సాక్షి, ముంబై: 2022లో పాపులర్ అయిన ప్రీమియమ్ స్మార్ట్‌ఫోన్ నథింగ్ ఫోన్ 1.కా ర్ల్ పీల్ నేతృత్వంలోని యూకే ఆధారిత సాంకేతిక సంస్థ నథింగ్ తీసుకొచ్చిన స్మార్ట్‌ఫోన్ 1 పై ఇపుడు భారీ తగ్గింపు లభిస్తోంది. ఫ్లిప్‌కార్ట్‌లో కేవలం రూ. 4,750కి అందుబాటులో ఉంది. 128, 256 స్టోరేజ్ రెండు వేరియంట్లలో ప్రారంభ ధర రూ. 32,999వద్ద ఈ స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయింది. ఆ తరువాత రెండు వేరియంట్ల రేట్లను పెంచేసింది.
ఇది కూడా చదవండి: ఉద్యోగుల ఆశలన్నీ ఆవిరి: కేంద్రం షాకింగ్ న్యూస్
నథింగ్ ఫోన్ (1) ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 10,500 తగ్గింపు తర్వాత రూ. 27,499 వద్ద లిస్ట్ అయింది. దీనికి అదనంగా ఐడీఎఫ్‌సీ ఫస్ట్ క్రెడిట్ కార్డ్ EMI లావాదేవీలపై 10శాతం తక్షణ తగ్గింపు లభిస్తుంది. అంటే నథింగ్ ఫోన్ (1) ధర మరో రూ.2,749 తగ్గవచ్చు. దీంతోపాటు పాత స్మార్ట్‌ఫోన్‌ను మార్పిడి చేస్తే ఫ్లిప్‌కార్ట్ రూ. 20వేల రకు తగ్గింపును అందిస్తోంది. అన్ని ఆఫర్‌లతో కలిపి రూ.22,749 తగ్గింపుతో ఫ్లిప్‌కార్ట్‌లో కేవలం రూ.4,750కే నథింగ్ ఫోన్ (1)ని సొంతం చేసుకోవచ్చన్నమాట. (లేడీ బాస్ సర్‌ప్రైజ్ బోనస్ బొనాంజా..ఒక్కొక్కరికీ రూ. 82 లక్షలు!)
నథింగ్ ఫోన్ (1)స్పెసిఫికేషన్స్
6.55 అంగుళాల ఫుల్ HD+ OLED డిస్‌ప్లే
120Hz రిఫ్రెష్ రేట్ Qualcomm Snapdragon 778+ చిప్‌సెట్
1080×2400 పిక్సెల్స్ రిజల్యూషన్
8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్
50 ఎంపీ ప్రైమరీ సెన్సార్‌తో డ్యూయల్ రియర్ కెమెరా
16ఎంపీ సెల్ఫీ కెమెరా
4500mAh బ్యాటరీ
Comments
Please login to add a commentAdd a comment