మారేడుమిల్లి అడవుల్లో... | Pushpa Movie shoot at Maredumilly Forest | Sakshi
Sakshi News home page

మారేడుమిల్లి అడవుల్లో...

Published Tue, Oct 13 2020 12:11 AM | Last Updated on Tue, Oct 13 2020 2:04 AM

Pushpa Movie shoot at Maredumilly Forest - Sakshi

‘ఆర్య, ఆర్య 2’ చిత్రాల తర్వాత అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘పుష్ప’. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. రష్మికా మందన్నా కథానాయిక. ఎర్రచందనం బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా చిత్రీకరణ సాగనుందని తెలిసిందే. ఈ సినిమా చిత్రీకరణను శేషాచలం అడవుల్లో, కేరళ అడవుల్లో జరుపుతారని ఆ మధ్య ప్రచారం జరిగింది. అయితే ‘పుష్ప’ టీమ్‌ రాజమండ్రి సమీపంలోని మారేడుమిల్లి అడవుల్లో షూట్‌కి రెడీ అయ్యారని టాక్‌. నెల రోజుల ఏకధాటి షెడ్యూల్‌ను ప్లాన్‌ చేశారట. నవంబర్‌ మొదటివారంలో ఈ షెడ్యూల్‌ ఆరంభం కానుందని తెలిసింది. ఈ సినిమాలో అల్లు అర్జున్, రష్మిక చిత్తూరు యాసలో డైలాగ్స్‌ చెబుతారు. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీత దర్శకుడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement