Anchor Anasuya Bharadwaj Joins Allu Arjun Pushpa Movie - Sakshi
Sakshi News home page

పుష్పలో అనసూయ: ఫుల్‌ హ్యాపీ అంటోన్న యాంకర్‌

Published Thu, Apr 22 2021 5:59 AM | Last Updated on Thu, Apr 22 2021 10:30 AM

Anasuya Bharadwaj joins Allu Arjun Pushpa Movie - Sakshi

సుకుమార్‌ దర్శకత్వంలో వచ్చిన ‘రంగస్థలం’ చిత్రంలో అనసూయ పోషించిన రంగమ్మత్త క్యారెక్టర్‌ ఆమె కెరీర్‌కు మంచి మైలేజ్‌ను ఇచ్చింది. ఇప్పుడు సుకుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ‘పుష్ప’ లో అనసూయ ఓ కీలక పాత్ర చేస్తున్నారు. ‘‘మంచి రోజులు ముందున్నాయి.. మళ్లీ సినిమా (సుకుమార్‌తో మరో సినిమా) చేయడం ఆనందంగా ఉంది’’ అని ‘పుష్ప’ చిత్రీకరణలో పాల్గొంటున్న విషయాన్ని బుధవారం సోషల్‌ మీడియా ద్వారా ధ్రువీకరించారు అనసూయ.

అల్లు అర్జున్‌ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో రష్మికా మందన్నా హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమా ఈ ఏడాది ఆగస్టు 13న విడుదల కానుంది. ‘పుష్ప’ సినిమా కాకుండా రవితేజ ‘ఖిలాడి’,  కృష్ణవంశీ డైరెక్షన్‌లో వస్తున్న ‘రంగమార్తాండ’ చిత్రాల్లో నటిస్తున్నారు అనసూయ. అలాగే అనసూయ లీడ్‌ రోల్‌ చేసిన ‘థ్యాంక్యూ...బ్రదర్‌’ సినిమా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్‌ కానుంది.

చదవండి: రెండున్నరేళ్లు అవుతుంది, అవి డిలీట్‌ చేయండి : మౌనిక

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement