కొన్నాళ్లుగా ఎవరైనా పిల్లలు తప్పిపోయుంటే వారి వివరాలను అధికారులకు అందజేయాల్సిందిగా ప్రధానమంత్రి షేక్ హసీనా ఇటీవల తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు.
బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో జులై 1న గుల్షన్ ప్రాంతంలో హోలే అర్టిసన్ బేకరి అండ్ రెస్టారెంట్ పై ఆరుగురు సాయుధులు దాడి చేసి 22 మందిని అతి కిరాతకంగా హతమార్చారు. ఇందులో ఐదుగురిని మట్టు పెట్టిన ఉగ్రవాదులు ఒకరిని సజీవంగా పట్టుకున్నారు. ఐదుగురు ఉన్నత విద్యాలయాల్లో చదువుకుంటున్న విద్యార్థులే నని దర్యాప్తులో తేలిన విషయం తెలిసిందే.