టెక్ దిగ్గజం గూగుల్ సరికొత్త వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌ను విడుదల చేసింది. గతనెలలో పిక్సెల్ బడ్స్ ఎ-సిరీస్ ఇయర్ బడ్స్ విడుదల చేస్తున్నట్లు అనుకోకుండా ప్రకటించింది. అదే ఇయర్ బడ్స్ ను తాజాగా గూగుల్ అధికారికంగా విడుదల చేసింది. గూగుల్ ట్రూ వైర్‌లెస్ స్టీరియో (టిడబ్ల్యుఎస్) ఇయర్‌బడ్స్ ధర $ 99 (సుమారు రూ .7,200) కాగా ప్రస్తుతం ఈయర్ బడ్స్ యుఎస్, కెనడాలో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. సున్నితంగా, అతి తక్కువ సౌండ్ లో స్పష్టంగా వినబడతాయి. దీంతో చెవులల్లో ఒత్తిడి తగ్గిపోతుందని గూగుల్ తెలిపింది.
కొత్త పిక్సెల్ బడ్స్ ఎ-సిరీస్ అడాప్టివ్ సౌండ్‌తో వస్తుంది. ఇది పరిసరాల ఆధారంగా వాల్యూమ్‌ను పెంచుతుంది లేదా తగ్గిస్తుంది. వినియోగదారులు ప్రయాణాల్లో ఈ ఇయర్ బడ్స్ వినియోగించడం వల్ల ఇతర వాహనాల నుంచి వచ్చే శబ్ధాలు రాకుండా నివారిస్తున్నట్లు తెలుస్తోంది. నివేదిక ప్రకారం,ఈ ఇయర్ బడ్స్ ఒక్కసారి పెట్టిన ఛార్జింగ్ 24 గంటల పాటు ఉండడమే కాదు కంటిన్యూగా 5 గంటల పాటు వినియోగించుకోవచ్చు. అతి తక్కువ సమయంలో అంటే 15నిమిషాలు ఛార్జింగ్ పెడితే 3గంటల పాటు వినియోగించుకోవచ్చు. దీంతో పాటు హలో గూగుల్ అంటూ మీ డౌట్స్ క్లియర్ చేసుకోవచ్చు. ట్రాన్సలేషన్, నోటిఫికేషన్లు పొందవచ్చు.
చదవండి : Battlegrounds Mobile India భారీ స్థాయిలో ప్రి రిజిస్ట్రేషన్
Comments
Please login to add a commentAdd a comment