ప్రముఖ నటుడు మోహన్ బాబు క్షమాపణ చెప్పాడు. ప్రస్తుతం ఈయన కుటుంబంలో ఆస్తి విషయమై వివాదం నడుస్తోంది. ఈ క్రమంలోనే మోహన్ బాబు, ఆయన చిన్న కొడుకు మనోజ్ ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకున్నారు. ఆ తర్వాత తండ్రి ఇంటికెళ్లిన మనోజ్.. గేట్లు బద్ధలు కొట్టుకుని లోపలికెళ్లాడు. అయితే రీసెంట్‌గా మోహన్ బాబు ఇంటి దగ్గరకెళ్లిన ఓ మీడియా ప్రతినిధిపై ఈయన దాడి చేయడం చర్చనీయాంశమైంది. ఈ క్రమంలోనే హత్యాయత్నం కేసు కూడా నమోదు చేశారు.
గత రెండు రోజులుగా ఆస్పత్రిలో చికిత్సి పొందిన మోహన్ బాబు.. గురువారం సాయంత్రం డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పుడు మీడియా ప్రతినిధిపై దాడి చేయడంపై క్షమాపణ చెప్పారు. తాను ఈ విషయమై పశ్చాత్తాప పడుతున్నానని పేర్కొన్నారు. ఈ మేరకు ఓ లెటర్ రిలీజ్ చేశారు. దాన్ని తన ట్విటర్‍లో పోస్ట్ చేశారు.
(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 18 సినిమాలు)
'అనారోగ్య కారణాల దృష్ట్యా.. ఈ సంఘటనపై తక్షణమే స్పందించలేకపోయాను. ఆ టైంలో నా ఇంటి గేటు విరిగిపోయింది. 30-50 మంది మనుషులు తోసుకుంటూ లోపలికి వచ్చేశారు. నేను నియంత్రణ కోల్పోయాను. ఇదంతా జరుగుతున్న టైంలో మీడియా అక్కడికొచ్చింది. అప్పటికే నేను అలసిపోయి ఉన్నాను. దీంతో అనుకోని పరిస్థితుల్లో మీడియా ప్రతినిధికి నా వల్ల గాయమైంది. ఈ విషయమై పశ్చాత్తపడుతున్నాను. అతడికి, అతడి కుటుంబానికి కలిగిన ఇబ్బందికి తీవ్రంగా చింతిస్తున్నాను. హృదయపూర్వకంగా క్షమించమని కోరుతున్నా. త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నా' అని మోహన్ బాబు చెప్పుకొచ్చారు.
ఇక ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన వెంటనే మోహన్ బాబు ఆడియో సందేశం ఒకటి రిలీజ్ చేశాడు. మీడియాపై దాడి జరిగినందుకు ఎంతో చింతిస్తున్నట్లు పేర్కొన్నారు. మా కుటుంబ సమస్యకు మధ్యవర్తులు అవసరం లేదని, తన కొడుకులతో కలిసి సమస్యని తామే పరిష్కరించుకుంటామని తెలిపారు.
(ఇదీ చదవండి: మూడు వారాలకే ఓటీటీలోకి వచ్చేసిన 'మెకానిక్ రాకీ')
— Mohan Babu M (@themohanbabu) December 13, 2024
Comments
Please login to add a commentAdd a comment