మారేడుమిల్లిలో ఎకో టూరిజం రిసార్ట్స్
Published Tue, Feb 14 2017 11:37 PM | Last Updated on Tue, Sep 5 2017 3:43 AM
కాకినాడ సిటీ :
మారేడుమిల్లిలో పర్యాటక ప్రాంత అభివృద్ధిలో భాగంగా ఎకో టూరిజం రిసార్ట్స్ నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నట్టు కలెక్టర్ అరుణ్‌కుమార్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం రాత్రి కార్యాలయంలో జిల్లా పర్యాటక అభివృద్ధి మండలి సమావేశంలో ప్రాజెక్టు నిర్మాణానికి విధి విధానాలు ఖరారు చేశారు. మారేడుమిల్లి– చింతూరు రహదారిలో ఉన్న హెచ్‌ఎ¯ŒSటీసీ ఆవరణలో సుమారు 60 కాటేజీలు నిర్మించేవిధంగా ఎకో టూరిజం రిసార్ట్స్ చేపట్టాలని, దీని నిర్మాణం కోసం రూ.8 కోట్ల వ్యయంతో కాటేజీలు, పుడ్‌కోర్టులు నిర్మించాలన్నారు. ఈ సమావేశంలో పర్యాటక శాఖ రీజనల్ డైరెక్టర్ భీమశంకరరావు, పంచాయతీ రాజ్ ఎస్‌ఈ వెంకటేశ్వరరావు, విజిలె¯Œ్స అండ్ క్వాలిటీ కంట్రోల్ అధికారి ఎ¯ŒS.ప్రసాద్ బాబు, తదితరులు పాల్గొన్నారు.
Advertisement