విడుదలకు ముందే వివరాలు లీక్ - ధర ఎంతంటే? | Oneplus nord buds 2r price and specifications leaked ahead launch | Sakshi
Sakshi News home page

విడుదలకు ముందే వన్​ప్లస్ బడ్స్ వివరాలు లీక్ - ధర ఎంతంటే?

Published Sun, Jun 25 2023 4:16 PM | Last Updated on Sun, Jun 25 2023 4:18 PM

Oneplus nord buds 2r price and specifications leaked ahead launch - Sakshi

OnePlus Nord Buds 2r: ఆధునిక కాలంలో ఇయర్ ఫోన్స్ ఉపయోగించే వారి సంఖ్య కంటే 'బడ్స్' ఉపయోగించే వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. ఇప్పటికే మార్కెట్లో అనేక బ్రాండ్లకు సంబంధించిన బడ్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే ఇప్పుడు సరసమైన ధరలో వన్​ప్లస్ (OnePlus) కంపెనీ 'నార్డ్​ బడ్స్​ 2ఆర్' (Nord Buds 2r) విడుదల చేయనుంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

దేశీయ మార్కెట్లో విడుదలకానున్న కొత్త 'వన్​ప్లస్ నార్డ్​ బడ్స్​ 2ఆర్' బాక్స్ ధర రూ. 2,999 అని తెలుస్తోంది. అంటే వీటి రిటైల్ ధర ఇంకా తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. కంపెనీ వీటిని 2023 జులై 05న లాంచ్ చేయనుంది. విడుదలకు ముందే ఈ ఇయర్​బడ్స్ ఫీచర్స్ కూడా లీక్ అయ్యాయి.

(ఇదీ చదవండి: అట్లుంటది ముఖేష్ అంబానీ అంటే! ఆ కారు పెయింట్ ఖర్చు రూ. కోటి..)

వన్​ప్లస్ నార్డ్​ బడ్స్​ 2ఆర్ ఒక ఛార్జ్‌తో 38 గంటల వరకు పనిచేస్తుందని కంపెనీ తెలిపింది. ఇది ఐపీ55 రేటింగ్ వాటర్​, డస్ట్​ రెసిస్టెన్స్​ కూడా కలిగి మంచి ఆడియో క్వాలిటీ అందిస్తుంది. ఇందులో 12.4mm డైనమిక్​ టిటానియం డ్రైవర్, 25డీబీ నాయిస్​ కాన్సిలింగ్ ఉండనున్నాయి. ఈ లేటెస్ట్ బడ్స్ కలర్ ఆప్షన్స్ గురించి మాత్రమే కాకుండా ఆఫర్స్ గురించి కూడా త్వరలోనే తెలుస్తుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement