వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న తమ ఉద్యోగులందరూ ఆఫీస్‌కి వచ్చి పనిచేయాలని ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ ‘నథింగ్’ సీఈఓ కార్ల్ పీ ప్రకటించారు. కోవిడ్ నుంచి సంవత్సరాల తరబడి రిమోట్‌గా పనిచేస్తున్న లండన్ ఉద్యోగులు ఇక ఆఫీస్‌కు రావాలంటూ వారికి ఈమెయిల్స్ పంపించారు.
కంపెనీ భవిష్యత్తు వృద్ధికి, ఆవిష్కరణలకు ఆఫీసు నుంచి పని చేయడం చాలా కీలకమని కార్ల్ పీ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన తన లింక్‌డిన్ ఖాతాలో పూర్తి ఈమెయిల్‌ను కూడా షేర్ చేశారు. "మనం తక్కువ సమయంలోనే చాలా దూరం వచ్చాం. పదేళ్లలో స్మార్ట్‌ఫోన్ వ్యాపారాన్ని స్థాపించి భారతదేశంలో 567 శాతం వార్షిక వృద్ధితో వేగంగా అభివృద్ధి చెందుతున్న స్మార్ట్‌ఫోన్ బ్రాండ్. అయినప్పటికీ, మనం మన సామర్థ్యంలో 0.1% వద్దే ఉన్నాం" అంటూ రాసుకొచ్చారు.
రిమోట్ లేదా హైబ్రిడ్ విధానం చాలా కంపెనీలకు సరిపోయినప్పటికీ, ‘నథింగ్’కు సెట్ కాదని వివరించారు. ఇందుకు ఆయన మూడు ముఖ్యమైన కారణాలను పేర్కొన్నారు. భౌతిక ఉత్పత్తులను రూపొందించడంలో సన్నిహిత సహకారం అవసరం. బలమైన పోటీదారులను ఓడించడంలో సృజనాత్మకత, ఆవిష్కరణల ప్రాముఖ్యత. నవతరం టెక్ కంపెనీగా మారాలనే కంపెనీ ఆకాంక్ష అని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment