సాక్షి, ముంబై: ఇ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డే సేల్ 2023 ముగియనున్న తరుణంలో నథింగ్ ఫోన్(1) భారీ తగ్గింపు లభిస్తోంది. మూడువేరియంట్లలో లాంచ్ అయిన నథింగ్ ఫోన్ (1) ఇపుడు రూ. 30,500 తగ్గింపు తర్వాతఫ్లిప్‌కార్ట్‌లో రూ. 7,499 వద్ద సొంతం చేసుకోవచ్చు. అదెలా అంటే..
ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ రేపటితో (మార్చి 15) ముగియనుంది. ఈ సేల్‌లో రూ. 9,500 తగ్గింపు తర్వాత ఫ్లిప్‌కార్ట్‌లో నథింగ్ ఫోన్(1) లిస్టింగ్ ప్రైస్ రూ. 28,499గా ఉంది. దీనికి అదనంగా, అమెరికన్ ఎక్స్‌ప్రెస్ క్రెడిట్ కార్డ్ EMI లావా దేవీలపై 10శాతం,(రూ. 1,000 వరకు) తగ్గింపు. అంటే రూ.27,499. దీనికి తోడు పాత ఫోన్ మార్పిడి ద్వారా రూ. 20వేల వరకు తగ్గింపుతో నథింగ్ ఫోన్ (1) ధర రూ. 7,499కు దిగి వచ్చిందన్నమాట.
నథింగ్ ఫోన్ (1) స్పెసిఫికేషన్స్
6.55అంగుళాల OLED డిస్‌ప్లే
కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్
Snapdragon 778G+ చిప్‌సెట్, 120Hz రిఫ్రెష్ రేట్
12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్
16ఎంపీ సెల్ఫీ కెమరా
33W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతుతో 4,500 mAh బ్యాటరీ
ఎంఆర్‌పీ ధరలు
8జీబీ ర్యామ్,/128 జీబీ స్టోరేజ్ ధర రూ. 32,999
8 జీబీ ర్యామ్ /256 జీబీ స్టోరేజ్,రూ. 35,999
12 జీబీ ర్యామ్ /256 జీబీ స్టోరేజ్ రూ. 38,999
Comments
Please login to add a commentAdd a comment