
భారతదేశాన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటున్న ఇండియన్ ఆర్మీ ఇటీవల 1850 మహీంద్రా కార్లను ఆర్డర్ చేసింది. ఈ సందర్భంగా ఆనంద్ మహీంద్రా చేసిన ఒక ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
నివేదికల ప్రకారం ఇటీవల మహీంద్రా కొత్త స్కార్పియో కార్లను ఆర్డర్ చేసింది. గత జనవరిలో ఆర్మీ 1470 యూనిట్ల కార్లను డెలివరీ చేసుకుంది. మొదట్లో డెలివరీ చేసుకున్న కార్లు కంపెనీ పాత లోగో కలిగి ఉన్నాయి, కావున రెండవ లాట్ కూడా అదే విధంగా ఉండే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.
మహీంద్రా స్కార్పియో కొనుగోలు చేసిన ఇండియన్ ఆర్మీ ఇప్పటికే ఉన్న మారుతి సుజుకి జిప్సీ స్థానంలో వినియోగించనున్నట్లు సమాచారం. గతంలో భారతీయ సైన్యం జిప్సీతో పాటు టాటా జెనాన్ పిక్-అప్‌లు, ప్రత్యేకంగా తయారు చేసిన టాటా సఫారీ స్టోర్మ్ (GS800)ని కూడా కొనుగోలు చేసింది.
ఈ సందర్భంగా ఆనంద్ మహీంద్రా మా దళాలను జాగ్రత్తగా చూసుకోండి, ఎందుకంటే వాళ్ళు మనల్ని జాగ్రత్తగా చూసుకుంటారు అని ట్వీట్ చేశారు. ఇది సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఈ పోస్ట్ ఇప్పటికే వేలలో లైక్స్ పొందింది, చాలామంది కామెంట్స్ కూడా తమకు తోచిన రీతిలో కామెంట్స్ కూడా చేస్తున్నారు.
Take good care of our troops, Scorpio. Because they take care of us… https://t.co/RzghhqgbGJ
— anand mahindra (@anandmahindra) July 13, 2023