Ashok Leyland bags orders worth Rs 800 crore from Indian Army - Sakshi
Sakshi News home page

భారత సైన్యానికి అశోక్‌ లేలాండ్‌ వాహనాలు - ఆర్డర్ ఎన్ని కోట్లంటే?

Published Tue, Jul 18 2023 7:03 AM | Last Updated on Tue, Jul 18 2023 8:37 AM

Indian army ordered to ashok leyland vehicles - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: వాణిజ్య వాహనాల తయారీ దిగ్గజం అశోక్‌ లేలాండ్‌ తాజాగా భారత సైన్యం నుంచి రూ.800 కోట్ల ఆర్డర్‌ను చేజిక్కించుకుంది. ఇందులో భాగంగా భారత సైన్యానికి ఫీల్డ్‌ ఆర్టిలరీ ట్రాక్టర్, గన్‌ టోయింగ్‌ వెహికిల్స్‌ను అశోక్‌ లేలాండ్‌ సరఫరా చేస్తుంది.

12 నెలల్లో వీటిని డెలివరీ చేస్తామని కంపెనీ ఎండీ, సీఈవో శేణు అగర్వాల్‌ తెలిపారు.  డిఫెన్స్‌ వ్యాపారం కంపెనీ వృద్ధికి బలమైన స్తంభంగా నిలిచిందని చెప్పారు. ఈ డీల్‌తో డిఫెన్స్‌ మొబిలిటీ వెహికల్స్‌ వ్యాపారంలో సంస్థ నాయకత్వాన్ని మరింత స్థిరపరుస్తుందని అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement