Taxi cars
-
ఇకపై ‘కాలీ పీలీ’ ట్యాక్సీలు ఖాళీ!
ముంబైలో పదిహేనేళ్లు పైబడిన ట్యాక్సీలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. అక్కడ నలుపు-పసుపు రంగుతో కూడిన ఐకానిక్ టాక్సీ(కాలీ పీలీ) ఇకపై రోడ్లపై కనిపించదనే వార్తలు వచ్చినప్పటి నుంచి ప్రజలతోపాటు ప్రముఖులు ఆ ట్యాక్సీతో తమకున్న జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నారు. మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా సోమవారం ముంబైలోని ఐకానిక్ టాక్సీలకు సంబంధించి వ్యాఖ్యలు చేశారు. అవి తీవ్ర శబ్దం చేస్తూ రోడ్లపై వెళ్లేవారికి అసౌకర్యంగా ఉన్నప్పటికీ, అవి చాలా మందికి ఎన్నో జ్ఞాపకాలు మిగిల్చాయని గుర్తుచేశారు. ‘నేటి నుంచి ఐకానిక్ ప్రీమియర్ పద్మిని టాక్సీ ముంబై రోడ్ల నుంచి అదృశ్యమవుతుంది. అవి చేసే శబ్దం అసౌకర్యంగా ఉన్నా, ఎక్కువ మంది ప్రయాణించే వెసులుబాటు లేకపోయినా ప్రజలకు అవి టన్నుల కొద్దీ జ్ఞాపకాలను మిగిల్చాయి. ఇక ఈ కాలీ-పీలీ టాక్సీలకు సెలవు’అని తన ‘ఎక్స్(ట్విటర్)’ ఖాతాలో పేర్కొన్నారు. (ఇదీ చదవండి: 2030 నాటికి పతాకస్థాయికి చేరనున్న శిలాజ ఇంధనాలు) పబ్లిక్ ట్రాన్స్పోర్టర్ బృహన్ముంబయి ఎలక్ట్రిక్ సప్లై అండ్ ట్రాన్స్పోర్ట్ (బెస్ట్) సంస్థ నుంచి డీజిల్‌తో నడిచే డబుల్ డెక్కర్ బస్సులను అధికారులు తొలగించినట్లు ప్రకటించారు. అయితే ఈ ప్రకటన వెలువడిన కొద్దిసేపటికే ప్రసిద్ధ ప్రీమియర్ పద్మిని మోడల్ కార్లును సైతం ఆపివేయాలని నిర్ణయం తీసుకున్నారు. నిబంధనల ప్రకారం 15 ఏళ్లు ముగిసిన డబుల్‌డెక్కర్ బస్సులను రద్దు చేశారు. అయితే ఫియట్ కంపెనీ తయారుచేసిన ఈ ప్రీమియర్ పద్మిని కార్లును ముంబయిలో ఎక్కువగా ట్యాక్సీలుగా వాడుతున్నారు. ఇవి నలుపు పసుపు రంగులో ఉండడంతో వాటికి కాలీపీలీ ట్యాక్సీలుగా పేరు వచ్చింది. ఈ ట్యాక్సీలకు కేటాయించిన రన్నింగ్ పీరియడ్ 20 సంవత్సరాలు. అక్టోబర్ 29, 2023తో ఆ సమయం ముగిసింది. From today, the iconic Premier Padmini Taxi vanishes from Mumbai’s roads. They were clunkers, uncomfortable, unreliable, noisy. Not much baggage capacity either. But for people of my vintage, they carried tons of memories. And they did their job of getting us from point A to… pic.twitter.com/weF33dMQQc — anand mahindra (@anandmahindra) October 30, 2023 -
ట్యాక్సీ సెగ్మెంట్ కోసం టాటా మోటార్స్ కొత్త బ్రాండ్
న్యూఢిల్లీ: ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ తాజాగా కార్పొరేట్ కంపెనీలు, ప్రభుత్వ విభాగాలు, ట్యాక్సీ సర్వీసులకు ఉపయోగించే వాహనాల కోసం ప్రత్యేకంగా 'ఎక్స్‌ప్రెస్' పేరుతో కొత్త బ్రాండ్‌ను ఆవిష్కరించింది. ఈ సెగ్మెంట్లో తక్కువ ధర, ప్యాసింజరు సౌకర్యం, భద్రత అణాలను దృష్టిలో ఉంచుకుని వాహనాలను అందించనున్నట్లు తెలిపింది. వ్యక్తిగత అవసరాలకు ఉపయోగించే వాటికి, ఈ కేటగిరీ వాటికి మధ్య వ్యత్యాసం స్పష్టంగా తెలిసేలా వీటిపై ఎక్స్‌ప్రెస్ బ్యాడ్జ్ ఉంటుందని టాటా మోటార్స్ ప్రెసిడెంట్ శైలేష్ చంద్ర వివరించారు. ఎక్స్ఫైస్ బ్రాండ్ మొదటి వాహనాన్ని ఎక్స్ట్రెస్-టి పేరిట ఎలక్టిక్ సెడాన్‌ను త్వరలో ప్రవేశపెట్టనున్నట్లు తెలిపింది. తక్కువ మెయింటెనెన్స్ ఖర్చులు, అందుబాటు ధర సౌకర్యవంతమైన అనుభూతి వంటి అంశాల కారణంగా నగరాల్లో ప్రయాణాలకు ఎలక్టిక్ వాహనాలు అనుకూలంగా ఉంటాయని పేర్కొంది. ఎక్స్ ఫ్రెస్-టి ఎలక్టిక్ సెడాన్ కార్లు 218 కిమీ.. 165 కి.మీ. మైలేజీ వేరియేషన్లలో అందుబాటులోకి తెస్తామని వివరించింది. -
గాల్లో ఎగిరే కారు వచ్చేసింది!
కాలుష్యం.. ట్రాఫిక్.. ఈ రెండు చాలు నగర జీవనం ఎంత దుర్భరంగా ఉంటుందో తెలిపేందుకు. అయితే కొన్ని నగరాల్లో వీటి నుంచి మెట్రోరైలు కొంత ఉపశమనం కలిగిస్తుంది. కానీ అంతకు మించిన ఉపశమనాన్ని మనకు అందించేందుకు ఉబర్ సంస్థ మరో ముందడుగు వేసింది. గాల్లో ఎగిరే ట్యాక్సీ కార్లను మన ముందుకు తెచ్చింది. దీన్ని చూసేందుకు హెలికాప్టరో.. కారో కూడా అర్థం కాదు. నలుగురు ఎంచక్కా ఈ కారులో వెళ్లొచ్చు. నార్త్ స్టార్ అనే కంపెనీతో కలసి ఉబర్ ఈ కారును డిజైన్ చేసింది. ఇటీవల అమెరికాలోని వాషింగ్టన్లో జరిగిన ఉబర్ ఎలివేట్ సమ్మిట్–2019లో ఈ కారును ప్రదర్శనకు ఉంచింది. అయితే 2020లో తొలుత పైలట్ ప్రాజెక్టుగా ప్రవేశపెడతామని, 2023 వరకు ఎయిర్ ట్యాక్సీ సేవలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెస్తామని సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. అయితే ప్రస్తుతానికి అమెరికాలో మాత్రమే ఈ వెసులుబాటు కల్పించనుంది. అతి త్వరలోనే మన దగ్గరికి కూడా రావాలని కోరుకుందాం. -
ఎయిర్‌పోర్టులోకి అనుమతిలేని ట్యాక్సీడ్రైవర్లు
అదుపులోకి తీసుకున్న పోలీసులు! శంషాబాద్: నిబంధనలకు విరుద్ధంగా అనుమతి లేకుండా విమానాశ్రయంలోని అరైవల్ ప్రాంగణంలోకి వెళ్లిన మూడు ట్యాక్సీ కార్లతోపాటు వాటి డ్రైవర్లను ఆర్జీఐఏ పోలీసులు గురువారం ఉదయం అదుపులోకి తీసుకున్నారు. అనుమతి లేని ట్యాక్సీలు అరైవల్ ప్రాంతంలోకి ప్రవేశిస్తున్నాయనే సమాచారం మేరకు పోలీసులు ఈ మేరకు చర్యలు తీసుకున్నారు. అయితే పోలీసులు మాత్రం తాము ఎవరినీ అదుపులోకి తీసుకోలేదని స్పష్టం చేశారు.