maredumilli
-
జలపాతంలో ఇద్దరి మృతదేహాలు లభ్యం
మారేడుమిల్లి: అల్లూరి జిల్లా మారేడుమిల్లి సమీపంలోని పర్యాటక ప్రదేశమైన జలతరంగిణి జలపాతంలో ఆదివారం గల్లంతైన ముగ్గురు వైద్య విద్యార్థుల్లో ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి. సోమవారం వేకువజామున జలపాతం సమీపంలోని తుప్పల మధ్య కె.సౌమ్య (21), బి.అమృత (21) మృతదేహాలను గుర్తించి బయటకు తీశారు. గల్లంతైన మరో విద్యార్థి సీహెచ్ హరదీప్ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.ఏలూరు ఆశ్రం మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ సెకండియర్ విద్యార్థులు 14 మంది ఆదివారం మారేడుమిల్లి వచ్చారు. జలతరంగిణి జలపాతంలో దిగి స్నానాలు చేస్తుండగా జలపాతం ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షానికి ఒక్కసారిగా వాగు ఉప్పొంగింది. ప్రవాహంలో సీహెచ్ హరదీప్, కె.సౌమ్య, బి.అమృత కొట్టుకుపోగా.. గాయత్రీపుష్ప, హరిణిప్రియ అనే విద్యార్థినులు జలపాతానికి 6 కిలోమీటర్ల సమీపంలో చెటుకొమ్మకు చిక్కుకుని ప్రాణాలతో బయటపడిన విషయం తెలిసిందే.లభ్యమైన మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం రంపచోడవరం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రి వద్ద మృతుల బంధువులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు. హరదీప్ ఆచూకీ కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, రెవెన్యూ, అటవీ, పోలీస్ అధికారులు విస్తృతంగా గాలిస్తున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని సీఐ గోపాలకృష్ణ తెలిపారు. -
మారేడుమిల్లిలో వైద్య విద్యార్థుల విహారయాత్ర.. విషాదాంతం
అల్లూరి, సాక్షి: మారేడుమిల్లి విహారయాత్రలో విషాదం చోటుచేసుకుంది. నిన్న గల్లంతైన ముగ్గురు వైద్య విద్యార్థుల్లో ఇద్దరు మృతిచెందగా.. సోమవారం ఉదయం వాళ్ల మృతదేహాల్ని వెలికి తీశారు. మరొకరి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.మారేడుమిల్లి పర్యాటక ప్రాంతానికి ఏలూరులోని ఆశ్రం కళాశాలలో ఎంబీబీఎస్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న 14 మంది వైద్యవిద్యార్థులు ఆదివారం ట్రావెలర్ వాహనంలో వెళ్లారు. మారేడుమిల్లి నుంచి చింతూరు వెళ్లే అంతర్రాష్ట్ర రహదారిలోని ‘జలతరంగిణి’ జలపాతం వద్దకు చేరుకుని అందులో దిగారు. ఈ క్రమంలో ఒక్కసారిగా భారీవర్షం కురిసింది. జలపాతం ఉద్ధృతి పెరగడంతో ఐదుగురు కొట్టుకుపోయారు.హరిణిప్రియ, గాయత్రి పుష్పను ఒడిశా నుంచి విహారయాత్రకు వచ్చిన ఇద్దరు యువకులు కాపాడి, రంపచోడవరం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. హరిణిప్రియ పరిస్థితి విషమంగా ఉండడంతో రాజమహేంద్రవరం తరలించారు. గల్లంతైనవారిలో సౌమ్య, హరదీప్, అమృత, హరిణిప్రియ, గాయత్రి పుష్ప ఉన్నారు. వీరిలో విజయనగరానికి చెందిన గల్లంతైన వారికోసం పోలీసులు, సీబీఈటీ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో సోమవారం ఉదయం సౌమ్య, అమృత మృతదేహాలు లభ్యమయ్యాయి. హరదీప్ కోసం గాలింపు కొనసాగుతోంది.కొసిరెడ్డి సౌమ్య (21) ది పార్వతీపురం జిల్లా బొబ్బిలి స్వస్థలంకాగా, బి.అమృత (21) బాపట్లగా పోలీసులు తెలిపారు. సీహెచ్ హరదీప్(20) ప్రకాశం జిల్లా మార్కాపురంగా తెలుస్తోంది. సౌమ్య, అమృత మృతదేహాలను రంపచోడవరం ఏరియా ఆస్పత్రికి తరలించారు. -
మారేడుమిల్లి జలపాతంలో ముగ్గురు గల్లంతు
మారేడుమిల్లి: విహారయాత్ర కోసం ఏలూరులోని ఆశ్రం వైద్య కళాశాల నుంచి 14 మంది మెడికోలు అల్లూరి జిల్లా మారేడుమిల్లిలోని జల తరంగిణి జలపాతం వద్దకు రాగా.. విషాదం చోటుచేసుకుంది. జలపాతంలో స్నానాలు చేస్తుండగా భారీవర్షం కురిసి ఒక్కసారిగా ప్రవాహం పెరగడంతో ఐదుగురు విద్యార్థులు కొట్టుకుపోయారు. వారిలో ఇద్దరు విద్యార్థినుల్ని 6 కిలోమీటర్ల దూరంలో స్థానికులు రక్షించగా.. ఓ విద్యార్థిని పరిస్థితి విషమంగా ఉంది.మరో ముగ్గురు విద్యార్థులు గల్లంతయ్యారు. ఏలూరులోని ఆశ్రం మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సెకండియర్ చదువుతున్న 14 మంది విద్యార్థులు వ్యాన్‌లో ఆదివారం విహారయాత్రకు మారేడుమిల్లి వచ్చారు. అక్కడి నుంచి జలతరంగిణి జలపాతంలో దిగి స్నానాలు చేస్తుండగా భారీ వర్షం కురిసింది. దీంతో ఒక్కసారిగా జలపాతం పొంగింది. దీనిని గమనించిన 9 మంది విద్యార్థులు వెంటనే బయటకు వచ్చేశారు. జలపాతం మధ్యలో చిక్కుకుపోయి.. జలపాతం మధ్యలో ఉండిపోయిన సీహెచ్.హరిదీప్, కె.సౌమ్య, బి.అమృత, గాయత్రీ పుష్ప, హరిణిప్రియ కొట్టుకుపోయారు. వీరిలో గాయత్రీపుష్ప, హరిణిప్రియ 6 కిలోమీటర్ల దూరంలోని భద్రాచలం ప్రధాన రహదారి కల్వర్టు వద్ద చెట్టుకొమ్మను పట్టుకుని వేలాడుతుండగా స్థానికులు ఒడ్డుకు చేర్చారు. మిగతా ముగ్గురు ఆచూకీ లభ్యం కాలేదు. గల్లంతైన వారిలో మార్కాపురానికి చెందిన సీహెచ్ హరిదీప్, విజయనగరానికి చెందిన కె.సౌమ్య, బి.అమృత ఉన్నట్టు ఎస్ఐ రాము తెలిపారు. -
మెగా 156 షురూ
చిరంజీవి హీరోగా ‘బింబిసార’ ఫేమ్ వశిష్ట దర్శకత్వం వహిస్తున్న ‘మెగా 156’(వర్కింగ్ టైటిల్) సినిమా రెగ్యులర్ షూటింగ్ షురూ అయింది. యువీ క్రియేష¯Œ ్సపై విక్రమ్, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మారేడుమిల్లిలో మొదలైంది. ముందుగా చిరంజీవి పాల్గొనని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట మేకర్స్. అతి త్వరలోనే ఈ సెట్స్‌లో చిరంజీవి పాల్గొంటారని సమాచారం. ఫాంటసీ అడ్వెంచరస్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ‘విశ్వంభర’ టైటిల్ అనుకుంటున్నారనే టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాకు సంగీతం: ఎమ్ఎమ్ కీరవాణి, కెమెరా: ఛోటా కె.నాయుడు. -
అడవి బిడ్డలకు అక్షర యజ్ఞం
సాక్షి, అమరావతి: పచ్చని తివాచీ కప్పుకున్నట్టు ఉండే ఎత్తయిన కొండలు.. దట్టమైన చెట్లు.. నడుమ పచ్చిక మైదానంలో కళ్లు చెదిరేలా రంగురంగుల భవంతులు. వాటిలోనే గిరిజన విద్యా కుసుమాలు వికసిస్తున్నాయి. అదే ఏజెన్సీ ప్రాంతంలోని మారేడుమిల్లి గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయం. అత్యంత బలహీన తెగల(పీవీటీజీ)కు చెందిన గిరిజన బాలల కోసం ఉద్దేశించిన ఈ గురుకులం మూడు నుంచి పదవ తరగతి వరకు ఇంగ్లిష్ మీడియం చదువులతో కార్పొరేట్ విద్యాలయాలను తలదన్నుతోంది. దీనిలో ఆధునిక హంగులతో కూడిన క్లాస్ రూమ్ నుంచి భోజనశాల, బాత్రూమ్, ఆర్వో ప్లాంట్, వసతి వరకు ప్రభుత్వం సకల సౌకర్యాలు కల్పించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక శ్రద్ధతో చేపట్టిన నాడు–నేడు ద్వారా 2020లో ప్రభుత్వం సకల సౌకర్యాలు సమకూర్చింది. రాష్ట్రంలో గిరిజన విద్యపై సర్కారు ప్రత్యేక ఫోకస్ పెట్టిందనేందుకు ఇదే గొప్ప నిదర్శనం. ఇదే కాదు.. రాష్ట్రంలోని అడవి బిడ్డల కోసం ప్రభుత్వం పెద్దఎత్తున అక్షర యజ్ఞాన్ని విజయవంతంగా నిర్వహిస్తోంది. ఇందుకోసం రూ.వందల కోట్లు ఖర్చు చేస్తోంది. బుట్టాయగూడెం ఈఆర్ఎం స్కూలులోని తరగతి గదులు 2,506 గిరిజన సంక్షేమ విద్యాసంస్థలు రాష్ట్రంలో మొత్తం 2,506 గిరిజన సంక్షేమ విద్యాసంస్థలు పనిచేస్తున్నాయి. అందులో 1,958 గిరిజన పాఠశాలలు, 371 ఆశ్రమ పాఠశాలలు, 18 ప్రీ మెట్రిక్ హాస్టళ్లు, 159 పోస్ట్ మెట్రిక్ హాస్టళ్లు ఉన్నాయి. వాటిలో 1,55,599 మంది విద్యార్థులు చదువుతున్నారు. వాటి పరిధిలోని హాస్టళ్లలో ఉంటున్న విద్యార్థులకు ఆహారం, సౌందర్య సాధనాలు, ఇతర సౌకర్యాలతో పాటు ఉచిత వసతి తదితర వాటికి ఈ ఏడాది(2023–24) ప్రభుత్వం రూ.920.31 కోట్లు కేటాయించింది. నూరు శాతం గిరిజన జనాభా ఉన్న షెడ్యూల్డ్ ప్రాంతాల్లోని విద్యాలయాల్లో మొత్తం సీట్లు అన్నీ వారికే కేటాయిస్తోంది. 70 శాతం లోపు గిరిజన జనాభా కలిగిన నాన్ షెడ్యూల్డ్ ప్రాంతాల్లోని విద్యాసంస్థల్లో ఎస్టీలకు 70 శాతం, ఎస్సీ, బీసీ, ఇతరులకు పది శాతం చొప్పున సీట్లు కేటాయిస్తున్నారు. భోజనాలు చేస్తున్న గిరిజన విద్యార్థులు ఎన్నో పథకాల ద్వారా జగనన్న విద్యా కానుక పథకం ద్వారా 1నుంచి 10వ తరగతి వరకు చదివే గిరిజన విద్యార్థులకు సైతం ప్రభుత్వం కిట్లు అందిస్తోంది. మూడు జతల యూనిఫామ్ క్లాత్, టెక్ట్స్‌బుక్స్, నోట్ బుక్స్ సెట్, ఒక జత షూ, రెండు జతల సాక్స్, స్కూల్ బ్యాగ్, బెల్ట్, మూడు మాస్‌్కలు అందిస్తున్నారు. గత విద్యా సంవత్సరం(2022–23)లో ఈ కార్యక్రమం ద్వారా మొత్తం 1,25,901 మంది గిరిజన విద్యార్థులు ప్రయోజనం పొందారు. స్వచ్ఛ కార్యక్రమం కింద కౌమార బాలికలకు రుతుస్రావ సమయంలో అత్యంత భద్రత, పరిశుభ్రతను నిర్థారించడానికి నాణ్యమైన(బ్రాండెడ్) శానిటరీ న్యాప్కిన్లు నెలకు 10 చొప్పున 17,060 మంది బాలికలకు అందజేస్తున్నారు. మరోవైపు గిరిజన పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించి పిల్లలకు నిజమైన అభ్యాస కేంద్రాలుగా తీర్చిదిద్దుతోంది. నాడు–నేడు మొదటి దశలో ప్రభుత్వం రూ.140 కోట్లుతో 352 పాఠశాలల్లో సమగ్ర మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసింది. మారేడుమిల్లి గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయంలోని మరుగుదొడ్లు ఉన్నత విద్యాలయాలకు శ్రీకారం రూ.153.853 కోట్లతో కురుపాంలో ఇంజనీరింగ్ కళాశాలకు 2020 అక్టోబర్ 2న సీఎం వైఎస్ జగన్ శంకుస్థాపన చేశారు. అకడమిక్ బ్లాక్, హాస్టల్ బ్లాకుల నిర్మాణ పనులు పురోగతిలో ఉన్నాయి. విజయనగరం జిల్లా సాలూరు నియోజకవర్గంలో సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీకి ప్రభుత్వం 561.88 ఎకరాలు కేటాయించింది. కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్, సీఎం వైఎస్ జగన్ శంకుస్థాపన చేశారు. ప్రస్తుతం ఈ విశ్వవిద్యాలయం కొండకరకంలో ఏయూ పాత క్యాంపస్‌లో కొనసాగుతోంది. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో రూ.500 కోట్లతో గిరిజన వైద్య కళాశాల మంజూరైంది. వంద వైద్య విద్యా సీట్లు కేటాయించిన ఈ కళాశాల గిరిజనుల ఆరోగ్య సమస్యల పరిష్కారానికి వైద్య సేవలు అందించడంతోపాటు వైద్య పరిశోధనలకు, వైద్య వృత్తిని స్వీకరించేలా గిరిజన యువతను ప్రోత్సహించేందుకు దోహదం చేస్తుంది. ఐఐటీ, ఎన్ఐటీ ప్రవేశాల్లో గిరిజన బిడ్డల సత్తా గురుకులాల్లో చదివే గిరిజన బిడ్డలు ఐఐటీ, ఎన్ఐటీ, మెడిసిన్ సీట్లు సాధించేలా ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం వారికి ప్రత్యేక శిక్షణ ఇస్తోంది. గిరిజన పాఠశాలల రూపురేఖలు మారాయి గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్యావకాశాలను అందించేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ప్రధానంగా నాడు–నేడు ద్వారా ప్రభుత్వం చేపడుతున్న పనులతో గిరిజన విద్యాలయాల రూపురేఖలు మారిపోతున్నాయి. గతంలో అరకొర వసతులు, ఎప్పుడు పడిపోతాయో తెలియనట్టు ఉండే భవనాల్లో చదువుకోవాలంటేనే గిరిజన పిల్లలకు ఆసక్తి ఉండేదికాదు. ఇప్పుడు కార్పొరేట్ విద్యా సంస్థలను తలదన్నే సౌకర్యాలను గిరిజన విద్యాలయాల్లో చూస్తే గిరిజనుల్లో ఆశ్చర్యంతో కూడిన ఆనందం కలుగుతుంది. – కంగాల వెంకటేశ్వరరావు, ఇన్చార్జి ప్రధానోపాధ్యాయుడు, ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల, నూతిరామన్నపాలెం విద్యతోనే గిరిజనులకు గొప్ప పురోగతి విద్యతోనే పురోగతి అని నమ్మడమే కాకుండా అందుకు అనుగుణంగా గొప్ప సంస్కరణలు చేపట్టిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో గిరిజనులకు కూడా విద్యావకాశాలు మెరుగుపరిచారు. గతంలో ఏజెన్సీ ప్రాంతంలో బడులను చూస్తేనే భయం వేసేది. ఇప్పుడు అన్ని సౌకర్యాలతో గిరిజన బిడ్డలకు విద్యను అందించేలా ప్రభుత్వం నిధులకు కూడా వెనుకాడక ఖర్చు చేస్తోంది. గిరిజన విద్యార్థులకు అవసరమైన విద్యతోపాటు వసతి, ఆహారం, సౌందర్య సాధనాలు(కాస్మోటిక్స్) తదితర అనేక సౌకర్యాలను ప్రభుత్వం కల్పిస్తోంది. – పీడిక రాజన్నదొర, ఉప ముఖ్యమంత్రి మాకు ఇంగ్లిష్ చదువులు అందించారు మా గిరిజన పిల్లలకు మామూలు చదువులు అందడమే కష్టంగా ఉండేది. బడుల్లో సౌకర్యాలు లేక, దూరభారమైన ప్రైవేటు కాన్వెంట్లకు వెళ్లి చదువులు కొనలేక మాలాంటి ఎంతో మంది గిరిజన పిల్లలు చదువుకు దూరమయ్యేవారు. ఇప్పుడు సీఎం వైఎస్ జగన్ మావయ్య..మారుమూల గిరిజన ప్రాంతాల్లో ప్రభుత్వ బడులు, గురుకులాల్లో ఇంగ్లిష్ చదువులు అందించారు. మేము బాగా చదువుకోవాలని అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు. –ఇన్నా కరుణ జెస్సీ ప్రియ,5వ తరగతి(ఇంగ్లిష్ మీడియం), మారేడుమిల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల -
మైమరపించే మారేడుమిల్లి అందాలు...
అల్లూరి సీతారామరాజు (మారేడుమిల్లి): నిన్న మొన్నటి వరకు వాడిపోయిన చెట్లకు ఇటీవల కురిసిన వర్షాలు కొత్త ఊపిరులూదాయి. ఏజెన్సీలో ఎటుచూసినా ఆకుపచ్చని తివాచీ పరిచినట్లు ప్రకృతి కనువిందు చేస్తోంది. దట్టమైన అడవులు, ఎత్తైన కొండలు, ఒంపులు తిరిగే రహదారులు, జలజలపారే సెలయేర్లు, ఉరికే జలపాతాలు, వాగులు, వంకలతో సుందర దృశ్యాలు కనువిందు చేస్తున్నాయి. ఈ ప్రకృతి అందాలను తిలకించడానికి పర్యాటకులు మారేడుమిల్లికి తరలివస్తున్నారు. ఇక్కడి నుంచి చింతూరు వెళ్లే ఘాట్‌రోడ్డు ఎంతో ఆహ్లాదకరంగా ఉంది.రోడ్డుకు ఇరువైపులా పచ్చదనంతో కూడిన దట్టమైన ఆడవులు, పక్షుల రాగాలు, ఒంపుసొంపుల మార్గంలో సాగే ప్రయాణం, చల్లని వాతావారణంలో తొలకరి చినుకుల మధ్య ఘాట్‌లో ప్రయాణం వాహనచోదకులకు మధురానుభూతిని కలిగిస్తోంది. ఘాట్‌లోని మన్యం వ్యూపాయింట్ నుంచి అందమైన ప్రకృతిని చూసే వారికి రెండు కళ్లూ సరిపోవడం లేదు. మండలంలో పేరొందిన పర్యాటక ప్రాంతం గుడిస హిల్ టాప్. ఈ ప్రదేశం చాలా ఎత్తులో ఉంటుంది. పై భాగం చదునుగా ఉండి.. చుట్టూ గడ్డి మాత్రమే ఉంటుంది. ఇక్కడ చేతికి అందే ఎత్తులో మేఘాలు వెళుతుంటాయి. ఈ ప్రదేశానికి చేరుకోవడానికి మెలికలు తిరిగిన ఘాట్ రోడ్డులో ప్రయాణించాలి. ఈ ప్రదేశం పచ్చదనంతో ఎంతో సుందరంగా ఉంది. అయితే ప్రస్తుతం గుడిస సందర్శనకు అనుమతి లేదు. -
మారేడుమిల్లి అడవుల్లో రామారావు..ఆన్ యాక్షన్
అడవిలో ఫైట్స్ చేస్తున్నారు రామారావు. మరి.. రామారావు పోరాటం ఎందుకు అనేది తెలియాలంటే కొంత కాలం వేచి ఉండక తప్పదు. రవితేజ హీరోగా శరత్ మండవ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘రామారావు: ఆన్ డ్యూటీ’. ఈ చిత్రంలో దివ్యాంకా కౌశిక్, రజిషా విజయన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ మారేడుమిల్లి అటవీ పాంత్రాల్లో జరుగుతోంది. థ్రిల్లింగ్ యాక్షన్ సీక్వెన్సెస్‌ను తెరకెక్కిస్తున్నారు. ఈ షెడ్యూల్ పూర్తయిన తర్వాత పాటల చిత్రీకరణ కోసం చిత్రబృందం విదేశాలకు వెళుతుంది. వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాలో వేణు తొట్టెంపూడి, నాజర్, నరేశ్, పవిత్రా లోకేష్, సురేఖా వాణి కీలక పాత్రధారులు. ఈ సినిమాకు సంగీతం: సామ్ సీఎస్. -
ఆచార్య షూటింగ్: వీడియో తీసిన ఫ్యాన్స్!
సాక్షి, తూర్పుగోదావరి: మగధీర, బ్రూస్లీ, ఖైదీ నంబర్ 150 చిత్రాల్లో చిన్న చిన్న సీన్లలో లేదా, పాటల్లోనో స్క్రీన్ మీద కనిపించారు చిరంజీవి, రామ్‌చరణ్. కానీ తొలిసారిగా ఈ తండ్రీకొడుకులు పూర్తి స్థాయిలో కలిసి నటిస్తున్నారు. చిరంజీవి ప్రధాన హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం "ఆచార్య". ప్రస్తుతం ఆచార్య యూనిట్ రాజమండ్రిలో మకాం వేసిన సంగతి తెలిసిందే. మారేడుమిల్లి అడవుల్లో జరుగుతున్న షెడ్యూల్లో చరణ్‌పై ఓ యాక్షన్ సన్నివేశాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ షెడ్యూల్లో మెగాస్టార్ సైతం పాల్గొన్నారు. షూటింగ్ స్పాట్‌కు చేరుకున్న అభిమానులు వారిని ఫొటోలు, వీడియోలు తీసి నెట్టింట పోస్ట్ చేశారు. దీంతో అవి కాస్తా వైరల్‌గా మారాయి. ఇద్దరు స్టార్లను ఒకే ఫ్రేములో చూసిన అభిమానులు సమ్మర్లో సందడి మామూలుగా ఉండదంటున్నారు. ఇక్కడ షూటింగ్ పూర్తైన వెంటనే మార్చి 7 నుంచి 15వ తేదీ వరకు ఖమ్మం జిల్లాలోని ఇల్లందులో మరో షెడ్యూల్ ప్లాన్ చేసింది ఆచార్య యూనిట్. ఈ మేరకు ఇల్లందులోని జేకే మైన్స్‌లో షూటింగ్‌కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో నిరంజన్ రెడ్డి, రామ్‌చరణ్ నిర్మిస్తున్నారు. కాజల్ కథానాయిక. ఈ సినిమాలో సిద్ధ అనే పాత్రలో నటిస్తున్నారు చరణ్. అతడికి జోడీగా పూజా హెగ్డే నటిస్తోంది. ఆచార్యలో సీన్స్ మాత్రమే కాకుండా లెట్స్ డు కుమ్ముడు అంటూ ఈ తండ్రీకొడుకులు స్టెప్స్ వేస్తారని టాక్. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం మే 13న రిలీజ్ కానుంది. ఇటీవలే విడుదలైన ఈ సినిమా టీజర్‌కు విశేషమైన స్పందన లభించిన సంగతి తెలిసిందే. పైగా ఈ టీజర్‌కు రామ్‌చరణ్ వాయిస్ ఓవర్ ఇవ్వడం మరింత ఆకర్షణగా మారింది. చదవండి: ఆచార్య: తెరుచుకున్న ధర్మస్థలి తలుపులు ఆచార్య@ మారేడుపల్లి.. చిరు గ్రాండ్ ఎంట్రీ -
కూలీ టు స్మగ్లర్
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘పుష్ప’. ఈ సినిమాలో బన్నీ (అల్లు అర్జున్) పాత్ర పేరు ‘పుష్పరాజ్’. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది. బన్నీది స్మగ్లర్ పాత్ర అని కూడా అందరికీ తెలుసు. అయితే స్టోరీ లైన్ ఏంటంటే... మొదట కూలీగా పని చేసే వ్యక్తి తర్వాత కాలంలో స్మగ్లర్‌గా ఎలా మారాడు? అనేది ప్రధానాంశమని తెలిసింది. కూలీ నుంచి స్మగ్లర్‌గా మారే క్రమాన్ని ఎంతో గ్రిప్పింగ్‌గా చూపించడంతో పాటు స్మగ్లర్ల జీవన విధానాన్ని, ఎర్రచందనం దొంగలు స్మగ్లింగ్‌ను ఎన్ని మార్గాల ద్వారా చేస్తారనేది కూడా చాలా ఆసక్తికరంగా చిత్రీకరిస్తున్నారట. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ మారేడుమిల్లిలో జరుగుతోంది. నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. రష్మికా మందన్నా కథానాయికగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి దేవీశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూరుస్తున్నారు. -
ఫారెస్ట్‌కి పుష్ప
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న తాజా చిత్రం ‘పుష్ప’. నవీన్ ఎర్నేని, రవి శంకర్. వై నిర్మిస్తున్న ఈ చిత్రంలో రష్మికా మందన్నా కథానాయికగా నటిస్తున్నారు. కోవిడ్ లాక్డౌన్ కారణంగా ఈ సినిమా షూటింగ్‌కి బ్రేక్ పడింది. నేటి నుంచి ఈ సినిమా చిత్రీకరణ తూర్పుగోదావరి జిల్లా మన్య ప్రాంతంలోని మారేడుమిల్లి డీప్ ఫారెస్ట్‌లో మొదలుకానుంది. ఈ షెడ్యూల్లో పాల్గొనడానికి అల్లు అర్జున్, సుకుమార్‌తో పాటు ఇప్పటికే చిత్రబృందం మారేడుమిల్లికి చేరుకున్నారు. ‘‘ప్యాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న చిత్రమిది. ‘అల వైకుంఠపురములో’ హిట్ తర్వాత అల్లు అర్జున్, ‘రంగస్థలం’ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత సుకుమార్ కలయికలో రూపొందనున్న సినిమా కావడంతో ఈ ప్రాజెక్ట్‌పై అటు ఫ్యాన్స్‌తో పాటు ఇతర ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు’’ అని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. ఈ చిత్రానికి సహ నిర్మాత: ముత్తంశెట్టి మీడియా, కెమెరా: మిరోస్లోవ్ కుబ బ్రోజెక్, సీఈఓ: చెర్రీ, లైన్ ప్రొడ్యూసర్: బాల సుబ్రమణ్యం కె.వి.వి. -
మారేడుమిల్లి అడవుల్లో...
‘ఆర్య, ఆర్య 2’ చిత్రాల తర్వాత అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘పుష్ప’. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. రష్మికా మందన్నా కథానాయిక. ఎర్రచందనం బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా చిత్రీకరణ సాగనుందని తెలిసిందే. ఈ సినిమా చిత్రీకరణను శేషాచలం అడవుల్లో, కేరళ అడవుల్లో జరుపుతారని ఆ మధ్య ప్రచారం జరిగింది. అయితే ‘పుష్ప’ టీమ్ రాజమండ్రి సమీపంలోని మారేడుమిల్లి అడవుల్లో షూట్‌కి రెడీ అయ్యారని టాక్. నెల రోజుల ఏకధాటి షెడ్యూల్‌ను ప్లాన్ చేశారట. నవంబర్ మొదటివారంలో ఈ షెడ్యూల్ ఆరంభం కానుందని తెలిసింది. ఈ సినిమాలో అల్లు అర్జున్, రష్మిక చిత్తూరు యాసలో డైలాగ్స్ చెబుతారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. -
రియల్ ఎస్టేట్ వ్యాపారిని హతమార్చిన భార్య
రాజమండ్రి : కుటుంబ వివాదాల నేపథ్యంలో రాజమహేంద్రవరం రూరల్ మండలం హుకుంపేట గ్రామంలో సోమవారం అర్థరాత్రి దారుణ హత్య జరిగింది. నాలుగేళ్లుగా కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటున్న రియల్ఎసేట్ట్ వ్యాపారిని అతని భార్య, బావ మరిది, ఇద్దరు కుమారులు కలిసి కత్తులతో పొడిచి హత్య చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. పశ్చిమగోదావరి జిల్లా పెంటపాడు మండలం తాళ్ల ముదునూరుపాడు గ్రామానికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి వెలగల పట్టాభి రామారెడ్డి (54) ప్రస్తుతం హుకుంపేట గ్రామంలోని బాలాజీటవర్స్లో మారేడుమిల్లి ప్రాంతానికి చెందిన గిరిజన యువతితో కలిసి అద్దెకు ఉంటున్నాడు. సోమవారం అర్థరాత్రి 12.15 గంటల సమయంలో రామారెడ్డి భార్య సూర్యావాణి, బావ మరిది సత్తిశివకృష్ణా రెడ్డి, కుమారులు యోగాదుర్గాతేజ్ రెడ్డి, డోలాశంకర్తేజ్ రెడ్డి బాలాజీటవర్స్కు చేరుకున్నారు. అక్కడున్న వాచ్మెన్ సాయంతో అతడుండే రెండో ఫ్లోర్లో ఫ్లాట్‌కు వెళ్లి బలవంతంగా తలుపులు పగులగొట్టి రామారెడ్డిపై దాడికి దిగారు. కత్తితో పొట్టపైన, మెడపైన విచక్షణా రహితంగా పొడవడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. ఆ సమయంలో వేరే గదిలో ఉన్న గిరిజన యువతితోపాటు, మరో మహిళ కూడా భయపడి బాత్రూంలోకి వెళ్లి తలుపులు వేసేసుకున్నారు. నాలుగేళ్లుగా కుటుంబానికి దూరంగా రామారెడ్డి నాలుగేళ్ల క్రితం వెలగల పట్టాభిరామారెడ్డికి, భార్య సూర్యావాణికి మధ్య వివాదాలు మొదలయ్యాయి. ఇంటిలో రూ.15 లక్షల నగదు, పెద్దమొత్తంలో బంగారం చోరీకి గురయ్యాయి. ఆ చోరీ భార్య, బావమరుదులు చేశారని రామారెడ్డి నిర్ధారణకు వచ్చారు. అయితే ఈ విషయం తెలుసుకున్న భార్య, బావమరుదులు ఆయనను అంతమొందించేందుకు అన్నంలో విషప్రయోగం చేశారు. అప్పటి నుంచి రామారెడ్డి ఇంటికి వెళ్లకుండా దూరంగా ఉంటున్నారు. దీంతో సూర్యావాణి రామారెడ్డిపై 498ఏ కేసు పెట్టింది. రామారెడ్డి ఆమెతో విడిపోవడానికి కోర్టులో విడాకుల కేసు వేశాడు. అప్పటి నుంచి రామారెడ్డి కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటున్నాడు. తొమ్మిది నెలల క్రితమే హుకుంపేటకు.. కొంతకాలం మారేడుమిల్లిలో ఉన్న రామారెడ్డి, తొమ్మిదినెలల క్రితమే హుకుంపేటలోని బాలాజీ టవర్స్‌లోని ఫ్లాట్‌లోకి అద్దెకు వచ్చారు. అపార్టుమెంటువాసులకు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటానని చెప్పినట్టు సమాచారం. మారేడుమిల్లికి చెందిన గిరిజన యువతి చదల దుర్గాదేవి తన మేనకోడలు అని చదివిస్తున్నానని, రాజమహేంద్రవరానకి చెందిన యేరుకొండ శ్రీవిద్య, ఏడాది పాపతో తనతో పాటు తనకు సలహాలు సూచనలు ఇస్తూ ఉంటుందని తెలిపినట్టు స్థానికులు చెబుతున్నారు. రెక్కీ నిర్వహించి మరీ.. వెలగల పట్టాభి రామారెడ్డిపై అతడి భార్య సూర్యవాణి, బావమరిది సత్తి శివకృష్ణారెడ్డి, కుమారులు నాలుగేళ్లుగా రెక్కీ నిర్వహిస్తూ వస్తున్నారు. మారేడుమిల్లిలో ఒకసారి అతడిపై హత్యాయత్నం చేసినట్టు తెలుస్తోంది. సోమవారం ఉదయమే ఇద్దరు కుమారులు బాలాజీ టవర్స్‌కు వచ్చి తండ్రి రామారెడ్డిని కలిసి వెళ్లినట్టు సమాచారం. అర్ధరాత్రి వచ్చి హత్యకు పాల్పడినట్లు పక్కా ప్రణాళిక ప్రకారమే చేసినట్టు అర్థమవుతోంది. మరోవైపు రామారెడ్డిపై తాడేపల్లిగూడెం పరిధిలో 11 కేసులు నమోదయ్యాయి. అధికారులను ఏసీబీకి పట్టించడంలో దిట్ట. అధికారులను బ్లాక్మెయిల్ చేసేవాడు. హత్య కేసుల్లోనూ నిందితుడిగా ఉన్నాడు. సంఘటన స్థలాన్ని బొమ్మూరు పోలీసులు పరిశీలించి, క్లూస్‌టీం ద్వారా వేలిముద్రలు సేకరించారు. లా అండ్ ఆర్డర్ ఏఎస్పీ లతామాధురి, తూర్పు మండల డీఎస్పీ, సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. -
గిరిజన మహిళ ఆత్మహత్య
మారేడుమిల్లి (రంపచోడవరం) : మండలంలోని వేటుకూరు పంచాయతీ పరిధిలోని పందిరి మామిడికోట గ్రామంలో గిరిజన మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామస్తుల కథనం ప్రకారం ఈ గ్రామానికి చెందిన రేవుల నాగమణి (39)కి సోమేశ్వరరెడ్డితో 20 ఏళ్ల క్రితం వివాహమైంది. ఈ దంపతులకు నలుగురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. సోమేశ్వరరెడ్డి గురువారం విపరీతంగా మద్యం సేవించి ఇంటికి వచ్చి నాగమణితో గొడవ పడ్డాడు. దీంతో విరక్తి చెందిన నాగమణి ఇంటి నుంచి పారిపోయి మర్నాడు శుక్రవారం బొడ్లంక గ్రామంలో చదువుకుంటున్న తన కొడుకుని చూసి తిరిగి పందిరిమామిడికోట వచ్చింది. ఆమె గ్రామం సమీపంలోని తోటలోకి వెళ్లి మామిడి చెట్టుకు ఉరి వేసుకుంది. ఆమె కోసం భర్త వెతికినా ఫలితం లేకపోయింది. ఆమె చనిపోయి నాలుగు రోజులు కావడంతో మృతదేహం నుంచి విపరీతమైన దుర్గంధం పరిసర ప్రాంతాలకు రావడంతో ఆమె ఆత్మహత్య విషయం గ్రామస్తులకు మంగళవారం తెలిసింది. వారు ఇచ్చిన సమాచారం మేరకు మారేడుమిల్లి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్డం కోసం రంపచోడవరం తరలించారు. దీనిపై ఇ¯ŒSఛార్జి సీఐ గీతా రామకృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భార్యకు నిప్పు పెట్టిన భర్త రాజమహేంద్రవరం క్రైం (రాజమహేంద్రవరం సిటీæ) : భార్యపై అనుమానంతో కిరోసి¯ŒS పోసి భర్త నిప్పు పెట్టాడు. వ¯ŒS టౌ¯ŒS పోలీసుల కథనం ప్రకారం జట్టు కార్మికుడిగా పనిచేసే రాజమహేంద్రవరం కొత్తపేట ప్రాంతంలోని గుభేల్‌పేటకు చెందిన రొక్కం ప్రకాష్‌రావు వృద్ధాప్యం వల్ల హోటల్లో పని చేస్తున్నాడు. భార్య కళావతిపై అనుమానంతో అతడు కొంతకాలంగా గొడవ పడుతున్నాడు. మంగళవారం రాత్రి మద్యం సేవించి ఇంటికి వచ్చిన అతడు భార్యతో ఘర్షణకు దిగాడు. ఆగ్రహంతో ఇంట్లో ఉన్న కిరోసి¯ŒS భార్యపై పోసి నిప్పు అంటించాడు. ఒంటిపై మంటలు ఎగిసిపడుతుండగా ఆమె కేకలు వేస్తూ రోడ్డుపై పరుగులు తీసింది. ఆమెను కుటుంబ సభ్యులు స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. స్థానికుల సమాచారంతో పోలీసులకు సంఘటనా స్థలానికి చేరుకుని నిందితుడు ప్రకాష్‌రావును అరెస్టు చేశారు. -
మారేడుమిల్లిలో ఎకో టూరిజం రిసార్ట్స్
కాకినాడ సిటీ : మారేడుమిల్లిలో పర్యాటక ప్రాంత అభివృద్ధిలో భాగంగా ఎకో టూరిజం రిసార్ట్స్ నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నట్టు కలెక్టర్ అరుణ్‌కుమార్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం రాత్రి కార్యాలయంలో జిల్లా పర్యాటక అభివృద్ధి మండలి సమావేశంలో ప్రాజెక్టు నిర్మాణానికి విధి విధానాలు ఖరారు చేశారు. మారేడుమిల్లి– చింతూరు రహదారిలో ఉన్న హెచ్ఎ¯ŒSటీసీ ఆవరణలో సుమారు 60 కాటేజీలు నిర్మించేవిధంగా ఎకో టూరిజం రిసార్ట్స్ చేపట్టాలని, దీని నిర్మాణం కోసం రూ.8 కోట్ల వ్యయంతో కాటేజీలు, పుడ్‌కోర్టులు నిర్మించాలన్నారు. ఈ సమావేశంలో పర్యాటక శాఖ రీజనల్ డైరెక్టర్ భీమశంకరరావు, పంచాయతీ రాజ్ ఎస్ఈ వెంకటేశ్వరరావు, విజిలె¯Œ్స అండ్ క్వాలిటీ కంట్రోల్ అధికారి ఎ¯ŒS.ప్రసాద్ బాబు, తదితరులు పాల్గొన్నారు. -
378 కిలోల గంజాయి స్వాధీనం
మారేడుమిల్లి: తూర్పు గోదావరి జిల్లా మారేడుమిల్లి ఏజెన్సీ లోతట్టు గ్రామం నుంచి ఆక్రమంగా తరలిస్తున్న గంజాయిని గుర్తేడు పోలీసులు పట్టుకున్నారు, వీటితోపాటు ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసి, ఓ బైకు, వ్యా¯ŒSను స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలను స్థానిక పోలీస్ స్టేష¯ŒSలో బుధవారం జరిగిన విలేకర్ల సమావేశంలో మారేడుమిల్లి ఇ¯ŒSచార్జి సీఐ గీతా రామకృష్ణ, తెలిపారు. మారేడుమిల్లి మండలం బోడ్లంక గ్రామానికి చేందిన పల్లాల వెంకటరెడ్డి వ్యా¯ŒS డ్రైవర్), విశాఖ జిల్లా దారకొండ పంచాయతీ గొందిపాలెం గ్రామానికి చేందిన కీలో సుందర్ రాయి, కీలో రంజిత్ కుమార్ అనే ముగ్గురు వ్యక్తులు దారకొండ గ్రామం నుంచి గంజాయిని బోడ్లంక గ్రామం మీదుగా వ్యా¯ŒSలో తరలిస్తుండగా ఏఎస్పీకి అందిన ముందస్తు సమచారం మేరకు గుర్తేడు ఎస్సై నాగేశ్వరరావు తన సిబ్బందితో వాహనాలు తనిఖీలు చేస్తుండగా వేటుకూరు జంక్ష¯ŒS వద్ధ పట్టుకున్నారు. వీరినుంచి 15 బస్తాలో ఉన్న 378 కిలోల గంజాయిని పట్టుకున్నారు. సరుకును తరలిస్తున్న ఓ వ్యా¯ŒSను, బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. మరో నింధితుడైన వ్యా¯ŒS ఓనర్ బలరాం పరారీలో ఉన్నాడు. గంజాయి విలువ సుమారు రూ.19 లక్షలుంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది బాలజీ పాల్గొన్నారు. -
కనికరం రాదాయె!
మారేడుమిల్లి : ఈ ముసిముసి నవ్వుల వెనుక విషాదమెంతో దాగి ఉంది. అందరి పిల్లల్లా తనకూ ఆడుకోవాలని ఉంటుంది. కానీ కాలు కదపలేదు. ఒకరు ఎత్తుకుని వెళితే కానీ.. మరోచోటికి వెళ్లలేదు. ఇంతటి దయనీయ పరిస్థితుల్లో బతుకీడుస్తున్న ఆ బాలికపై అధికారులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ కనికరం చూపడం లేదు. వివరాల్లోకి వెళితే.. స్థానిక సంత మార్కెట్‌కు చెందిన ఉడుగుల నాగరాజు, తంబయమ్మ కూలీ పనులు చేస్తుంటారు. కూలీ పనులకు వెళితే కానీ ఇల్లు గడవని పరిస్థితి వారిది. వారి కుమార్తె భవానికి పుట్టుకతోనే కాళ్లు చచ్చుపడిపోయాయి. వికలాంగురాలిగా మార డంతో కనీసం నిలబడలేని దుస్థితి ఆమెది. రెండేళ్ల వయసులో ఆ పాపను వైద్యులకు చూపించగా, ఆమెకు శస్త్రచికిత్స చేయాలని, రూ.పది లక్షల వరకు ఖర్చవుతుందని చెప్పారు. అంత ఆర్థికస్తోమత లేకపోవడంతో బాలికకు శస్త్రచికిత్స చేయించేందుకు ఆమె తల్లిదండ్రులు సాహసించ లేకపోయారు. చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు, తాతయ్య ఆ బాలిక ఆలానాపాలనా చూస్తున్నారు. ప్రస్తుతం తొమ్మిదేళ్ల భవాని.. మారేడుమిల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఐదో తరగతి చదువుతోంది. నిత్యం ఆమెను ఎవరో ఒకరు స్కూల్‌కు ఎత్తుకుని తీసుకువెళ్లి, తీసుకు వస్తుంటారు. నేలపై ఎక్కడ కూర్చోపెడితే అక్కడే ఉంటుంది. అటూఇటూ కదల్లేని పరిస్థితి. ఆమెకు పింఛను మంజూరు చేయాలని తల్లిదండ్రులు రెండేళ్ల క్రితం అధికారులకు దరఖాస్తు చేశారు. సదరం సర్టిఫికెట్ కూడా తీసుకున్నారు. అన్నీ ఉన్నా ఆమెకు ఇప్పటివరకు అధికారులు పింఛను మంజూరు చేయలేదు. ఆమెను వెంటబెట్టుకుని కలెక్టర్ కార్యాలయానికి వెళ్లినా ప్రయోజనం లేకపోయింది. బాలికకు పింఛను మంజూరు చేయాలని ఆమె తల్లిదండ్రులు అధికారులను వేడుకుంటున్నారు. -
జీపు అదుపుతప్పి ఇంజనీర్ మృతి
మారేడుమిల్లి : మారేడుమిల్లి ఘాట్ రోడ్డులో సోమవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో సివిల్ ఇంజనీర్ మరణించగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. మారేడుమిల్లి నుంచి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న టైగర్ క్యాంపు వద్ద ఈ సంఘటన చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. పశ్చిమగోదావరి జిల్లా అత్తిలి మండలం మంచిలి గ్రామానికి చెందిన అల్లం వరప్రసాద్ (38) ప్రైవేట్ సివిల్ ఇంజనీరుగా పని చేస్తున్నాడు. విశాఖ జిల్లాలోని సీలేరుకు చెందిన సివిల్ వర్కులను ఆయన పర్యవేక్షిస్తున్నారు. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. సీలేరులో జరుగుతున్న పనులను చూసేందుకు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి చెందిన తాపీ మేస్త్రీ చిన్ని, డ్రైవర్ దాకమర్రి శ్రీనివాసరావుతో కలిసి సోమవారం రాత్రి జీపులో అక్కడికి బయలుదేరారు. మారేడుమిల్లి ఘాట్ రోడ్డులో ప్రయాణిస్తుండగా.. టైగర్ క్యాంపు మలుపులో జీపు అదుపుతప్పి ఘాట్‌లో బోల్తా పడింది. అక్కడి నుంచి కింద రోడ్డు వరకూ దొర్లుకుంటూ వెళ్లింది. వాహనం ధ్వంసమై అందులో ఉన్న వరప్రసాద్ అక్కడికక్కడే మరణించాడు. మేస్త్రీ చిన్నికి చేయి విరగ్గా, డ్రైవర్ శ్రీనివాసరావు స్వల్ప గాయాలతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. సమాచారం అందుకున్న మారేడుమిల్లి పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం రంపచోడవరం ఆస్పత్రికి తరలించారు. గాయపడిన చిన్నిని చికిత్స కోసం రాజమండ్రి ప్రభుత్వాస్పత్రికి పంపించారు. ఎస్సై వి.కోటేశ్వరరావు దర్యాప్తు చేస్తున్నారు. రోడ్డుకు ఇరువైపులా రక్షణ గోడలు లేకపోవడం వల్లే ఈ సంఘటన జరిగిందని డ్రైవర్ శ్రీనివాసరావు చెప్పాడు. కనీసం మలుపుల వద్ద హెచ్చరిక బోర్డు కూడా ఏర్పాటు చేయలేదని తెలిపాడు. -
కల్లు చెట్ల కోసం ఘర్షణ: ఐదుగురి మృతి
-
కల్లు చెట్ల కోసం ఘర్షణ: ఐదుగురి మృతి
తూర్పుగోదావరి జిల్లా ఏజెన్సీ ప్రాంతమైన మారేడుమిల్లి మండలంలో విషాదం చోటుచేసుకుంది. అక్కడి ఇజ్జలూరు గ్రామంలో కల్లు గీసుకునే చెట్ల మీద హక్కు కోసం రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగి ఐదుగురు గిరిజనులు మరణించారు. ఇది పూర్తిగా గిరిజన గ్రామం. ఈడిగ కల్లు చెట్లకు సంబంధించి గిరిజనుల మధ్య గత నాలుగైదు రోజులుగా జరుగుతోంది. మద్యం మత్తులో ఉండటంతో రాత్రి బాగా పొద్దుపోయిన తర్వాత ఈ ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణ కారణంగా రెండు వర్గాలకు చెందినవాళ్లు కత్తులతో పరస్పరం దాడులు చేసుకున్నారు. దీంతో ఐదుగురు అక్కడికక్కడే మరణించారు, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. సాధారణంగా ఒక్కో చెట్టు నుంచి 50-100 లీటర్ల వరకు కల్లు వస్తుంది. ఇది మార్కెట్లో లీటర్ 15 రూపాయల వరకు అమ్ముతారు. రంపచోడవరం తీసుకొచ్చి ఈ కల్లము అమ్ముకుంటారు. వేసవి కాలం కావడంతో ఈ కల్లుకు డిమాండ్ కూడా ఎక్కువ. అందుకే ఈ ఘర్షణ జరిగిందని భావిస్తున్నారు. -
మరో రెండు నెలలు రాకపోకలు బంద్
రంపచోడవరం, న్యూస్‌లైన్ : ఖమ్మం- తూర్పుగోదావరి మధ్య మారేడుమిల్లి వద్ద ఘాట్ రోడ్డుకు మరమ్మతులు చేస్తుండడంతో 40 రోజులు వాహనాల రాకపోకలు నిలిపివేశారు. వై.రామవరం మండలం ఎగువ ప్రాంతంలో ఉన్న గిరిజనులు వాహనాలు తిరగక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ రహదారిపై ఛత్తీస్‌గఢ్ - ఆంధ్రప్రదేశ్ మధ్య లారీలపై వస్తువుల రవాణా అవుతాయి. ఘాట్‌రోడ్డుపై రాకపోకలు నిలిపివేయడంతో పశ్చిమ గోదావరి మీదుగా చుట్టూ తిరిగి రావాల్సి వస్తోందని వాహనదారులు అన్నారు. జగ్దల్పూర్-రాజమండ్రి మధ్య బస్సు రాకపోకలు నిలిపివేశారు. ఘాట్ రోడ్డులో అడ్డుగా బండరాళ్లను ఉంచడంతో ద్విచక్ర వాహనాలు కూడా తిరిగే అవకాశం లేదు. మరో పది రోజుల్లో ద్విచక్ర వాహనాలు వెళ్లేందుకు అనుమతిస్తామని భద్రాచలం డివిజన్ రోడ్డు భవనాలు శాఖ అధికారులు తెలిపారు. ఘాట్ రోడ్డులో ఐదు కిలోమీటర్లు మేర కొండ చరియలను బాంబు బ్లాస్టింగ్ చేసి రోడ్డు, రక్షణగోడ నిర్మాణం పనులు పూర్తయ్యేందుకు మరో రెండు నెలలు అవసరమని అధికారులు చెబుతున్నారు. గిరిజనులకు తప్పని ఇక్కట్లు వై.రామవరం ఎగువ ప్రాంతాల్లోని గిరిజన గ్రామాలకు పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి. ఇతర ప్రాంతాలకు జీకే వీధి మీదుగా కాకరపాడు జంక్షన్ నుంచి రాజవొమ్మంగి మీదుగా రంపచోడవరం చేరుకోవాల్సి వస్తోందని గిరిజనులు అన్నారు. అక్కడ జిల్లా పరిధిలో దాదాపు 40 గ్రామాలు ఉంటాయి. గత నెలలో వారికి రేషన్ బియ్యం నర్సీపట్నం మీదుగా పంపించడంతో ఖర్చులు తడిసి మోపిడయ్యాయని జీసీసీ అధికారులు తెలిపారు. వచ్చే నెల రేషన్ సరుకులు ఎలా పంపుతారో తెలియని పరిస్థితి. ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు ప్రయాణానికి ఇబ్బందులు ఎదురొంటున్నట్టు గిరిజనులు తెలిపారు. సమస్యలు అధికారులు తెలిపేందుకు రంపచోడవరం ఐటీడీఏ వద్దకు వెళ్లేందుకు కూడా దూరాభారం పెరిగిందని వారన్నారు.