
సాక్షి. హైదరాబాద్: బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో మాజీ మంత్రి అఖిలప్రియ సోదరుడు జగత్ విఖ్యాత్ రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటీషన్‌ను వచ్చే శుక్రవారానికి వాయిదా వేస్తున్నట్లు సికింద్రాబాద్ కోర్టు వెల్లడించింది. అయితే ఈ కేసుకు సంబంధించి జగత్ విఖ్యాత్ రెడ్డికి ముందస్తు బెయిల్ మంజూరు చేస్తే దర్యాప్తును ప్రభావితం చేసే అవకాశం ఉందని, అందు చేత అతనికి ముందస్తు బెయిల్ మంజూరు చేయొద్దని పోలీసులు కౌంటర్ దాఖలు చేశారు. ఈ కేసులో కీలక నిందితుడైన జగత్ విఖ్యాత్ రెడ్డి ప్రస్తుతం పరారీలో ఉన్నారు.
కాగా, ఇదే కేసులో అరెస్టు అయిన మరో 15 మంది నిందితులు కూడా సికింద్రాబాద్ కోర్టులోనే బెయిల్ పిటీషన్ దాఖలు చేయగా, అన్ని పిటీషన్లను వచ్చే శుక్రవారం విచారణ చేస్తామని కోర్టు పేర్కొంది. ఇదే కేసులో మాజీ మంత్రి అఖిలప్రియ అరెస్టై ఇటీవలే విడుదలయ్యారు. ఆమె భర్త భార్గవ్ రామ్, జగత్ విఖ్యాత్ రెడ్డి, గుంటూరు శ్రీను, చంద్రహాస్‌లు పరారీలో ఉన్నారు. ప్రస్తుతం పోలీసులు వారి కోసం గాలిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment