Nothing Phone (1) available at just Rs 1,999 on Flipkart - Sakshi
Sakshi News home page

రూ. 32 వేల బెస్ట్‌ సెల్లింగ్‌ స్మార్ట్‌ఫోన్‌ కేవలం రూ. 1,999కే 

Published Wed, Mar 22 2023 2:49 PM | Last Updated on Wed, Mar 22 2023 6:57 PM

Nothing Phone1 for 32999 only rs1999 in Flipkart - Sakshi

సాక్షి, ముంబై: బెస్ట్‌ సెల్లింగ్‌ స్మార్ట్‌ఫోన్‌ నథింగ్‌ ఫోన్‌(1) ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో నమ్మశక్యం కాని ధరకు అందుబాటులో ఉంది.కార్ల్ పీ నేతృత్వంలోని యూకే ఆధారిత టెక్ స్టార్టప్ నుండి వచ్చిన తొలి స్మార్ట్‌ఫోన్ ఇది. నథింగ్ ఇయర్ (1) ​సక్సెస్‌ తరువాత దీనికి కొనసాగింపుగా త్వరలోనే  నథింగ్ ఇయర్ (2) గ్లోబల్ లాంచ్‌ చేయనుంది. ఈ లాంచింగ్‌కు ముందే నథింగ్ ఫోన్ (1) ఫ్లిప్‌కార్ట్‌లో భారీ తగ్గింపుతో లభిస్తుంది. 

రూ. 32,999 ప్రారంభ ధరతో  లాంచ్‌ అయిన నథింగ్ ఫోన్ (1) ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో కేవలం రూ. 1,999కి అందుబాటులో ఉంది. (టాటా, మారుతి, హ్యుందాయ్‌: కారు ఏదైనా ఆఫర్‌మాత్రం భారీగానే!)

ఫ్లిప్‌కార్ట్‌లో 8వేల తగ్గింపుతో రూ. 29,999 వద్ద నథింగ్ ఫోన్ (1) లిస్ట్‌ అయింది. అయితే దీనికి అదనంగా, కొనుగోలుదారులు ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ ఈఎంఐ లావాదేవీలపై 10శాతం  తక్షణ తగ్గింపు(రూ. 1000 వరకు). అలాగే పాత ఫోన్‌ ఎ‍క్స్చేంజ్‌ ఆఫర్‌గా రూ. 27 వేల దాకా తగ్గింపుతో కలిపి నథింగ్ ఫోన్ (1) ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 1,999కే లభించనుంది. (వచ్చే ఏడాది ఫార్మా రంగం కళకళ!

నథింగ్ ఫోన్ (1) స్పెసిఫికేషన్‌లు
6.55 అంగుళాల OLED డిస్‌ప్లే
Qualcomm Snapdragon 778G+ చిప్‌సెట్ 
ఆండ్రాయిడ్ ఆధారిత నథింగ్ OS
12జీబీ ర్యామ్‌, 256  జీబీ స్టోరేజ్‌
 50+50 డ్యుయల్‌ రియర్‌ కెమెరా
16 ఎంపీ సెల్ఫీ కెమెరా 
33W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతుతో 4,500 mAh బ్యాటరీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement