Good Friday Offer: Nothing Phone (1) available at just Rs 1500 in Flipkart sale - Sakshi
Sakshi News home page

గుడ్ ఫ్రైడే  ఆఫర్‌: రూ.1500కే నథింగ్ ఫోన్ (1)

Published Fri, Apr 7 2023 12:01 PM | Last Updated on Fri, Apr 7 2023 1:03 PM

Good Friday offer Nothing Phone1 available just Rs1500 at Flipkart - Sakshi

సాక్షి,ముంబై:  గుడ్ ఫ్రైడే రోజున ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో బెస్ట్‌ సెల్లింగ్‌ స్మార్ట్‌ఫోన్‌ నథింగ్ ఫోన్ (1) పై భారీ ఆఫర్‌ లభిస్తోంది. యూకే ఆధారిత కార్ల్ పీ నేతృత్వంలోని వినియోగదారు టెక్ కంపెనీ త్వరలో ఫోన్ (2)ని లాంచ్ చేయడానికి సన్నద్ధమవుతున్నందున నథింగ్ ఫోన్ డిస్కౌంట్‌ ధరలో లభించనుంది.

సేల్స్‌లో దూసుకుపోతున్న నథింగ్ ఫోన్ (1) గుడ్ ఫ్రైడే సందర్భంగా ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో కేవలం రూ. 1,500కే అందుబాటులో ఉంది. నథింగ్ ఫోన్ (1) ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో గుడ్ ఫ్రైడే రోజున రూ. 8,000 తగ్గింపు తర్వాత రూ. 29,999కి లిస్ట్ చేయబడింది. దీనికి అదనంగా, కొనుగోలుదారులు ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డ్‌పై 5శాతం క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. దీంతో స్మార్ట్‌ఫోన్ ధర రూ.28,500కి తగ్గింది. దీంతోపాటు పాత స్మార్ట్‌ఫోన్‌కు బదులుగా ఫ్లిప్‌కార్ట్ రూ. 27,000 వరకు తగ్గింపును అందిస్తోంది. అలా నథింగ్ ఫోన్ (1) ధరను రూ. 1,500కి దిగొచ్చింది. (సర్కార్‌  కొలువుకు గుడ్‌బై..9 లక్షల కోట్ల కంపెనీకి జై: ఎవరీ ప్రసూన్‌ సింగ్‌?)

నథింగ్ ఫోన్ (1) లాంచింగ్‌ ప్రైస్‌. రూ. 32,999 
నథింగ్ ఫోన్ (1)ఫీచర్లు 
6.55-అంగుళాల OLED డిస్‌ప్లే
కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 రక్షణ  120Hz రిఫ్రెష్ రేట్‌
Qualcomm Snapdragon 778G+ చిప్‌సెట్
12 జీబీ ర్యామ్‌,  256 జీబీ స్టోరేజ్‌
50ఎంపీ రియర్‌  డ్యూయల్ కెమెరా సెటప్‌
16 ఎంపీ సెల్ఫీ కెమెరా
 33W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతుతో 4,500 mAh బ్యాటరీ
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement