secundrabad court
-
జగత్ విఖ్యాత్ రెడ్డి బెయిల్ పిటీషన్ వాయిదా..
సాక్షి. హైదరాబాద్: బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో మాజీ మంత్రి అఖిలప్రియ సోదరుడు జగత్ విఖ్యాత్ రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటీషన్‌ను వచ్చే శుక్రవారానికి వాయిదా వేస్తున్నట్లు సికింద్రాబాద్ కోర్టు వెల్లడించింది. అయితే ఈ కేసుకు సంబంధించి జగత్ విఖ్యాత్ రెడ్డికి ముందస్తు బెయిల్ మంజూరు చేస్తే దర్యాప్తును ప్రభావితం చేసే అవకాశం ఉందని, అందు చేత అతనికి ముందస్తు బెయిల్ మంజూరు చేయొద్దని పోలీసులు కౌంటర్ దాఖలు చేశారు. ఈ కేసులో కీలక నిందితుడైన జగత్ విఖ్యాత్ రెడ్డి ప్రస్తుతం పరారీలో ఉన్నారు. కాగా, ఇదే కేసులో అరెస్టు అయిన మరో 15 మంది నిందితులు కూడా సికింద్రాబాద్ కోర్టులోనే బెయిల్ పిటీషన్ దాఖలు చేయగా, అన్ని పిటీషన్లను వచ్చే శుక్రవారం విచారణ చేస్తామని కోర్టు పేర్కొంది. ఇదే కేసులో మాజీ మంత్రి అఖిలప్రియ అరెస్టై ఇటీవలే విడుదలయ్యారు. ఆమె భర్త భార్గవ్ రామ్, జగత్ విఖ్యాత్ రెడ్డి, గుంటూరు శ్రీను, చంద్రహాస్‌లు పరారీలో ఉన్నారు. ప్రస్తుతం పోలీసులు వారి కోసం గాలిస్తున్నారు. -
కిడ్నాప్ కేసు: అఖిల ప్రియకు ఎదురుదెబ్బ
సాక్షి, హైదరాబాద్: టీడీపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియకు కోర్టులో సోమవారం ఎదురుదెబ్బ తగిలింది. బోయినపల్లి కిడ్నాప్ కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న అఖిల ప్రియ బెయిల్ పిటిషన్‌ను సికింద్రాబాద్ కోర్టు తిరస్కరించింది. తన ఆరోగ్యం బాగాలేదని, బెయిల్ ఇవ్వాలని పిటిషన్లో ఆమె కోరారు. అయితే వైద్యులు న్యాయస్థానానికి సమర్పించిన వైద్యపరీక్షల్లో ఆమె ఆరోగ్యంగానే ఉన్నట్లు తేలింది. దీంతో బెయిల్ పిటిషన్‌ను కోర్టు కోట్టివేసింది. కిడ్నాపు కేసులో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితురాలిని కస్టడీకి ఇవ్వాలన్న పోలీసుల వాదనతో న్యాయస్థానం ఏకీభవించింది. అఖిలప్రియ బయటకొస్తే సాక్షులను బెదిరించవచ్చని పోలీసులు తమ పిటిషన్లో పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు రాబట్టడానికి ఆమెను వారంరోజుల పాటు విచారించాల్సి ఉందని పోలీసులు న్యాయస్థానాకి తెలిపారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న అఖిల ప్రియ అనుచరులు మరికొన్ని నేరాలు చేసినట్లు అనుమానాలు ఉన్నాయని, ఆమె భర్త భార్గవ్‌రామ్‌తో పాటు పరారీలో ఉన్న అనుచరులను అరెస్టు చేయాల్సి ఉందని కోర్టుకు నివేదించారు. పోలీసుల వాదన విన్న కోర్టు.. అఖిల ప్రియను మూడు రోజుల పాటు పోలీసుల కస్టడీకి అనుమతించింది. నేటి నుంచి అఖిల ప్రియ 13వ తేదీ వరకు పోలీస్ కస్టడీలో ఉండనున్నారు. కాగా బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో అఖిలప్రియ ఏ1గా ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె చంచల్‌గూడ జైల్లో 14 రోజుల రిమాండ్‌లో ఉండగా.. కిడ్నాప్ కేసులో పోలీసులు ప్రశ్నించనున్నారు. మరోవైపు కిడ్నాప్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అఖిల ప్రియ భర్త భార్గవ్ రామ్‌తో పాటు ఆయన అనుచరుడు శ్రీనివాస్ చౌదరి అలియాస్ గుంటూరు శీను ఇంకా పరారీలోనే ఉన్నారు. వారిద్దరి కోసం మూడు రాష్ట్రాల్లో పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నారు. చదవండి: గుంటూరు శ్రీను నేర చరిత్రపై ఆరా.. -
అఖిల ప్రియకు కోర్టులో చుక్కెదురు
సాక్షి, హైదరాబాద్: హాకీ మాజీ క్రీడాకారుడు ప్రవీణ్‌రావు ,అతని ఇద్దరు సోదరుల కిడ్నాప్ కేసులో ఏ-1గా ఉన్న భూమా అఖిలప్రియకు గురువారం సికింద్రాబాద్ కోర్టులో చుక్కెదురైంది. మెరుగైన వైద్యం కోసం ఆస్పత్రికి తరలించాలని ఆమె దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. కాగా ప్రవీణ్‌రావు కిడ్నాప్ కేసులో అఖిలప్రియ ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో 14 రోజుల రిమాండ్‌లో ఉన్న విషయం తెలిసిందే. (చదవండి: అఖిలప్రియ రిమాండ్ రిపోర్ట్‌లో సంచలన విషయాలు) ఆమె పిటిషన్‌ను పరిశీలించిన కోర్టు.. జైలులోనే అఖిలప్రియకు అవసరమైన వైద్య సదుపాయాలు ఉన్నాయని.. వైద్యులు కూడా అందుబాటులో ఉన్నారని తెలిపింది. ఒకవేళ అఖిలప్రియ ఆరోగ్యం బాగాలేదని.. మెరుగైన వైద్యం కోసం ఆసుపత్రికి తరలించాలని జైలు అధికారులు సూచిస్తే ఈ విషయంపై నిర్ణయం తీసుకుంటామని కోర్టు స్పష్టం చేసింది. కాగా అఖిలప్రియ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై శుక్రవారం సికింద్రాబాద్ కోర్టులో విచారణకు రానుంది. అఖిలప్రియ బెయిల్ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలంటూ కోర్టు పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు రేపు బెయిల్ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయనున్నారు. -
ఆంధ్రజ్యోతి ఎండీపై చీటింగ్ కేసుకు కోర్టు ఆదేశం
హైదరాబాద్: ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణపై చీటింగ్ కేసు నమోదు చేయాలని సికింద్రాబాద్ మేజిస్ట్రేట్ మంగళవారం సరూర్‌నగర్ పోలీసులకు ఉత్తర్వులు జారీచేశారు. ఫిర్యాదుదారుడు సుంకరి జనార్ధన్‌గౌడ్ కథనం మేరకు... వీణ, వాణి అవిభక్త కవలలకు ఆపరేషన్ నిమిత్తం 2012 సంవత్సరంలో రండి... రండి... చేయి కలుపుదాం - వీణా, వాణిలకు అండగా నిలుద్దాం అంటూ ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఛానల్లో ప్రసారం చేశారు. దీనికి దాతలు స్పందించి, లక్షల రూపాయలను ఆ ఛానల్ ఖాతాలో జమచేశారు. అయితే.. ఆ డబ్బులను బాధితుల ఆపరేషన్‌కు గానీ, వారి తల్లిదండ్రులకు గానీ ఇవ్వకుండా సొంతానికి వాడుకున్నాడని, దీనిపై పలుమార్లు రాధాకృష్ణకు ఫోన్ చేయగా ఫోన్లో బెదిరించాడని ఫిర్యాదుదారుడు కోర్టుకు విన్నవించాడు. రాధాకృష్ణపై భారతీయ శిక్షాస్మృతిలోని 406, 420, 403, 120బి సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలంటూ సరూర్‌నగర్ పోలీసులకు కోర్టు ఉత్తర్వులను జారీ చేసింది.