శాంపిల్‌ వస్తోంది! | Pushpa team to introduce Allu Arjun character on April 7 | Sakshi
Sakshi News home page

శాంపిల్‌ వస్తోంది!

Published Sun, Apr 4 2021 4:38 AM | Last Updated on Sun, Apr 4 2021 5:17 AM

Pushpa team to introduce Allu Arjun character on April 7 - Sakshi

పుష్పరాజ్‌ ఎలా ఉంటాడో చూశాం. పుష్పరాజ్‌ ఏం చేస్తాడో మరో మూడు రోజుల్లో శాంపిల్‌ చూడనున్నాం. ‘ఆర్య, ఆర్య 2’ సినిమాల తర్వాత హీరో అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్‌ కాంబినేషన్లో వస్తున్న తాజా చిత్రం ‘పుష్ప’. ఈ సినిమా టీజర్‌ను ఏప్రిల్‌ 7న విడుదల చేయనున్నారు. ఏప్రిల్‌ 8న అల్లు అర్జున్‌ బర్త్‌డే. ఈ సందర్భంగా ‘పుష్ప’ టీజర్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, ముత్తం శెట్టి మీడియా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. రష్మికా మందన్నా హీరోయిన్‌ గా నటిస్తున్న ఈ చిత్రంలో ఫాహద్‌ ఫాజిల్‌ విలన్‌ . దేవి శ్రీ ప్రసాద్‌ ఈ సినిమాకు సంగీతదర్శకుడు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమాను ఆగస్టు 13న రిలీజ్‌ చేయాలనుకుంటున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement