లండన్‌కు చెందిన టెక్నాలజీ సంస్థ ‘నథింగ్’ సబ్-బ్రాండ్ అయిన సీఎంఎఫ్ మూడు కొత్త ఉత్పత్తులను ఆవిష్కరించింది. సీఎంఎఫ్ ఫోన్ 1, సీఎంఎఫ్ వాచ్ ప్రో 2 , సీఎంఎఫ్ బడ్స్ ప్రో 2లను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది.
ఈ సీఎంఎఫ్ బ్రాండ్ కొత్త ఉత్పత్తులు జూలై 12 నుంచి భారత్‌లో విక్రయానికి రానున్నాయి. సీఎంఎఫ్ అధికారిక వెబ్‌సైట్ (cmf.tech) నుంచి, దారి రిటైల్ భాగస్వాముల ద్వారా జూలై 12 మధ్యాహ్నం 12 గంటల నుంచి కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటాయి.
సీఎంఎఫ్ ఫోన్ 1 వివరాలు
⇒ 6/8GB ర్యామ్, 128GB స్టోరేజీ,
⇒ మీడియాటెక్ డైమెన్సిటీ 7300 చిప్‌సెట్
⇒ 120 Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్‌తో 6.67-అంగుళాల సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే
⇒ 50 MP రియర్ కెమెరా, 16 MP సెల్ఫీ కెమెరా
⇒ 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5000 mAh బ్యాటరీ
⇒ ఛార్జర్‌ను రూ. 799కి విడిగా కొనుగోలు చేయాల్సి ఉంటుంది.
⇒ 6GB ర్యామ్ + 128GB స్టోరేజ్ వెర్షన్ ధర రూ. 15,999
⇒ 8GB ర్యామ్ + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.17,999.
⇒ మొదటిరోజు సేల్‌లో రెండు మోడళ్లపై రూ. 1,000 తగ్గింపు.
⇒ ఫ్లిప్‌కార్ట్‌లో ఫోన్ కొంటే సీఎంఎఫ్ వాచ్ ప్రో 2 లేదా CMF బడ్స్ ప్రో 2పై రూ.1,000 తగ్గింపు
⇒ బ్లాక్, బ్లూ, ఆరెంజ్, గ్రీన్ రంగులలో లభించే బ్యాక్ కేస్‌ల ధర రూ.1499 యాక్సెసరీస్‌లో స్టాండ్ రూ. 799, లాన్యార్డ్ ధర రూ. 799, కార్డ్ కేస్ రూ. 799కి లభిస్తుంది.
సీఎంఎఫ్ వాచ్ ప్రో 2 వివరాలు
⇒ 1.32- అంగుళాల అమోల్డ్ ఎల్లప్పుడూ ఆన్ డిస్‌ప్లే
⇒ 120కి పైగా స్పోర్ట్స్ మోడ్స్
⇒ హృదయ స్పందన రేటు, బ్లడ్ ఆక్సిజన్ శాచురేషన్, ఒత్తిడి స్థాయిల నిరంతర పర్యవేక్షణ
⇒ IP68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్
⇒ మార్చుకోగలిగిన బెజెల్ డిజైన్
⇒ బ్లూటూత్ కాల్స్, మ్యూజిక్ కంట్రోల్, నోటిఫికేషన్స్, రిమోట్ కెమెరా కంట్రోల్
⇒ స్టాండర్డ్ మోడల్ ధర రూ. 4,999
⇒ వేగన్ లెదర్ రూ.5,499
⇒ డార్క్ గ్రే, యాష్ గ్రే, బ్లూ, ఆరెంజ్ రంగుల్లో లభ్యం.
⇒ బెజెల్, స్ట్రాప్ సెట్‌ను అదనంగా రూ. 749కి కొనుగోలు చేయవచ్చు.
సీఎంఎఫ్ బడ్స్ ప్రో 2 వివరాలు
⇒ 50 dB హైబ్రిడ్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్
⇒ మెరుగైన సౌండ్ క్వాలిటీ కోసం డ్యూయల్ డ్రైవర్‌లు
⇒ ఎల్‌డీఏసీ టెక్నాలజీ సపోర్ట్
⇒ Hi-Res ఆడియో వైర్‌లెస్
⇒ 43 గంటల బ్యాటరీ లైఫ్
⇒ స్పేషియల్ ఆడియో ఎఫెక్ట్
⇒ బ్లాక్, వైట్, బ్లూ, ఆరెంజ్ రంగులలో లభ్యం.
⇒ ధర రూ. 4,299.
Comments
Please login to add a commentAdd a comment