లక్నో: హథ్రాస్ దుర్ఘటనకు సంబంధించి ఉత్తరప్రదేశ్ పోలీసుల వ్యవహారశైలి మరోసారి వివాదాస్పదంగా మారుతోంది. ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేసి శాంతి భద్రతలకు విఘాతం కలిగించడానికి ప్రయత్నించారంటూ మరో ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో 19 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా కొన్ని గ్రూపులు రాష్ట్రంలో అలజడి సృష్టించేందుకు యత్నిస్తున్నాయని యూపీ డీజీపీ(లా అండ్ ఆర్డర్) ప్రశాంత్ కుమార్ చెప్పారు.
ప్రభుత్వానికి వ్యతిరేకంగా మీడియా ముందు మాట్లాడితే రూ.50 లక్షలు ఇస్తామని బాధితురాలి కుటుంబ సభ్యులను ప్రలోభపెట్టారని ఆయన ఆరోపించారు. కొన్ని సంఘ విద్రోహ శక్తులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్రపూరితంగా రాష్ట్రంలో సామాజిక సామరస్యాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నాయని, ఇటువంటి వారిని ఉపేక్షించేది లేదని ఆయన అన్నారు. ఈ కేసుకు సంబంధించి కొంతమందిపై ఇప్పటికే దేశ ద్రోహం కేసు నమోదు చేశామని డీజీపీ వివరించారు. (చదవండి: హథ్రాస్ ఘటన: న్యాయం చేసే ఉద్దేశముందా?)
Comments
Please login to add a commentAdd a comment