buds
-
సరికొత్త మడత ఫోన్లు.. అదిరిపోయే ఫీచర్లు!
శాంసంగ్ తన సరికొత్త ఫోల్డబుల్ ఫోన్లను ప్రకటించింది. గెలాక్సి జెడ్ ఫోల్డ్6 (Galaxy Z Fold6), గెలాక్సి జెడ్ ఫ్లిప్6 (Galaxy Z Flip6)లను ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేసింది. భారత్‌లో వీటి ధరలను ప్రకటించిన కంపెనీ ముందస్తు ఆర్డర్లను ప్రారంభించింది.గెలాక్సి జెడ్ ఫ్లిప్6 (12GB+256GB) ధర రూ. 1,09,999 కాగా 12GB+512GB వెర్షన్ ధర రూ. 1,21,999. ఇక 12GB+256GB వేరియంట్లోని గెలాక్సి జెడ్ ఫోల్డ్6 ధర రూ.1,64,999 కాగా, 12GB+512GB వెర్షన్ రూ.1,76,999కి వస్తుంది. 12GB+1TB (సిల్వర్ షాడో కలర్) ధర రూ. 2,00,999 అని కంపెనీ తెలిపింది."డివైస్‌లను ప్రీ-ఆర్డర్ చేసే వారు రూ. 14,999 విలువ చేసే 'గెలాక్సీ జెడ్ అస్యూరెన్స్'లో భాగంగా రెండు స్క్రీన్లు, విడిభాగాలను కేవలం రూ. 999కి పొందుతారు" అని కంపెనీ తెలిపింది, ప్రస్తుత శాంసంగ్ ఫ్లాగ్షిప్ కస్టమర్లు రూ. 15,000 అప్‌గ్రేడ్ బోనస్‌ను పొందవచ్చని కంపెనీ పేర్కొంది.గెలాక్సి జెడ్ ఫోల్డ్6, గెలాక్సి జెడ్ ఫ్లిప్6 ఫోల్డబుల్ ఫోన్లతో పాటు గెలాక్సి బడ్స్3 (Galaxy Buds3), గెలాక్సి బడ్స్3 ప్రో (Galaxy Buds3 Pro)లను కూడా శాంసంగ్ లాంచ్ చేసింది. వీటిలో బడ్స్3 ధర రూ. 14,999 కాగా బడ్స్3 ప్రో ధర రూ. 19,999. శాంసంగ్ గెలాక్సి ఫోల్డబుల్ ఫోన్లు, బడ్స్ అమ్మకాలు జూలై 24 నుంచి ప్రారంభం కానున్నాయి.గెలాక్సి జెడ్ ఫోల్డ్6 స్పెసిఫికేషన్లు» 7.60-అంగుళాల ప్రైమరీ డిస్ప్లే» స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్» 10-మెగాపిక్సెల్ + 4-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా» 50-మెగాపిక్సెల్ + 12-మెగాపిక్సెల్ + 10-మెగాపిక్సెల్ రియర్ కెమెరా» 12GB ర్యామ్, 256GB, 512GB, 1TB స్టోరేజ్» 4400mAh బ్యాటరీ కెపాసిటీ» ఆండ్రాయిడ్ 14 ఓఎస్గెలాక్సి జెడ్ ఫ్లిప్6 స్పెసిఫికేషన్లు» 6.70-అంగుళాల ప్రైమరీ డిస్ప్లే» స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్» 10-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా» 50-మెగాపిక్సెల్ + 12-మెగాపిక్సెల్ రియర్ కెమెరా» 12GB ర్యామ్, 256GB, 512GB స్టోరేజ్» 4000mAh బ్యాటరీ కెపాసిటీ» ఆండ్రాయిడ్ 14 ఓఎస్ -
కొత్త బ్రాండ్ స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది.. వాచ్, బడ్స్ కూడా..
లండన్‌కు చెందిన టెక్నాలజీ సంస్థ ‘నథింగ్’ సబ్-బ్రాండ్ అయిన సీఎంఎఫ్ మూడు కొత్త ఉత్పత్తులను ఆవిష్కరించింది. సీఎంఎఫ్ ఫోన్ 1, సీఎంఎఫ్ వాచ్ ప్రో 2 , సీఎంఎఫ్ బడ్స్ ప్రో 2లను మార్కెట్లోకి తీసుకొచ్చింది.ఈ సీఎంఎఫ్ బ్రాండ్ కొత్త ఉత్పత్తులు జూలై 12 నుంచి భారత్‌లో విక్రయానికి రానున్నాయి. సీఎంఎఫ్ అధికారిక వెబ్సైట్ (cmf.tech) నుంచి, దారి రిటైల్ భాగస్వాముల ద్వారా జూలై 12 మధ్యాహ్నం 12 గంటల నుంచి కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటాయి.సీఎంఎఫ్ ఫోన్ 1 వివరాలు⇒ 6/8GB ర్యామ్, 128GB స్టోరేజీ, ⇒ మీడియాటెక్ డైమెన్సిటీ 7300 చిప్సెట్⇒ 120 Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్‌తో 6.67-అంగుళాల సూపర్ అమోల్డ్ డిస్ప్లే⇒ 50 MP రియర్ కెమెరా, 16 MP సెల్ఫీ కెమెరా⇒ 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5000 mAh బ్యాటరీ⇒ ఛార్జర్‌ను రూ. 799కి విడిగా కొనుగోలు చేయాల్సి ఉంటుంది.⇒ 6GB ర్యామ్ + 128GB స్టోరేజ్ వెర్షన్ ధర రూ. 15,999 ⇒ 8GB ర్యామ్ + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.17,999.⇒ మొదటిరోజు సేల్‌లో రెండు మోడళ్లపై రూ. 1,000 తగ్గింపు. ⇒ ఫ్లిప్‌కార్ట్‌లో ఫోన్ కొంటే సీఎంఎఫ్ వాచ్ ప్రో 2 లేదా CMF బడ్స్ ప్రో 2పై రూ.1,000 తగ్గింపు⇒ బ్లాక్, బ్లూ, ఆరెంజ్, గ్రీన్ రంగులలో లభించే బ్యాక్ కేస్ల ధర రూ.1499 యాక్సెసరీస్‌లో స్టాండ్ రూ. 799, లాన్యార్డ్ ధర రూ. 799, కార్డ్ కేస్ రూ. 799కి లభిస్తుంది.సీఎంఎఫ్ వాచ్ ప్రో 2 వివరాలు⇒ 1.32- అంగుళాల అమోల్డ్ ఎల్లప్పుడూ ఆన్ డిస్ప్లే⇒ 120కి పైగా స్పోర్ట్స్ మోడ్స్⇒ హృదయ స్పందన రేటు, బ్లడ్ ఆక్సిజన్ శాచురేషన్, ఒత్తిడి స్థాయిల నిరంతర పర్యవేక్షణ⇒ IP68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్⇒ మార్చుకోగలిగిన బెజెల్ డిజైన్⇒ బ్లూటూత్ కాల్స్, మ్యూజిక్ కంట్రోల్, నోటిఫికేషన్స్, రిమోట్ కెమెరా కంట్రోల్ ⇒ స్టాండర్డ్ మోడల్ ధర రూ. 4,999⇒ వేగన్ లెదర్ రూ.5,499⇒ డార్క్ గ్రే, యాష్ గ్రే, బ్లూ, ఆరెంజ్ రంగుల్లో లభ్యం.⇒ బెజెల్, స్ట్రాప్ సెట్‌ను అదనంగా రూ. 749కి కొనుగోలు చేయవచ్చు.సీఎంఎఫ్ బడ్స్ ప్రో 2 వివరాలు⇒ 50 dB హైబ్రిడ్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్⇒ మెరుగైన సౌండ్ క్వాలిటీ కోసం డ్యూయల్ డ్రైవర్లు⇒ ఎల్డీఏసీ టెక్నాలజీ సపోర్ట్⇒ Hi-Res ఆడియో వైర్లెస్⇒ 43 గంటల బ్యాటరీ లైఫ్⇒ స్పేషియల్ ఆడియో ఎఫెక్ట్⇒ బ్లాక్, వైట్, బ్లూ, ఆరెంజ్ రంగులలో లభ్యం.⇒ ధర రూ. 4,299. -
విడుదలకు ముందే వివరాలు లీక్ - ధర ఎంతంటే?
OnePlus Nord Buds 2r: ఆధునిక కాలంలో ఇయర్ ఫోన్స్ ఉపయోగించే వారి సంఖ్య కంటే 'బడ్స్' ఉపయోగించే వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. ఇప్పటికే మార్కెట్లో అనేక బ్రాండ్లకు సంబంధించిన బడ్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే ఇప్పుడు సరసమైన ధరలో వన్‌ప్లస్ (OnePlus) కంపెనీ 'నార్డ్ బడ్స్ 2ఆర్' (Nord Buds 2r) విడుదల చేయనుంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. దేశీయ మార్కెట్లో విడుదలకానున్న కొత్త 'వన్‌ప్లస్ నార్డ్ బడ్స్ 2ఆర్' బాక్స్ ధర రూ. 2,999 అని తెలుస్తోంది. అంటే వీటి రిటైల్ ధర ఇంకా తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. కంపెనీ వీటిని 2023 జులై 05న లాంచ్ చేయనుంది. విడుదలకు ముందే ఈ ఇయర్‌బడ్స్ ఫీచర్స్ కూడా లీక్ అయ్యాయి. (ఇదీ చదవండి: అట్లుంటది ముఖేష్ అంబానీ అంటే! ఆ కారు పెయింట్ ఖర్చు రూ. కోటి..) వన్‌ప్లస్ నార్డ్ బడ్స్ 2ఆర్ ఒక ఛార్జ్‌తో 38 గంటల వరకు పనిచేస్తుందని కంపెనీ తెలిపింది. ఇది ఐపీ55 రేటింగ్ వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ కూడా కలిగి మంచి ఆడియో క్వాలిటీ అందిస్తుంది. ఇందులో 12.4mm డైనమిక్ టిటానియం డ్రైవర్, 25డీబీ నాయిస్ కాన్సిలింగ్ ఉండనున్నాయి. ఈ లేటెస్ట్ బడ్స్ కలర్ ఆప్షన్స్ గురించి మాత్రమే కాకుండా ఆఫర్స్ గురించి కూడా త్వరలోనే తెలుస్తుంది. -
ఈ గూగుల్ ఇయర్ బడ్స్ స్పెషల్ ఏంటో తెలుసా?
టెక్ దిగ్గజం గూగుల్ సరికొత్త వైర్లెస్ ఇయర్‌బడ్స్‌ను విడుదల చేసింది. గతనెలలో పిక్సెల్ బడ్స్ ఎ-సిరీస్ ఇయర్ బడ్స్ విడుదల చేస్తున్నట్లు అనుకోకుండా ప్రకటించింది. అదే ఇయర్ బడ్స్ ను తాజాగా గూగుల్ అధికారికంగా విడుదల చేసింది. గూగుల్ ట్రూ వైర్లెస్ స్టీరియో (టిడబ్ల్యుఎస్) ఇయర్‌బడ్స్ ధర $ 99 (సుమారు రూ .7,200) కాగా ప్రస్తుతం ఈయర్ బడ్స్ యుఎస్, కెనడాలో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. సున్నితంగా, అతి తక్కువ సౌండ్ లో స్పష్టంగా వినబడతాయి. దీంతో చెవులల్లో ఒత్తిడి తగ్గిపోతుందని గూగుల్ తెలిపింది. కొత్త పిక్సెల్ బడ్స్ ఎ-సిరీస్ అడాప్టివ్ సౌండ్‌తో వస్తుంది. ఇది పరిసరాల ఆధారంగా వాల్యూమ్‌ను పెంచుతుంది లేదా తగ్గిస్తుంది. వినియోగదారులు ప్రయాణాల్లో ఈ ఇయర్ బడ్స్ వినియోగించడం వల్ల ఇతర వాహనాల నుంచి వచ్చే శబ్ధాలు రాకుండా నివారిస్తున్నట్లు తెలుస్తోంది. నివేదిక ప్రకారం,ఈ ఇయర్ బడ్స్ ఒక్కసారి పెట్టిన ఛార్జింగ్ 24 గంటల పాటు ఉండడమే కాదు కంటిన్యూగా 5 గంటల పాటు వినియోగించుకోవచ్చు. అతి తక్కువ సమయంలో అంటే 15నిమిషాలు ఛార్జింగ్ పెడితే 3గంటల పాటు వినియోగించుకోవచ్చు. దీంతో పాటు హలో గూగుల్ అంటూ మీ డౌట్స్ క్లియర్ చేసుకోవచ్చు. ట్రాన్సలేషన్, నోటిఫికేషన్లు పొందవచ్చు. చదవండి : Battlegrounds Mobile India భారీ స్థాయిలో ప్రి రిజిస్ట్రేషన్ -
గూగుల్ బడ్స్‌తో 40 భాషలు
భాషరాని చోటికి వెళితే ఇకపై ఇబ్బంది పడాల్సిన అవసరమే లేదు. చేతిలో గూగుల్ పిక్సెల్ ఫోన్.. ‘బడ్స్’ఇయర్ ఫోన్స్ ఉంటే చాలు.. దాదాపు 40 భాషలు మీకు వచ్చినట్లే.. ఎందుకంటే ఈ బడ్స్ 40 భాషలను తర్జుమా చేసి వినిపిస్తాయి. ఇటీవల జరిగిన గూగుల్ పిక్సెల్ కార్యక్రమంలో భాగంగా ఈ బడ్స్‌ను విడుదల చేశారు. ఆపిల్ ఎయిర్‌పాడ్స్ మాదిరిగా ఇవి నేరుగా స్మార్ట్‌ఫోన్ లేదా టాబ్లెట్‌కు అనుసంధానమై ఉండవు. కానీ రెండు చెవుల్లో ఉంచుకునే ఫోన్స్ మాత్రం ఒక తీగతో కనెక్ట్ అయి ఉంటాయి. అంతేకాకుండా కుడివైపు ఇయర్ఫోన్పై ఓ టచ్‌ప్యాడ్ ఉంటుంది. దీనిద్వారా మ్యూజిక్‌ను కంట్రోల్ చేయొచ్చు. పిక్సెల్ స్మార్ట్‌ఫోన్‌లో ఉండే గూగుల్ ట్రాన్స్‌లేట్ సాఫ్ట్వేర్ ద్వారా ఏ భాషనైనా ఇంకో భాషలోకి తర్జుమా చేసి వినిపిస్తాయి. అవతలి వ్యక్తి మాట్లాడుతూండగానే.. తర్జుమా చేసిన మాటలు మనకు వినిపించడం విశేషం. కుడిచెవిలోని వేళ్లతో టచ్ చేసి ఫలానా భాష మాట్లాడేందుకు సాయం చేయాలని అడగటమే ఆలస్యం గూగుల్ ట్రాన్స్‌లేట్ పనిలో పడిపోతుంది. మీరు మాట్లాడే భాష తాలూకూ భాషను స్పీకర్ ద్వారా ఎదుటి వ్యక్తికి వినిపించొచ్చు. బడ్స్‌లో ఎలాగూ ‘గూగుల్ అసిస్టెంట్’ఉంటుంది కాబట్టి.. స్మార్ట్‌ఫోన్‌లోని మ్యూజిక్‌ను మన మాటలతోనే కంట్రోల్ చేయొచ్చు. ఫోన్‌కాల్స్, టెక్ట్స్ మెసేజీ చదివేందుకు కూడా స్మార్ట్‌ఫోన్‌ను బయటకు తీయాల్సిన అవసరం ఉండదన్నమాట! -
కందినైనా కాపాడుకోండి
శనగపచ్చ పురుగు రెక్కల పురుగులు(బసవంతలు) లేత ఆకులపై పూత, పిందెలపై తెల్లని గసగసాల పరిమాణంలో గుడ్లు పెడుతాయి. వీటి నుంచి బయటకు వచ్చిన లార్వాలు తొలి రోజుల్లో ఆకులను తిని రంధ్రాలు చేస్తాయి. తర్వాత పంట పూత దశకు చేరగానే పూత, మొగ్గలు, కాయలు, గింజలను ఆశించి అధిక నష్టం కలగజేస్తాయి. నివారణ చర్యలు... దీని నివారణకు మొక్కల మొదళ్లలో గోనె సంచులు లేదా తాటిపత్రి షీట్లను పరవాలి. మొక్కను సున్నితంగా ఓ వైపు వంచి దులపాలి. ఇలా చేస్తే 90 శాతం శనగపచ్చ పురుగులు, ఇతర క్రిమికీటకాలు, నల్లులు, పెంకు పురుగులు కింద పడుతాయి. రాలిన లార్వాలను, ఇతర కీటకాలను పూడ్చడం గానీ మంటలో వేయడం చేయాలి. ఉధృతి మరీ ఎక్కువగా ఉంటే లీటర్ నీటిలో 3 మిల్లీలీటర్ల క్లోరోఫైరిపాస్ (20శాతం ఈసీ) లేదా 1 మిల్లీలీటరు నోవాల్యురాన్ (10శాతం ఈసీ) లేదా 2 మిల్లీలీటర్ల ప్రొఫెనోపాస్ (50 శాతం ఈసీ) మందును ఉదయం లేదా సాయంత్రం వేళల్లో పంటపై పిచికారీ చేయాలి. కాయతొలుచు పురుగు దీన్ని మారుక మచ్చల పురుగు, గూడు పురుగు అని కూడా అంటారు. వీటి లార్వాలు చిన్నవిగా ఉండి పూత లోపలి మెత్తటి భాగాలను తిని నష్టపరుస్తాయి. ఆకులు, పూత, పిందెలను కలిపి గూడుగా మలిచి తింటూ ఉండిపోతుంది. ఫలితంగా పంట కాత పట్టదు. కాయ అడుగు భాగాన చిన్న రంధ్రం చేసి లోపలికి ప్రవేశిస్తుంది. లోపలి మెత్తటి గింజలను తినేసి కాయలను డొల్లగా మారుస్తాయి. ఈ లార్వా ఆశించిన పూతపై, కాయ లోపల వాటి విసర్జన పదార్థాన్ని చూసి నిర్ధారించుకోవచ్చు. నివారణ చర్యలు... ఈ పురుగు నివారణకు లీటరు నీటిలో 3 మిల్లీలీటర్ల క్లోరోఫైరిపాస్ (25శాతం ఈసీ) మందును కలిపి పిచికారీ చేయాలి. ఉధృతి ఎక్కువగా ఉన్నట్లయితే రెండోసారి వారం రోజుల తర్వాత.. లీటరు నీటిలో 2.5 మిల్లీలీటర్ల ట్రయాజోఫాస్ (40శాతం ఈసీ) లేదా 0.4 మిల్లీలీటర్ల ఇమమేక్టిన్ బెంజోయేట్ (5 ఈసీ డబ్ల్యూజీ) లేదా 2 మిల్లీలీటర్ల ప్లూబెండమైడ్ (39, 35 ఎస్సీ) మందును కలిపి స్ప్రే చేయాలి. కాయతొలుచు ఈగ తల్లి ఈగ గుడ్లను కాయ లోపలికి జొప్పించి పెడతాయి. కాయ లోపలే గుడ్లు పొదిగి కాళ్లు లేని పిల్లలు(మగ్గోట్స్)గా మారి లేత గింజలను తిని మగ్గేట్ దశను పూర్తి చేసుకుని ప్యూపాగా మారుతాయి. ప్యూపాలు కొంత కాలం తర్వాత పగిలి తల్లి ఈగలు తయారవుతాయి. మగ్గేట్లు కాయ లోపలి భాగాన్ని కొరికి తినేటప్పుడు కాయ తొక్కకి పలుచని పొర ఏర్పడుతుంది. దీన్ని చీల్చుకుంటూ తల్లి ఈగ బయటకు వస్తుంది. ఈగ లేత దశలోనే ఆశించడం వల్ల జీవిత చక్రం కాయ లోపలనే జరుపుకోవడంతో ఇది కలుగజేసే నష్టాన్ని గుర్తించడం కష్టం. నివారణ చర్యలు... మొదటి దశలో లీటరు నీటిలో 2 మిల్లీలీటర్ల మోనోక్రొటోఫాస్ మందును పిచికారీ చేయాలి. పది రోజుల తర్వాత రెండో విడతగా లీటరు నీటిలో 2.5 మిల్లీలీటర్ల డైమిథోయేట్‌ను పంటపై స్ప్రే చేయాలి. వేరుకుళ్లు, ఎండుకుళ్లు ఈ తెగులు సోకిన మొక్కల ఆకులు వడలిపోయి క్రమేపీ వాడిపోతాయి. కాండాన్ని చీల్చి చూసినట్లయితే గోధుమ రంగు ధారలు కనిపిస్తాయి. వేర్లు పూర్తిగా కానీ పాక్షికంగా గానీ కుళ్లిపోతాయి. కొద్ది రోజుల్లోనే మొక్క చనిపోతుంది. నివారణ చర్యలు... దీని నివారణకు లీటరు నీటిలో 3 గ్రాముల కాపర్ ఆక్సీక్లోరైడ్ లేదా 0.2 గ్రాముల తెబుకొనజోల్ మందును కలిపి పిచికారీ చేయాలి. - మొక్కను మొత్తం మందుతో తడపాలి. ముఖ్యంగా మొదళ్లు బాగా తడిసేలా చూడాలి. - పై పద్ధతులను పాటిస్తే మంచి దిగుబడులు సాధించవచ్చని ఏఓ సూచించారు. కందిపెంకు పురుగు పెంకు పురుగులు పూత, కాతను ఆశించి పూత నుంచి కాత రసాన్ని పీల్చడం ద్వారా నష్టాన్ని కలుగజేస్తాయి. వీటిని సకాలంలో గుర్తించి నివారిస్తే నష్టాన్ని తగ్గించుకోవచ్చు. నివారణ చర్యలు... లీటరు నీటిలో 2.5 మిల్లీలీటర్ల ప్రొఫెనోపాస్ మందును కలిపి పిచికారీ చేయాలి.