New brand
-
కొత్త బ్రాండ్ స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది.. వాచ్, బడ్స్ కూడా..
లండన్‌కు చెందిన టెక్నాలజీ సంస్థ ‘నథింగ్’ సబ్-బ్రాండ్ అయిన సీఎంఎఫ్ మూడు కొత్త ఉత్పత్తులను ఆవిష్కరించింది. సీఎంఎఫ్ ఫోన్ 1, సీఎంఎఫ్ వాచ్ ప్రో 2 , సీఎంఎఫ్ బడ్స్ ప్రో 2లను మార్కెట్లోకి తీసుకొచ్చింది.ఈ సీఎంఎఫ్ బ్రాండ్ కొత్త ఉత్పత్తులు జూలై 12 నుంచి భారత్‌లో విక్రయానికి రానున్నాయి. సీఎంఎఫ్ అధికారిక వెబ్సైట్ (cmf.tech) నుంచి, దారి రిటైల్ భాగస్వాముల ద్వారా జూలై 12 మధ్యాహ్నం 12 గంటల నుంచి కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటాయి.సీఎంఎఫ్ ఫోన్ 1 వివరాలు⇒ 6/8GB ర్యామ్, 128GB స్టోరేజీ, ⇒ మీడియాటెక్ డైమెన్సిటీ 7300 చిప్సెట్⇒ 120 Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్‌తో 6.67-అంగుళాల సూపర్ అమోల్డ్ డిస్ప్లే⇒ 50 MP రియర్ కెమెరా, 16 MP సెల్ఫీ కెమెరా⇒ 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5000 mAh బ్యాటరీ⇒ ఛార్జర్‌ను రూ. 799కి విడిగా కొనుగోలు చేయాల్సి ఉంటుంది.⇒ 6GB ర్యామ్ + 128GB స్టోరేజ్ వెర్షన్ ధర రూ. 15,999 ⇒ 8GB ర్యామ్ + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.17,999.⇒ మొదటిరోజు సేల్‌లో రెండు మోడళ్లపై రూ. 1,000 తగ్గింపు. ⇒ ఫ్లిప్‌కార్ట్‌లో ఫోన్ కొంటే సీఎంఎఫ్ వాచ్ ప్రో 2 లేదా CMF బడ్స్ ప్రో 2పై రూ.1,000 తగ్గింపు⇒ బ్లాక్, బ్లూ, ఆరెంజ్, గ్రీన్ రంగులలో లభించే బ్యాక్ కేస్ల ధర రూ.1499 యాక్సెసరీస్‌లో స్టాండ్ రూ. 799, లాన్యార్డ్ ధర రూ. 799, కార్డ్ కేస్ రూ. 799కి లభిస్తుంది.సీఎంఎఫ్ వాచ్ ప్రో 2 వివరాలు⇒ 1.32- అంగుళాల అమోల్డ్ ఎల్లప్పుడూ ఆన్ డిస్ప్లే⇒ 120కి పైగా స్పోర్ట్స్ మోడ్స్⇒ హృదయ స్పందన రేటు, బ్లడ్ ఆక్సిజన్ శాచురేషన్, ఒత్తిడి స్థాయిల నిరంతర పర్యవేక్షణ⇒ IP68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్⇒ మార్చుకోగలిగిన బెజెల్ డిజైన్⇒ బ్లూటూత్ కాల్స్, మ్యూజిక్ కంట్రోల్, నోటిఫికేషన్స్, రిమోట్ కెమెరా కంట్రోల్ ⇒ స్టాండర్డ్ మోడల్ ధర రూ. 4,999⇒ వేగన్ లెదర్ రూ.5,499⇒ డార్క్ గ్రే, యాష్ గ్రే, బ్లూ, ఆరెంజ్ రంగుల్లో లభ్యం.⇒ బెజెల్, స్ట్రాప్ సెట్‌ను అదనంగా రూ. 749కి కొనుగోలు చేయవచ్చు.సీఎంఎఫ్ బడ్స్ ప్రో 2 వివరాలు⇒ 50 dB హైబ్రిడ్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్⇒ మెరుగైన సౌండ్ క్వాలిటీ కోసం డ్యూయల్ డ్రైవర్లు⇒ ఎల్డీఏసీ టెక్నాలజీ సపోర్ట్⇒ Hi-Res ఆడియో వైర్లెస్⇒ 43 గంటల బ్యాటరీ లైఫ్⇒ స్పేషియల్ ఆడియో ఎఫెక్ట్⇒ బ్లాక్, వైట్, బ్లూ, ఆరెంజ్ రంగులలో లభ్యం.⇒ ధర రూ. 4,299. -
పారిస్ ఒలింపిక్స్ 2024: టీమ్ ఇండియా దుస్తులను డిజైన్ చేసేదేవరంటే..!
పారిస్ ఒలింపిక్స్ వేడుకల్లో పాల్గొనన్న టీమ్ ఇండియా ధరించే దుస్తులను భారతీయ ప్రముఖ డిజైనర్ తరుణ్ తహిలియన్‌కి చెందిన లగ్జరీ బ్రాండ్ రూపొందిస్తోంది. తరుణ్ తహిలియాన్ లగ్జరీ బ్రాండ్ రెడీ టు వేర్ లేబుల్ తస్వా ఈ ప్రతిష్టాత్మకమైన బాధ్యతను చేపట్టింది. అయితే ఈ దుస్తుల డిజైనింగ్‌లో భారత సంప్రదాయ సొబగులకు ఆధునిక స్టైల్‌ని మిళితం చేసి సరికొత్తగా రూపొందించారు. ఈ సరికొత్త డిజైనర్‌వేర్ దుస్తులను క్రీడల మంత్రి మన్సుఖ్ మాండవియా జూన్ 30, 2024న ఇండియన్ ఒలింపిక్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఉషా సమక్షంలో ఆవిష్కరించారు. ముఖ్యంగా ఈ దుస్తుల డిజైనింగ్ భారతీయ సంప్రదాయ దుస్తులకు పెద్ద పీట వేసేలా రూపొందించడం విశేషం. అంతేగాక భారతదేశ సాంస్కృతిక వస్త్రాలకు ఐకాన్‌గా నిలచేలా త్రివర్ణ పతాకానికి సంబంధించిన.. కాషాయం, ఆకుపచ్చ, తెలుపు వంటి కలర్లతో రూపొందించారు. టీమ్ ఇండియా పురుష అథ్లెట్లు కుర్తా బూందీ సెట్, మహిళా అథ్లెట్లు అశోక చక్రాన్ని సూచించేలా.. కుంకుమ, ఆకుపచ్చ, నీలం బటన్ హోల్స్‌లోతో కూడిన తెలుపు చీరను డిజైన్ చేశారు. ఇక్కడ తెలుపు శాంతి, ఐక్యతను సూచించేలా చీర రంగును ఎంచుకోవడం విశేషం. ఈ మేరకు డిజైనర్ తరుణ్ తహిలియాని తాను డిజైన్ చేసిన ఈ దుస్తులు గురించి మాట్లాడుతూ..ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్‌తో కలిసి చాలా క్లోజ్‌గా పనిచేయడంతో ఇలా భారతదేశ చరిత్రను చెప్పేలా దుస్తులను డిజైన్ చేశాం. ఈ వస్తాలు చూసేందుకు ఆకర్షణీయంగానే కాకుండా సౌకర్యవంతంగా ఉంటాయి. ఇవి కార్యచరణను నిర్థేసిస్తాయి కూడా. ఈ ఒలింపిక్స్ ప్రారంభ వేడుకలో ఈ డిజైనర్ వేర్ దుస్తులతో అథ్లెట్స్ ఎంట్రీ అందరీ అటెన్షన్ తమపై ఉండేలా చేయడమే గాకుండా శాంతి, సామరస్యాన్ని చాటి చెబుతాయి. జూలైలో పారిస్ వెచ్చదనానికి అనుకూలమైన తేలికపాటి దుస్తులు ఇవి. ఆ వేదికపై అథ్లెట్లు భారతీయ సంస్కృతికి, వారసత్వానికి రాయబారులుగా వెళ్లాలని కోరుకుంటున్నా. అందుకే వాటి డిజైనింగ్ విషయంలో ఇంతలా శ్రద్ధ తీసుకున్నాం"అని తరుణ్ తహిలియాని అన్నారు. ఇక కుర్తా బూందీ సెట్‌ని తేలికపాటి మెత్తటి కాటన్‌తో రూపొందించినట్లు తెలిపారు. ఇది శ్వాసక్రియ సౌకర్యాన్ని నిర్థారిస్తుంది. అని ఏస్ డిజైనర్ అన్నారు. అలాగే మహిళ కోసం డిజైన్ చేసిన చీర కూడా శ్వాసకు సౌకర్యంగా ఉండేలా విస్కోస్ క్రేప్ మెటీరియల్‌ని ఎంచుకున్నట్లు వివరించారు డిజైనర్ తరుణ్ తహిలియాని. (చదవండి: మోదీ ఇష్టపడే అరకు వ్యాలీ కాఫీ..ప్రత్యేకత ఇదే..!) -
ప్రీమియం రిసార్ట్స్ విభాగంలోకి ఓయో.. కొత్త బ్రాండ్ ఆవిష్కరణ
న్యూఢిల్లీ: హాస్పిటాలిటీ టెక్నాలజీ సంస్థ ఓయో తాజాగా ప్రీమియం రిసార్టులు, హోటల్స్ విభాగంలోకి ప్రవేశించింది. పాలెట్ పేరిట కొత్త బ్రాండ్‌ను ఆవిష్కరించింది. ప్రస్తుతానికి హైదరాబాద్‌తో పాటు ముంబై, చెన్నై తదితర నగరాల్లో 10 రిసార్టులతో ఈ బ్రాండును ప్రారంభించినట్లు సంస్థ చీఫ్ మర్చంట్ ఆఫీసర్ అనుజ్ తేజ్‌పాల్ తెలిపారు. రెండో త్రైమాసికంలో దీని కింద మరో 40 రిసార్టులను చేర్చుకోనున్నట్లు వివరించారు. ప్రస్తుతం పర్యాటకులు మరింత విలాసవంతమైన పర్యటనల వైపు మొగ్గు చూపుతున్న నేపథ్యంలో పాలెట్ బ్రాండుకు మంచి ఆదరణ లభించగలదని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఓయోలో ప్రస్తుతం టౌన్హౌస్ ఓక్, ఓయో టౌన్హౌస్, కలెక్షన్ ఓ, క్యాపిటల్ ఓ పేరిట పలు బ్రాండ్స్ ఉన్నాయి. 2023 ఆఖరు నాటికి తమ ప్రీమియం పోర్ట్‌ఫోలియోలోకి మొత్తం 1,800 ప్రాపర్టీలను చేర్చుకోవాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. -
టెక్నో కామన్ 20 సిరీస్ ఫోన్ల విడుదల.. కెమెరానే ప్రత్యేకం!
చైనీస్ టెక్ బ్రాండ్ టెక్నో (Tecno) భారతదేశంలో కొత్త స్మార్ట్ఫోన్లను విడుదల చేసింది. టెక్నో కామన్ 20 (Tecno Camon 20) సిరీస్ పేరుతో మూడు సరికొత్త స్మార్ట్ఫోన్లను తీసుకొచ్చింది. లెదర్ ఫినిషింగ్, రిఫ్లెక్టివ్ డ్యూయల్ అపియరెన్స్ బ్యాక్ ప్యానెల్‌ను కలిగిన టెక్నో కామన్ 20, టెక్నో కామన్ 20 ప్రో స్మార్ట్ఫోన్లను కంపెనీ అధికారికంగా లాంచ్ చేసింది. ఈ ఫోన్లు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. అయితే ఈ సిరీస్‌లో రావాల్సిన కామన్ 20 ప్రీమియర్ 5జీ (Camon 20 Premier 5G)ని మాత్రం ఇంకా ఆవిష్కరించలేదు. జూన్ నెలాఖరున ఈ ఫోన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. కాగా కంపెనీ వెల్లడించిన వివరాల ప్రకారం.. టెక్నో కామన్ 20 సిరీస్ ఫోన్లలో కెమెరానే ప్రత్యేకతగా తెలుస్తోంది. ఈ కొత్త కెమెరా-సెంట్రిక్ స్మార్ట్ఫోన్లు అధునాతన పోర్ట్రెయిట్, వీడియో సామర్థ్యాలతో యూజర్లకు వినూత్న ఇమేజింగ్ అందిస్తాయని టెక్నో మొబైల్ ఇండియా సీఈవో తెలిపారు. అందుబాటు ధరలోనే.. టెక్నో కామన్ 20 16జీబీ ర్యామ్, 256 జీబీ రోమ్ వేరియంట్ ధర రూ.14,999. ప్రీడాన్ బ్లాక్, గ్లేసియర్ గ్లో, సెరెనిటీ బ్లూ రంగుల్లో ఈ ఫోన్ లభిస్తుంది. అమ్మకాలు మే 29 నుంచి ప్రారంభమవుతాయి. టెక్నో కామన్ 20 ప్రో 16జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వర్షన్ ధర రూ.19,999. 16జీబీ ర్యామ్ 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.21,999. ఈ మోడళ్లు డార్క్ వెల్కిన్, సెరెనిటీ బ్లూ కలర్స్‌లో వస్తున్నాయి. జూన్ రెండో వారంలో అందుబాటులోకి రానున్నాయి. డిజైన్, స్పెసిఫికేషన్లు ప్రత్యేకమైన కామన్ పజిల్ డిజైన్ 6.67 అంగుళాల AMOLED డాట్ ఇన్ డిస్ప్లే, ఫుల్ HD+ రిజల్యూషన్, 100 శాతం DCI-P3 వైడ్ కలర్ గామట్‌కు సపోర్ట్ 99.8 శాతం గుర్తింపు ఖచ్చితత్వం, 0.35 సెకన్ల వేగవంతమైన అన్‌లాక్‌తో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ వనిల్లా కామన్ 20 వేరియంట్ మీడియాటెక్ హీలియో G85 చిప్సెట్తో పాటు ఆర్మ్ మాలి-G52 యూనిట్ సపోర్ట్ 8జీబీ ర్యామ్ (మెమొరీ ఫ్యూజన్‌తో 16జీబీ) 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ప్రో మోడల్లో డైమెన్సిటీ 8050 ప్రాసెసర్ 256 జీబీ స్టోరేజ్ తక్కువ కాంతి పరిస్థితులలో సహాయపడే RGBW ప్రో టెక్నాలజీ, పోర్ట్రెయిట్ మాస్టర్, ఇన్-బాడీ స్టెబిలైజేషన్ సెన్సార్ షిఫ్ట్ OIS యాంటీ షేకింగ్ టెక్నాలజీ కామన్ 20లో 64MP+2MP+AI లెన్స్‌తో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ప్రో వేరియంట్లో 64MP+2MP+2MP ట్రిపుల్ కెమెరా మాడ్యూల్, 4K వీడియో రికార్డింగ్ 45W వరకు ఫ్లాష్ ఛార్జింగ్‌తో పాటు 5000mAh బ్యాటరీ యూనిట్ ఇదీ చదవండి: లేటెస్ట్ స్మార్ట్ఫోన్లు.. ధర రూ.10 వేల లోపే.. ఫీచర్స్ అదుర్స్! -
వ్యాపార రంగంలోకి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా
బాలీవుడ్లో దీపికా పదుకొణే అంటే పరిచయం అక్కర్లేని పేరు. 2007లో కెరీర్ ప్రారంభించిన ఆమె తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. బాలీవుడ్‌తో పాటు హాలీవుడ్‌లోనూ తన ఉనికి చాటుకుంది. బి-టౌన్లో అత్యంత ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్న నటీనటుల్లో దీపికా ఒకరు. ఇకా ఆమె వెండితెర ఎంట్రీకి 15 ఏళ్లు పూర్తిచేసుకుంది. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి నటిగా తన సత్తా చాటింది. ప్రస్తుతం టాప్ హీరోయిన్గా మెప్పించిన ఆమె.. తాజాగా వ్యాపార రంగంలోకి అడుగు పెట్టింది. ఫిలిం ఇండస్ట్రీలో 15 ఏళ్లు పూర్తి చేసుకున్న ఆనందంలో దీపికా పదుకొణె తన సొంత బ్రాండ్‌ను లాంచ్ చేసింది. చదవండి: హీరోతో అభ్యంతరకర సీన్.. నా తల్లిదండ్రులకు చెప్పే చేశా: హీరోయిన్ 82 ఈస్ట్ అనే పేరుతో సెల్ఫ్ కేర్ బ్రాండ్‌ను ప్రకటించింది. ఈ మేరకు తన ఇన్స్టాగ్రామ్ దీన్ని ప్రమోట్ చేస్తూ ఆమె వీడియో విడుదల చేసింది. ‘రెండేళ్ల క్రితమే సెల్ప్ కేర్ బ్రాండ్‌ను ప్రారంభించాలని అనుకున్నాం. ప్రస్తుతం దీన్ని మన దేశంలోనే లాంచ్ చేశాం. ఇక త్వరలోనే ప్రపంచవ్యాప్తంగా దీన్ని పరిచయం చేస్తాం. ఇదే మా 82 ఈస్ట్’ అంటూ రాసుకొచ్చింది. ఇదిలా ఉంటే ఇప్పటికే దీపికా నిర్మాతగా మారి పలు చిత్రాలు తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఇక ఆమె సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం దీపికా షారుక్ ఖాన్‌తో పఠాన్ చిత్రంతో పాటు పాన్ ఇండియా చిత్రం ప్రాజెక్ట్-కెలో హీరోయిన్గా చేస్తోంది. చదవండి: నా గ్లామర్ ఫొటోలు చూసి ఎంజాయ్ చేస్తున్నారు: హీరోయిన్ షాకింగ్ కామెంట్స్ View this post on Instagram A post shared by Deepika Padukone (@deepikapadukone) -
హీరో మోటోకార్ప్ విదా
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ద్విచక్ర వాహన తయారీ దిగ్గజం హీరో మోటోకార్ప్ విదా పేరుతో ఎలక్ట్రిక్ వెహికల్స్ బ్రాండ్‌ను ఆవిష్కరించింది. జూలై 1న అధికారికంగా ఎలక్ట్రిక్ వాహనంతో సహా విదా బ్రాండ్ కింద భవిష్యత్‌లో ప్రవేశపెట్టబోయే ఉత్పత్తులు, సేవలను పరిచయం చేయనున్నట్టు వెల్లడించింది. దుబాయి వేదికగా మార్చి 3న సాయంత్రం ఈ కార్యక్రమం జరిగింది. ఆంధ్రప్రదేశ్ చిత్తూరులో ఉన్న కంపెనీ ప్లాంటులో విదా మోడల్స్ ఉత్పత్తిని చేపట్టనున్నారు. ఏడాది చివర్లో డెలివరీలు ప్రారంభం కానున్నాయని కంపెనీ తెలిపింది. హీరో మోటాకార్ప్ ఈ సందర్భంగా రూ.760 కోట్ల ఫండ్‌ను ప్రకటించింది. పర్యావరణం, సామాజిక, పాలన విభాగాల్లో దేశవ్యాప్తంగా 10,000 మంది ఔత్సాహిక వ్యాపారవేత్తలను ప్రోత్సహించనున్నట్టు వెల్లడించింది. ‘విదా అంటే జీవితం. ప్రపంచంపై సానుకూల ప్రభావాన్ని సృష్టించడం, మనందరినీ అర్థ్ధవంతమైన మార్గాల్లో ముందుకు తీసుకెళ్లడం బ్రాండ్ ఏకైక ఉద్దేశం. మేము, మా పిల్లలు, తరువాతి తరం కోసం నిర్మిస్తున్న వాటికి ఈ పేరు సరైనదని నమ్ముతున్నాం. కేవలం 17 వారాల్లో ప్రపంచాన్ని మెరుగైన ప్రదేశంగా మార్చడానికి మా విదా ప్లాట్‌ఫామ్, ఉత్పత్తులు, సేవలను ఆవిష్కరిస్తాం’ అని హీరో మోటోకార్ప్ చైర్మన్, సీఈవో పవన్ ముంజాల్ తెలిపారు. జూలై 1న హీరో గ్రూప్ వ్యవస్థాపకులు బ్రిజ్మోహన్ లాల్ ముంజాల్ జయంతి. -
ట్యాక్సీ సెగ్మెంట్ కోసం టాటా మోటార్స్ కొత్త బ్రాండ్
న్యూఢిల్లీ: ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ తాజాగా కార్పొరేట్ కంపెనీలు, ప్రభుత్వ విభాగాలు, ట్యాక్సీ సర్వీసులకు ఉపయోగించే వాహనాల కోసం ప్రత్యేకంగా 'ఎక్స్‌ప్రెస్' పేరుతో కొత్త బ్రాండ్‌ను ఆవిష్కరించింది. ఈ సెగ్మెంట్లో తక్కువ ధర, ప్యాసింజరు సౌకర్యం, భద్రత అణాలను దృష్టిలో ఉంచుకుని వాహనాలను అందించనున్నట్లు తెలిపింది. వ్యక్తిగత అవసరాలకు ఉపయోగించే వాటికి, ఈ కేటగిరీ వాటికి మధ్య వ్యత్యాసం స్పష్టంగా తెలిసేలా వీటిపై ఎక్స్‌ప్రెస్ బ్యాడ్జ్ ఉంటుందని టాటా మోటార్స్ ప్రెసిడెంట్ శైలేష్ చంద్ర వివరించారు. ఎక్స్ఫైస్ బ్రాండ్ మొదటి వాహనాన్ని ఎక్స్ట్రెస్-టి పేరిట ఎలక్టిక్ సెడాన్‌ను త్వరలో ప్రవేశపెట్టనున్నట్లు తెలిపింది. తక్కువ మెయింటెనెన్స్ ఖర్చులు, అందుబాటు ధర సౌకర్యవంతమైన అనుభూతి వంటి అంశాల కారణంగా నగరాల్లో ప్రయాణాలకు ఎలక్టిక్ వాహనాలు అనుకూలంగా ఉంటాయని పేర్కొంది. ఎక్స్ ఫ్రెస్-టి ఎలక్టిక్ సెడాన్ కార్లు 218 కిమీ.. 165 కి.మీ. మైలేజీ వేరియేషన్లలో అందుబాటులోకి తెస్తామని వివరించింది. -
బ్యూటీ ప్రొడక్ట్స్ విక్రయాల్లోకి ‘లువీ’
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బ్యూటీ ప్రొడక్ట్స్ విక్రయాల్లోకి కొత్త బ్రాండ్ ‘లువీ’ ఎంట్రీ ఇచ్చింది. యాంకర్, నటి శ్రీముఖి నేతృత్వంలో ఈ బ్రాండ్ ఏర్పాటైంది. లువీ అంటే సంస్కృతంలో అందం అని అర్థం. తొలుత పర్ఫ్యూమ్స్ను ప్రవేశపెట్టి దశలవారీగా బ్యూటీ, గ్రూమింగ్, హెయిర్ కేర్ వంటి ఉత్పత్తులను లువీ స్టోర్లలో పరిచయం చేస్తారు. 40 అంతర్జాతీయ బ్రాండ్స్‌తో కలిపి మొత్తం 80 కంపెనీల సుగంధ పరిమళాలు ఇక్కడ కొలువుదీరాయి. వీటి ధరలు రూ.299తో ప్రారంభమై రూ.7,500 వరకు ఉంది. ‘వ్యాపార రంగంలోకి ప్రవేశించాలని కొన్నేళ్లుగా భావిస్తున్నాను. నా ఆలోచనలకు తగ్గ భాగస్వాములు దొరికారు. వారికి ఉన్న రిటైల్ అనుభవం లువీ అభివృద్ధికి ఉపయోగపడుతుంది. పర్ఫ్యూమ్స్, బ్యూటీ ప్రొడక్ట్స్ వాడకం పల్లెల్లోనూ పెరిగింది. తక్కువ పెట్టుబడితో ఫ్రాంచైజీ ద్వారా నిరుద్యోగులకు తోడ్పాటు అందించాలన్నది నా ఆలోచన’ అని లువీని ప్రమోట్ చేస్తున్న రస్గో ఇంటర్నేషనల్ డైరెక్టర్, బ్రాండ్ అంబాసిడర్ శ్రీముఖి ఆదివారమిక్కడ మీడియాకు తెలిపారు. తిరుపతి రావు వొజ్జా, శ్రీకాంత్ అవిర్నేని, విజయ్ అడుసుమల్లి కంపెనీ డైరెక్టర్లుగా ఉన్నారు. తొలి ఏడాది 150 స్టోర్లు.. షాప్ ఇన్ షాప్ విధానంలో స్టోర్ల ఏర్పాటుకు లినెన్ దుస్తుల విక్రయంలో ఉన్న లినెన్ హౌజ్‌తో లువీ భాగస్వామ్యం కుదుర్చుకుంది. లినెన్ హౌజ్‌కు చెందిన 23 దుకాణాల్లో షాప్ ఇన్ షాప్స్ ఏర్పాటు చేసింది. ఏడాదిలో 150 స్టోర్లను సొంతంగా ప్రారంభించనున్నారు. -
మైక్రోమాక్స్ బిగ్ అనౌన్స్ మెంట్
సాక్షి, ముంబై: ఒకపుడు దిగ్గజంగా వెలిగిన దేశీయ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ మైక్రోమాక్స్ మళ్లీ తన పూర్వ వైభవాన్ని పొందేందుకు సిద్ధపడుతోంది. దేశంలో చైనా ఉత్పత్తులపై పెరుగుతున్న వ్యతిరేకత నేపథ్యంలో మైక్రోమాక్స్ సరికొత్త వ్యూహాలతో మార్కెట్లోకి రీఎంట్రీ ఇవ్వనుంది. ఈమేరకు మైక్రోమాక్స్ సీఈవో రాహుల్ శర్మ ఒక వీడియోను ట్విటర్ లో పోస్ట్ చేశారు. పోటీ మార్కెట్ లో చైనా మొబైల్ సంస్థలు వస్తే.. ఒకే కానీ, సరిహద్దులో అనిశ్చితి సరైనది కాదు అంటూ ఆయన చైనాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మధ్య తరగతి కుటుంబంలో, ఒక సామాన్య ఉపాధ్యాయుడి కుమారుడిగా తన వ్యాపార ప్రస్థానాన్నిఈ వీడియోలో వివరించారు. ప్రపంచంలో టాప్ 10 బ్రాండ్స్ లో ఒకటిగా నిలిచిన మైక్రోమాక్స్ జర్నీని ప్రస్తావించారు. అయితే కొన్ని పొరపాట్లు జరిగినా, తాను ఓడిపోకపోయినా, సాధించిన దానితో సంతృప్తి చెందానని చెప్పుకొచ్చారు. కానీ సరిహద్దు వద్ద ఏమి జరిగిందో అది సరైనది కాదన్నారు. ఏం చేయాలి.. ఎవరికోసం చేయాలి అని చాలా ఆలోంచించాను.. అయితే ఎక్కడినుంచి మొదలు పెట్టానో.. మళ్లీ అక్కడ్నించే మొదలు పెట్టే అవకాశాన్ని జీవితం ఇచ్చింది. కానీ ఈసారి ఏం చేసిన దేశం కోసం మాత్రమే చేస్తానని రాహుల్ ప్రకటించారు. అందుకే ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆత్మనిభర్ భారత్ పిలుపులో భాగంగా ఇండియా కోసం మైక్రోమాక్స్ 'ఇన్' అనే కొత్త స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌తో తిరిగి వస్తోందని వెల్లడించారు. భారతదేశంలో కొత్త ఇన్-సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదలకు సూచికగా బ్లూ బాక్స్ ను కూడా వీడియోలో షేర్ చేశారు. ఇంతకుమించి వివరాలను ఆయన ప్రకటించపోయినప్పటికీ, 7-15 వేల రూపాయల ధరల మధ్య ఉత్పత్తులను మైక్రోమాక్స్ లాంచ్ చేయనుందని భావిస్తున్నారు. నవంబర్ ఆరంభంలో ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్లను బడ్జెట్ ధరలో ఆవిష్కరించనుందని టెక్ నిపుణుల అంచనా. ఇందుకోసం 500 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టాలని యోచిస్తోంది. We're #INForIndia with #INMobiles! What about you? #IndiaKeLiye #BigAnnouncement #MicromaxIsBack #AatmanirbharBharat pic.twitter.com/eridOF5MdQ — Micromax India (@Micromax__India) October 16, 2020 -
వొడాఫోన్ కొత్త ‘ఐడియా’
న్యూఢిల్లీ: వొడాఫోన్ ఐడియా లిమిటెడ్ (వీఐఎల్) ‘వీఐ’ బ్రాండ్‌తో వినియోగదారులను ఇక మీదట పలకరించనుంది. టెలికం మార్కెట్లో వాటా పెంచుకునే లక్ష్యంతో, మరింత మంది చందాదారులను ఆకర్షించడం ద్వారా నెట్వర్క్ బలోపేతం లక్ష్యాలతో నూతన బ్రాండ్ వీఐను సోమవారం కంపెనీ ఆవిష్కరించింది. వొడాఫోన్, ఐడియా బ్రాండ్లను ఇకమీదట వీఐగా పిలవనున్నట్టు కంపెనీ ప్రకటించింది. జూన్ చివరికి 28 కోట్ల చందాదారులు వొడాఫోన్ ఐడియా నెట్వర్క్ పరిధిలో ఉన్నారు. ఏజీఆర్ బకాయిల చెల్లింపులపై పదేళ్ల గడువు ఇస్తూ సుప్రీంకోర్టు తీర్పు జారీ చేసిన వారం వ్యవధిలోనే వొడాఫోన్ ఐడియా నూతన బ్రాండ్‌తో మార్పు దిశగా అడుగువేసింది. అంతేకాదు, రూ.25,000 కోట్ల నిధుల సమీకరణకు బోర్డు గత వారం నిర్ణయించిన విషయం తెలిసిందే. 100 కోట్ల మందికి 4జీ సేవలు ‘‘రెండేళ్ల క్రితం విలీనం ద్వారా వొడాఫోన్ ఐడియా ఏర్పడింది. అప్పటి నుంచి రెండు అతిపెద్ద నెట్‌వర్క్‌లు, ఉద్యోగులు, ప్రక్రియల ఏకీకరణపై దృష్టి పెట్టాము. భవిష్యత్తుపై దృష్టితో కస్టమర్ల కోసం రూపొందించిన బ్రాండ్ వీఐ. రెండు బ్రాండ్ల ఏకీకరణతో ప్రపంచంలోనే అతిపెద్ద టెలికం విలీనం పూర్తయింది. అంతేకాదు 4జీ నెట్‌వర్క్‌పై 100 కోట్ల భారతీయులకు బలమైన డిజిటల్ సేవలు అందించేందుకు, భవిష్యత్తు ప్రయాణానికి వీలుగా కంపెనీ సిద్ధమైంది’’అంటూ వీఐ బ్రాండ్‌ను వర్చువల్‌గా ఆవిష్కరించిన సందర్భంగా కంపెనీ ఎండీ, సీఈవో రవీందర్ టక్కర్ పేర్కొన్నారు. చార్జీలు పెంచాల్సిందే.. గత కాలపు బకాయిల చెల్లింపులకు టెలికం కంపెనీలకు సుప్రీంకోర్టు పదేళ్ల గడువు ఇవ్వడాన్ని సానుకూల పరిణామంగా వొడాఫోన్ ఐడియా అభివర్ణించింది. పరిశ్రమ మనుగడ సాగించాలంటే మొబైల్ టారిఫ్‌లను పెంచాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. అదనపు టారిఫ్‌లు (చార్జీలు) చెల్లించేందుకు వినియోగదారులు సిద్ధంగా ఉన్నారని, గతంలో చెల్లించిన మాదిరే (జియో రాక పూర్వం) ఉండొచ్చని టక్కర్ పేర్కొన్నారు. తొలుత రూ.200కు, అనంతరం రూ.300కు టారిఫ్‌లు పెరగడం తప్పనిసరి అన్నారు. చార్జీలు పెంచేందుకు తాము సంకోచించడం లేదని.. ఇదే సరైన తరుణమని భావిస్తే ఆ దిశగా నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. భారతీ ఎయిర్టెల్ చైర్మన్ సునీల్మిట్టల్ సైతం ఇదే విధమైన ప్రకటనను ఇటీవలే చేసిన విషయం గమనార్హం. ఏజీఆర్, ఇతర బకాయిల రూపంలో వొడాఫోన్ ఐడియా టెలికం శాఖకు రూ.58,000 కోట్లను చెల్లించాల్సి ఉండగా, ఇప్పటికి రూ.7,000 కోట్లకు పైగా చెల్లింపులు చేసింది. పదేళ్ల గడువు ఇవ్వడంతో కంపెనీకి పెద్ద ఉపశమనే లభించినట్టయింది. తాము ఇప్పటికే 10 శాతం చెల్లించేశామని, కనుక తదుపరి చెల్లింపులు 2020 మార్చిలోనే చేయాల్సి ఉంటుందని టక్కర్ స్పష్టం చేశారు. మొత్తానికి కోర్టు తీర్పు పట్ల తాము సంతోషంగా ఉన్నామని చెప్పారు. రూ.25వేల కోట్ల నిధుల సమీకరణకు బోర్డు నిర్ణయం తీసుకోగా.. ఇండస్‌టవర్స్‌లో తనకున్న వాటాను విక్రయించే ప్రణాళికతో ఉంది. ఫైబర్, డేటా సెంటర్ల ఆస్తుల విక్రయంతోనూ నిధులు సమీకరించాలనుకుంటోంది. తదుపరి నిధుల సమీకరణలో ప్రమోటర్ సంస్థ వొడాఫోన్ గ్రూపు కూడా పాల్గొనే ఉద్దేశ్యం ఉందా..? అన్న ప్రశ్నకు.. దీనిపై వారు నిర్ణయం తీసుకోవాల్సి ఉందని టక్కర్ స్పష్టం చేశారు. రుణ పరిమితి రూ. లక్ష కోట్లకు..? రుణాల పరిమితిని రూ.లక్ష కోట్లకు పెంచుకునేందుకు ఈ నెల 30న జరిగే సమావేశంలో వాటాదారుల ఆమోదం కోరనున్నట్టు వొడాఫోన్ ఐడియా తెలిపింది. వాస్తవానికి రూ.25,000 కోట్ల రుణ సమీకరణ పరిమితికి 2014 సెప్టెంబర్‌లో అప్పటి ఐడియా సెల్యులర్ వాటాదారులు ఆమోదం తెలిపారు. అనంతరం ఐడియా సెల్యులర్, వొడాఫోన్ ఐడియాతో వీలీనమైన విషయం తెలిసిందే. ఇండస్టవర్స్తో పదేళ్ల మాస్టర్ సర్వీస్ అగ్రిమెంట్‌కు సైతం వాటాదారుల ఆమోదం కోరనుంది. డిజిటల్ ఎకానమీకి తోడ్పాటు... దేశవ్యాప్తంగా 5 లక్షల గ్రామాల్లో 120 కోట్ల భారతీయులు వాయిస్, డేటా సేవలను ప్రపంచంలోనే అతి తక్కువ టారిఫ్‌లకు పొందుతున్నారు. ‘వీఐ’ బ్రాండ్‌తో భారత్‌ను డిజిటల్ ఆర్థిక వ్యవస్థ దిశగా నడిపించేందుకు ప్రభుత్వంతో భాగస్వామ్యం అయ్యేందుకు కట్టుబడి ఉన్నాము. – వొడాఫోన్ ఐడియా చైర్మన్ కుమారమంగళం బిర్లా రెండు నెట్‌వర్క్‌ల ఏకీకరణ పూర్తయింది. నూతన ప్రయాణం ఆరంభానికి సమయం వచ్చింది. – వొడాఫోన్ గ్రూపు సీఈవో నిక్‌రీడ్ -
వొడాఫోన్ ఐడియా కొత్త బ్రాండ్ వీఐ
మొబైల్ సేవల దిగ్గజం వొడాఫోన్ ఐడియా ఎట్టకేలకు ప్రత్యర్థి సంస్థలకు ధీటుగా పావులు కదిపింది. వీఐ పేరుతో కొత్త వైర్లెస్ సర్వీసుల బ్రాండును ప్రవేశపెట్టడంతోపాటు.. సరికొత్త లోగోను సైతం ఆవిష్కరించింది. తద్వారా డిజిటల్ సేవలలో భారతీ ఎయిర్టెల్, రిలయన్స్ జియోలకు ధీటైన పోటీనివ్వాలని భావిస్తున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. ఐడియాతో విలీనం తదుపరి పలు సర్కిళ్లలో సేవలను సమీకృతం చేశాక రెండేళ్లకు సరికొత్త వ్యూహాలను వొడాఫోన్ ప్రకటించడం గమనార్హం! ఏజీఆర్ బకాయిలపై సుప్రీం కోర్టు ఆదేశాల నేపథ్యంలో వారాంతాన వొడాఫోన్ ఐడియా బోర్డు రూ. 25,000 కోట్ల సమీకరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. విభిన్న మార్గాలలో దశలవారీగా నిధులను సమకూర్చుకునే ప్రణాళికలు ప్రకటించింది. కంపెనీ సుమారు రూ. 50,000 కోట్లమేర ఏజీఆర్ బకాయిలు చెల్లించవలసి ఉన్నట్లు పరిశ్రమవర్గాలు చెబుతున్నాయి. భారీ స్పెక్ట్రమ్ వొడాఫోన్ ఐడియా.. భారీగా 1846 మెగాహెట్జ్ స్పెక్ట్రమ్ పోర్ట్‌ఫోలియోను కలిగి ఉంది. 4జీ సర్వీసులను అందించడం ద్వారా కస్టమర్లకు సేవలు అందిస్తోంది. గత రెండేళ్లుగా వొడాఫోన్, ఐడియా బ్రాండ్లను విడిగా నిర్వహిస్తూ వచ్చింది. ఇటీవల కస్టమర్లను కోల్పోతూ వస్తున్న నేపథ్యంలో యూనిఫైడ్ బ్రాండుగా వీఐను తీసుకువచ్చింది. తద్వారా మరింత మంది వినియోగదారులను ఆకట్టుకోగలమని కంపెనీ ఆశిస్తోంది. గ్రామీణ ప్రాంతాలలో ఐడియా బ్రాండుకు పట్టుంటే.. పట్టణాలలో వొడాఫోన్ అధికంగా విస్తరించింది. రెండు కంపెనీల విలీన సమయంలో 40.8 కోట్లుగా ఉన్న కస్టమర్ల సంఖ్య తగ్గుతూ వచ్చి తాజాగా 28 కోట్లకు చేరింది. షేరు జూమ్ కొత్త యూనిఫైడ్ బ్రాండుతోపాటు.. లోగో ఆవిష్కరణ నేపథ్యంలో వొడాఫోన్ ఐడియా కౌంటర్‌కు నేటి ట్రేడింగ్‌లో ఉదయం నుంచీ డిమాండ్ కనిపిస్తోంది. తొలుత ఒక దశలో ఈ షేరు ఎన్ఎస్ఈలో 10 శాతం దూసుకెళ్లి రూ. 13.25ను తాకింది. తదుపరి కొంత వెనకడుగు వేసింది. ప్రస్తుతం 5 శాతం జంప్‌చేసి రూ. 12.7 వద్ద ట్రేడవుతోంది. -
ఫెయిర్ అండ్ లవ్లీ: హెచ్‌యూఎల్ సంచలనం
సాక్షి, న్యూఢిల్లీ: జాతి వివక్ష, సౌందర్య ప్రామాణికతపై ప్రపంచవ్యాప్త చర్చ నేపథ్యంలో ఎఫ్ఎంసీజీ దిగ్గజం హిందుస్తాన్ యూనిలీవర్ కీలక నిర్ణయం తీసుకుంది. సంస్థ ప్రధాన బ్రాండ్ ఫెయిర్ అండ్ లవ్లీ నుండి ‘ఫెయిర్’ అనే పదాన్ని తొలగించేందుకు నిర్ణయించింది. ఈ మేరకు దీన్ని రీబ్రాండ్ చేయనున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది. ఫెయిర్ అండ్ లవ్లీకి చేసిన మార్పులతో పాటు, మిగిలిన చర్మ సంరక్షణ పోర్ట్‌ఫోలియో కూడా ‘పాజిటివ్ బ్యూటీ, సమగ్ర దృష్టిని’ ప్రతిబింబిస్తుందని పేర్కొంది. రెగ్యులేటరీ ఆమోదం తరువాత రాబోయే కొద్ది నెలల్లో పేరును ప్రకటిస్తామని కంపెనీ భావిస్తోంది.(ఫెయిర్‌నెస్ క్రీమ్ మార్కెట్ నుంచి జేజే ఔట్!) ఫెయిర్ అండ్ లవ్లీ ప్యాకేజీమీద ‘ఫెయిర్/ఫెయిర్‌నెస్’, ‘వైట్ వైట్నింగ్’ ‘లైట్ / మెరుపు’ వంటి పదాలను కూడా తొలగించినట్లు హెచ్‌యూఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సంజీవ్ మెహతా వెల్లడించారు. ఫెయిర్ అండ్ లవ్లీ ప్యాకెట్ పై ఉండే రెండు ముఖాలతో పాటు ఉండే మరో (నల్ల)ముఖాన్ని తొలగించామన్నారు. రెగ్యులేటరీ ఆమోదం అనంతరం కొత్త పేరుతో మరికొద్ది నెలల్లో వినియోగదారుల ముందుకు రానున్నామని వెల్లడించారు. గత దశాబ్దంలో మహిళల సాధికారత సందేశంతో ఫెయిర్ అండ్ లవ్లీ ప్రకటనలు తీసుకొచ్చామని పేర్కొన్నారు. దీనికి ప్రజలనుంచి మంచి ఆదరణ లభించిందన్నారు. ఇకపై దేశవ్యాప్తంగా వివిధ స్కిన్ టోన్ల మహిళలను గౌరవిస్తూ, వారి ప్రాతినిధ్యంతో విభిన్నంగా ఇవి ఉండబోతున్నాయన్నారు. భారతదేశంలో విక్రయించే రెండు ఫెయిర్‌నెస్ ఉత్పత్తుల అమ్మకాలను నిలిపివేస్తున్నట్లు అమెరికన్ మల్టీనేషనల్ జాన్సన్ అండ్ జాన్సన్ ప్రకటించిన వారం తరువాత హెచ్‌యూఎల్ ఈ నిర్ణయం ప్రకటించడం విశేషం. అయితే ఎనలిస్టులు అంచనా వేసినట్టుగానే సౌందర్య ఉత్పత్తులను నిలిపివేయడం కాకుండా..కేవలం పేరు మార్చేందుకు నిర్ణయించడం గమనార్హం. కాగా కంపెనీకి సంబంధించి ప్రధాన ఉత్పత్తి ఫెయిర్ అండ్ లవ్లీ. వార్షిక అమ్మకాల విలువ 560 మిలియన్ల డాలర్లు. భారతీయ స్కిన్ వైట్నింగ్ మార్కెట్ లో 50-70శాతం ఫెయిర్ అండ్ లవ్లీ సొంతం. -
కరోనా : సల్మాన్ కొత్త బ్రాండ్ లాంచ్
సాక్షి, ముంబై: బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ కొత్త వ్యాపరంలోని అడుగు పెట్టాడు. కరోనా సంక్షోభ సమయంలో సమయానికి తగినట్టుగా శానిటైజర్ బిజినెస్ లోకి ప్రవేశించిన సల్మాన్ ఫ్రెష్ పేరుతో సరికొత్త హ్యాండ్ శానిటైజర్ ను లాంచ్ చేశారు. ఈ మేరకు బాలీవుడ్ మెగాస్టార్ ఆదివారం తన ట్విటర్ లో ఒక వీడియో పోస్ట్ చేశారు. అత్యుత్తమైన ఉత్పత్తులు నీకు , నాకు మనందరికీ అందుబాటులోకి వచ్చేశాయని ఆయన తెలిపారు. ఫ్రెష్ గా వుండండి, సురక్షితంగా ఉండండి అని పేర్కొన్నారు. కొత్త గ్రూమింగ్ (ట్రిమర్స్, రేజర్స్, తదితర) పెర్సనల్ కేర్ బ్రాండ్ ప్రెష్ (ఎఫ్ఆర్ఎస్హెచ్) ప్రకటించారు. మొదట ఈ బ్రాండ్ కింద డియోడరెంట్లను ప్రారంభించాలని అనుకున్నాము, కానీ ప్రస్తుత కరోనావైరస్ మహమ్మారి కాలంలో అవసరాలకు అనుగుణంగా శానిటైజర్లను తీసుకొచ్చామని ఆయన చెప్పారు. తరువాతి కాలంలో డియోడరెంట్స్, బాడీ వైప్స్, పెర్ ఫ్యూమ్స్ వంటి ఇతర ఉత్పత్తులను కూడా తమ కొత్త బ్రాండ్ కింద విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం, 72 శాతం ఆల్కహాల్ ఆధారిత ఎఫ్ఆర్ఎస్హెచ్ శానిటైజర్లు అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి. తరువాతి కాలంలో ఇవి స్టోర్స్‌లో లభిస్తాయని సల్మాన్ తెలిపారు. ఎఫ్ఆర్ఎస్హెచ్ వెబ్సైట్ ప్రకారం, 100 మి.లీ బాటిల్ శానిటైజర్ ధర రూ.50, 500 మి.లీ బాటిల్ శానిటైజర్ ధర రూ .250గా వుంది.. అయితే కాంబో ఆఫర్ లో 10 శాతం నుంచి 20 శాతం వరకు డిస్కౌంట్ లభించనుంది. Launching my new grooming & personal care brand FRSH! @FrshGrooming Yeh hai aapka, mera, hum sabka brand jo layega aap tak behtareen products. Sanitizers aa chuke hain, jo milenge aapko yaha https://t.co/L3U5PlsGlt Toh try karo!@FrshGrooming ko follow karo! #RahoFrshRahoSafe pic.twitter.com/iuteEphLzd — Salman Khan (@BeingSalmanKhan) May 24, 2020 -
టాటా, జయేం రేసింగ్ కార్లు వచ్చేసాయ్!
సాక్షి,న్యూఢిల్లీ: దేశీయ నాల్గవ అతిపెద్ద వాహన తయారీదారు టాటా మోటార్స్ కొత్త మోడల్ కార్లను మార్కెట్లోకి విడుదల చేయడం ద్వారా రేసింగ్ కార్ల సెగ్మెంట్లోకి దూసుకువచ్చింది. ప్రధానంగా జేటీపీ బ్రాండ్ కింద టాటా మోటార్స్.. దాని ‘టియాగో జేటీపీ’, ‘ టిగోర్ జేటీపీ’ మోడల్ కార్లను మార్కెట్లోకి విడుదల చేసింది. కొత్త మోడల్ కార్లు, బుకింగ్స్ ఈ రోజునుంచే అందుబాటులోకి వచ్చాయి. వచ్చే నెలలో డెలివరీ ప్రారంభం కానుంది. హ్యాచ్‌బ్యాక్ టియాగో జేటీపీ ధర రూ. 6.39 లక్షలు, సెడాన్ టిగోర్ జేటీపీ ధర రూ. 7.49 లక్షలు (ఎక్స్-షోరూమ్, న్యూఢిల్లీ)గా కంపెనీ నిర్ణయించింది. ఇవి పరిచయ ధరలని కంపెనీ తెలిపింది. టాటామోటార్స్, కోయంబత్తూరుకు చెందిన జయేం మోటార్స్ సమ భాగస్వామ్యంతో లాంచ్ అయిన మొట్టమొదటి కార్లు ఇవి కావడం విశేషం ఈ రెండు కార్లు మూడు-సిలిండర్ల 1.2 లీటర్ టర్బోచార్జెడ్ న్యూ జనరేషన్ రివోట్రోన్ పెట్రోల్ ఇంజిన్‌ను కలిగి ఉన్నాయి. 114 బిహెచ్పీ పీక్ పవర్‌ని అందిస్తుంది. 8 -స్పీకర్ హార్మన్ కార్డన్ ఆడియో సిస్టమ్, అల్యూమినియం పెడల్స్, 5000 ఆర్పీఎంతో , 5స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ ఇతర ఫీచర్లుగగా ఉన్నాయి. -
స్టన్నింగ్ లుక్‌లో హ్యుందాయ్ కొత్త శాంట్రో
సాక్షి, ముంబై: ఎప్పటినుంచి వార్తల్లో నిలిచిన హ్యుందాయ్ కొత్త శాంట్రో కారు ఆకర్షణీయంగా వచ్చేసింది. బడ్జెట్ ధరలో కస్టమర్లకు ఆకట్టుకున్న బెస్ట్ కారును సరికొత్తగా విడుదల చేసింది. భారత్‌లో హ్యుందాయ్‌కు మంచి గుర్తింపు తెచ్చిపెట్టిన మోడల్ శాంట్రో అనే చెప్పాలి.అయితే ఆశించి ఫలితాలు సాధించడం లేదనే కారణం చేత శాంట్రో కారును మార్కెట్‌నుంచి తొలగించింది. భారీ డిమాండ్ నేపథ్యంలో బ్రాండ్ న్యూ శాంట్రో కారును హ్యుందాయ్ అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఇది పెట్రోల్ వెర్షన్లో లభించనుంది. త్వరలోనే సీఎన్జీ వేరియంట్లలో కూడా లాంచ్ చేయనుంది. అక్టోబర్ 10 నుంచి ప్రిబుకింగ్కు లభ్యం. అలాగే లాంచింగ్ ఆఫర్‌గా మొదటి 50వేల కస్టమర్లకు 11,100 రూపాయలకే బుక్ చేసుకునే సౌలభ్యాన్ని కల్పిస్తోంది. హ్యుందాయ్ శాంట్రో ఎంట్రీ లెవల్ స్మాల్ హ్యాచ్‌బ్యాక్ ప్యాసింజర్ కార్ల సెగ్మెంట్లో హ్యుందాయ్ శాంట్రో, పాత శాంట్రోతో పోలిస్తే కారు పొడవును, వీల్‌బేస్‌ను విస్తరించింది 1.1 లీటర్ కెపాసిటి నాలుగు సిలిండర్ల పెట్రోల్ ఇంజన్‌ను అమర్చింది. ఇది 68 బిహెచ్పి పవర్, 99 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. మ్యాన్యువల్ అండ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ గల గేర్‌బాక్స్‌లతో లభ్యం కానుంది. ఇది లీటర్‌కు సుమారుగా 20.3 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుందని కంపెనీ తెలిపింది. సెవెన్ ఇంచెస్ టచ్ స్క్రీన్, రియర్ ఎయిర్ కండిషనింగ్ వెంట్స్‌ను జోడించామని, గంటలకు 150 కి.మీ వేగంతో దూసుకుపోతుందని వెల్లడించింది. మధ్య తరగతి కస్టమర్లను ఆకట్టుకునేలా కొత్త శాంట్రో ఇంటీరియర్‌ను కూడా అత్యాధునిక ఆకర్షణీయమైన హంగులతో తీర్చిదిద్దింది. ధర. రూ. 3.7లక్షలు -
కొత్త టైర్ బ్రాండ్ ‘న్యూమెక్స్’
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టైర్లు, ట్యూబ్‌ల విపణిలోకి కొత్త బ్రాండ్ ‘న్యూమెక్స్’ ప్రవేశించింది. ఈ బ్రాండ్ కింద టూ వీలర్లు, త్రీ వీలర్లు, స్మాల్, లైట్ కమర్షియల్ వెహికల్స్, ఫామ్ ఎక్విప్మెంట్కు అవసరమైన వాహనాల టైర్లు, ట్యూబ్‌లను విక్రయిస్తారు. రెండేళ్ల సమగ్ర పరిశోధన అనంతరం మార్కెట్‌కు అవసరమైన ఉత్పాదనలను తీసుకొచ్చామని కంపెనీ ప్రమోటర్ కె.రవిశంకర్ ఈ సందర్భంగా చెప్పారు. 65 రకాల టైర్లను తొలుత ప్రవేశపెట్టామన్నారు. ఈ ఉత్పాదనలతో 80 శాతం మార్కెట్‌ను కవర్ చేస్తున్నట్లవుతుందని తెలియజేశారు. ‘‘ఈ ఏడాది చివరి వరకూ పూర్తిగా హైదరాబాద్, సికింద్రాబాద్ మార్కెట్లపైనే దృష్టి పెడతాం. వచ్చే ఏడాది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో... ఆ తరువాతి సంవత్సరం దక్షిణ భారతంలో, ఆ తరవాత దేశవ్యాప్తంగా విస్తరించడానికి ప్రణాళిక సిద్ధం చేశాం’’ అని రవిశంకర్ వివరించారు. టైర్ల తయారీలో విశేష అనుభవం ఉన్న... ఎన్నో ప్రధాన బ్రాండ్లకు టైర్లను సరఫరా చేస్తున్న హైదరాబాదీ కంపెనీ ఒకటి న్యూమెక్స్కు కావాల్సిన ఉత్పత్తులను సరఫరా చేస్తోంది. కాగా, ఫుల్ సర్కిల్ పేరుతో ఎక్స్‌క్లూజివ్ ఔట్లెట్లను న్యూమెక్స్ తెరుస్తోంది. జూన్ నాటికి 8 కేంద్రాలు హైదరాబాద్‌లో రానున్నాయని సహ ప్రమోటర్ సుప్రజ్ రెడ్డి తెలియజేశారు. స్టోర్లలో కస్టమర్లు వినూత్న అనుభూతికి లోనవుతారని చెప్పారు. భవిష్యత్తులో టైర్ల ఎగుమతులు చేపడతామన్నారు. ‘‘ప్రతి బ్రాండ్‌లోనూ చౌక, ప్రీమియం టైర్లున్నాయి. మేం ప్రీమియం విభాగంపైనే దృష్టి పెట్టాం. ఈ విభాగంలో మిగతా బ్రాండ్లతో పోలిస్తే మా టైర్ల ధరలు కొంత తక్కువే. డబ్బుకు తగ్గ విలువ ఇవ్వటంలో మేం మిగతా బ్రాండ్లకన్నా చాలా ముందుంటాం. ఎందుకంటే నాణ్యతకు మేం అత్యంత ప్రాధాన్యమిస్తున్నాం’’ అన్నారాయన. రూ.600–8,500 వరకు ఉన్నాయి. -
పోటాపోటీగా... తగ్గిస్తున్నారు!
పాల కంపెనీల మధ్య తీవ్రమైన పోటీ - తగ్గింపు ధరలు, డిస్కౌంట్ ఆఫర్లు... - ‘నందిని’ రాకతో ముదిరిన పోరు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో కొత్త బ్రాండ్ల ప్రవేశంతో పాల కంపెనీల మధ్య పోటీ తారస్థాయికి చేరింది. దేశవ్యాప్తంగా పాల వినియోగం పెరుగుతూ వస్తున్నా... పోటీ కారణంగా కంపెనీలు డిస్కౌంట్ల బాట పడుతున్నాయి. సహకార దిగ్గజం అమూల్ ఇక్కడి మార్కెట్లోకి అడుగుపెట్టడంతో ఆరంభమైన ఈ పోటీ... మరో సహకార బ్రాండ్ ‘నందిని’ రావటం... ఇటీవలే ఆ సంస్థ తన పాల ధరను మరింత తగ్గించటంతో తీవ్రమైంది. కస్టమర్లను ఆకట్టుకోవడానికి పాల కంపెనీలు ఒకదాన్ని మించి ఒకటి డిస్కౌంట్లు, ఆఫర్లతో రంగంలోకి దిగుతున్నాయి. పరాగ్ మిల్క్ ఫుడ్స్ గోవర్దన్ బ్రాండ్ పాలను రూ.40కి విక్రయిస్తోంది. ఒక లీటరు పాలను కొన్న కస్టమర్‌కు రూ.12 విలువ చేసే 200 గ్రాముల పెరుగు ప్యాకెట్‌ను ఇటీవలి వరకు ఉచితంగా ఇచ్చింది. మదర్ డెయిరీ ... లిమిటెడ్ ఆఫర్ కింద లీటరు ప్యాక్‌ను రూ.33కే విక్రయిస్తోంది. జూలై 22 వరకూ ఈ ఆఫర్ ఉంది. కర్ణాటక కో-ఆపరేటివ్ మిల్క్ ప్రొడ్యూసర్స్ ఫెడరేషన్ (కేఎంఎఫ్) నందిని స్పెషల్ పేరుతో 3.5 శాతం వెన్న కలిగిన పాలను లీటరుకు రూ.34కే అందిస్తోంది. నిజానికి ఈ స్థాయిలో వెన్న ఉన్న పాలను ప్రైవేటు కంపెనీలు రూ.42-44 మధ్య విక్రయిస్తున్నాయని కేఎంఎఫ్ చెబుతోంది. ఇక్కడే ధర ఎక్కువ... హైదరాబాద్ మార్కెట్లో ప్రయివేటు పాల కంపెనీల ధరలు మరీ ఎక్కువగా ఉన్నట్లు కేఎంఎఫ్ చెబుతోంది. ఇక్కడ దాదాపు 20 బ్రాండ్ల వరకూ ఉన్నా... ధర మాత్రం దేశంలో ఎక్కడా లేనంతగా లీటరుకు రూ.6-10 వరకూ అధికంగా ఉన్నట్లు అమూల్ బ్రాండ్‌తో పాలను విక్రయిస్తున్న గుజరాత్ కో-ఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ వెల్లడించింది. పంపిణీ వ్యవస్థ అసమర్థత, దళారుల వల్లే పరిస్థితి ఇలా ఉందని సంస్థ ఎండీ ఆర్.ఎస్.సోధి ఇటీవల చెప్పారు. ఇక దేశవ్యాప్తంగా కేఎంఎఫ్ మాత్రమే పాల రైతులకు అత్యధికంగా లీటరుకు రూ.27 చెల్లించి సేకరిస్తోంది. పలు రాష్ట్రాల్లో ప్రైవేటు కంపెనీలు రైతులకు రూ.19 కూడా చెల్లిస్తున్నాయని సంస్థ ఎండీ ఎస్.ఎన్.జయరామ్ ఇటీవల చెప్పారు. ‘దళారి వ్యవస్థ మూలంగా రైతులు నష్టపోతున్నారు. కస్టమర్లు అధిక ధర చెల్లించాల్సి వస్తోంది. ఇదంతా వ్యవస్థీకృత సేకరణ లేకపోవడం వల్లే జరుగుతోంది’ అన్నారాయన. కేఎంఎఫ్ కర్ణాటకలో లీటరు ప్యాకెట్‌ను రూ.29కే విక్రయిస్తోంది. రవాణా తదితర చార్జీలుంటాయి కనక హైదరాబాద్‌లో రూ.34కు విక్రయిస్తున్నట్లు జయరామ్ తెలిపారు. అమూల్‌తో మొదలు... హైదరాబాద్‌లో రోజుకు 17 లక్షల లీటర్ల ప్యాకెట్ పాలు అమ్ముడవుతున్నాయి. అమూల్ రాక ముందు వరకు ప్రభుత్వ రంగ సంస్థ విజయ మాత్రమే అతి తక్కువగా లీటరు పాలను రూ.38కి విక్రయించేది. ప్రైవేటు కంపెనీలు రూ.44 వరకు అమ్మేవి. విజయ బ్రాండ్‌ను దెబ్బతీయకూడదనే ఉద్దేశంతో అమూల్ కూడా లీటరు ధరను రూ.38గానే నిర్ణయించింది. ఈ ఏడాది జనవరిలో అమూల్ రావటంతో అప్పటికే పాగావేసిన కంపెనీలకు ఏం చేయాలో పాలుపోలేదు. అన్ని ప్రైవేటు కంపెనీలు పాల ధరను తగ్గించాల్సి వచ్చింది. ఇక నందిని బ్రాండ్ రాకతో వీటికి షాక్ కొట్టినట్టయింది. 2015 మేలో రూ.36 ధరతో రంగంలోకి దిగిన నందిని... ఇటీవల రూ.34 ధరతో స్పెషల్ టోన్డ్ పాలను మార్కెట్లోకి తెచ్చింది. మిగతా కంపెనీలు ఏ మేరకు తగ్గిస్తాయో చూడాల్సిందే.