కొత్త సినిమాలు మరీ త్వరగా ఓటీటీల్లోకి వచ్చేస్తున్నాయి. ఇప్పుడు కూడా అలానే లేటెస్ట్ తెలుగు మూవీ ఒకటి.. సడన్ సర్‌ప్రైజ్ అన్నట్లు వచ్చేసింది. మొన్ననే థియేటర్లలో రిలీజైంది. ఇది జరిగిన మూడు వారాలు అయిందో లేదో ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. ఇంతకీ ఏంటా సినిమా? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది?
యంగ్ హీరో విశ్వక్ సేన్.. వరస సినిమాలు చేస్తూ అలరిస్తున్నాడు. ఈ ఏడాది 'గామి', 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' చిత్రాలు చేశాడు గానీ ఇవి అనుకున్నంత సక్సెస్ కాలేదు. దీంతో నవంబర్ 22న 'మెకానిక్ రాకీ'గా వచ్చాడు. అయితే ఈ మూవీ సెకండాఫ్ బాగున్నా ఫస్టాప్ మరీ తీసికట్టుగా ఉండటం మైనస్ అయింది. దీంతో ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోలేదు.
(ఇదీ చదవండి: రాజకీయాల్లోకి అల్లు అర్జున్.. క్లారిటీ ఇచ్చిన టీమ్)
ఈ క్రమంలోనే ఎలాంటి ప్రకటన లేకుండా ఇప్పుడు ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చేసింది. ఈ వీకెండ్ ఎలా టైమ్ పాస్ చేయాలా అని ఆలోచిస్తుంటే 'మెకానిక్ రాకీ' చూస్తే ఎంజాయ్ చేసేయండి. సినిమా విషయానికొస్తే.. రాకీ (విష్వక్) మెకానిక్ గ్యారేజ్‌తో పాటూ డ్రైవింగ్ స్కూల్ నడుపుతుంటాడు. వారసత్వంగా వచ్చిన ఈ గ్యారేజ్‌లో తండ్రితో కలిసి పనిచేస్తుంటాడు. అనుకోని పరిస్థితుల్లో రాకీ తండ్రి చనిపోతాడు.
ఇదిలా ఉండగా మాయ (శ్రద్ధ శ్రీనాథ్) మెకానిక్ రాకీ దగ్గర డ్రైవింగ్ స్కూల్‌లో చేరుతుంది. మధ్యలో రంకిరెడ్డి అనే ఓ కబ్జాదారుడు (సునీల్).. ఆ మెకానిక్ షెడ్డుని కబ్జా చేయబోతాడు. ఈలోగా చనిపోయిన తండ్రి పేరు మీద రూ.2 కోట్లు ఇన్సూరెన్స్ ఉందని, ఆ డబ్బు వస్తుంది కనుక రంకిరెడ్డి మొహాన కొంత కొట్టి ఆ కబ్జా నుంచి తప్పించుకోవచ్చని దారి చూపిస్తుంది మాయ. ఆ తర్వాత ఏం జరుగుతుందనేది మిగతా కథ.
(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 8కు అందుకే వచ్చానన్న గౌతమ్.. ఏడ్చేసిన అవినాష్!)
Comments
Please login to add a commentAdd a comment