
లక్నో: లోక్‌సభలో విపక్ష నేత రాహుల్‌గాంధీకి (Rahul Gandhi) కోర్టు ఫైన్ విధించింది. స్వాతంత్య్ర సమరయోధుడు వీర్‌సావర్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను రాహుల్‌పై పరువు నష్టం దావా కేసు నమోదైంది. అయితే, ఈ కేసు విచారణలో భాగంగా రాహుల్ గాంధీ లక్నోలోని అడిషనల్ చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ (acjm)ముందు హాజరు కావాల్సి ఉంది.
కానీ రాహుల్ కోర్టు విచారణకు గైర్హాజరయ్యారు. రాహుల్ తీరుపై ఏసీజేఎం న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ.200 ఫైన్ విధించారు. ఇదే కేసులో ఏప్రిల్ 14న కోర్టు విచారణకు తప్పని సరిగా హాజరు కావాల్సిందేనని ఆదేశాలు జారీ చేశారు.