Nothing Phone 1 Bumper Offer: Get Nothing Phone Free Need To Participate In This Contest - Sakshi
Sakshi News home page

బీభత్సమైన ఆఫర్‌: జస్ట్‌ కామెంట్ చేస్తే చాలు.. ఉచితంగా రూ.30 వేల స్మార్ట్‌ఫోన్‌!

Published Wed, Dec 21 2022 7:00 PM | Last Updated on Thu, Dec 22 2022 12:10 AM

Nothing Phone 1 Bumper Offer: Get Smartphone Free Need To Participate This Contest - Sakshi

భారత్‌లో స్మార్ట్‌ఫోన్లకు విపరీతమైన డిమాండ్‌ ఉంది. ఈ క్రమంలో కొన్ని మొబైల్స్‌ కంపెనీలు కస్టమర్లను ఆకట్టుకునేందుకు వివిధ రకాల ఆఫర్లతో వస్తుంటాయి. తాజాగా  ట్రాన్స్‌పరెంట్ లుక్‌తో లక్షల మందిని ఆకర్షించిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ కంపెనీ నథింగ్‌ ఫోన్‌ (1) కూడా ఓ బంపర్‌ ఆఫర్‌ని ‍తీసుకొచ్చింది. 

నథింగ్ బ్రాండ్ ఫౌండర్ కార్ల్ పి ఉచితంగా నథింగ్ ఫోన్ 1అందిస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఈ ఫ్రీ ఆఫర్‌ దక్కించుకోవడం కోసం ట్విట్టర్‌లో నడుస్తున్న ఒక కాంటెస్ట్‌లో పాల్గొనాలని తెలిపారు. కాంటెస్ట్‌ అంటే ఏదో కష్టంగా ఉంటుంది అనుకుంటే మీరు పొరపడినట్లే.

మీరు చేయాల్సిందల్లా కార్ల్‌ పీ ట్వీట్‌కు కామెంట్ చేయడమే. మీ కామెంట్‌కు ఎవ్వరూ లైక్ కొట్టకపోతే మీకు నథింగ్ ఫోన్ 1ను ఉచితంగా గెలుచుకోవచ్చు. అలాగే ఎక్కువ లైక్స్ పొందిన కామెంట్‌కు ఉచితంగా నథింగ్ స్మార్ట్‌ఫోన్ 1 లభిస్తుంది.

ఇందులో విజేతలను 24 గంటల్లోగా ప్రకటించనున్నారు. దీని బట్టి చూ​స్తే ఇద్దరు ఉచితంగా నథింగ్ స్మార్ట్‌ఫోన్లు పొందే అద్భుత అవకాశమని అనుకోవచ్చు. అయితే ఈ కాంపిటీషన్‌ వినడానికి ఈజీగానే ఉన్న కాస్త కష్టమనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పటి వరకు చూస్తే ప్రతి కామెంట్‌కు లైక్స్ ఉన్నాయి. అందువల్ల ఉచితంగా స్మార్ట్‌ఫోన్ పొందటం కష్టమే అని చెప్పుకోవాలి.

మరో వైపు ఎక్కువ లైక్స్ పొందిన వారికి కూడా ఫోన్ ఉచితంగా వస్తుంది. అందువల్ల ఎక్కువ లైక్స్ పొందే వారికి మాత్రం ఉచిత ఫోన్ పొందే అవకాశం ఉంది. భారత్‌లో నథింగ్‌ స్మార్ట్‌ఫోన్‌ మూడు స్టోరేజ్ వేరియంట్‌లలో లభిస్తుంది. దీని ధర రూ. 27,499 (8GB RAM, 128GB స్టోరేజ్) నుంచి ప్రారంభమవుతుంది. 256GB స్టోరేజ్‌తో దాని మోడల్ ధర రూ. 30,499, టాప్-ఎండ్ మోడల్ 12GB RAM, 256GB స్టోరేజ్ ధర రూ.33,499. మూడు వేరియంట్‌లు కొన్ని ఆఫర్‌లు, డీల్స్‌తో ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉన్నాయి.

చదవండి: బిలియనీర్‌కు భారీ షాక్‌.. ఒక్క రోజులో 63వేల కోట్లు తుడిచిపెట్టుకుపోయాయి!

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement