టాలీవుడ్ సంచలన డైరెక్టర్ రాం గోపాల్ వర్మపై ఏపీ పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ ఆయన ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. రాజకీయ దురుద్దేశంతోనే తనపైన కేసు నమోదు చేశారని పిటిషన్‌లో పేర్కొన్నారు. తాను ఎవరి పరువుకు నష్టం కలిగించేలా ఎలాంటి పోస్టులు పెట్టలేదని.. అలాగే వర్గాల మధ్య శతృత్వం సృష్టించేలా పోస్టులు చేయలేదని పిటిషన్‌లో ప్రస్తావించారు. తనను అరెస్టు చేసి థర్డ్ డిగ్రీ ప్రయోగించే అవకాశం ఉందని బెయిల్ పిటిషన్‌లో వివరించారు.
కాగా.. అంతకుముందు విచారణకు హాజరయ్యేందుకు తన సమయం కావాలని పోలీసులకు సందేశం పంపారు ఆర్జీవీ. నాలుగు రోజులు సమయం ఇవ్వాలని ఆయన కోరారు. సినిమా షూటింగ్ బిజీ షెడ్యూల్ కారణంగా విచారణకు రాలేనని వర్మ పేర్కొన్నారు. ఈ మేరకు ఒంగోలు రూరల్ సర్కిల్ ఇన్సెపెక్టర్ శ్రీకాంత్ బాబుకి వాట్సాప్‌లో వర్మ మెసేజ్ పెట్టారు.
మరోవైపు రామ్ గోపాల్ వర్మకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో చుక్కెదురైంది. తనపై నమోదైన కేసులో అరెస్ట్ నుంచి రక్షణల్పించాలని ఆయన దాఖలు చేసిన అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది. తనపై నమోదైన కేసు కొట్టేయాలన్న పిటిషన్‌ను మాత్రం విచారణకు స్వీకరించింది. ఈ క్రమంలో కౌంటర్ దాఖలు చేయాలంటూ ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలిచ్చింది.
ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్‌లో వర్మపై కొన్నిరోజులు క్రితం కేసు నమోదైంది. 'వ్యూహం' మూవీ ప్రమోషన్స్‌లో చంద్రబాబు, నారా లోకేశ్ తదితరులపై కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి రామలింగం ఫిర్యాదు చేయడంతో ఐటీ యాక్ట్ కింద కేసు నమోదైంది.
Comments
Please login to add a commentAdd a comment