NOTHING
-
‘వర్క్ ఫ్రమ్ హోమ్ మనకు సెట్ కాదు.. ఆఫీస్‌కి వచ్చేయండి’
వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న తమ ఉద్యోగులందరూ ఆఫీస్‌కి వచ్చి పనిచేయాలని ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ ‘నథింగ్’ సీఈఓ కార్ల్ పీ ప్రకటించారు. కోవిడ్ నుంచి సంవత్సరాల తరబడి రిమోట్‌గా పనిచేస్తున్న లండన్ ఉద్యోగులు ఇక ఆఫీస్‌కు రావాలంటూ వారికి ఈమెయిల్స్ పంపించారు.కంపెనీ భవిష్యత్తు వృద్ధికి, ఆవిష్కరణలకు ఆఫీసు నుంచి పని చేయడం చాలా కీలకమని కార్ల్ పీ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన తన లింక్డిన్ ఖాతాలో పూర్తి ఈమెయిల్‌ను కూడా షేర్ చేశారు. "మనం తక్కువ సమయంలోనే చాలా దూరం వచ్చాం. పదేళ్లలో స్మార్ట్‌ఫోన్ వ్యాపారాన్ని స్థాపించి భారతదేశంలో 567 శాతం వార్షిక వృద్ధితో వేగంగా అభివృద్ధి చెందుతున్న స్మార్ట్‌ఫోన్ బ్రాండ్. అయినప్పటికీ, మనం మన సామర్థ్యంలో 0.1% వద్దే ఉన్నాం" అంటూ రాసుకొచ్చారు.రిమోట్ లేదా హైబ్రిడ్ విధానం చాలా కంపెనీలకు సరిపోయినప్పటికీ, ‘నథింగ్’కు సెట్ కాదని వివరించారు. ఇందుకు ఆయన మూడు ముఖ్యమైన కారణాలను పేర్కొన్నారు. భౌతిక ఉత్పత్తులను రూపొందించడంలో సన్నిహిత సహకారం అవసరం. బలమైన పోటీదారులను ఓడించడంలో సృజనాత్మకత, ఆవిష్కరణల ప్రాముఖ్యత. నవతరం టెక్ కంపెనీగా మారాలనే కంపెనీ ఆకాంక్ష అని వివరించారు. -
కొత్త బ్రాండ్ స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది.. వాచ్, బడ్స్ కూడా..
లండన్‌కు చెందిన టెక్నాలజీ సంస్థ ‘నథింగ్’ సబ్-బ్రాండ్ అయిన సీఎంఎఫ్ మూడు కొత్త ఉత్పత్తులను ఆవిష్కరించింది. సీఎంఎఫ్ ఫోన్ 1, సీఎంఎఫ్ వాచ్ ప్రో 2 , సీఎంఎఫ్ బడ్స్ ప్రో 2లను మార్కెట్లోకి తీసుకొచ్చింది.ఈ సీఎంఎఫ్ బ్రాండ్ కొత్త ఉత్పత్తులు జూలై 12 నుంచి భారత్‌లో విక్రయానికి రానున్నాయి. సీఎంఎఫ్ అధికారిక వెబ్సైట్ (cmf.tech) నుంచి, దారి రిటైల్ భాగస్వాముల ద్వారా జూలై 12 మధ్యాహ్నం 12 గంటల నుంచి కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటాయి.సీఎంఎఫ్ ఫోన్ 1 వివరాలు⇒ 6/8GB ర్యామ్, 128GB స్టోరేజీ, ⇒ మీడియాటెక్ డైమెన్సిటీ 7300 చిప్సెట్⇒ 120 Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్‌తో 6.67-అంగుళాల సూపర్ అమోల్డ్ డిస్ప్లే⇒ 50 MP రియర్ కెమెరా, 16 MP సెల్ఫీ కెమెరా⇒ 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5000 mAh బ్యాటరీ⇒ ఛార్జర్‌ను రూ. 799కి విడిగా కొనుగోలు చేయాల్సి ఉంటుంది.⇒ 6GB ర్యామ్ + 128GB స్టోరేజ్ వెర్షన్ ధర రూ. 15,999 ⇒ 8GB ర్యామ్ + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.17,999.⇒ మొదటిరోజు సేల్‌లో రెండు మోడళ్లపై రూ. 1,000 తగ్గింపు. ⇒ ఫ్లిప్‌కార్ట్‌లో ఫోన్ కొంటే సీఎంఎఫ్ వాచ్ ప్రో 2 లేదా CMF బడ్స్ ప్రో 2పై రూ.1,000 తగ్గింపు⇒ బ్లాక్, బ్లూ, ఆరెంజ్, గ్రీన్ రంగులలో లభించే బ్యాక్ కేస్ల ధర రూ.1499 యాక్సెసరీస్‌లో స్టాండ్ రూ. 799, లాన్యార్డ్ ధర రూ. 799, కార్డ్ కేస్ రూ. 799కి లభిస్తుంది.సీఎంఎఫ్ వాచ్ ప్రో 2 వివరాలు⇒ 1.32- అంగుళాల అమోల్డ్ ఎల్లప్పుడూ ఆన్ డిస్ప్లే⇒ 120కి పైగా స్పోర్ట్స్ మోడ్స్⇒ హృదయ స్పందన రేటు, బ్లడ్ ఆక్సిజన్ శాచురేషన్, ఒత్తిడి స్థాయిల నిరంతర పర్యవేక్షణ⇒ IP68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్⇒ మార్చుకోగలిగిన బెజెల్ డిజైన్⇒ బ్లూటూత్ కాల్స్, మ్యూజిక్ కంట్రోల్, నోటిఫికేషన్స్, రిమోట్ కెమెరా కంట్రోల్ ⇒ స్టాండర్డ్ మోడల్ ధర రూ. 4,999⇒ వేగన్ లెదర్ రూ.5,499⇒ డార్క్ గ్రే, యాష్ గ్రే, బ్లూ, ఆరెంజ్ రంగుల్లో లభ్యం.⇒ బెజెల్, స్ట్రాప్ సెట్‌ను అదనంగా రూ. 749కి కొనుగోలు చేయవచ్చు.సీఎంఎఫ్ బడ్స్ ప్రో 2 వివరాలు⇒ 50 dB హైబ్రిడ్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్⇒ మెరుగైన సౌండ్ క్వాలిటీ కోసం డ్యూయల్ డ్రైవర్లు⇒ ఎల్డీఏసీ టెక్నాలజీ సపోర్ట్⇒ Hi-Res ఆడియో వైర్లెస్⇒ 43 గంటల బ్యాటరీ లైఫ్⇒ స్పేషియల్ ఆడియో ఎఫెక్ట్⇒ బ్లాక్, వైట్, బ్లూ, ఆరెంజ్ రంగులలో లభ్యం.⇒ ధర రూ. 4,299. -
నథింగ్ ఫోన్ 2ఏ వచ్చేసింది.. ధర ఎంతంటే?
లండన్‌కు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ నథింగ్‌కు మంచి ఆదరణ లభించిన విషయం తెలిసిందే. భారత్‌లో ఈ స్మార్ట్ ఫోన్ అమ్మకాలు భారీగా జరిగాయి. నథింగ్ ఫోన్1 ప్రీమియం మార్కెట్‌ను టార్గెట్ చేసుకొని వస్తే.. తాజాగా ఈ బ్రాండ్ నుంచి మిడ్ రేంజ్ బడ్జెట్ ఫోన్‌ను తీసుకొచ్చింది. ప్రస్తుతం ఈ ఫోన్ యూజర్లకు అందుబాటులోకి వచ్చింది. బ్లాక్, వైట్ వేరియంట్లో నథింగ్ ఫోన్ 2ఏ మార్చి 5న ఆవిష్కరించింది. ఆండ్రాయిడ్ ఓఎస్‌లో ఆసక్తికరమైన టేకింగ్‌కు పేరుగాంచిన నథింగ్ గతంలో ఒరిజినల్ నథింగ్ ఫోన్ (2022), నథింగ్ ఫోన్ 2 (2023)లను ప్రారంభించింది. రూ.23,999 నుండి ప్రారంభమయ్యే ఈ ఫోన్లో 6.7-అంగుళాల అమోలెడ్ డిస్ప్లే, మీడియా టెక్ డైమన్సిటీ 7200 ప్రో ప్రాసెసర్, వెనుకవైపు డ్యూయల్ 50 ఎంపీ కెమెరా సెటప్, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్నాయి. -
నథింగ్ ఫోన్ గురించి తెలుసా..
నథింగ్.. అంటే ఏమీలేదు అనుకోకండి. అదో ప్రతిష్టాత్మక బ్రాండ్ మొబైల్ పేరు. కంపెనీ లాంచ్ చేసినవి రెండు ఫోన్లైనా కావాల్సినంత ప్రచారం లభించింది. వన్‌ప్లస్ సహ వ్యవస్థాపకుడైన కార్ల్‌పై స్థాపించిన బ్రాండ్ ఇది. ట్రాన్సపరెంట్ లుక్‌లో లాంచ్ అయిన నథింగ్ ఫోన్ 1, 2 ఇప్పటికే మంచి మార్కులు కొట్టేశాయి. ధరే కాస్త అధికంగా ఉండడంతో చాలామంది ఆసక్తి చూపలేదు. దీంతో మిడ్ రేంజ్లో తాజాగా నథింగ్ ఫోన్ 2ఏ పేరిట ఓ ఫోన్‌ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. నథింగ్ ఫోన్ 2ఏ మూడు వేరియంట్లలో లభిస్తుంది. 8జీబీ + 128జీబీ వేరియంట్ ధర రూ.23,999గా కంపెనీ నిర్ణయించింది. 8జీబీ+256జీబీ వేరియంట్ రూ.25,999గా ఉంది. 12జీబీ+ 256జీబీ వేరియంట్ ధర రూ.27,999గా పేర్కొంది. మార్చి 12 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. లాంచ్ ఆఫర్ కింద తొలిరోజు కొనుగోలు చేసేవారికి రూ.19,999కే ఈ ఫోన్‌ను అందిస్తామని కంపెనీ ప్రకటించింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కార్డు ద్వారా రూ.2వేలు, ఎక్స్ఛేంజ్ ఆఫర్ కింద మరో రూ.2వేలు చొప్పున తగ్గింపు పొందొచ్చు. నో-కాస్ట్ ఈఎంఐ సదుపాయం కూడా ఉంది. బ్లాక్, వైట్ కలర్స్‌లో లభిస్తుంది. ఫోన్ స్పెసిఫికేషన్స్.. ఆండ్రాయిడ్ 14 ఆధారిత నథింగ్ ఓఎస్ 2.5తో పనిచేస్తుంది. మూడేళ్ల పాటు ఆండ్రాయిడ్ అప్డేట్స్, నాలుగేళ్ల పాటు సెక్యూరిటీ అప్డేట్స్ లభిస్తాయి. 6.7 అంగుళాల ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే ఇచ్చారు. 30Hz నుంచి 120Hz రిఫ్రెష్ రేటుతో ఈ డిస్ప్లే పనిచేస్తుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్‌తో వస్తోంది. 1300 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉంది. ఈ ఫోన్లో మీడియాటెక్ డైమెన్సిటీ 7200 ప్రో ప్రాసెసర్‌ను అమర్చారు. వెనకవైపు డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. 50 ఎంపీ+ 50 ఎంపీ చొప్పున రెండు కెమెరాలు అమర్చారు. ముందువైపు 16 ఎంపీ కెమెరా ఉంది. ఈ ఫోన్లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీని అమర్చారు. నథింగ్ బడ్స్, నెక్ బ్యాండ్ నథింగ్ సబ్ బ్రాండ్ సీఎంఎఫ్ ఈ సందర్భంగా రెండు కొత్త ఆడియో ఉత్పత్తులను విడుదల చేసింది. సీఎంఎఫ్ బడ్స్, నెక్‌బ్యాండ్ ప్రోను తీసుకొచ్చింది. ఈ రెండూ మార్చి 6 నుంచి ఫ్లిప్‌కార్ట్, మింత్రాలో లభిస్తాయి. బడ్స్ ధరను రూ.2,499గా కంపెనీ నిర్ణయించింది. 42db నాయిస్ క్యాన్సిలేషన్‌తో ఈ బడ్స్ వస్తున్నాయి. సింగిల్ ఛార్జ్‌తో 8 గంటల పాటు పనిచేస్తాయి. ఛార్జింగ్ కేసు 35.5 గంటల బ్యాకప్ ఇస్తుంది. ఇదీ చదవండి: ఇషా అంబానీ ప్రయత్నం ఫలిస్తుందా..? నెక్‌బ్యాండ్ ప్రో ధర రూ.1999గా నిర్ణయించింది. హైబ్రిడ్ ఏఎన్సీ టెక్నాలజీ, 50db నాయిస్ క్యాన్సిలేషన్‌తో దీన్ని తీసుకొచ్చింది. ఐపీ55 వాటర్, స్వెట్, డస్ట్ రెసిస్టెన్స్‌తో వస్తోంది. సింగిల్ ఛార్జ్‌తో 37 గంటల పాటు పనిచేస్తుంది. 10 నిమిషాల ఛార్జింగ్‌తో 18 గంటల పాటు వీటిని వినియోగించుకోవచ్చని కంపెనీ పేర్కొంది. -
రూ. 749కే బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్‌ఫోన్ నథింగ్ ఫోన్ (1), డిస్కౌంట్ ఎంతంటే?
సాక్షి, ముంబై: బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్‌ఫోన నథింగ్ ఫోన్ (1) ఇపుడు డిస్కౌంట్ ధరలో కస్టమర్లకు అందుబాటులోకి వచ్చింది. కంపెనీ నథింగ్ ఫోన్ (2) లాంచింగ్‌కు సిద్ధమవుతున్న తరుణంలో నథింగ్ ఫోన్ (1) ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో భారీ తగ్గింపుతో లభిస్తుంది. ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో బాగా సేల్ అవుతున్న నథింగ్ ఫోన్ వన్ ఇపుడు రూ. 39,250 తగ్గింపు తర్వాత కేవలం రూ.749కే అందుబాటులో ఉంది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 8,000 తగ్గింపు తర్వాత రూ. 31,999గా లిస్ట్ అయింది. దీనితో పాటు హెచ్డీఎఫ్సీ ఈఎంఐ లావాదేవీలపై రూ. 1,250 తగ్గింపు లభిస్తోంది. దీనికి అదనంగా, పాత స్మార్ట్‌ఫోన్‌కు బదులుగా రూ. 30,000 వరకు తగ్గింపును కూడా అందిస్తోంది. ఈ ఆఫర్లన్నీ వర్తించిన తరువాత నథింగ్ ఫోన్ (1)ను రూ. 749కే కొనుగోలు చేయవచ్చు. కార్ల్ పీ నేతృత్వంలోని యూకే ఆధారిత టెక్ కంపెనీ నథింగ్ ఫోన్ సిరీస్‌లో నథింగ్ ఫోన్ (2) ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్‌నులాంచ్ చేయనుంది. ప్రీమియం స్పెసిఫికేషన్స్‌తో గేమ్-ఛేంజర్‌గా ఉంటుందనే అంచనాల మధ్య జూలైలో లాంచ్కానుంది. నథింగ్ ఫోన్ (1) స్పెసిఫికేషన్లు 6.55-అంగుళాల OLED డిస్ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 రక్షణ, 120Hz రిఫ్రెష్ రేట్ ఆండ్రాయిడ్ ఆధారిత నథింగ్ OS Qualcomm Snapdragon 778G+ చిప్సెట్ 12 జీబీ ర్యామ్,చ 256 జీబీ స్టోరేజ్ 50 ఎంపీ డ్యుయల్‌రియర్ కెమెరా 16 ఎంపీ సెల్ఫీ కెమెరా 33W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతుతో 4,500 mAh బ్యాటరీ -
గుడ్ ఫ్రైడే ఆఫర్: రూ.1500కే నథింగ్ ఫోన్ (1)
సాక్షి,ముంబై: గుడ్ ఫ్రైడే రోజున ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్‌ఫోన్ నథింగ్ ఫోన్ (1) పై భారీ ఆఫర్ లభిస్తోంది. యూకే ఆధారిత కార్ల్ పీ నేతృత్వంలోని వినియోగదారు టెక్ కంపెనీ త్వరలో ఫోన్ (2)ని లాంచ్ చేయడానికి సన్నద్ధమవుతున్నందున నథింగ్ ఫోన్ డిస్కౌంట్ ధరలో లభించనుంది. సేల్స్‌లో దూసుకుపోతున్న నథింగ్ ఫోన్ (1) గుడ్ ఫ్రైడే సందర్భంగా ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో కేవలం రూ. 1,500కే అందుబాటులో ఉంది. నథింగ్ ఫోన్ (1) ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో గుడ్ ఫ్రైడే రోజున రూ. 8,000 తగ్గింపు తర్వాత రూ. 29,999కి లిస్ట్ చేయబడింది. దీనికి అదనంగా, కొనుగోలుదారులు ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డ్‌పై 5శాతం క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. దీంతో స్మార్ట్‌ఫోన్ ధర రూ.28,500కి తగ్గింది. దీంతోపాటు పాత స్మార్ట్‌ఫోన్‌కు బదులుగా ఫ్లిప్‌కార్ట్ రూ. 27,000 వరకు తగ్గింపును అందిస్తోంది. అలా నథింగ్ ఫోన్ (1) ధరను రూ. 1,500కి దిగొచ్చింది. (సర్కార్ కొలువుకు గుడ్‌బై..9 లక్షల కోట్ల కంపెనీకి జై: ఎవరీ ప్రసూన్ సింగ్?) నథింగ్ ఫోన్ (1) లాంచింగ్ ప్రైస్. రూ. 32,999 నథింగ్ ఫోన్ (1)ఫీచర్లు 6.55-అంగుళాల OLED డిస్ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 రక్షణ 120Hz రిఫ్రెష్ రేట్ Qualcomm Snapdragon 778G+ చిప్సెట్ 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ 50ఎంపీ రియర్ డ్యూయల్ కెమెరా సెటప్ 16 ఎంపీ సెల్ఫీ కెమెరా 33W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతుతో 4,500 mAh బ్యాటరీ -
రూ. 32 వేల బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్‌ఫోన్ కేవలం రూ. 1,999కే
సాక్షి, ముంబై: బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్‌ఫోన్ నథింగ్ ఫోన్(1) ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో నమ్మశక్యం కాని ధరకు అందుబాటులో ఉంది.కార్ల్ పీ నేతృత్వంలోని యూకే ఆధారిత టెక్ స్టార్టప్ నుండి వచ్చిన తొలి స్మార్ట్‌ఫోన్ ఇది. నథింగ్ ఇయర్ (1) సక్సెస్ తరువాత దీనికి కొనసాగింపుగా త్వరలోనే నథింగ్ ఇయర్ (2) గ్లోబల్ లాంచ్ చేయనుంది. ఈ లాంచింగ్‌కు ముందే నథింగ్ ఫోన్ (1) ఫ్లిప్‌కార్ట్‌లో భారీ తగ్గింపుతో లభిస్తుంది. రూ. 32,999 ప్రారంభ ధరతో లాంచ్ అయిన నథింగ్ ఫోన్ (1) ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో కేవలం రూ. 1,999కి అందుబాటులో ఉంది. (టాటా, మారుతి, హ్యుందాయ్: కారు ఏదైనా ఆఫర్మాత్రం భారీగానే!) ఫ్లిప్‌కార్ట్‌లో 8వేల తగ్గింపుతో రూ. 29,999 వద్ద నథింగ్ ఫోన్ (1) లిస్ట్ అయింది. అయితే దీనికి అదనంగా, కొనుగోలుదారులు ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ ఈఎంఐ లావాదేవీలపై 10శాతం తక్షణ తగ్గింపు(రూ. 1000 వరకు). అలాగే పాత ఫోన్ ఎక్స్చేంజ్ ఆఫర్‌గా రూ. 27 వేల దాకా తగ్గింపుతో కలిపి నథింగ్ ఫోన్ (1) ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 1,999కే లభించనుంది. (వచ్చే ఏడాది ఫార్మా రంగం కళకళ!) నథింగ్ ఫోన్ (1) స్పెసిఫికేషన్లు 6.55 అంగుళాల OLED డిస్ప్లే Qualcomm Snapdragon 778G+ చిప్సెట్ ఆండ్రాయిడ్ ఆధారిత నథింగ్ OS 12జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ 50+50 డ్యుయల్ రియర్ కెమెరా 16 ఎంపీ సెల్ఫీ కెమెరా 33W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతుతో 4,500 mAh బ్యాటరీ -
ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో బంపర్ ఆఫర్: నథింగ్(1) ఫోన్‌పై రూ. 30వేలు తగ్గింపు
సాక్షి, ముంబై: ఇ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డే సేల్ 2023 ముగియనున్న తరుణంలో నథింగ్ ఫోన్(1) భారీ తగ్గింపు లభిస్తోంది. మూడువేరియంట్లలో లాంచ్ అయిన నథింగ్ ఫోన్ (1) ఇపుడు రూ. 30,500 తగ్గింపు తర్వాతఫ్లిప్కార్ట్లో రూ. 7,499 వద్ద సొంతం చేసుకోవచ్చు. అదెలా అంటే.. ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ రేపటితో (మార్చి 15) ముగియనుంది. ఈ సేల్‌లో రూ. 9,500 తగ్గింపు తర్వాత ఫ్లిప్‌కార్ట్‌లో నథింగ్ ఫోన్(1) లిస్టింగ్ ప్రైస్ రూ. 28,499గా ఉంది. దీనికి అదనంగా, అమెరికన్ ఎక్స్‌ప్రెస్ క్రెడిట్ కార్డ్ EMI లావా దేవీలపై 10శాతం,(రూ. 1,000 వరకు) తగ్గింపు. అంటే రూ.27,499. దీనికి తోడు పాత ఫోన్ మార్పిడి ద్వారా రూ. 20వేల వరకు తగ్గింపుతో నథింగ్ ఫోన్ (1) ధర రూ. 7,499కు దిగి వచ్చిందన్నమాట. నథింగ్ ఫోన్ (1) స్పెసిఫికేషన్స్ 6.55అంగుళాల OLED డిస్ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ Snapdragon 778G+ చిప్సెట్, 120Hz రిఫ్రెష్ రేట్ 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ 16ఎంపీ సెల్ఫీ కెమరా 33W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతుతో 4,500 mAh బ్యాటరీ ఎంఆర్పీ ధరలు 8జీబీ ర్యామ్,/128 జీబీ స్టోరేజ్ ధర రూ. 32,999 8 జీబీ ర్యామ్ /256 జీబీ స్టోరేజ్,రూ. 35,999 12 జీబీ ర్యామ్ /256 జీబీ స్టోరేజ్ రూ. 38,999 -
బీభత్సమైన ఆఫర్: జస్ట్ కామెంట్ చేస్తే చాలు.. ఉచితంగా రూ.30 వేల స్మార్ట్‌ఫోన్!
భారత్‌లో స్మార్ట్ఫోన్లకు విపరీతమైన డిమాండ్ ఉంది. ఈ క్రమంలో కొన్ని మొబైల్స్ కంపెనీలు కస్టమర్లను ఆకట్టుకునేందుకు వివిధ రకాల ఆఫర్లతో వస్తుంటాయి. తాజాగా ట్రాన్స్పరెంట్ లుక్‌తో లక్షల మందిని ఆకర్షించిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ నథింగ్ ఫోన్ (1) కూడా ఓ బంపర్ ఆఫర్‌ని తీసుకొచ్చింది. నథింగ్ బ్రాండ్ ఫౌండర్ కార్ల్ పి ఉచితంగా నథింగ్ ఫోన్ 1అందిస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఈ ఫ్రీ ఆఫర్ దక్కించుకోవడం కోసం ట్విట్టర్లో నడుస్తున్న ఒక కాంటెస్ట్‌లో పాల్గొనాలని తెలిపారు. కాంటెస్ట్ అంటే ఏదో కష్టంగా ఉంటుంది అనుకుంటే మీరు పొరపడినట్లే. మీరు చేయాల్సిందల్లా కార్ల్ పీ ట్వీట్‌కు కామెంట్ చేయడమే. మీ కామెంట్‌కు ఎవ్వరూ లైక్ కొట్టకపోతే మీకు నథింగ్ ఫోన్ 1ను ఉచితంగా గెలుచుకోవచ్చు. అలాగే ఎక్కువ లైక్స్ పొందిన కామెంట్‌కు ఉచితంగా నథింగ్ స్మార్ట్‌ఫోన్ 1 లభిస్తుంది. ఇందులో విజేతలను 24 గంటల్లోగా ప్రకటించనున్నారు. దీని బట్టి చూస్తే ఇద్దరు ఉచితంగా నథింగ్ స్మార్ట్ఫోన్లు పొందే అద్భుత అవకాశమని అనుకోవచ్చు. అయితే ఈ కాంపిటీషన్ వినడానికి ఈజీగానే ఉన్న కాస్త కష్టమనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పటి వరకు చూస్తే ప్రతి కామెంట్‌కు లైక్స్ ఉన్నాయి. అందువల్ల ఉచితంగా స్మార్ట్‌ఫోన్ పొందటం కష్టమే అని చెప్పుకోవాలి. మరో వైపు ఎక్కువ లైక్స్ పొందిన వారికి కూడా ఫోన్ ఉచితంగా వస్తుంది. అందువల్ల ఎక్కువ లైక్స్ పొందే వారికి మాత్రం ఉచిత ఫోన్ పొందే అవకాశం ఉంది. భారత్‌లో నథింగ్ స్మార్ట్‌ఫోన్ మూడు స్టోరేజ్ వేరియంట్లలో లభిస్తుంది. దీని ధర రూ. 27,499 (8GB RAM, 128GB స్టోరేజ్) నుంచి ప్రారంభమవుతుంది. 256GB స్టోరేజ్‌తో దాని మోడల్ ధర రూ. 30,499, టాప్-ఎండ్ మోడల్ 12GB RAM, 256GB స్టోరేజ్ ధర రూ.33,499. మూడు వేరియంట్లు కొన్ని ఆఫర్లు, డీల్స్‌తో ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉన్నాయి. చదవండి: బిలియనీర్‌కు భారీ షాక్.. ఒక్క రోజులో 63వేల కోట్లు తుడిచిపెట్టుకుపోయాయి! -
మీకు మా స్మార్ట్‌ఫోన్ ఫ్రీ: సీఈవో బంపర్ ఆఫర్, ట్వీట్ వైరల్
న్యూఢిల్లీ: క్రిస్మస్ పర్వదినం సమీపిస్తున్న తరుణంలో ఈ క్రిస్మస్ శాంతాక్లాజ్ కావాలనుకుంటున్నారా? అయితే నథింగ్ సీఈవో కార్ల్‌పీ బంపర్ ఆఫర్ గురించి తెలుసుకోవాల్సిందే. బెస్ట్ మీమ్ షేర్ చేసిన వారికి నథింగ్ స్మార్ట్‌ఫోన్(1) ఉచితం అంటూ కార్ల్ పీ ట్వీట్ చేశారు. దీంతో ఈ ట్వీట్ వైరల్‌గా మారింది. దీంతోపాటు చక్కటి మీమ్‌ను కూడా ఆయన షేర్ చేశారు. (నథింగ్ స్మార్ట్‌ఫోన్ (1)పై బంపర్ ఆఫర్: ఏకంగా 22 వేల తగ్గింపు) I'm feeling 🎅 Best meme in the next 24 hrs gets a Nothing Phone (1) — Carl Pei (@getpeid) December 16, 2022 మీరు బాగా చిలిపా? స్మార్టా? అయితే తమ స్మార్ట్‌ఫోన్ ఫ్రీ అన్నట్టుగా కార్ల్ పీ ట్వీట్ తెగ వైరల్ అవుతోంది. "రాబోయే 24 గంటల్లో వచ్చే బెస్ట్ మీమ్‌కి నథింగ్ ఫోన్ (1)’’ అంటూ ఆయన ట్వీట్ చేశారు. తన ఫాలోవర్స్‌తో ఇంటరాక్ట్ అవుతూ వారితో ఎక్కువగా టచ్‌లో ఉండే యాక్టివ్ టెక్ సీఈవోలలో ఒకరు కార్ ప్లీ. లండన్‌లోని సోహోలో కంపెనీ తొలి ఆఫ్‌లైన్ స్టోర్ ప్రారంభోత్సవంలో ఇటీవల ఫఫ్రీగా నథింగ్ ప్రొడకక్ట్స్ అందించారు. pic.twitter.com/p2eW6kClQr — Carl Pei (@getpeid) December 16, 2022 కాగా 2022లో నథింగ్ ఫోన్ (1) అత్యంత జనాదరణ పొందిన స్మార్ట్ఫోన్లలో ఒకటి. కార్ల్ పీ నేతృత్వంలోని యూకే -ఆధారిత స్టార్టప్ నథింగ్ తీసుకొచ్చిన ఈ తొలి ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో బెస్ట్ సెల్లర్‌గా నిలుస్తోంది. అలాగే ఫోన్ ఎరీనా బెస్ట్ డిజైన్ ఫోన్ 2022 అవార్డు కూడా గెల్చుకుంది. ప్రస్తుతం నథింగ్ ఫోన్ (1) ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో భారీ తగ్గింపుతో అందుబాటులో ఉన్న సంగతి తెలిసిందే. -
నథింగ్ స్మార్ట్‌ఫోన్ (1)పై బంపర్ ఆఫర్: ఏకంగా 22 వేల తగ్గింపు
సాక్షి, ముంబై: 2022లో పాపులర్ అయిన ప్రీమియమ్ స్మార్ట్‌ఫోన్ నథింగ్ ఫోన్ 1.కా ర్ల్ పీల్ నేతృత్వంలోని యూకే ఆధారిత సాంకేతిక సంస్థ నథింగ్ తీసుకొచ్చిన స్మార్ట్‌ఫోన్ 1 పై ఇపుడు భారీ తగ్గింపు లభిస్తోంది. ఫ్లిప్‌కార్ట్‌లో కేవలం రూ. 4,750కి అందుబాటులో ఉంది. 128, 256 స్టోరేజ్ రెండు వేరియంట్లలో ప్రారంభ ధర రూ. 32,999వద్ద ఈ స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయింది. ఆ తరువాత రెండు వేరియంట్ల రేట్లను పెంచేసింది. ఇది కూడా చదవండి: ఉద్యోగుల ఆశలన్నీ ఆవిరి: కేంద్రం షాకింగ్ న్యూస్ నథింగ్ ఫోన్ (1) ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 10,500 తగ్గింపు తర్వాత రూ. 27,499 వద్ద లిస్ట్ అయింది. దీనికి అదనంగా ఐడీఎఫ్సీ ఫస్ట్ క్రెడిట్ కార్డ్ EMI లావాదేవీలపై 10శాతం తక్షణ తగ్గింపు లభిస్తుంది. అంటే నథింగ్ ఫోన్ (1) ధర మరో రూ.2,749 తగ్గవచ్చు. దీంతోపాటు పాత స్మార్ట్‌ఫోన్‌ను మార్పిడి చేస్తే ఫ్లిప్‌కార్ట్ రూ. 20వేల రకు తగ్గింపును అందిస్తోంది. అన్ని ఆఫర్లతో కలిపి రూ.22,749 తగ్గింపుతో ఫ్లిప్‌కార్ట్‌లో కేవలం రూ.4,750కే నథింగ్ ఫోన్ (1)ని సొంతం చేసుకోవచ్చన్నమాట. (లేడీ బాస్ సర్ప్రైజ్ బోనస్ బొనాంజా..ఒక్కొక్కరికీ రూ. 82 లక్షలు!) నథింగ్ ఫోన్ (1)స్పెసిఫికేషన్స్ 6.55 అంగుళాల ఫుల్ HD+ OLED డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్ Qualcomm Snapdragon 778+ చిప్సెట్ 1080×2400 పిక్సెల్స్ రిజల్యూషన్ 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ 50 ఎంపీ ప్రైమరీ సెన్సార్‌తో డ్యూయల్ రియర్ కెమెరా 16ఎంపీ సెల్ఫీ కెమెరా 4500mAh బ్యాటరీ -
ఐఫోన్‌ను తలదన్నేలా బెస్ట్ ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్..! నథింగ్ నుంచి..! లాంచ్ ఎప్పుడంటే..?
వన్‌ప్లస్ కో ఫౌండర్ కార్ల్ పీ నథింగ్ టెక్నాలజీ లిమిటెడ్ సంస్థను నెలకొల్పిన విషయం తెలిసిందే. నథింగ్ ఇయర్ బడ్స్‌ను లాంచ్ చేసి ఆడియో గాడ్జెట్స్ సెగ్మెంట్స్‌లో సంచలనం సృష్టించాడు. ఇప్పుడు ఏకంగా యాపిల్ ఐఫోన్లకు ప్రత్యామ్నాయంగా స్మార్ట్‌ఫోన్‌ను రిలీజ్ చేసేందుకు నథింగ్ సిద్ధమైంది. నథింగ్ ఫోన్ 1 నథింగ్ బ్రాండ్ నుంచి తొలి స్మార్ట్‌ఫోన్ నథింగ్ ఫోన్ 1 ( Nothing Phone 1 ) పేరుతో రానుంది. ఈ విషయాన్ని వన్‌ప్లస్ మాజీ సీఈవో, ప్రస్తుతం నథింగ్ సంస్థ హెడ్ కార్ల్ పీ (Carl Pei) వెల్లడించారు. బుధవారం వర్చువల్‌గా జరిగిన నథింగ్ ఈవెంట్లో ఈ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన విషయాలను వెల్లడించారు. క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్‌తో రానుంది. స్టాక్ ఆండ్రాయిడ్ ఎక్స్‌పీరియన్స్‌కు అతి దగ్గరగా ఉండే నథింగ్ ఓఎస్ తో అందుబాటులో ఉండనుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను బెస్ట్ ఆఫ్ ప్యూర్ ఆండ్రాయిడ్‌గా సంస్థ పేర్కొంది. లాంచ్ ఎప్పుడంటే..? నథింగ్ ఫోన్ 1 మొబైల్‌ను ఈ ఏడాది జూలై, ఆగస్టు నెలలో విడుదల చేసే అవకాశం ఉంది. మరోవైపు గ్లోబల్‌గా లాంచ్ అయిన సమయంలోనే నథింగ్ ఫోన్ 1 భారత్‌లో కూడా లాంచ్ కానుంది. యాపిల్ ఐఫోన్లకు ప్రత్యామ్నాయంగా..! నథింగ్ ఫోన్ 1 యాపిల్‌ను ఐఫోన్లను టార్గెట్ చేసింది. యాపిల్‌కు ప్రత్యామ్నాయంగా గట్టి పోటీని ఇస్తూ ఎదగడమే తమ లక్ష్యమని కార్ల్ పీ చెప్పారు.స్టాక్ ఆండ్రాయిడ్ ప్లాట్ఫామ్లో బెస్ట్ ఫీచర్లను నథింగ్ ఓఎస్‌లో వాడుతామని కార్ల్ చెప్పారు. అలాగే మూడు సంవత్సరాల సాఫ్ట్వేర్ అప్డేట్లు, నాలుగు సంవత్సరాల సెక్యూరిటీ అప్డేట్లు రానున్నాయి. అంతేకాకుండా ట్రాన్స్‌ప్రంట్ డిజైన్‌తో వస్తోందని తెలిపారు. స్మార్ట్ఫోన్ల తయారీలో భాగంగా అమెరికన్ చిప్ మేకర్ క్వాల్కమ్తో నథింగ్ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. నథింగ్ స్మార్ట్‌ఫోన్ ధర రూ. 30 వేల కంటే తక్కువగా ఉండనుంది. చదవండి: ప్రపంచంలోనే ఫాస్టెస్ట్ ఛార్జింగ్ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసిన రియల్మీ..! ధర ఎంతంటే..?