ఆంధ్రజ్యోతి ఎండీపై చీటింగ్ కేసుకు కోర్టు ఆదేశం | cheating case on ABN MD ordered by court | Sakshi
Sakshi News home page

ఆంధ్రజ్యోతి ఎండీపై చీటింగ్ కేసుకు కోర్టు ఆదేశం

Published Tue, Nov 3 2015 7:00 PM | Last Updated on Fri, Aug 10 2018 5:09 PM

cheating case on ABN MD ordered by court

హైదరాబాద్: ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణపై చీటింగ్ కేసు నమోదు చేయాలని సికింద్రాబాద్ మేజిస్ట్రేట్ మంగళవారం సరూర్‌నగర్ పోలీసులకు ఉత్తర్వులు జారీచేశారు. ఫిర్యాదుదారుడు సుంకరి జనార్ధన్‌గౌడ్ కథనం మేరకు...  వీణ, వాణి అవిభక్త కవలలకు ఆపరేషన్ నిమిత్తం 2012 సంవత్సరంలో రండి... రండి... చేయి కలుపుదాం - వీణా, వాణిలకు అండగా నిలుద్దాం అంటూ ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఛానల్లో ప్రసారం చేశారు.

దీనికి దాతలు స్పందించి, లక్షల రూపాయలను ఆ ఛానల్ ఖాతాలో జమచేశారు. అయితే.. ఆ డబ్బులను బాధితుల ఆపరేషన్‌కు గానీ, వారి తల్లిదండ్రులకు గానీ ఇవ్వకుండా సొంతానికి వాడుకున్నాడని, దీనిపై పలుమార్లు రాధాకృష్ణకు ఫోన్ చేయగా ఫోన్‌లో బెదిరించాడని ఫిర్యాదుదారుడు కోర్టుకు విన్నవించాడు. రాధాకృష్ణపై భారతీయ శిక్షాస్మృతిలోని 406, 420, 403, 120బి సెక్షన్‌ల కింద కేసు నమోదు చేయాలంటూ సరూర్‌నగర్ పోలీసులకు కోర్టు ఉత్తర్వులను జారీ చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement