ఇకపై ‘కాలీ పీలీ’ ట్యాక్సీలు ఖాళీ! | Premier Padmini Cars Will Never Be Seen Again | Sakshi
Sakshi News home page

ఇకపై ‘కాలీ పీలీ’ ట్యాక్సీలు ఖాళీ!

Published Mon, Oct 30 2023 1:27 PM | Last Updated on Mon, Oct 30 2023 3:01 PM

Premier Padmini  Cars Will Never Be Seen Again - Sakshi

ముంబైలో పదిహేనేళ్లు పైబడిన ట్యాక్సీలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. అక్కడ నలుపు-పసుపు రంగుతో కూడిన ఐకానిక్ టాక్సీ(కాలీ పీలీ) ఇకపై రోడ్లపై కనిపించదనే వార్తలు వచ్చినప్పటి నుంచి ప్రజలతోపాటు ప్రముఖులు ఆ ట్యాక్సీతో  తమకున్న జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నారు. 

మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా సోమవారం ముంబైలోని ఐకానిక్ టాక్సీలకు సంబంధించి వ్యాఖ్యలు చేశారు. అవి తీవ్ర శబ్దం చేస్తూ రోడ్లపై వెళ్లేవారికి అసౌకర్యంగా ఉన్నప్పటికీ, అవి చాలా మందికి ఎన్నో జ్ఞాపకాలు మిగిల్చాయని గుర్తుచేశారు. ‘నేటి నుంచి ఐకానిక్ ప్రీమియర్ పద్మిని టాక్సీ ముంబై రోడ్ల నుంచి అదృశ్యమవుతుంది. అవి చేసే శబ్దం అసౌకర్యంగా ఉన్నా, ఎక్కువ మంది ప్రయాణించే వెసులుబాటు లేకపోయినా ప్రజలకు అవి టన్నుల కొద్దీ జ్ఞాపకాలను మిగిల్చాయి. ఇక ఈ కాలీ-పీలీ టాక్సీలకు సెలవు’అని తన ‘ఎక్స్‌(ట్విటర్‌)’ ఖాతాలో పేర్కొన్నారు. 

(ఇదీ చదవండి: 2030 నాటికి పతాకస్థాయికి చేరనున్న శిలాజ ఇంధనాలు)

పబ్లిక్ ట్రాన్స్‌పోర్టర్ బృహన్‌ముంబయి ఎలక్ట్రిక్ సప్లై అండ్ ట్రాన్స్‌పోర్ట్ (బెస్ట్) సంస్థ నుంచి డీజిల్‌తో నడిచే డబుల్ డెక్కర్ బస్సులను అధికారులు తొలగించినట్లు ప్రకటించారు. అయితే ఈ ప్రకటన వెలువడిన కొద్దిసేపటికే ప్రసిద్ధ ప్రీమియర్ పద్మిని మోడల్‌ కార్లును సైతం ఆపివేయాలని నిర్ణయం తీసుకున్నారు. నిబంధనల ప్రకారం 15 ఏళ్లు ముగిసిన డబుల్‌డెక్కర్‌ బస్సులను రద్దు చేశారు. అయితే ఫియట్‌ కంపెనీ తయారుచేసిన ఈ ప్రీమియర్ పద్మిని కార్లును ముంబయిలో ఎక్కువగా ట్యాక్సీలుగా వాడుతున్నారు. ఇవి నలుపు పసుపు రంగులో ఉండడంతో వాటికి కాలీపీలీ ట్యాక్సీలుగా పేరు వచ్చింది. ఈ ట్యాక్సీలకు కేటాయించిన రన్నింగ్ పీరియడ్ 20 సంవత్సరాలు. అక్టోబర్ 29, 2023తో ఆ సమయం ముగిసింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement