టాలీవుడ్ నటుడు మోహన్‌బాబు తెలంగాణ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. పోలీసులు ఎలాంటి దర్యాప్తు చేపట్టకుండా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. కాగా.. ఇటీవల జల్‌పల్లిలోని ఆయన నివాసం వద్ద జరిగిన ఘటనపై పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేశారు. మీడియా ప్రతినిధిపై దాడి చేశారంటూ ఆయనపై హత్యాయత్నం కేసు నమోదైన సంగతి తెలిసిందే.
(ఇది చదవండి: మీడియాపై దాడికి క్షమాపణ చెప్పిన మోహన్ బాబు)
ఈ ఘటనపై మోహన్‌బాబు మీడియాను క్షమాపణలు కోరారు. తాను చేసిన పనికి ఎంతో బాధపడుతున్నానని ఆడియో సందేశం కూడా విడుదల చేశారు. నా ఇంట్లోకి గేట్లు బద్దలు కొట్టి రావడం న్యాయమేనా? అని మోహన్ బాబు ప్రశ్నించారు. ఈ ఘటన తర్వాత మోహన్ బాబు ఆస్పత్రిలో చేరారు. చికిత్స అనంతరం గురువారం ఆస్పత్రి నుంచి డిశ్ఛార్జ్ అయ్యారు. ప్రస్తుతం ఆయనకు వారం రోజుల పాటు విశ్రాంతి అవసరమని వైద్యులు వెల్లడించారు.
హైకోర్టులో మోహన్ బాబుకు షాక్..
టాలీవుడ్ నటుడు మోహన్ బాబుకు తెలంగాణ హైకోర్టు షాకిచ్చింది. ఈ కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తనపై నమోదైన కేసులో ఎలాంటి దర్యాప్తు, అరెస్ట్ చేపట్టకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలంటూ పిటిషన్‌లో కోరారు. తాజాగా ఆయన పిటిషన్‌పై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం అభ్యర్థనను తోసిపుచ్చింది. ఈ పిటిషన్‌పై తదుపరి విచారణను హైకోర్టు వచ్చే గురువారానికి వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment