ట్యాక్సీ సెగ్మెంట్‌ కోసం టాటా మోటార్స్‌ కొత్త బ్రాండ్‌ | Tata Motors Launches XPRES Brand For Fleet Customers | Sakshi
Sakshi News home page

ట్యాక్సీ సెగ్మెంట్‌ కోసం టాటా మోటార్స్‌ కొత్త బ్రాండ్‌

Published Thu, Jul 15 2021 2:33 PM | Last Updated on Thu, Jul 15 2021 2:34 PM

Tata Motors Launches XPRES Brand For Fleet Customers - Sakshi

న్యూఢిల్లీ: ఆటోమొబైల్‌ దిగ్గజం టాటా మోటార్స్‌ తాజాగా కార్పొరేట్‌ కంపెనీలు, ప్రభుత్వ విభాగాలు, ట్యాక్సీ సర్వీసులకు ఉపయోగించే వాహనాల కోసం ప్రత్యేకంగా 'ఎక్స్‌ప్రెస్‌' పేరుతో కొత్త బ్రాండ్‌ను ఆవిష్కరించింది. ఈ సెగ్మెంట్‌లో తక్కువ ధర, ప్యాసింజరు సౌకర్యం, భద్రత అణాలను దృష్టిలో ఉంచుకుని వాహనాలను అందించనున్నట్లు తెలిపింది. వ్యక్తిగత అవసరాలకు ఉపయోగించే వాటికి, ఈ కేటగిరీ వాటికి మధ్య వ్యత్యాసం స్పష్టంగా తెలిసేలా వీటిపై ఎక్స్‌ప్రెస్‌ బ్యాడ్జ్ ఉంటుందని టాటా మోటార్స్‌ ప్రెసిడెంట్‌ శైలేష్‌ చంద్ర వివరించారు. 

ఎక్స్‌ఫైస్‌ బ్రాండ్‌ మొదటి వాహనాన్ని ఎక్స్‌ట్రెస్‌-టి పేరిట ఎలక్టిక్‌ సెడాన్‌ను త్వరలో ప్రవేశపెట్టనున్నట్లు తెలిపింది. తక్కువ మెయింటెనెన్స్‌ ఖర్చులు, అందుబాటు ధర సౌకర్యవంతమైన అనుభూతి వంటి అంశాల కారణంగా నగరాల్లో ప్రయాణాలకు ఎలక్టిక్‌ వాహనాలు అనుకూలంగా ఉంటాయని పేర్కొంది. ఎక్స్‌ ఫ్రెస్‌-టి ఎలక్టిక్‌ సెడాన్‌ కార్లు 218 కిమీ.. 165 కి.మీ. మైలేజీ వేరియేషన్లలో అందుబాటులోకి తెస్తామని వివరించింది.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement