న్యూఢిల్లీ: దేశంలో ఎక్కువ మంది హైదరాబాద్‌కు ప్రయాణాలు కడుతున్నారు. ఈ ఏడాది ఎక్కువగా హోటళ్లు బుక్ చేసుకున్నది హైదరాబాద్‌లోనే అని ఓయో ట్రెవెలో పీడియా 2023 నివేదిక ప్రకటించింది. హైదరాబాద్ తర్వాత బుకింగ్‌లలో బెంగళూరు రెండో స్థానంలో నిలిచింది. ఢిల్లీ, కోల్‌కతా తర్వాతి రెండు స్థానాల్లో ఉన్నాయి. గోరఖ్‌పూర్, ధిగ, వరంగల్, గుంటూరులకు సైతం ఎక్కువ బుకింగ్‌లు నమోదయ్యాయి.
ఇక ఎక్కువ మంది సందర్శించిన (హోటళ్లు బుక్ చేసుకున్న) రాష్ట్రం ఉత్తరప్రదేశ్. ఆ తర్వాతి స్థానంలో మహారాష్ట్ర ఉంది. ఈ ఏడాది సెపె్టంబర్ 30 నుంచి అక్టోబర్ 2 మధ్య వారాంతపు హోటళ్ల బుకింగ్‌లు ఎక్కువ నమోదయ్యాయి. విహార పర్యటనలకు జైపూర్ ప్రధాన కేంద్రంగా ఉంది. 2023లో ఎక్కువ మంది విహారం కోసం ఈ పట్టణాన్ని సందర్శించారు. గోవా, మైసూరు, పుదుచ్చేరి తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
ఎక్కువ హోటళ్లు బుక్ చేసుకున్న ఆధ్యాతి్మక, భక్తి కేంద్రంగా ఒడిశాలోని పూరి పట్టణం నిలిచింది. ఈ విషయంలో అమృత్‌సర్, వారణాసి, హరిద్వార్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఆధ్యాతి్మకంగా పెద్దగా తెలియని దియోగఢ్, పళని, గోవర్ధన్‌కు సైతం బుకింగ్‌లు 2022తో పోలిస్తే ఈ ఏడాది గణనీయంగా పెరిగాయి. రాష్ట్రాల పరంగా ఎక్కువ బుకింగ్‌లలో యూపీ మొదటి స్థానంలో ఉంటే, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వరుసగా తర్వాతి స్థానాల్లో నిలిచాయి.
ఎప్పటికీ గుర్తుండి పోతుంది..
‘‘ప్రయాణాలకు సంబంధించి 2023 ప్రత్యేకంగా నిలిచిపోతుంది. కరోనా కారణంగా ఏర్పడిన సవాళ్ల తర్వాత పరిశ్రమ తిరిగి సాధారణ స్థితికి చేరుకుంది. దేశీయంగా కొత్త ప్రాంతాలను చూసి రావాలన్న ధోరణి కొనసాగుతూనే ఉంది. అంతర్జాతీయంగా ప్రయాణాల వృద్ధిలో విహార యాత్రలు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. భారత్‌లో వ్యాపార ప్రయాణాలు సైతం వృద్ధికి చెప్పుకోతగ్గ మద్దతునిస్తున్నాయి’’అని ఓయో గ్లోబల్ చీఫ్ సర్వీస్ ఆఫీసర్ శ్రీరంగ్ గాడ్‌బోలే వివరించారు.
ఈ ఏడాది ఎక్కువ హోటల్ బుకింగ్‌లు చేసుకున్న రోజు సెపె్టంబర్ 30 కాగా, మాసాల వారీగా చూస్తే మేలో ఎక్కువ బుకింగ్‌లు నమోదైనట్టు ఓయో ట్రావెలోపీడియా నివేదిక తెలిపింది. ఇక అమెరికాలో ఎక్కువ మంది ప్రయాణించిన రాష్ట్రాల్లో టెక్సాస్, ఒరెగాన్, లూసియానా, ఓక్లహామా, ఫ్లోరిడా, హూస్టన్ టాప్‌లో ఉన్నాయి. యూకేలో లండన్, ప్లైమౌత్, మిడిల్స్‌బ్రో, షెఫీల్డ్, ఈస్ట్‌బోర్న్, యూరప్‌లో శాల్జ్‌బర్గ్, ఆ్రస్టియాలో టైరోల్‌ను ఎక్కువ మంది
సందర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment