
న్యూఢిల్లీ: హాస్పిటాలిటీ టెక్నాలజీ సంస్థ ఓయో తాజాగా ప్రీమియం రిసార్టులు, హోటల్స్ విభాగంలోకి ప్రవేశించింది. పాలెట్ పేరిట కొత్త బ్రాండ్‌ను ఆవిష్కరించింది. ప్రస్తుతానికి హైదరాబాద్‌తో పాటు ముంబై, చెన్నై తదితర నగరాల్లో 10 రిసార్టులతో ఈ బ్రాండును ప్రారంభించినట్లు సంస్థ చీఫ్ మర్చంట్ ఆఫీసర్ అనుజ్ తేజ్‌పాల్ తెలిపారు.
రెండో త్రైమాసికంలో దీని కింద మరో 40 రిసార్టులను చేర్చుకోనున్నట్లు వివరించారు. ప్రస్తుతం పర్యాటకులు మరింత విలాసవంతమైన పర్యటనల వైపు మొగ్గు చూపుతున్న నేపథ్యంలో పాలెట్ బ్రాండుకు మంచి ఆదరణ లభించగలదని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
ఓయోలో ప్రస్తుతం టౌన్‌హౌస్ ఓక్, ఓయో టౌన్‌హౌస్, కలెక్షన్ ఓ, క్యాపిటల్ ఓ పేరిట పలు బ్రాండ్స్ ఉన్నాయి. 2023 ఆఖరు నాటికి తమ ప్రీమియం పోర్ట్‌ఫోలియోలోకి మొత్తం 1,800 ప్రాపర్టీలను చేర్చుకోవాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది.
Comments
Please login to add a commentAdd a comment