resorts
-
దురాశ తెచ్చిన దుఃఖం
అత్యాశే మనిషికి పెను శాపంగా మారుతోంది. వయనాడ్ విలయమే ఇందుకు తాజా ఉదాహరణ. అసలే కేరళకు పశ్చిమాన అరేబియా సముద్రం. ఆపై తూర్పున విస్తారమైన పశ్చిమ కనుమలు. దాంతో పుష్కలమైన వానలకు ఆ రాష్ట్రం పెట్టింది పేరు. ఏకంగా 310 సెంటీమీటర్ల వార్షిక సగటు వర్షపాతం నమోదవుతుంది. ఇందులో మూడొంతుల వానలు జూన్–సెప్టెంబర్ మధ్య వర్షాకాలంలోనే కురుస్తాయి. కేరళలో పశ్చిమ కనుమల అందాలు కన్ను తిప్పుకోనివ్వవు. వాటిని ఆస్వాదించేందుకు పర్యాటకుల రాక కొన్నేళ్లుగా ఊహాతీతంగా పెరుగుతోంది. దాంతో ఎకో టూరిజం పేరిట హోటళ్లు, రిసార్టుల నిర్మాణం అడ్డూ అదుపూ లేకుండాపోయింది. అందుకోసం అడవులను విచ్చలవిడిగా నరికేస్తున్నారు. కొండ ప్రాంతాలను కూడా ఎక్కడ పడితే అక్కడ అడ్డగోలుగా తవ్వేయడం నిత్యకృత్యంగా మారింది. వీటిని కట్టడి చేసి సమతుల్యత పాటించాల్సింది పోయి రాష్ట్ర ప్రభుత్వమూ వీటిని వీలైనంతగా ప్రోత్సహిస్తూ వస్తోంది. పర్యావరణపరంగా అత్యంత సున్నిత ప్రాంతమైన పశ్చిమ కనుమలు ఈ విపరిణామాలను తట్టుకోలేకపోతున్నాయి. ఫలితమే విపరీతమైన వాతావరణ మార్పులు. అవి కేరళలో కొన్నేళ్లుగా పరిపాటిగా మారాయి. 2017, 2018, 2019ల్లో వరుసగా తుఫాన్లు, వరదలు రాష్ట్రాన్ని ముంచెత్తాయి. అతి భారీ వర్షాలు ఇకపై మరింత పెరుగుతాయని ఈ ట్రెండ్ చెబుతోంది. విపరీత వాతావరణ పరిస్థితులు... వయనాడ్ విధ్వంసానికి మనిషి దురాశే ప్రధాన కారణమని లండన్ ఇంపీరియల్ కాలేజ్ రీసెర్చ్ అసోసియేట్ మరియం జకారియా అన్నారు. ‘‘వయనాడ్, ఇడుక్కి జిల్లాల్లో కొండ ప్రాంతాలపై నిర్మాణాలు విపరీతంగా పెరిగిపోవడమే పెను సమస్యగా పరిణమించింది. దాంతో ఒకప్పుడు చల్లగా ఉండే వయనాడ్ ప్రాంతం ఇప్పుడు వేడిగా, పొడిగా మారిపోయింది. వేసవిలో తీవ్రమైన ఎండలు, వర్షాకాలంలో మితిమీరిన వానలు పరిపాటిగా మారాయి. దాంతో కొండచరియలు విరిగిపడే ముప్పు నానాటికీ పెరుగుతోంది. బాగా ఎండిన నేలల్లో వాననీరు తక్కువగా ఇంకుతుంది. కొండల పైభాగంలో రాతి శిఖరాలను ఆవరించి ఉండే మట్టి పొరలు వదులుగా ఉంటాయి. భారీ వర్షాలకు తడిసి, వరద ఉధృతికి కొట్టుకుపోతాయి. తాజా విలయమే ఇందుకు ఉదాహరణ’’ అని వివరించారు. ‘‘వాయు, సముద్ర ఉష్ణోగ్రతల్లో పెరుగుదల ఈ విపరీత వాతావరణ పరిస్థితులకు దోహదపడుతోంది. గ్లోబల్ వారి్మంగ్, వాతావరణ మార్పుల వంటివి తీవ్రతను మరింతగా పెంచుతున్నాయి. ఫలితంగా ఉన్నట్టుండి కుంభవృష్టి కురిసి భారీ ఆస్తి, ప్రాణ నష్టానికి దారితీస్తుంది’’ అని జకారియా వివరించారు.అటకెక్కిన కమిటీ సిఫార్సులు... అత్యంత సున్నితమైన భౌగోళిక పరిస్థితులు కేరళ ప్రత్యేకత. కొంత ప్రాంతాలు ఎక్కువ కావడంతో దాదాపుగా సగం రాష్ట్రం 20 డిగ్రీల ఏటవాలు కోణంలో ఉంటుంది. పెలుసుబారిన మట్టితో కూడిన కొండల పై ప్రాంతాలు భారీ వర్షాలకు విరిగిపడటం పరిపాటి...→ గత ఏడేళ్లలో దేశవ్యాప్తంగా అత్యంత ఎక్కువ సంఖ్యలో కొండచరియలు విరిగిపడ్డ ఘటనలు నమోదైంది కేరళలోనే! దేశమంతటా 3,782 ఘటనలు జరిగితే వీటిలో కేరళ వాటాయే 2,239!→ 2021లో కొట్టాయం, ఇడుక్కి జిల్లాల్లో భారీ వరదలు, కొండచరియలు విరిగిపడ్డ ఘటనల్లో భారీగా ప్రాణనష్టం జరిగింది. → పశ్చిమ కనుమల్లో 61 శాతాన్ని పర్యావరణపరంగా అతి సున్నిత ప్రాంతంగా ప్రకటించి పరిరక్షించాలని మాధవ్ గాడ్గిల్ కమిటీ 13 ఏళ్ల క్రితమే కేంద్రానికి సిఫార్సు చేసింది. → కేరళలో కొంత ప్రాంతాలన్నింటినీ ఈ జాబితాలో చేర్చి ఎలాంటి అభివృద్ధి, నిర్మాణ పనులూ జరగకుండా చూడాలని పేర్కొంది. → గనుల తవ్వకాలు, ఇసుక తవ్వకాలు, జల–పవన విద్యుత్కేంద్రాలు, కాలుష్యకారక పరిశ్రమల నిర్మాణం తదితరాలను పూర్తిగా నిషేధించాలని సూచించింది. → కానీ ప్రజల జీవనోపాధికి, రాష్ట్రాభివృద్ధికి ఈ సిఫార్సులు గొడ్డలిపెట్టంటూ కమిటీ నివేదికను కేరళ ప్రభుత్వం పట్టించుకోలేదు. → వయనాడ్‌లో గత 50 ఏళ్లలోనే పచ్చదనం ఏకంగా 60 శాతానికి పైగా హరించుకుపోయిందని 2022లో జరిగిన అధ్యయనం తేల్చింది. → అదే సమయంలో జిల్లావ్యాప్తంగా తేయాకు తోటల సాగు ఏకంగా 1,800 శాతం పెరిగిపోయిందని వివరించింది. → కొండ ప్రాంతాల్లో నేల పై పొరల్ని గట్టిగా పట్టి ఉంచే చెట్లు తదితరాలు లేకపోవడం కొద్దిపాటి వర్షాలకే మట్టిపెళ్లలు విరిగిపడటం పరిపాటిగా మారింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
పుణే కేసు నిందితుడిపై ‘బుల్డోజర్’ ప్రయోగం
ముంబై: పుణె పోర్షే కారు రోడ్డు ప్రమాదం కేసులో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. తాజాగా నిందితుడు మైనర్ బాలుడి కుటుంబానికి సంబంధించిన ఓ రిసార్ట్‌లో అక్రమ కట్టడాలను శనివారం అధికారులు కూల్చి వేశారు. మహారాష్ట్రలోని మహాబలేశ్వర్ మల్కంపేట్ ప్రాంతంలో మైనర్ బాలుడి ఫ్యామిలీకి ‘ఎంపీజీ క్లబ్’ అనే పేరుతో ఓ రిసార్ట్ ఉంది. దానిలో ఎలాంటి అనుమతులు తీసుకోకుండా కొన్ని నిర్మాణాలు చేపట్టినట్లు అధికారులకు సమాచారం అందింది.The administration in Maharashtra's Satara district on June 9 demolished illegal structures in a resort in Mahabaleshwar owned by the family of the 17-year-old boy allegedly involved in the Pune Porsche crash, an official said.https://t.co/l9Hdui9pH1— The Hindu (@the_hindu) June 8, 2024 ఈ వ్యవహారంపై గతవారం సీఎం ఏక్నాథ్ షిండే స్పందించారు. నిందితుడి ఫ్యామిలీ రిసార్ట్‌లో ఉన్న కట్టడాలు అక్రమమని తేలితే చర్యలు తీసుకోవాలని సతారా జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. ఈ క్రమంలోనే గతవారం రిసార్ట్‌ను అధికారులు సీల్ చేశారు. తర్వాత వాటిపై విచారణ చేపట్టగా.. ఆ కట్టడాలు అక్రమంగా నిర్మించినట్లు నిర్ధారణ అయింది. దీంతో శనివారం ఎంపీజీ క్లబ్ వద్దకు బుల్డోజర్ను తీసుకువెళ్లిన అధికారులు అనుమతులు లేకుండా నిర్మించిన కట్టడాలను కూల్చివేశారు.మే 19 తెల్లవారుజామున మైనర్ బాలుడు మద్యం మత్తులో వేగంగా పోర్షేకారు నడిపి బైక్‌ను ఢీకొట్టాడు. ఈ రోడ్డు ప్రమాదంలో ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు మృతి చెందారు. ఈ కేసులో పోలీసులు చేపట్టిన దర్యాప్తులో రోజుకో కీలక విషయం వెలుగులోకి వస్తోంది. దీనిపై పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు.చదవండి: పుణె పోర్షే కేసు: ఇవేం ట్విస్టులు బాబోయ్! -
ప్రీమియం రిసార్ట్స్ విభాగంలోకి ఓయో.. కొత్త బ్రాండ్ ఆవిష్కరణ
న్యూఢిల్లీ: హాస్పిటాలిటీ టెక్నాలజీ సంస్థ ఓయో తాజాగా ప్రీమియం రిసార్టులు, హోటల్స్ విభాగంలోకి ప్రవేశించింది. పాలెట్ పేరిట కొత్త బ్రాండ్‌ను ఆవిష్కరించింది. ప్రస్తుతానికి హైదరాబాద్‌తో పాటు ముంబై, చెన్నై తదితర నగరాల్లో 10 రిసార్టులతో ఈ బ్రాండును ప్రారంభించినట్లు సంస్థ చీఫ్ మర్చంట్ ఆఫీసర్ అనుజ్ తేజ్‌పాల్ తెలిపారు. రెండో త్రైమాసికంలో దీని కింద మరో 40 రిసార్టులను చేర్చుకోనున్నట్లు వివరించారు. ప్రస్తుతం పర్యాటకులు మరింత విలాసవంతమైన పర్యటనల వైపు మొగ్గు చూపుతున్న నేపథ్యంలో పాలెట్ బ్రాండుకు మంచి ఆదరణ లభించగలదని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఓయోలో ప్రస్తుతం టౌన్హౌస్ ఓక్, ఓయో టౌన్హౌస్, కలెక్షన్ ఓ, క్యాపిటల్ ఓ పేరిట పలు బ్రాండ్స్ ఉన్నాయి. 2023 ఆఖరు నాటికి తమ ప్రీమియం పోర్ట్‌ఫోలియోలోకి మొత్తం 1,800 ప్రాపర్టీలను చేర్చుకోవాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. -
తీరంలో తనివితీరా!
సాక్షి ప్రతినిధి, బాపట్ల: సముద్రతీర ప్రాంతానికి పర్యాటకుల రద్దీ పెరిగింది. బాపట్ల జిల్లాలోని బాపట్ల సూర్యలంక, చీరాల రామాపురం, ఓడరేవు, పాండురంగాపురం బీచ్‌లను చూసేందుకు సందర్శకులు ఎగబడుతున్నారు. గతంతో పోలిస్తే సముద్ర తీరం చూసేవారి సంఖ్య మరింతగా పెరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల నుంచి నిత్యం సందర్శకులు బీచ్‌లకు తరలివస్తున్నారు. వారాంతంలో సందర్శకుల సంఖ్య రెట్టింపునకు మించి ఉంటోంది. ప్రధానంగా హైదరాబాద్ నగరంతో పాటు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పర్యాటకులు ఇక్కడి బీచ్‌లకు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. విశాఖ, గోవా, చెన్నైలతో పోలిస్తే తెలంగాణ రాష్ట్రానికి బాపట్ల, చీరాల బీచ్‌లు మరింత దగ్గరగా ఉన్నాయి. రైల్వేతో పాటు ఇతర రవాణా సౌకర్యాలున్నాయి. సొంత వాహనాలే కాకుండా రైల్లో రావాలనుకునేవారికి మరింత అనుకూలంగా ఉంది. ఖర్చుకూడా తక్కువవుతుండటంతో ఇక్కడ సందర్శకుల తాకిడి పెరిగింది. వీకెండ్స్‌లో చీరాల, బాపట్ల తీరప్రాంతంలోని బీచ్‌లకు రోజుకు 50 వేలకు మించి సందర్శకులు వస్తున్నారు. మిగిలిన రోజుల్లోనూ 20 వేల మందికి తగ్గకుండా వస్తున్నారు. విజయవాడ కనకదుర్గమ్మ, మంగళగిరి పానకాల లక్ష్మీనరసింహ స్వామి, నరసరావుపేటలోని శ్రీ త్రికోటేశ్వరస్వామి, బాపట్లలోని సుందరవల్లీ రాజ్యలక్ష్మి సమేత శ్రీ క్షీరభావన్నారాయణస్వామి, పొన్నూరులోని శ్రీ ఆంజనేయస్వామి లాంటి ప్రసిద్ధి చెందిన ఆలయాలు ఈ ప్రాంతంలో ఉండటంతో సందర్శకులు అటు దేవాలయాలను, ఇటు బీచ్‌లను చూసుకుని వెళుతున్నారు. పర్యాటకాభివృద్ధికి పెద్దపీట.. తీరంలో సందర్శకుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటంతో ప్రభుత్వం ఇక్కడ పర్యాటకాభివృద్ధికి అత్యంత ప్రాధాన్యతనిస్తోంది. తీరప్రాంతానికి రోడ్లు వేసి రవాణా సౌకర్యాన్ని మరింత మెరుగుపర్చింది. తీరప్రాంతంలో ఉన్న ప్రభుత్వ భూముల్లో సొంతంగా రిసార్టుల నిర్మాణానికి సిద్ధమైంది. పెరిగిన రిసార్ట్లు బీచ్‌లకు సందర్శకులు పెరగడంతో అంతే స్థాయిలో ఇక్కడ రిసార్టులూ పెరుగుతున్నాయి. బాపట్ల సూర్యలంకలో 32 రూమ్‌లతో హరిత రిసార్ట్స్ హోటల్ ఉంది. అటవీశాఖ ఆధ్వర్యంలో ఎకో రిసార్ట్స్ ఏర్పాటు చేసింది. రోజూ 90 శాతం రూమ్‌లు ఫుల్ అవుతుండగా.. వీకెండ్స్‌లో వందశాతం నిండిపోతున్నాయి. గడిచిన నాలుగేళ్లలో రద్దీ 50 శాతానికి పైగా పెరిగిందని అధికారులు చెబుతున్నారు. గతంలో నెలకు రూ.20 లక్షల వ్యాపారం జరగ్గా.. ఇప్పడది రూ.40 లక్షలకు పెరిగిందని హరిత రిసార్ట్స్ మేనేజర్ చెప్పారు. హరిత రిసార్ట్స్‌లో రోజుకు రూమ్‌రెంట్ రూ.2,500 నుంచి 4,500 వరకూ ఉంది. ఇక ఈ ప్రాంతంలో గోల్డెన్శాండ్, వీ.హోటల్ , సీబ్రీజ్, రివేరా తదితర పేర్లతో వందలాది రూమ్‌లతో కార్పొరేట్ స్థాయి ప్రైవేటు రిసార్ట్స్‌లు పెద్ద ఎత్తున వెలిశాయి. వీటిల్లో రోజుకు రూమ్‌రెంట్ రూ.10 వేల నుంచి 20 వేల వరకూ ఉంది. ఆన్లైన్ బుకింగ్స్‌తో ఇవి నిత్యం నిండిపోతున్నాయి. ఇక సాధారణ స్థాయిలో వందలాదిగా రిసార్ట్లు వెలిశాయి. వీటిల్లో రోజుకు రూమ్‌కు రూ.3 వేలకు పైనే రెంట్ ఉంది. చీరాల, బాపట్ల పట్టణాల్లోనూ ఇబ్బడి ముబ్బడిగా హోటళ్లు వెలిశాయి. బీచ్‌ల ఎఫెక్ట్‌తో అన్నీ నిత్యం రద్దీగా ఉంటున్నాయి. నాణ్యంగా ఫుడ్ ఉంటుందని పేరున్న హోటళ్లకు మరింత డిమాండ్ ఉంది. గోవా బీచ్ కన్నా బాగుంది సూర్యలంక బీచ్ గోవా బీచ్ కన్నా బాగుంది. ఇక్కడి వాతావరణం ప్రశాంతంగా ఉంది. మొదటిసారి సూర్యలంక బీచ్‌కు వచ్చాం. మళ్లీ మళ్లీ రావాలనిపిస్తోంది. బీచ్ పరిశుభ్రంగా ఉంది. సెక్యూరిటీ కూడా బాగుంది. – సాద్, అతీఫ్, అమాన్అలీ, నాసిద్.. హైదరాబాద్ ఖర్చు చాలా తక్కువ రైలు సౌకర్యం అందుబాటులో ఉండటంతో చీరాల, బాపట్ల బీచ్‌లకు రాగలుగుతున్నాం. ఖర్చు కూడా చాలా తక్కువగా అవుతోంది. బీచ్ చాలా బాగుంది. ప్రైవేటు రిసార్ట్‌లలో అద్దె చాలా ఎక్కువగా వసూలు చేస్తున్నారు. – నవీన్, ప్రభాకర్, అజయ్.. మిర్యాలగూడ మూడేళ్లుగా మరింత రద్దీ సూర్యలంక, చీరాల ప్రాంతంలోని బీచ్‌లకు సందర్శకులు పెరిగారు. మూడేళ్లుగా పర్యాటకుల రద్దీ మరింతగా పెరిగింది. సోమవారం నుంచి గురువారం వరకు 90 శాతం రూమ్‌లు బుక్ అవుతుండగా.. శుక్రవారం నుంచి ఆదివారం వరకు 100 శాతం బుక్ అవుతున్నాయి. హోటల్ వ్యాపారం మరింతగా వృద్ధి చెందింది. రద్దీ పెరగడం వల్లే ఈ ప్రాంతంలో రిసార్టులు పెద్ద ఎత్తున వెలుస్తున్నాయి. – నాగభూషణం, మేనేజర్, హరిత రిసార్ట్స్ -
పర్యాటకులను ఆకర్షిస్తున్న లంబసింగి రిసార్ట్స్
-
హైదరాబాద్‌లో ధమాకా హీరోయిన్ శ్రీలీల సందడి
హైదరాబాద్‌లో సినీ నటి పెళ్లి సందడి ఫేమ్, ధమాకా హీరోయిన్ శ్రీలీల సందడి చేశారు. గచ్చిబౌలి ఖానాపూర్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన వజ్రా గ్రూప్స్ రిసార్ట్స్ పూజా కార్యక్రమంలో నటి పాల్గొన్నారు. డెస్టినేషన్ వెడ్డింగ్‌కు ప్లేస్ ఎంతగానో అనుగుణంగా రూపోందించారని శ్రీలీల అన్నారు. ఈ నెల 25న రిలీజ్ అయ్యే ధమాకా కచ్చితంగా రికార్డు సృష్టిస్తుందని అన్నారు. ఈ రిసార్ట్స్ అతి పెద్ద లాన్, ఎసీ హాల్, పూల్ సైడ్ మినిలాన్, రిసార్ట్స్ విత్ 50 రూమ్స్ అందుబాటులో ఉంటాయని ఆహ్వానం ఎండీ అరుణ్ కుమార్ తెలిపారు. ఇప్పటి వజ్ర ఇవెంట్స్ మూవీ ఇండస్ట్రీస్‌లో సక్సెస్‌తో పాటు ఇప్పుడు హాస్పిటాలిటీ రంగంలో కూడా రాణిస్తూ ఆహ్వానం రిసార్ట్స్ ప్రారంభించామని ఎండీ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సినీనటీ శ్రీలీలతో పాటు ఎండీ అరుణ్ కుమార్, కౌన్సిలర్ అమరేందర్ రెడ్డి పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. -
టెంట్లతోనే రిసార్ట్స్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పర్యాటకులకు మెరుగైన వసతులు కల్పించడంతో పాటు తక్కువ ఖర్చుతో విలాసవంతమైన అనుభూతి అందించేందుకు పర్యాటక అభివృద్ధి సంస్థ(ఏపీటీడీసీ) చర్యలు చేపట్టింది. బీచ్‌లు, కొండ ప్రాంతాల్లో పర్యాటకులు బస చేసేందుకు వీలుగా ఎకో టెంట్ రిసార్టులను ఏర్పాటు చేయబోతోంది. తొలి దశలో భాగంగా ఐదు ప్రాంతాలను ప్రతిపాదించింది. ఇందులో బాపట్ల జిల్లాలోని పెదగంజాం–నిజాంపట్నం బీచ్ కారిడార్, తిరుపతి జిల్లాలోని తుపిలిపాలెం, అనకాపల్లి జిల్లాలోని ముత్యాలంపాలెం, అందలాపల్లె బీచ్‌లతో పాటు అన్నమయ్య జిల్లాలోని మల్లయ్యకొండపై టెంట్ రిసార్టులను అందుబాటులోకి తేనుంది. ఒక్కో రిసార్ట్‌లో 20 టెంట్లు.. ప్రతి ఎకో రిసార్టులో 20 టెంట్ గదులతో పాటు అనుబంధంగా రెస్టారెంట్ ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో టెంట్ గదిలో బెడ్రూమ్కు అనుబంధంగా బాత్రూమ్, వరండా నిర్మిస్తారు. టెంట్లో ఒక కుటుంబం (ఇద్దరు పెద్దలు, ఇద్దరు పిల్లలు) విడిది చేసేలా తీర్చిదిద్దనున్నారు. ఏపీటీడీసీ వీటిని ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్(ఓఅండ్ఎం) కింద నిర్వహించనుంది. ఔత్సాహిక వ్యాపారవేత్తల నుంచి ప్రతిపాదనలను ఆహ్వానించింది. భూమిని లీజు ప్రాతిపదికన అద్దెకిచ్చి.. అందులో ప్రైవేటు వ్యక్తులు స్వయంగా టెంట్ రిసార్టులు ఏర్పాటు చేసి, నిర్వహించేలా ఏపీటీడీసీ ప్రణాళికలు రూపొందించింది. -
మహీంద్రా హాలిడేస్ భారీ పెట్టుబడులు
న్యూఢిల్లీ: మహీంద్రా హాలిడేస్ అండ్ రిసార్ట్స్ ఇండియా తమ కార్యకలాపాలను మరింతగా విస్తరించడంపై దృష్టి సారించింది. వచ్చే మూడేళ్లలో రూ. 1,500 కోట్లు పెట్టుబడులు పెట్టనుంది. రిసార్ట్స్ కొనుగోలు, కొత్తగా మరిన్ని గదులు నిర్మించడం మొదలైన వాటిపై ఇన్వెస్ట్ చేయనుంది. కంపెనీ ఎండీ, సీఈవో కవీందర్ సింగ్ ఈ విషయాలు తెలిపారు. గత రెండున్నరేళ్లలో గదుల సంఖ్యను 1,000 పైగా పెంచుకున్నట్లు ఆయన చెప్పారు. (ఎన్డీటీవీ బోర్డు: అదానీ గ్రూప్‌నకు 2 సీట్లు ఆఫర్) ప్రస్తుతం మహీంద్రా హాలిడేస్‌కు దేశీయంగా 74, అంతర్జాతీయంగా 12 రిసార్టులు ఉండగా, 4,700 గదులు ఉన్నాయని వివరించారు. కొత్త ప్రాజెక్టుల కింద హిమాచల్ ప్రదేశ్‌లోని కందఘాట్ రిసార్ట్‌లో సుమారు రూ. 200 కోట్లతో 185 గదులు జోడిస్తున్నామని, అలాగే పుదుచ్చేరి రిసార్టులో రూ. 60–70 కోట్లతో 60 గదులు నిర్మిస్తున్నాని సింగ్ చెప్పారు. అలాగే గణపతిపులే ప్రాంతం (మహారాష్ట్ర)లో రూ. 250 కోట్లతో 240 గదుల రిసార్టును అభివృద్ధి చేస్తున్నట్లు పేర్కొన్నారు. (భారత్‌కు చమురు సరఫరాలో రష్యానే టాప్) -
నిబంధనలు గాల్లో.. ప్రాణాలు ‘పూల్’లో..
సాక్షి, విశాఖపట్నం: స్విమ్మింగ్ పూల్.. ఎక్కడ కనిపించినా ఈత కొట్టాలన్న ఉత్సాహం అందరిలోనూ కనిపిస్తుంది. ముఖ్యంగా స్టార్ హోటల్స్, రిసార్టుల్లో బస చేసే ముందు అందరూ అడిగేది ఒక్కటే.. మీ దగ్గర స్విమ్మింగ్‌పూల్ ఉందా అని. అంతలా ఆకర్షిస్తున్న స్విమ్మింగ్‌పూల్‌కి అనుగుణంగా లైఫ్‌గార్డులు ఉన్నారా..? నిబంధనలు పాటిస్తున్నారా? అనే విషయాన్ని మాత్రం ఎవరూ పట్టించుకోవడం లేదు. ఫలితంగా సరదా స్విమ్మింగ్ ప్రాణాల మీదకి తీసుకొస్తోంది. గురువారం నగరంలోని ఓ ప్రైవేట్ రిసార్టులోని స్విమ్మింగ్‌పూల్‌లో ప్రమాదవశాత్తూ తొమ్మిదేళ్ల చిన్నారి జారిపడి మృత్యువాత పడింది. ఈ ఘటన నగరంలో విషాదాన్ని నింపింది. ఈ నేపథ్యంలో నగరంలోని రిసార్టులు, హోటల్స్‌లో గల స్విమ్మింగ్‌పూల్స్ వద్ద లైఫ్‌గార్డులు ఏర్పాటు చేయాలని రాష్ట్ర క్రీడాప్రాధికార సంస్థ(శాప్) తాజాగా నోటీసులు జారీ చేసింది. కనిపించని లైఫ్‌గార్డులు నగరంలో ప్రైవేట్ హోటల్స్, రిసార్టుల్లో సుమారు 30కి పైగా స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయి. వీటిలో ఏ ఒక్కటీ నిబంధనలకు అనుగుణంగా నిర్వహించకపోవడం గమనార్హం. ప్రతి స్విమ్మింగ్ పూల్ వద్ద కచ్చితంగా పూల్ సామర్థ్యం బట్టి లైఫ్‌గార్డులు ఉండాలి. కానీ ఏ ఒక్క ఈత కొలను వద్ద ఒక్క లైఫ్గార్డుని కూడా ఆయా యాజమాన్యాలు నియమించలేదు. ఎప్పుడైనా ప్రమాదం జరిగితే హోటల్, రిసార్టుల్లో పని చేసే సిబ్బందిని వినియోగించుకుంటున్నారే తప్ప.. నిబంధనలను మాత్రం పాటించడం లేదు. ఫలితంగా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది. సరైన పర్యవేక్షణ లేకపోవడంతో ఎవరూ నిబంధనలు పట్టించుకోవడం లేదన్నది వాస్తవం. సామర్థ్యాన్ని బట్టి.. లైఫ్‌గార్డులు హోటల్స్, రిసార్టుల్లో బస చేస్తున్న వారి సామర్థ్యాన్ని బట్టి లైఫ్‌గార్డులు ఉండాలి. స్విమ్మింగ్‌పూల్స్ వద్ద స్విమ్మింగ్ ఫ్లోటింగ్ ట్యూబ్స్, స్టిక్స్ అందుబాటులో ఉంచాలి. పిల్లలు ఈతకొట్టేటప్పుడు అప్రమత్తంగా వ్యవహరించాలి. లైఫ్ సేవర్స్ కచ్చితంగా ఉంటేనే ఈత కొట్టేందుకు అనుమతులు ఇవ్వాలి. లేదంటే ఆ రోజు స్విమ్మింగ్ పూల్ ప్రవేశాన్ని నిలుపుదల చేస్తున్నట్లు ప్రకటించాలి. పూల్ సైజ్, స్విమ్మర్స్ ఎంత మంది వినియోగించుకుంటున్నారనే విషయాల్ని పరిగణనలోకి తీసుకొని ఒకటి నుంచి నలుగురు లైఫ్‌గార్డుల్ని నియమించాల్సిన అవసరం ఉంది. కానీ ఏ ఒక్క దాంట్లోనూ లైఫ్ సేవర్స్ లేకపోవడం శోచనీయం. నిబంధనలపై శాప్ నోటీసులు ప్రతి పూల్‌లో గార్డులను ఏర్పాటు చేయాలని ఏపీ స్పోర్ట్స్ అథారిటీ(శాప్) తాజాగా ఆదేశాలు జారీ చేసింది. ప్రతి స్విమ్మింగ్‌పూల్ నిర్వాహకులకు నోటీసులు అందిస్తోంది. పూల్ సామర్థ్యానికి అనుగుణంగా లైఫ్‌గార్డుల్ని నియమించుకోవాలని స్పష్టం చేసింది. ఇందు కోసం రాష్ట్రీయ లైఫ్ సేవింగ్స్ సొసైటీ(ఏపీఆర్ఎల్ఎస్ఎస్) అందించే స్విమ్మర్ సర్టిఫికెట్ ఉన్నవారిని మాత్రమే నియమించుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. నిర్లక్ష్యం తగదు ప్రైవేట్ స్విమ్మింగ్‌పూల్స్‌లో చాలా వరకూ నిబంధనలు పాటించడం లేదు. పీఆర్ఎల్ఎస్ఎస్ ఆధ్వర్యంలో లైఫ్‌గార్డులకు శిక్షణ అందిస్తున్నాం. శాప్ ఆధ్వర్యంలో వారందరికీ ధ్రువపత్రాలు అందజేస్తున్నాం. పూల్స్ వద్ద లైఫ్‌గార్డులు ఉంటే.. విషాద ఘటనలు ఇకపై ఏ ఈత కొలను వద్ద కూడా చోటుచేసుకోవు. – బలరాం, రాష్ట్రీయ లైఫ్ సేవింగ్స్ సొసైటీ ఏపీ అధ్యక్షుడు -
వీకెండ్ వస్తే.. రేవ్ మొదలు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలోని పబ్బులు, శివార్లలోని రిసార్టులు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతున్నాయి. డ్రగ్స్ వినియోగం, అశ్లీల నృత్యాలతో రేవ్ పార్టీలు విచ్చలవిడిగా జరుగుతున్నాయి. కొన్నేళ్ల క్రితం మేడ్చల్, హయత్‌నగర్‌లలో ఇలాంటి ఘటనలు బయటపడగా.. తాజాగా ఆదివారం వెలుగులోకి వచ్చిన ‘ఫుడింగ్ అండ్ మింక్ పబ్’ఉదంతం కలకలం రేపుతోంది. హైదరాబాద్‌లోని తొమ్మిది పబ్స్‌లో మాదకద్రవ్యాల విక్రయాలు జోరుగా సాగుతున్నట్టుగా తమకు సమాచారం ఉందని గతంలో పోలీసులే అధికారికంగా ప్రకటించడం గమనార్హం. డబ్బులు ఎరవేసి.. రేవ్ పార్టీల నిర్వాహకులు ఓ వైపు డ్రగ్స్ సమకూర్చడంతోపాటు డబ్బున్నవారి పిల్లలను ఆకర్షించేందుకు అమ్మాయిలతో నృత్యాలను నిర్వహిస్తున్నారు. ఇందుకోసం ఉత్తరాది రాష్ట్రాలు, మెట్రో నగరాలకు చెందిన యువతులకు డబ్బులు ఎరవేసి రప్పిస్తున్నారు. కొన్నిచోట్ల అయితే టూరిస్టు వీసాలపై విదేశీ యువతులనూ పిలిపిస్తున్నారు. ఇలాంటి పార్టీల కోసం ప్రముఖులు, వీఐపీల పిల్లల నుంచి భారీగా వసూలు చేస్తున్నారు. అంతేకాదు సూత్రధారులు ఎక్కడా దొరకకుండా వ్యవస్థీకృతంగా దీనంతటినీ నడిపిస్తుండటం గమనార్హం. పోలీసులు దాడులు చేసినా.. అమాయక యువతులు, పార్టీలో పనిచేసే సిబ్బంది మాత్రమే పట్టుపడుతున్నారు. గతంలో బంజారాహిల్స్‌లోని ఓ పబ్‌లో ఇలాగే ముగ్గురు రష్యా యువతులు చిక్కారు. మరో యువతి టాస్క్‌ఫోర్స్‌కు పట్టుబడింది. సైబరాబాద్ పరిధిలోని శామీర్‌పేటలో 43 మంది, మేడ్చల్‌లోని ఓ రిసార్ట్‌లో 39 మంది, హయత్‌నగర్ పరిధిలోని మరో రిసార్ట్‌లో 11 మంది ఇలాగే పోలీసులకు దొరికారు. రేవ్ పార్టీల పేరిట వ్యభిచారం కూడా చేయిస్తున్నారనే ఆరోపణలున్నాయి. కొత్త ట్రెండ్‌గా డ్రగ్ టూర్స్ రాష్ట్ర పోలీసులు కొంతకాలంగా డ్రగ్స్ వ్యవహారంపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో అయితే ‘హెచ్–న్యూ’పేరిట ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసి మరీ నిఘా పెట్టారు. డ్రగ్ పెడ్లర్స్ కదలికలు, మాదకద్రవ్యాలు దొరకడం కష్టమవడంతో కొత్తగా ‘డ్రగ్ టూర్స్’పెరిగినట్టు పోలీసులు చెప్తున్నారు. హైదరాబాద్‌కు చెందిన డ్రగ్స్ వినియోగదారుల్లో చాలా మంది గోవాతోపాటు హిమాచల్‌ప్రదేశ్‌కు వెళ్తున్నారని అంటున్నారు. హిమాచల్‌ప్రదేశ్‌లోని కసోల్ ప్రాంతంలో నిర్ణీత సందర్భాల్లో రేవ్ ఫెస్టివల్స్ నిర్వహిస్తున్నారని.. దేశవ్యాప్తంగా ఉన్న డ్రగ్ వినియోగదారులు హాజరవుతున్నారని సమాచారం. -
భీమిలి హయగ్రీవ రిసార్ట్స్‌లో పేకాట
తగరపువలస (విశాఖ): విశాఖ జిల్లా భీమిలి మండలం అన్నవరం పంచాయతీలోని హయగ్రీవ రిసార్ట్స్‌లో నిర్వహిస్తున్న పేకాట శిబిరంపై శనివారం అర్ధరాత్రి తర్వాత స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (ఎస్ఈబీ) అధికారులు దాడిచేసి 22 మందిని అరెస్టు చేశారు. పేకాట ఆడుతున్న వీరి నుంచి రూ.5,70,270 నగదు, ఎనిమిది కార్లు, 23 సెల్ఫోన్లు, నగదుకు ప్రత్యామ్నాయంగా వినియోగిస్తున్న రూ.21.53 లక్షల విలువైన 323 ప్లాస్టిక్ కాయిన్లు స్వాధీనం చేసుకున్నారు. మధురవాడ జోన్ ఏసీపీ చుక్కా శ్రీనివాసరావు, సీఐ జి.వి.రమణ ఆదివారం భీమిలి పోలీస్ స్టేషన్లో వివరాలు వెల్లడించారు. ఎస్ఈబీ ఉన్నతాధికారుల ఆదేశాలతో ఇన్స్పెక్టర్లు పి.అప్పలరాజు, నమ్మి గణేష్, జగదీష్, ఎస్ఐలు సంతోష్, ఖగేష్, అమాన్రావు, జ్ఞానేశ్వరి, పద్మావతి దాడులు జరిపారు. ఈ సందర్భంగా పేకాట ఆడుతున్న తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, విశాఖ, కృష్ణా జిల్లాలకు చెందిన 22 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు టీడీపీ ఇన్చార్జ్ బడేటి రాధాకృష్ణయ్య కూడా ఉండడం గమనార్హం. స్వాధీనం చేసుకున్న సెల్ఫోన్లు, ప్లేయింగ్ కార్డులు, నగదు, ప్లాస్టిక్ కాయిన్లు వీరే సూత్రధారులు విశాఖ నగరానికి చెందిన దాట్ల కృష్ణంరాజు, చేబోలు శ్రీనివాస్‌పై పేకాట నిర్వహణ, క్రికెట్ బుకీలుగా నగరంలోని పోలీస్ స్టేషన్లలో కేసులున్నాయి. వీరే బెంగళూరు తదితరచోట్ల ఉన్న పరిచయాలతో వివిధ జిల్లాలకు చెందిన వారితో వీకెండ్లలో పేకాట డెన్లు నిర్వహిస్తున్నారు. అరెస్టు అయింది వీరే.. అరెస్టైన వారిలో పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన సాగిరాజు శ్రీనివాసరాజు(జక్కవరం, కాళ్ల మండలం), కుంచంపూడి రామకృష్ణంరాజు(గణపవరం మండలం), గాదిరాజు శరత్ (భీమవరం), సాగిరాజు హరివర్మ(జువ్వలపాలెం, కాళ్ల మండలం), వేగేశ్న ఆదిత్య (భీమవరం), మంతెన నాగరాజు (మలవని దిబ్బ, కాళ్ల మండలం), నరహరిశెట్టి రాధాకృష్ణ (మేడవల్లి, ఏలూరు), అడ్డాడ సోమరాజు (ఏఎస్ఆర్ నగర్, భీమవరం) ఉన్నారు. విశాఖకు చెందిన వారిలో దాట్ల కృష్ణంరాజు(విశాలాక్షినగర్), సప్పా రవి(మాధవధార), కంతేటి శేషుబాబు(రామ్‌నగర్), చేబోలు శ్రీనివాస్(విశాలాక్షినగర్), కొల్లిమల్ల నాగ అప్పలరాజు (అనకాపల్లి), ఆడారి జగ్గారావు(చింతల అగ్రహారం), ఆడారి వేణుగోపాలకృష్ణ(అక్కయ్యపాలెం) ఉన్నారు. కృష్ణాజిల్లాకు చెందిన వారిలో చల్లగుల్ల శ్రీకృష్ణ (పెద పాలపర్రు, ముదినేపల్లి మండలం), బలుసు హరికిరణ్ (అడ్డాడ, పామర్రు మండలం), పొట్లూరి మురళీధర్ (దొండపాడు, గుడివాడ మండలం), కొర్ని నాగరాజు(భూషణగుళ్ల, పెద్దపారుపూడి మండలం), తూర్పు గోదావరి జిల్లాకు చెందిన వారిలో యడ్ల రాజారమేష్(వేమగిరి, కడియం మండలం), కూనదరాజు సత్యనారాయణరాజు(మణికిపురం, రాజోలు మండలం) ఉన్నారు. రిసార్ట్స్ యజమాని చిలుకూరి జగదీశ్వరుడు, మేనేజర్ పాతూరి కృష్ణకాంత్‌లను అరెస్ట్ చేయాల్సి ఉంది. -
సింహాచలం: ‘అన్యాక్రాంతమైన భూములను వెనక్కి తీసుకుంటాం’
విశాఖ: టీడీపీ హయాంలోనే సింహాచలం భూములు అన్యాక్రాంతమయ్యాయి.. దీనిలో అధికారుల పాత్ర ఉండటంతో చర్యలు తీసుకున్నాం అని మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు. అన్యాక్రాంతమైన భూములను వెనక్కి తీసుకుంటాం అన్నారు. రుషికొండ రిసార్ట్స్‌పై టీడీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి అవంతి మండిపడ్డారు. కొత్తవి కట్టేందుకు పాత రిసార్ట్స్ తొలగిస్తే.. టీడీపీ రాజకీయం చేస్తోందని విమర్శించారు. ఇప్పుడున్నవాటి స్థానంలో వరల్డ్ క్లాస్ రిసార్ట్స్ నిర్మిస్తాం అన్నారు. కొత్త రిసార్ట్స్ కోసం మొదటి దశలో రూ.92 కోట్లు.. రెండో దశలో రూ.72 కోట్ల నిధులు మంజూరు అయ్యాయి అని మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు. -
సముద్ర తీరాల్లో టూరిజం రిసార్ట్స్
సాక్షి, అమరావతి: శ్రీకాకుళం జిల్లా నుంచి నెల్లూరు వరకు సముద్ర తీరం వెంబడి పెద్దఎత్తున రిసార్ట్స్ నిర్మించేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్టు పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ తెలిపారు. ఆదివారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ.. రిసార్ట్స్ నిర్మాణానికి ప్రభుత్వ భూములను గుర్తించి నివేదిక ఇవ్వాల్సిందిగా ఆయా జిల్లాల కలెక్టర్లను కోరామన్నారు. పర్యాటక రంగానికి మన రాష్ట్రం పర్యాయ పదం కావాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉందని, విదేశీ పర్యాటకులను ఆకర్షించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. కొత్త టూరిజం పాలసీ రూపొందించాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారన్నారు. పర్యాటక రంగానికి సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి నియంత్రణ లేదని, అందువల్ల ఈ రంగంలో ఉన్న టూర్ ఆపరేటర్లు, హోటళ్లు, వాటిలో అందుబాటులో ఉన్న గదులు, టూరిజం అడ్వెంచర్‌కు సంబంధించిన ప్రదేశాలు, సదుపాయాలు వంటివన్నీ రిజిస్ట్రేషన్ చేస్తున్నామని వివరించారు. 12 ప్రాంతాల్లో స్టార్ సదుపాయాలతో కూడిన రిసార్టులు, హోటళ్లు అభివృద్ధి చేస్తున్నామని, వాటర్ టూరిజం, ఎకో టూరిజం, బీచ్ టూరిజం, టెంపుల్ టూరిజంపై ప్రత్యేక దృష్టి సారించామని పేర్కొన్నారు. తెలుగు వంటకాలకు గుర్తింపు కోసం ఫుడ్ ఫెస్టివల్ తెలుగు వంటకాలకు అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చేందుకు ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించనున్నామని, శాఖాహార, మాంసాహార వంటకాలను ప్రజలకు పరిచయం చేస్తామని చెప్పారు. పర్యాటకుల భద్రత కోసం ప్రభుత్వం తొలిసారిగా రాష్ట్రంలో 9 కంట్రోల్ రూమ్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చిందని చెప్పారు. -
స్టార్ హోటళ్లు వద్దు!
న్యూఢిల్లీ: ఐపీఎల్ షెడ్యూలుపై స్పష్టత వచ్చేసింది కానీ... దానితో ముడిపడిన ఎన్నో అంశాలపై ఇంకా గందరగోళం ఉంది. ఇందులో నిర్వహణ సమస్యలు కొన్ని కాగా... మరికొన్ని ఆటగాళ్ల డిమాండ్లు, భయాల గురించి ఉన్నాయి. లీగ్‌లో ఆడేందుకు సిద్ధమవుతున్నా... క్రికెటర్లలో కరోనా భయం ఏ మూలో వెంటాడుతూనే ఉంది. అందుకే ప్రతీ విషయంలో వారు జాగ్రత్తలు కోరుకుంటున్నారు. వాటిని తమ ఫ్రాంచైజీల ముందు ఉంచుతున్నారు. ఇందులో ఇప్పుడు క్రికెటర్ల వసతి అంశం తెరపైకి వచ్చింది. ఎప్పట్లా సకల సౌకర్యాలు ఉండే ఫైవ్ స్టార్ హోటళ్లను ఆటగాళ్లను కోరుకోవడం లేదు. అక్కడ బస చేయడంపై కొన్ని భయాలు ఉన్నాయి. సాధారణంగా హోటల్ మొత్తం అనుసంధానమై ఉండే ఎయిర్ కండిషనింగ్ డక్ట్‌ల ద్వారా కోవిడ్ వైరస్ వ్యాపించవచ్చనే ఆందోళన వారిలో ఉంది. పైగా పెద్ద సంఖ్యలో ఇతర పర్యాటకులు, అతిథులు ఉండే హోటళ్లలో బస అంత మంచిది కాదని ఆటగాళ్లు భావిస్తున్నారు. దాంతో ఫ్రాంచైజీ యాజమాన్యాలు ప్రత్యామ్నా యాలపై దృష్టి పెట్టాయి. దుబాయ్‌లో గోల్ఫ్ రిసార్ట్‌లలో ఆటగాళ్లను ఉంచే విషయంపై సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఇప్పటికే ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు సమాచారం. ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ కూడా ఇదే బాటలో ఉన్నాయి. ముంబై యాజమాన్యమైతే ఒక అపార్ట్మెంట్ మొత్తాన్ని ఆటగాళ్ల కోసమే అద్దెకు తీసుకోవాలనే ఆలోచనతో ఉంది. ‘హోటల్లో అందరినీ ప్రతీ సారి స్క్రీనింగ్ చేయడం సాధ్యమయ్యే పని కాదు. దుబాయ్‌లోని రిసార్ట్‌లలో సకల సౌకర్యాలు ఉంటాయి. ఇక్కడ ఒక్కో ఆటగాడికి ఒక్కో గదిని కేటాయించడం కష్టం కాకపోవచ్చు’ అని ఒక ఫ్రాంచైజీ ప్రతినిధి అభిప్రాయ పడ్డారు. కొందరు విదేశీ ఆటగాళ్లు ఐపీఎల్ సమయంలో మానసిక ఉల్లాసానికి తమకు గోల్ఫ్ ఆడుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతున్నారు. రిసార్ట్‌లలో ఉంటే ఇది సాధ్యమవుతుందని, పైగా గోల్ఫ్ సోషల్ డిస్టెన్సింగ్లోనే జరుగుతుందని, ఏ సమస్యా ఉండ దని చెబుతున్నారు. కాంటాక్ట్‌లెస్ ఫుడ్ కావాలి... మరో వైపు ఐపీఎల్‌కు సంబంధించి పలు అంశాలపై ఫ్రాంచైజీల సందేహాలు ఇంకా తీరలేదు. వీటిపై తమకు మరింత స్పష్టతనివ్వాలని వారు కోరుతున్నారు. లీగ్‌లో గాయపడితే అతని స్థానంలో ఎవరిని తీసుకోవాలనే సందిగ్ధం అలానే ఉంది. అయితే బయటినుంచి కాకుండా కొందరు ఆటగాళ్ల బృందంతో బీసీసీఐ ఒక జాబితాను సిద్ధం చేసి వారిలోంచే ఎవరినైనా తీసుకునేలా ఫ్రాంచైజీల ముందు పెట్టే అవకాశం కనిపిస్తోంది. యూఏఈలో 6 రోజుల క్వారంటైన్ కాకుండా వైద్యుల సూచనలు తీసుకుంటూ కేవలం 3 రోజులకే పరిమితం చేయాలని ఫ్రాంచైజీలు కోరుతున్నాయి. ఆటగాళ్లు తీసుకునే ఆహారం పలువురు చేతులు మారకుండా ‘కాంటాక్ట్‌లెస్ డెలివరీ’ ఉండాలని డిమాం డ్ చేస్తున్నారు. కుటుంబ సభ్యులను అనుమతించాలని విజ్ఞప్తులు బోర్డుకు ఎక్కువయ్యాయి. సుమారు 80 రోజులు కుటుంబాలకు దూరంగా ఉండటం ఆటగాళ్ల మానసిక స్థితిపై ప్రభావం చూపిస్తుందని వారు చెబుతున్నారు. అన్నింటికీ మించి తమ స్పాన్సర్ల ప్రచార కార్యక్రమాలను ఎలా నిర్వహించుకోవచ్చనే విషయంపై కూడా మరింత స్పష్టత కావాలని ఫ్రాంచైజీలు అడుగుతున్నాయి. -
రాజకీయం.. ఇక రిసార్ట్స్‌లో
సాక్షి, మేడ్చల్‌జిల్లా: మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో ఏడు కార్పొరేషన్లు, 21 మున్సిపాలిటీల ఎన్నికల ఫలితాలు శనివారం వెలువడనున్న నేపథ్యంలో గెలుపొందిన అభ్యర్థులను వెంటనే క్యాంపులకు తరలించేందుకు ప్రణాళికలు సిద్ధం అవుతున్నాయి. ఈ నెల 27న కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో మేయర్, చైర్మన్‌తోపాటు డిప్యూటీ మేయర్, వైస్ చైర్మన్ల ఎన్నిక జరగనున్న నేపథ్యంలో టీఆర్ఎస్ రిసార్ట్ రాజకీయాలకు తెరలేపింది. ప్రాదేశిక, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో లాగానే మున్సిపల్ ఎన్నికల్లోనూ క్లీన్‌స్వీప్ చేయాలన్న పిలుపులో భాగంగా మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలుపొందిన వారంతా అధిష్టానం నిర్ణయించిన మేయరు, ఛైర్మన్ అభ్యర్థులకు ఓటు వేసేలా క్యాంపులు నిర్వహించటానికి సన్నద్ధమైనట్టు సమాచారం. రెండు జిల్లాల్లో ఎన్నికలకు ముందే తొమ్మిది వార్డులను ఏకగ్రీవం చేసుకున్న అధికార పార్టీ కౌంటింగ్ పూర్తి కాగానే, గెలుపొందిన టీఆర్ఎస్ అభ్యర్థులను అక్కడ నుంచి నేరుగా క్యాంపులకు తరలించేందుకు నగర శివారు ప్రాంతాల్లో రిసార్టులను శుక్రవారం బుక్ చేశారు. మ్యాజిక్ ఫిగర్ రాని కార్పొరేషన్ లేదా మున్సిపాలిటీలో ఎవరైనా స్వతంత్రులు గెలిస్తే వారిని కూడా తమకే మద్దతు ఇచ్చేలా చూసి, వారిని కూడా క్యాంపులకు తరలించే అవకాశాలు లేకపోలేదు. -
రిసార్ట్‌లో హంగామా పోలీసు స్టేషన్‌కు యువతులు..
సాక్షి, చెన్నై: ఈసీఆర్ మార్గంలో ఓ రిసార్ట్‌లో మత్తులో యువత తూలారు. అర్ధరాత్రి వీరు సృష్టించిన హంగమా ఏకంగా నేర విభాగం ప్రత్యేక డీజీపీ దృష్టికి చేరింది. తిరువళ్లూరు ఎస్పీ, ఇద్దరు డీఎస్పీల నేతృత్వంలోని రెండు వందల మంది పోలీసులు ఆ రిసార్ట్‌ను చుట్టుముట్టారు. మత్తుకు చిత్తై ఉన్న 150 మందికి పైగా యువకులు, యువతులు, బౌనర్లను అరెస్టు చేశారు. ఐదు మంది నిర్వాహకుల మీద కేసు నమోదు చేశారు. ఇటీవల కాలంగా రిసార్టుల్లో వీకెండ్ పార్టీలు జోరుగా సాగుతున్నాయి. మత్తులో యువత తూలే దిశగా మద్యం, గంజాయి, మాత్రలు వంటి వాటిని సరఫరా చేసే వాళ్లు పెరగడంతో వీటికి ఆకర్షితులయ్యే వారి సంఖ్య పెరుగుతోంది. గత వారం పొల్లాచ్చిలోని ఓ రిసార్ట్‌లో సాగిన వీరంగంతో పోలీసులు కొరడా ఝుళిపించారు. అక్కడ పట్టుబడ్డ యువతను హెచ్చరించి పంపించారు. నిర్వాహకుల మీద మాత్రం కేసులు పెట్టారు. అరెస్టులు చేశారు. అయినా, తాము తగ్గేది లేదన్నట్టుగా రిసార్టులు, యువ సమూహం మత్తుకు చిత్తయ్యే పనిలో పడ్డాయి. ఆదివారం అర్ధరాత్రి పన్నెండు గంటల సమయంలో మహాబలిపురం సమీపంలో ఉన్న ఓ ప్రైవేటు రిసార్ట్‌లో సాగుతున్న హంగమా నేర విభాగం ప్రత్యేక డీజీపీ విజయకుమార్ దృష్టికి చేరింది. ఆయనకు వచ్చిన ఫిర్యాదుతో కాంచీపురం పోలీసుల్ని అప్రమత్తం చేశారు. ఆ జిల్లా ఎస్పీ సంతోష్ సెలవులో ఉండటంతో తిరువళ్లురు ఎస్పీ పొన్నిని రంగంలోకి దించారు. ఫేస్‌బుక్‌తో ఏకం.. విందుతో మజా తిరువళ్లురు ఎస్పీ పొన్ని నేతృత్వంలోని డీఎస్పీ సుబ్బరాజు, ఏడీఎస్పీ శిలంబరసన్తో పాటుగా రెండు వందల మంది పోలీసులు ఆ రిసార్ట్‌ను అర్ధరాత్రి వేళ చుట్టుముట్టారు. ఎవ్వరూ లేనికి వెళ్లలేనంతగా అక్కడ నిర్వాహకులు భద్రతా ఏర్పాట్లు చేసుకుని ఉండటంతో కాసేపు బయటే వేచి ఉండాల్సిన పరిస్థితి. అక్కడ యాబైకు పైగా ఖరీదైన కార్లు ఉండటంతో వాటిలో తనిఖీలు చేపట్టారు. ఎట్టకేలకు పోలీసులు అతి కష్టం మీద లోనికి వెళ్లారు. ఈ సమయంలో పోలీసులతో అక్కడ మత్తుకు చిత్తైన వాళ్లు తిరగబడే యత్నం చేశారు. కొందరు అయితే, అక్కడ హోరెత్తుతున్న సంగీతంతో పోలీసుల్ని సైతం పట్టించుకోకుండా నృత్యాలు చేస్తుండటం గమనార్హం. దీంతో అక్కడున్న స్పీకర్లను పోలీసులు తొలగించారు. దీంతో ఆగ్రహించిన అక్కడున్న వాళ్లు తిరగబడే రీతిలో వ్యవహరించడంతో పోలీసులు తమదైన శైలిలో రుచి చూపించే యత్నం చేశారు. దీంతో అక్కడున్న అనేక మంది భయంతో బయటకు పరుగులు పెట్టే యత్నం చేసినా, ముందుగానే పోలీసులు అన్ని దార్లను మూసివేయడంతో శరణు కోరక తప్పలేదు. తామంతే ఫేస్బుక్, ట్విటర్ల ద్వారా ఏకం అయ్యామని, తరచూ ఇక్కడకు వచ్చి విందు, వినోదాలతో గడుపుతామని పోలీసులకు వారు వివరణ ఇచ్చుకున్నారు. అయితే, ఆ పరిసర వాసులకు ఇబ్బంది కల్గించే రీతిలో స్పీకర్లు ఏర్పాటు చేయడంతో పాటుగా అక్కడ పెద్ద ఎత్తున మద్యం బాటిళ్లే కాదు, పది గ్రామలు, ముప్పై గ్రాములు చొప్పున గంజాయి ప్యాకెట్లు లభించడం, అనేక రకాల మాత్రలు సైతం ఉండటంతో అందర్నీ అదుపులోకి తీసుకున్నారు. వేకువజామున వీరందర్నీ సమీపంలోని ఓ కల్యాణ మండపంలో ఉంచి విచారించారు. అందరి వద్ద తలా రూ.మూడు వేలు చొప్పున వసూళ్లు చేసిన నిర్వాహకులు ఐదు మంది మీద కేసు నమోదు చేశారు. మిగిలిన వారికి తీవ్ర హెచ్చరికలు చేసి పంపించేందుకు నిర్ణయించారు. తల్లిదండ్రులకు చీవాట్లు.. మొత్తంగా 150 మంది యువకులు, ఏడుగురు యువతులు, పది మంది బౌనర్లు, ఐదు మంది నిర్వాహకులు అక్కడ పట్టుబడ్డారు. యువతుల్ని మాత్రం మహిళ పోలీసు స్టేషన్‌కు తరలించి, వారి వివరాలను సేకరించారు. మత్తుకు చిత్తై ఉన్న ఆ యువతుల తల్లిదండ్రుల్ని పిలిపించి తీవ్రంగా మందలించారు. ఏదేని జరగరానిది జరిగిన పక్షంలో పోలీసుల్ని నిందిస్తారంటూ తల్లిదండ్రులకు చీవాట్లు పెట్టారు. -
జేఎన్ గణేష్‌ను అరెస్ట్ చేసే ఛాన్స్
సాక్షి, బెంగళూర్ : కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బస చేసిన ఈగల్టన్ రిసార్ట్స్‌లో సహచర ఎమ్మెల్యే ఆనంద్ సింగ్‌పై దాడి చేశాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే జేఎన్ గణేష్‌ను పోలీసులు అరెస్ట్ చేయవచ్చని భావిస్తున్నారు. దాడి ఘటనపై ప్రశ్నించేందుకు గణేష్‌ను బుధవారం విచారణకు హాజరు కావాల్సిందిగా కోరిన పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది. కాగా, గణేష్‌పై సోమవారం ఆనంద్ సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు గణేష్‌ను అదేరోజు పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు కాంగ్రెస్ ప్రకటించింది. ఇక ఆనంద్ సింగ్‌ను ఆస్పత్రికి తరలించడంతో ఆయన కుటుంబ సభ్యులకు గణేష్ క్షమాపణలు చెప్పారు. తాను బీజేపీతో టచ్‌లో ఉన్నట్టు పార్టీ నేతలకు సమాచారం ఇచ్చాడనే ఆగ్రహంతో ఆనంద్ సింగ్‌పై గణేష్ దాడికి తెగబడినట్టు చెబుతున్నారు. తమ ఎమ్మెల్యేలను బీజేపీ ప్రలోభాలకు గురిచేస్తుందనే ఆందోళనతో కాంగ్రెస్ పార్టీ తమ ఎమ్మెల్యేలను శుక్రవారం సాయంత్రం బెంగళూర్‌లోని ఈగల్టన్ రిసార్ట్స్‌కు తరలించిన సంగతి తెలిసిందే. -
31 జోష్.. ఒక్క రాత్రికి హోటల్ చార్జ్ 11 లక్షలు!
న్యూఢిల్లీ: కొత్త సంవత్సర సంబరాల నేపథ్యంలో హోటళ్లు, రిసార్ట్‌లలో ఛార్జీలకు రెక్కలొచ్చేశాయి. ముఖ్యంగా రాజస్తాన్‌లోని హోటళ్లు టారిఫ్‌ల పండుగ చేసుకుంటున్నాయి. ఈ నెల 31వ తేదీ కోసం రాజస్తాన్‌లోని లగ్జరీ హోటళ్లు రూ.11 లక్షల వరకు వసూలు చేస్తుండడం డిమాండ్‌ను తెలియజేస్తోంది. సంపన్నులు ఖరీదైన హోటళ్లలో వేడుకలకు ఆసక్తి చూపిస్తుండడం హోటళ్లకు కలిసొస్తోంది. జోధ్‌పూర్‌లోని ఉమైద్ భవన్ డిసెంబర్ 31న సూట్ కోసం రూ.11.03 లక్షలను చార్జ్ చేస్తోంది. ఉదయ్‌పూర్‌లోని తాజ్ లేక్ ప్యాలస్ టారిఫ్ జనవరి 1న అయితే రూ.11 లక్షలు దాటేసింది. అంతేకాదు ఈ నెల 31వ తేదీకి బుకింగ్‌లు కూడా అయిపోయాయి. జైపూర్‌లోని తాజ్ రామ్‌భాగ్ ప్యాలస్ గతేడాదితో పోలిస్తే ఈ నెల 31కి 7 శాతం అధికంగా రూ.8.53 లక్షల టారిఫ్‌ను వసూలు చేస్తోంది. ‘‘సాధారణంగా ప్రత్యేకమైన గదుల చార్జీలు సాధారణ వాటితో పోలిస్తే అధికంగా ఉంటాయి. కానీ, డిసెంబర్ 31 వంటి ప్రత్యేక సందర్భాల్లో వీటి చార్జీలు కూడా గణనీయంగా పెరిగిపోతుంటాయి. ఈ ఏడాది టారిఫ్‌లు 40 శాతం పెరిగాయి’’ అని తాజ్ రామ్‌భాగ్ ప్యాలస్ వర్గాలు తెలిపాయి. ఈ ఏడాది రాజస్తాన్‌లో పర్యాటకం మంచి ఊపుతో ఉందని, నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో హోటళ్లలో ఆక్యుపెన్సీ రేషియో (భర్తీ) 90 శాతానికి చేరిందని ఆ వర్గాలు పేర్కొన్నాయి. ‘‘దేశంలోని కొన్ని పట్టణాల్లోనే రాజస్తాన్ లో మాదిరిగా హోటళ్లు, రిసార్ట్‌ల టారిఫ్‌లు అధికంగా ఉన్నాయి. నూతన సంవత్సరం సందర్భంగా ప్రజలు రాజస్తాన్‌లోని చారిత్రక వారసత్వం ఉన్న ప్రాపర్టీలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. డబ్బులు వారికి ద్వితీయ ప్రాధాన్యం. మంచి అనుభవం, గోప్యత, సౌకర్యాలకే వారి మొదటి ప్రాధాన్యం’’ అని ఐటీసీ రాజ్‌పుతానా జనరల్ మేనేజర్ శేఖర్ సావంత్ తెలిపారు. -
ఏనుగుల కారిడార్‌లో రిసార్టులపై కొరడా
న్యూఢిల్లీ: నీలగిరిలోని ఏనుగుల కారిడార్ పరిధిలో అనుమతులు లేకుండా నడుస్తున్న హోటళ్లు, రిసార్టులపై సుప్రీంకోర్టు కొరడా ఝళిపించింది. ఆ ప్రాంతంలోని 27 రిసార్టులు, హోటళ్లను మూసివేయాలని సుప్రీంకోర్టు తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది. నీలగిరి జిల్లాలోని ఏనుగుల కారిడార్‌లో చట్ట విరుద్ధంగా రిసార్టులు, హోటళ్లను నడుపుతున్నారంటూ దాఖలైన పిటిషన్‌ను ధర్మాసనం విచారణ చేపట్టింది. ‘ఏనుగులు సంచరించే ప్రాంతంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదని చట్టం ఉంది. అయినా రిసార్టులు, హోటళ్ల నిర్మాణాలను ఎలా చేపడతారు?’ అంటూ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ వర్షాకాలంలో సుమారు 18వేల ఏనుగులు నీలగిరి కారిడార్లోకి ప్రవేశించాయని పిటిషనర్ తెలపగా.. ఆ ప్రాంతంలో ఉన్న రిసార్టులు, హోటళ్లకు విద్యుత్ సరఫరా నిలిపివేయాలని ధర్మాసనం అధికారులను ఆదేశించింది. -
అంతరాత్మలున్నాయా?
అక్షర తూణీరం క్యాంప్ కట్టడం ఓ బ్రహ్మవిద్య అని కొందరు, కాదు క్షుద్ర విద్య అని మరికొందరు అంటుం టారు. తన అనుకున్నవాళ్లందర్నీ ఒకచోట మళ్లే యడాన్ని క్యాంప్ రాజకీయం అంటారు. రేపు చేతులెత్తాల్సిన వాళ్లందర్నీ ఒకే తాటిమీద, ఒకే గూట్లో ఉంచడం. వాళ్లని రాచమర్యాదలతో ఆ పది రోజులూ సేవించుకోవడం చిన్న సంగతి కాదు. నరాలు తెగిపోతాయ్. ఎందుకంటే వాళ్లకి బాహ్య ప్రపంచంతో సంబంధాలుండవ్. సర్వభో గాలు ఉంటాయ్. ఈ క్యాంప్‌లు గడచిన నలభై ఏళ్లలో చాలా మంచి ఫలితాలు ఇవ్వడంతో బహుళ ప్రాచుర్యం పొందాయి. ఈ క్యాంప్‌కి చాలామంది ఐచ్ఛికంగా వస్తే, కొద్దిమంది బలవం తంగా తీసుకు రాబడతారు. బడా ఎన్నికల నించి పంచాయతీ స్థాయి దాకా ఈ రాజకీయం నడు స్తోంది. అప్పట్లో మావూరి మున్సబు గారి మామిడితోట క్యాంప్‌లు పెట్టడా నికి చాలా ప్రసిద్ధికెక్కింది. తాటాకు పందిళ్లు, మడత మంచాలు, పేకాట లకి విశాలమైన గడ్డి పరుపులు ఏర్పా టుగా ఉండేవి. వంటలకి, వార్పులకి అనువైన గాడి పొయ్యిలు, కోరినపు డల్లా ఒళ్లుపట్టి, టెన్షన్ దింపేసే పని వాళ్లు, చేగోడీల నించి చేపల పులుసు దాకా వండి వడ్డించగల వంటవాళ్లు క్యాంప్‌ని సుభిక్షం, సుసంపన్నం చేస్తుండేవారు. ఈ సంప్రదాయం మన దేశంలో అన్ని దిక్కులా ఉంది. 30 ఏళ్ల క్రితం తమిళనాట ఓ క్యాంప్‌లో విధివశాత్తు ఉండాల్సి వచ్చింది. మద్రా సులో మెరీనా బీచ్‌కి దగ్గర్లో పది పన్నెండు అంత స్థుల హోటల్ని ఉన్నట్టుండి క్యాంప్‌గా మార్చే శారు. నేనందులో నెలవారీ కస్టమర్‌ని. మిగతా గదులన్నీ తమిళ పంచెలతో, బంగారు చెయిన్లతో నిండిపోయాయి. హోటల్ వారు తమ కిచెన్‌ని క్యాంపుకి అంకితం చేశారు. నన్ను మాత్రం క్యాంపులో కోరినవన్నీ ఉచితంగా తినెయ్యమ న్నారు. ఫ్రీగా తాగేయచ్చన్నారు. నిజంగా ఆ తిండి ఓ గొప్ప అనుభవం. ఆంధ్రలో కూడా క్యాంప్‌లు నడపగల సమ ర్థులున్నారు. వారాల తరబడి కప్పలు చెదర కుండా, పిట్టలెగరకుండా కాపాడుకురావడం చిన్న విషయం కాదు. సమాచార వ్యవస్థని పూర్తిగా కట్టిపెట్టాలి. అన్నిరకాల ఆటలతో వాళ్లని ఉల్లాస మరియు వినోద పరచాలి. అవసరమైతే మన వాళ్లని ఆటలో కూచోపెట్టి, అవతలివాళ్లకి కుప్పలు తెప్పలుగా సొమ్ములొచ్చేలా చూడాలి. నిత్యావస రాలైన మందు, మందులు అందిస్తూ ఉపద్రవం రాకుండా చూసుకోవాలి. అవసరమైతే రెండు డైలీ పేపర్లలో నాలుగు పేజీలు జాగ్రత్తగా కల్తీచేసి క్యాంప్ సభ్యులకు హాయిని కలిగించాలి. ఇలా చేస్తేనే ఓసారి రసాభాస అయింది. ఓ సాయంకాల వేళ సిల్కు లాల్చీ ఫెళ ఫెళల్లోంచి నిజం డైలీ పేజీ జారి పడింది. దాంట్లో పెద్దక్షరాల్లో సమాచారం వేరేగా ఉంది. ‘‘ఇంకే వుంది... క్యాంపు మునిగింది’’ అనుకుంటున్నారు కదూ? రెండు మూడు బృహత్ క్యాంపులు నిర్వ హించినాయన చెప్పినప్పుడు నేనూ అలాగే అను కున్నా. ‘‘ఏవుందండీ... జరిగిన చిన్న పొరబా టుకి వంద కోట్లు పెనాల్టీ పడిందండీ. దాదాపు యాభైమంది మోసం చేశారంటూ ఎదురు తిరి గారు. తలొక రెండూ వడ్డించి సరిచేశాం. ఇవన్నీ తప్పదండీ చివరాఖరికి అంతరాత్మ ప్రబోధం అంటారండీ’’ అంటూ ఆర్గనైజర్ నిట్టూర్చాడు! శ్రీరమణ, వ్యాసకర్త ప్రముఖ కథకుడు -
విచ్చల‘విడిది’ కేంద్రాలు
శంకర్పల్లి : నగర శివారుకు ఆనుకొని ఉన్న మన జిల్లాలో రిసార్టులు ఇబ్బడిముబ్బడిగా వెలిశాయి. నిత్యం పని ఒత్తిడికి లోనయ్యే వారు వారాంతాల్లో ఇక్కడ సేద తీరేందుకు వస్తుంటారు. అయితే, నిబంధనల ప్రకారం నిర్వాహకులు కుటుంబాలతో వచ్చే వారికి మాత్రమే అనుమతి ఇవ్వాలి. కాగా, లాభార్జనే ధ్యేయంగా రిసార్టుల నిర్వాహకులు నిబంధనలను పట్టించుకోకుండా యువతీయువకులకు సైతం గదులను అద్దెకు ఇస్తున్నారు. ఎలాంటి పరిశీలన చేయకుండానే ఆన్లైన్లో బుకింగ్ చేస్తున్నారు. శంకర్పల్లి, మొయినాబాద్ మండలాల పరిధిలోని వివిధ గ్రామాల్లో రిసార్టులు అడుగడుగునా ఉన్నాయి. తరచూ ఈ రిసార్టుల్లో అసాంఘిక కార్యకలాపాలు వెలుగుచూస్తున్నా పోలీసులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. యంత్రాంగం గట్టి నిఘా సారిస్తే ఎలాంటి అవకతవకలు చోటుచేసుకునే ఆస్కారం లేదు. అయితే, కొంతకాలంగా రిసార్టుల్లో తరచూ అసాంఘిక కార్యకలాపాలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. గతంలో పలు రిసార్టులో వ్యభిచారం, ముజ్రా పార్టీలు, కోళ్ల పందేలు తదితరాలు వెలుగులోకి వచ్చాయి. రిసార్టు నిర్వాహకులు అనుమతులు తీసుకునేది ఒక దానికి.. వాస్తవానికి వాటిలో జరుగుతున్నది మరోటి అన్నవిధంగా ఉంది. రిసార్టులో హత్య కలకలం కొత్తూరు మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన సాయిప్రసాద్, అదే మండలం కుమ్మరిగూడ గ్రామానికి చెందిన శిరీష(21) పరిచయస్తులు. గతంలో వీరు ప్రేమించుకున్నారు. అయితే, కొంతకాలంగా శిరీష సాయిప్రసాద్‌కు దూరంగా ఉంది. తనను పెళ్లి చేసుకోవాలని సాయిప్రసాద్ ఆమెపై ఒత్తిడి తీసుకురాగా యువతి నిరాకరించింది. దీంతో అతడు శిరీషపై కక్ష పెంచుకున్నాడు. తనకు దక్కని అమ్మాయి మరొకరికి దక్కకూడదని నిర్ణయించుకున్నాడు. ఎలాగైనా ఆమెను చంపేయాలని పథకం వేశాడు. గత గురువారం శంకర్పల్లి మండల పరిధిలోని ప్రగతి రిసార్టులో ఆన్లైన్లో గది బుక్ చేశాడు. అయితే, పథకం ప్రకారం సాయిప్రసాద్ తనతో ఓ కత్తి తెచ్చుకున్నాడు. నిర్వాహకులు ఎలాంటి తనిఖీలు చేయలేదు. వారి గుర్తింపు కార్డులను సైతం చెక్ చేయలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గదిలోకి వెళ్లిన తర్వాత సాయిప్రసాద్ పెళ్లి ప్రస్తావన తీసుకురావడంతో శిరీష నిరాకరించింది. దీంతో అతడు కత్తితో ఆమె గొంతు కోసం చంపేశాడు. నిర్వాహకులు గుర్తించేసరికి పారిపోయాడు. అనంతరం పోలీసులు బృందాలుగా ఏర్పడి అతడిని మరుసటి రోజు చిలుకూరు చౌరస్తాలో పట్టుకొని కటకటాల వెనక్కి పంపారు. రిసార్టు నిర్వాహకులు సాయిప్రసాద్‌ను సరిగా తనిఖీలు చేసి ఉంటే ఓ అమ్మాయి ప్రాణం దక్కేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. కనిపించని తనిఖీలు సాధారణంగా హోటళ్లు, రెస్టారెంట్లు, సినిమాహాళ్లతోపాటు ఎక్కువ మంది ప్రజలు రాకపోకలు సాగించే ప్రాంతాల్లో సీసీ కెమెరాలతో పాటు మెటల్ డిటెక్టర్లు వినియోగించి ప్రజలను క్షుణ్ణంగా తనిఖీలు చేయాల్సి ఉంటుంది నిబంధనల ప్రకారం. అయితే, నిర్వాహకులు ఎలాంటి తనిఖీలు చేయడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. చిరునామాకు సంబంధించిన ధృవీకరణ పత్రాలు పరిశీలించి గదులను అద్దెకు ఇవ్వాలి. అయితే, నిబంధనలను ఎవరూ పాటించడం లేదు. సంఘటన జరిగినప్పుడే పోలీసులు, అధికారులు హడావుడి చేసి.. కొద్దిరోజులకు విస్మరిస్తున్నారు. నిర్వాహకులు నిబంధనలు పాటించేలా కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. నిబంధనలు పాటించాల్సిందే రిసార్టు నిర్వాహకులు నిబంధనలు పాటించాలి. ఖచ్చితంగా విజిటర్స్ ఐడీ ప్రూఫ్ తీసుకోవాలి. నిబంధనలు ఉల్లంఘించినట్లు మా దృష్టికి వస్తే తనిఖీలు చేసి కేసులు నమోదు చేస్తాం. – పీవీ పద్మజరెడ్డి, డీసీపీ శంషాబాద్ -
ఆంధ్రప్రదేశ్‌లో మహీంద్రా రిసార్ట్!
ప్రస్తుత యువ తరంగానికి ట్రెక్కింగ్, స్నో స్కీయింగ్, పారాగ్లైడింగ్, రాక్ క్లైంబింగ్, జంగిల్ సఫారీ లాంటి సాహసకృత్యాలంటే చాలా మక్కువ. ఇలాంటివన్నీ సాకారం చేస్తూ.. విహార, పర్యాటక రంగంలో దూసుకెళుతున్న మహీంద్రా హాలిడేస్ అండ్ రిసార్ట్స్.. విస్తరణకోసం భారీగానే ప్రణాళికలు వేస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో తొలిసారిగా రిసార్ట్ ఏర్పాటుపై దృష్టి పెట్టినట్లు కంపెనీ ఎండీ, సీఈఓ కవిందర్ సింగ్ చెప్పా రు. ఇటీవలే ‘క్లబ్ మహీంద్రా’ కండాఘాట్ రిసార్ట్‌లో మీడియా ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశమైన సందర్భంగా ‘సాక్షి, బిజినెస్ ప్రతినిధి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. నోట్ల రద్దు వల్ల పరిశ్రమకు నష్టం మాట అటుంచితే, తమకు ప్రయోజనాలే ఎక్కువగా జరిగాయని చెప్పారాయన. ఇంకా కంపెనీ విస్తరణ ప్రణాళికలు, విదేశీ కొనుగోళ్లతో పాటు కొత్త సభ్యత్వ ప్యాకేజీలు తదితర అంశాలను వివరంగా తెలిపారు. ఇంటర్వ్యూ ముఖ్యాంశాలివీ... ప్ర: మీ లీజర్ హాలిడేయింగ్ (సరదా విహార యాత్రలు), పర్యాటక విభాగం ప్రస్తుతం ఎలా ఉంది? కొత్త ప్రాజెక్టులేమైనా తెస్తున్నారా? ప్రస్తుతం ఉన్న ప్రాపర్టీల(రిసార్ట్) విస్తరణతోపాటు, ఈ రంగంలోని ఇతర సంస్థలతో భాగస్వామ్యాల రూపంలో మా వ్యాపారాన్ని శరవేగంగా ముందుకు తీసుకెళ్తున్నాం. గోవాలో రూ.230 కోట్లతో 240 గదులతో విశాలమైన రిసార్ట్‌ను అందుబాటులోకి తేబోతున్నాం. అష్టముడిలో రూ.100 కోట్లతో కొత్త ప్రాజెక్టును చేపట్టాం. దీనివల్ల 100 గదులు జతవుతాయి. ఇంకా నాల్దెరాలో 55 గదులతో రిసార్ట్ తెరిచాం. రూ.100 కోట్ల పెట్టుబడితో 60 గదులను జత చేశాం. మొత్తంమీద ఈ మూడు కొత్త ప్రాజెక్టులపై రూ.600 కోట్ల వరకూ పెట్టుబడి పెడుతున్నాం. దీనివల్ల కొత్తగా సభ్యులకు 600 గదులు అందుబాటులోకి వస్తాయి. అలాగే సిమ్లా దగ్గర్లో కూడా మరో కొత్త రిసార్ట్ ప్రయత్నాల్లో ఉన్నాం. ఇక 50 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయసున్నవారి అవసరాలను దృష్టిలో పెట్టుకొని ‘బ్లిస్’ పేరిట పదేళ్ల సభ్యత్వ స్కీమ్‌ను ప్రవేశపెడుతున్నాం. సొంత ప్రాంతాల్లో ఏడాదంతా వినూత్న హాలిడే అనుభూతిని ఆస్వాదించేందుకు ‘డ్రీమ్ స్కేప్స్’ ప్రోగ్రామ్‌ను కూడా తీసుకొస్తున్నాం. హాట్ఎయిర్ బెలూన్ రైడ్స్, వైన్యార్డ్స్ సందర్శన, యాట్ రైడ్స్ వంటివి ఇందులో ఉంటాయి. గతేడాదే మొబైల్ యాప్‌ను తెచ్చాం. ఇప్పుడు మా బుకింగ్స్‌లో 85 శాతం వరకూ వెబ్, యాప్‌ల ద్వారానే జరుగుతోంది. ట్రెక్కింగ్, ఎకో టూరిజం వంటి ప్రత్యేకతలుండే లీజర్ పర్యాటకం దేశంలో ఎలా ఉంది? భవిష్యత్తు ఎలా ఉండొచ్చు? భారతీయ సేవల రంగానికి బూస్ట్‌నిచ్చే రంగాల్లో పర్యాటక, ఆతిథ్య పరిశ్రమది ప్రధాన పాత్ర. లక్షలాది ఉద్యోగాల కల్పనతోపాటు దేశానికి వేల కోట్ల రూపాయల విదేశీ మారక ద్రవ్యాన్ని కూడా అందిస్తోంది. 2016లో మన జీడీపీకి ఈ పరిశ్రమ ప్రత్యక్షంగా 71.53 బిలియన్ డాలర్లను జతచేసింది. ఇక్కడున్న గొప్ప సాంస్కృతిక, చారిత్రక, వారసత్వ సంపదకు తోడు.. సహజమైన ప్రకృతి రమణీయ ప్రదేశాలు కూడా మన పర్యాటక పరిశ్రమ వృద్ధికి దన్నుగా నిలుస్తున్నాయి. దాదాపు భారతీయ పర్యాటక రంగంలో 83 శాతం వరకూ దేశీయంగానే ఉంది. అందుకే మేం ఇండియాలోనే అత్యధికంగా పెట్టుబడులు పెడుతున్నాం. మాకున్న 53 రిసార్టుల్లో 48 ఇక్కడే ఉన్నాయి. అయితే, విదేశీ పర్యటనలకు వెళ్లేవారిక్కూడా అందుబాటులో ఉండటానికి ఇతర రిసార్టులు, హోటల్ నెట్‌వర్క్‌లతో జతకట్టి.. మంచి ప్యాకేజీలను అందిస్తున్నాం. యువత కూడా తమ స్నేహితులతో, కుటుంబాలతో టూర్లకు ముందుంటున్నారు. ఇప్పటివరకూ ఎవరికీ పెద్దగా తెలియని ప్రాంతాలను చూసొచ్చేందుకు మక్కువ చూపుతున్నారు. అందుకే అలాంటి పర్యాటక గమ్యస్థానాల్లో రిసార్టుల విస్తరణపై దృష్టిపెడుతున్నాం. పెద్ద నోట్ల రద్దు కారణంగా మన పర్యాటక, ఆతిథ్య రంగంపై ప్రతికూల ప్రభావం పడిందంటారా? మీ సంగతేంటి? డీమోనిటైజేషన్ వల్ల పరిశ్రమపై కొంత ప్రతికూల ప్రభావం పడినమాట నిజమే. కాకపోతే మాపై మాత్రం పడలేదు. నిజం చెప్పాలంటే మాకు దీనివల్ల ప్రయోజనమే ఎక్కువ. ఎందుకంటే క్రెడిట్ కార్డు చెల్లింపులు భారీగా పెరిగాయి. మేం నెలవాయిదాల (ఈఎంఐ) రూపంలో సభ్యత్వాలను విక్రయిస్తాం కాబట్టి.. మరింత మంది సభ్యులు కార్డు చెల్లింపులకు ముందుకొస్తున్నారు. డీమోనిటైజేషన్ కాలంలో మా అమ్మకాల్లో మంచి వృద్ధిని కూడా సాధించాం. దక్షిణాదిలో మీకు అత్యధికంగా 18 రిసార్టులున్నాయి. మరి పర్యాటకానికి అవకాశమున్న ఏపీ, తెలంగాణల్లో ఒక్కటి కూడా లేదెందుకు? దేశంలో మాకున్న భారీ నెట్‌వర్క్‌కు తోడుగా కొత్త పర్యాటక ప్రాంతాల్లో రిసార్టుల ఏర్పాటుపై ఎప్పటికప్పుడు అధ్యయనాలు, ప్రయత్నాలు జరుగుతూనే ఉంటాయి. ఆంధ్రప్రదేశ్‌లో రిసార్ట్ నెలకొల్పే అంశం మా పరిశీలనలో ఉంది. ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నాం. 2014లో మీరు ఫిన్లాండ్కు చెందిన అతిపెద్ద రిసార్ట్ చైన్ ‘హాలిడే క్లబ్’ను చేజిక్కించుకున్నారు? మళ్లీ ఆ స్థాయిలో విదేశీ కొనుగోళ్లపై దృష్టి పెడుతున్నారా? హాలిడే క్లబ్‌కు ఫిన్లాండ్, స్పెయిన్, స్వీడన్లలో 32 పైగా రిసార్టులు (2,800 గదులు) ఉన్నాయి. దీనికి భారత్‌లోని రిసార్టులను కూడా కలిపితే మొత్తం సభ్యత్వాల సంఖ్య ఇప్పుడు 2,25,000కు పైనే ఉంటుంది. గడిచిన 9 క్వార్టర్లలో సగటున 3,500కు పైగా మెంబర్లు జతయ్యారు. మాకు లీజ్డ్, సొంత ప్రాపర్టీలు రెండూ ఉన్నాయి. గతేడాది ట్రావెల్ ఎక్స్పీరియన్సెస్ను ఆఫర్ చేసే ‘జోజోడే’ అనే స్టార్టప్‌లో పెట్టుబడి పెట్టాం. ఇంకా ప్రపంచస్థాయి క్రూయిజ్ (భారీ విహార నౌకలు) ప్యాకేజీలను అందించేందుకు అంతర్జాతీయ ట్రావెల్ అగ్రిగేటర్లతోనూ ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాం. ఇంకా మాకున్న భారీ ల్యాండ్ బ్యాంక్‌లో భవిష్యత్తులో కొత్త రిసార్టుల నిర్మాణాన్ని పరి శీలిస్తున్నాం. శ్రీలంక, పశ్చిమ యూరప్, ఆగ్నేయాసియా, అమెరికాల్లో ప్రాపర్టీల లీజు లేదా పూర్తిగా కొనుగోలు ద్వారా విస్తరణ అవకాశాలపై దృష్టిపెడుతున్నాం. సభ్యత్వాలు, కంపెనీ ఆదాయాల పరంగా మీ భవిష్యత్తు లక్ష్యాలేంటి? ముందస్తు అంచనాలను మేం వెల్లడించం. అయితే, 2025కల్లా పర్యాటకులకు అత్యంత అభిమాన వెకేషన్ ఓనర్షిప్ (రిసార్టుల సభ్యత్వం) కంపెనీగా ఎదగడంపై దృష్టి పెట్టాం. రిసార్టులన్నింటిలో మెంబర్లకు వినూత్న అనుభూతులను అందించేందుకు కొత్తకొత్త కార్యక్రమాలను తీసుకొస్తున్నాం. కొత్త, రిసార్టుల్లో నూతన స్కీమ్‌ల కోసం భారీగా పెట్టుబడులు పెట్టడం ద్వారా సభ్యుల సంఖ్యను పెంచుకోవాలనేది మా వ్యూహం. – ఎం. శివరామకృష్ణ -
పున్నమి వసంతం..రంగుల ప్రపం
నగరం సప్తవర్ణ శోభితమైంది. రంగుల లోకంలో మునిగితేలింది. సిటీలో హోలీ వేడుకలు ఆదివారం అంబరాన్నంటాయి. యువ జోష్.. కలర్‌ఫుల్ కిక్‌తో పబ్బులు, క్లబ్బులు, రిసార్ట్స్ ఉర్రూతలూగాయి. వివిధ ప్రాంతాల్లో నిర్వహించిన వేడుకల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొని సందడి చేశారు. -
మారేడుమిల్లిలో ఎకో టూరిజం రిసార్ట్స్
కాకినాడ సిటీ : మారేడుమిల్లిలో పర్యాటక ప్రాంత అభివృద్ధిలో భాగంగా ఎకో టూరిజం రిసార్ట్స్ నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నట్టు కలెక్టర్ అరుణ్‌కుమార్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం రాత్రి కార్యాలయంలో జిల్లా పర్యాటక అభివృద్ధి మండలి సమావేశంలో ప్రాజెక్టు నిర్మాణానికి విధి విధానాలు ఖరారు చేశారు. మారేడుమిల్లి– చింతూరు రహదారిలో ఉన్న హెచ్ఎ¯ŒSటీసీ ఆవరణలో సుమారు 60 కాటేజీలు నిర్మించేవిధంగా ఎకో టూరిజం రిసార్ట్స్ చేపట్టాలని, దీని నిర్మాణం కోసం రూ.8 కోట్ల వ్యయంతో కాటేజీలు, పుడ్‌కోర్టులు నిర్మించాలన్నారు. ఈ సమావేశంలో పర్యాటక శాఖ రీజనల్ డైరెక్టర్ భీమశంకరరావు, పంచాయతీ రాజ్ ఎస్ఈ వెంకటేశ్వరరావు, విజిలె¯Œ్స అండ్ క్వాలిటీ కంట్రోల్ అధికారి ఎ¯ŒS.ప్రసాద్ బాబు, తదితరులు పాల్గొన్నారు. -
ఇక బ్రాండ్ ‘తాజ్’ ఒక్కటే!
ఇండియన్ హోటల్స్‌కు కొత్తరూపు.. • ఆతిథ్య సేవలన్నీ ఒకే బ్రాండ్ పేరుతో • ఒక్కటి కానున్న తాజ్ హోటల్స్, ప్యాలసెస్, రిసార్ట్స్, సఫారీస్ • గేట్‌వే, వివాంటా హోటళ్లూ తాజ్ కిందకు • డిసెంబర్ నాటికి ప్రక్రియ పూర్తి ముంబై: టాటాగ్రూపులో భాగమైన ఇండియన్ హోటల్స్ కంపెనీ (ఐహెచ్‌సీఎల్) పునర్నిర్మాణ ప్రక్రియ దిశగా చర్యలు ప్రారంభించింది. తన పరిధిలోని అన్ని హోటల్స్‌ను ‘తాజ్ హోటల్స్ ప్యాలసెస్ రిసార్ట్స్ సఫారీస్’ పేరుతో ఒకే బ్రాండ్ కిందకు తీసుకురానున్నట్టు ఐహెచ్‌సీఎల్ తాజాగా ప్రకటించింది. ప్రస్తుతం తాజ్ హోటల్స్, తాజ్ ప్యాలసెస్, తాజ్ రిసార్ట్స్, తాజ్ సఫారీస్ అనే నాలుగు విభాగాలతో భిన్నమైన ఆతిథ్య సేవలు అందిస్తుండగా... ఇవన్నీ తాజ్ బ్రాండ్ కిందకు రానున్నాయి. నూతనంగా ఏర్పడే బ్రాండ్ స్వరూపం తాజ్ వారసత్వాన్ని గౌరవించే విధంగా, గొప్ప బ్రాండ్‌గా ఉంటుందని, తమ వాటాదారులకు గణనీయమైన విలువను తెచ్చిపెడుతుందని కంపెనీ ఆశాభావం వ్యక్తం చేసింది. ఈ పునర్నిర్మాణ ప్రక్రియలో భాగంగా వివాంటా, గేట్‌వే పేర్లు కనుమరుగవుతాయి. దేశంలోనూ, దేశం వెలుపల ఉన్న వివాంటా, గేట్‌వే హోటళ్లన్నీ తాజ్ బ్రాండ్ కిందకు వస్తాయని తాజ్ హటల్స్ ప్యాలసెస్ రిసార్ట్స్ సఫారీస్ సీఈవో, ఎండీ రాకేశ్ సర్నా గురువారం ముంబైలో విలేకరులకు తెలిపారు. పునర్నిర్మాణ ప్రక్రియ ఈ ఏడాది డిసెంబర్ నాటికి ముగుస్తుందన్నారు. 100 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న ఇండియన్ హోటల్స్ కంపెనీకి ప్రపంచవ్యాప్తంగా 64 చోట్ల 101 ప్రదేశాల్లో హోటళ్లు ఉన్నాయి. ఆసియాలోనే అతిపెద్ద హోటళ్ల గ్రూపుగా ఇది కొనసాగుతోంది. ఎనిమిదేళ్ల క్రితమే ప్రారంభం... గేట్‌వే, వివాంటా పేరుతో ఎనిమిదేళ్ల క్రితమే హోటల్స్ ప్రారంభం అయ్యాయి. దేశీయ మార్కెట్లో అంతర్జాతీయ బ్రాండ్లకు పోటీనిచ్చే వ్యూహంలో భాగంగా ఐహెచ్‌సీఎల్ ఈ బ్రాండ్ల పేరుతో హోటళ్లను కస్టమర్ల ముందుకు తీసుకొచ్చింది. అయితే, ఇవి పెద్దగా ఆదరణకు నోచుకోలేదు. ఈ రెండు బ్రాండ్ల కింద అందిస్తున్న సేవల విషయమై కస్టమర్లలో అవగాహన లేదని ఐహెచ్‌సీఎల్ ఉద్యోగి ఒకరు స్వయంగా పేర్కొనడం గమనార్హం. తాజా ఏకీకరణ చర్యలతో దేశీయంగా అతిపెద్ద ఆతిథ్య బ్రాండ్‌గా తాజ్ నిలుస్తుంది. ప్రధానంగా పేరుకుపోయిన రుణ భారాన్ని తగ్గించుకోవడంతోపాటు, లాభాలను గడించడం, తాజ్ బ్రాండ్‌కు మరింత బలాన్ని తీసుకొచ్చేందుకు ఐహెచ్‌సీఎల్ తాజా చర్యలను చేపట్టినట్టు పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి.