టాటా, జయేం రేసింగ్‌ కార్లు వచ్చేసాయ్‌! | Tata Motors enters racing car space TiagoJTP, Tigor JTP launched | Sakshi
Sakshi News home page

టాటా, జయేం రేసింగ్‌ కార్లు వచ్చేసాయ్‌!

Published Fri, Oct 26 2018 7:43 PM | Last Updated on Fri, Oct 26 2018 8:54 PM

Tata Motors enters racing car space TiagoJTP, Tigor JTP launched - Sakshi

సాక్షి,న్యూఢిల్లీ: దేశీయ నాల్గవ అతిపెద్ద వాహన తయారీదారు టాటా మోటార్స్ కొత్త మోడల్ కార్లను మార్కెట్‌లోకి విడుదల చేయడం ద్వారా   రేసింగ్‌ కార్ల సెగ్మెంట్‌లోకి  దూసుకువచ్చింది.  ప్రధానంగా  జేటీపీ బ్రాండ్‌ కింద టాటా మోటార్స్.. దాని ‘టియాగో జేటీపీ’, ‘ టిగోర్‌ జేటీపీ’ మోడల్ కార్లను మార్కెట్‌లోకి విడుదల చేసింది.

కొత్త  మోడల్‌ కార్లు, బుకింగ్స్‌  ఈ రోజునుంచే అందుబాటులోకి వచ్చాయి. వచ్చే నెలలో డెలివరీ ప్రారంభం కానుంది. హ్యాచ్‌బ్యాక్‌  టియాగో జేటీపీ  ధర రూ. 6.39 లక్షలు, సెడాన్ టిగోర్‌ జేటీపీ  ధర రూ. 7.49 లక్షలు (ఎక్స్-షోరూమ్, న్యూఢిల్లీ)గా కంపెనీ నిర్ణయించింది. ఇవి పరిచయ ధరలని కంపెనీ తెలిపింది. టాటామోటార్స్‌,  కోయంబత్తూరుకు చెందిన జయేం మోటార్స్‌  సమ  భాగస్వామ‍్యంతో లాంచ్‌ అయిన మొట్టమొదటి కార్లు ఇవి  కావడం విశేషం

ఈ రెండు కార్లు మూడు-సిలిండర్ల 1.2 లీటర్ టర్బోచార్జెడ్ న్యూ జనరేషన్‌  రివోట్రోన్‌ పెట్రోల్‌ ఇంజిన్‌ను కలిగి ఉన్నాయి.  114 బిహెచ్‌పీ పీక్‌ పవర్‌ని అందిస్తుంది. 8 -స్పీకర్ హార్మన్ కార్డన్ ఆడియో సిస్టమ్, అల్యూమినియం పెడల్స్, 5000 ఆర్పీఎంతో , 5స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ ఇతర ఫీచర్లుగగా ఉన్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/1

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement