నథింగ్.. అంటే ఏమీలేదు అనుకోకండి. అదో ప్రతిష్టాత్మక బ్రాండ్ మొబైల్ పేరు. కంపెనీ లాంచ్ చేసినవి రెండు ఫోన్లైనా కావాల్సినంత ప్రచారం లభించింది. వన్‌ప్లస్ సహ వ్యవస్థాపకుడైన కార్ల్‌పై స్థాపించిన బ్రాండ్ ఇది. ట్రాన్సపరెంట్ లుక్‌లో లాంచ్ అయిన నథింగ్ ఫోన్ 1, 2 ఇప్పటికే మంచి మార్కులు కొట్టేశాయి. ధరే కాస్త అధికంగా ఉండడంతో చాలామంది ఆసక్తి చూపలేదు. దీంతో మిడ్ రేంజ్‌లో తాజాగా నథింగ్ ఫోన్ 2ఏ పేరిట ఓ ఫోన్‌ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది.
- నథింగ్ ఫోన్ 2ఏ మూడు వేరియంట్లలో లభిస్తుంది. 8జీబీ + 128జీబీ వేరియంట్ ధర రూ.23,999గా కంపెనీ నిర్ణయించింది.
- 8జీబీ+256జీబీ వేరియంట్ రూ.25,999గా ఉంది.
- 12జీబీ+ 256జీబీ వేరియంట్ ధర రూ.27,999గా పేర్కొంది.
మార్చి 12 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. లాంచ్ ఆఫర్ కింద తొలిరోజు కొనుగోలు చేసేవారికి రూ.19,999కే ఈ ఫోన్‌ను అందిస్తామని కంపెనీ ప్రకటించింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కార్డు ద్వారా రూ.2వేలు, ఎక్స్ఛేంజ్ ఆఫర్ కింద మరో రూ.2వేలు చొప్పున తగ్గింపు పొందొచ్చు. నో-కాస్ట్ ఈఎంఐ సదుపాయం కూడా ఉంది. బ్లాక్, వైట్ కలర్స్‌లో లభిస్తుంది.
ఫోన్ స్పెసిఫికేషన్స్..
ఆండ్రాయిడ్ 14 ఆధారిత నథింగ్ ఓఎస్ 2.5తో పనిచేస్తుంది. మూడేళ్ల పాటు ఆండ్రాయిడ్ అప్‌డేట్స్, నాలుగేళ్ల పాటు సెక్యూరిటీ అప్‌డేట్స్ లభిస్తాయి. 6.7 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమోలెడ్ డిస్‌ప్లే ఇచ్చారు. 30Hz నుంచి 120Hz రిఫ్రెష్ రేటుతో ఈ డిస్‌ప్లే పనిచేస్తుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్‌తో వస్తోంది. 1300 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ఉంది. ఈ ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్‌సిటీ 7200 ప్రో ప్రాసెసర్‌ను అమర్చారు. వెనకవైపు డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. 50 ఎంపీ+ 50 ఎంపీ చొప్పున రెండు కెమెరాలు అమర్చారు. ముందువైపు 16 ఎంపీ కెమెరా ఉంది. ఈ ఫోన్‌లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీని అమర్చారు.
నథింగ్ బడ్స్, నెక్ బ్యాండ్
నథింగ్ సబ్ బ్రాండ్ సీఎంఎఫ్ ఈ సందర్భంగా రెండు కొత్త ఆడియో ఉత్పత్తులను విడుదల చేసింది. సీఎంఎఫ్ బడ్స్, నెక్‌బ్యాండ్ ప్రోను తీసుకొచ్చింది. ఈ రెండూ మార్చి 6 నుంచి ఫ్లిప్‌కార్ట్, మింత్రాలో లభిస్తాయి. బడ్స్ ధరను రూ.2,499గా కంపెనీ నిర్ణయించింది. 42db నాయిస్ క్యాన్సిలేషన్‌తో ఈ బడ్స్ వస్తున్నాయి. సింగిల్ ఛార్జ్‌తో 8 గంటల పాటు పనిచేస్తాయి. ఛార్జింగ్ కేసు 35.5 గంటల బ్యాకప్ ఇస్తుంది.
ఇదీ చదవండి: ఇషా అంబానీ ప్రయత్నం ఫలిస్తుందా..?
నెక్‌బ్యాండ్ ప్రో ధర రూ.1999గా నిర్ణయించింది. హైబ్రిడ్ ఏఎన్‌సీ టెక్నాలజీ, 50db నాయిస్ క్యాన్సిలేషన్‌తో దీన్ని తీసుకొచ్చింది. ఐపీ55 వాటర్, స్వెట్, డస్ట్ రెసిస్టెన్స్‌తో వస్తోంది. సింగిల్ ఛార్జ్‌తో 37 గంటల పాటు పనిచేస్తుంది. 10 నిమిషాల ఛార్జింగ్‌తో 18 గంటల పాటు వీటిని వినియోగించుకోవచ్చని కంపెనీ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment