న్యూఢిల్లీ: ప్రజలకు సుపరిపాలన అందించడమే ప్రభుత్వ లక్ష్యమని పని చేయని అధికారులను సహించేది లేదని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ హెచ్చరించారు . రెవెన్యూ డిపార్ట్ మెంట్ లో పని చేయని 33 మంది ఉన్నతాదికారులను ముందస్తు రిటర్మెంట్ తీసుకోవాల్సిందిగా ఆయన ఆదేశాలు జారీ చేశారు.
గడిచిన రెండేళ్లలో 72 మంది ఉన్నతాధికారులను శాఖా పరమైన క్రమశిక్షన పేరుతో తొలగించారు. కానీ ఇంత మొత్తంలో ఒకేసారి ముందస్తు పదవీ విరమణ చేయమని ఆదేశించడం ఇదే మొదటిసారి . ఇప్పటి వరకు తొలగించిన 105 మందిలో అందరూ గ్రూప్ 1 అధికారులు కావడం గమనార్హం . వీరందరూ 50 ఏళ్ల పై బడిన వారే. జనవరిలో జరిగిన 'ప్రగతి ఇంటరాక్షన్' సమావేశంలో పని చేయని అధికారుల వివరాలను అందజేయాలని అన్ని శాఖల కార్యదర్శులను ప్రధాని ఆదేశించారు.. అప్పటి నుంచి 122 మంది ఉన్నతాధికారుల వివరాలు సేకరించిన అనంతరం ఇప్పటి వరకు 72 మందిపై చర్యలు తీసుకున్నారు