లక్నో : ఉత్తరప్రదేశ్‌లో మూడు మటన్ షాపులకు నిప్పుపెట్టడం కలకంల సృష్టించింది. మంగళవారం రాత్రి హత్రాస్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. యూపీ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ బాధ్యతలు స్వీకరించిన రెండు రోజుల్లోనే ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా గోసంరక్షక దళాలు మటన్ షాపులకు నిప్పు పెట్టినట్టు బాధితులు ఆరోపిస్తున్నారు.
వాస్తవానికి ప్రమాణ స్వీకారం చేసిన రెండవ రోజే సీఎం యోగి రాష్ట్రంలోని రెండు కబేళాలపై నిషేధం విధించారు. గోవుల అక్రమ రవాణాను ఆపేందుకు మొరాదాబాద్ ఎస్పీ కూడా అధికారులకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. బీజేపీ తన ఎన్నికల్లో మేనిఫెస్టోలో అక్రమ కబేళాలను మూసివేస్తామని హామీ ఇచ్చింది. ఆ వాగ్ధానం ప్రకారమే రాష్ట్రంలో కబేళాలను మూసివేస్తున్నారు.