Allu Arjun Pushpa 2 Team Planning To Release Teaser On December 16th, Deets Inside - Sakshi
Sakshi News home page

Pushpa 2 Teaser Update: పుష్ప-2 క్రేజీ అప్‌ డేట్.. 25 భాషల్లో టీజర్‌ రిలీజ్‌కు ప్లాన్?

Published Sat, Nov 5 2022 3:12 PM | Last Updated on Sat, Nov 5 2022 4:58 PM

Allu Arjun Pushpa 2 Team Planning To Release Teaser On 16th December  - Sakshi

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా బ్లాక్ బస్టర్ చిత్రం 'పుష్ప'. ఈ చిత్రానికి సీక్వెల్‌గా వస్తున్న పుష్ప-2 షూటింగ్ ఇటివలే ప్రారంభమైంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన క్రేజీ అప్ డేట్‌ వైరలవుతోంది. ఇటీవలే అల్లు అర్జున్‌తో సినిమాటోగ్రాఫర్ మిరోస్లా కుబా బ్రోజెక్‌ సీన్‌ వివరిస్తున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ కాగా.. తాజాగా ఈ మూవీ టీజర్‌కు సంబంధించిన వార్త చక్కర్లు కొడుతోంది. బన్నీ ఫ్యాన్స్‌ పుష్ప-2 కోసం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న టీజర్ గ్లింప్స్‌ రిలీజ్‌ డేట్‌పై సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది . 

(చదవండి: పుష్ప-2 క్రేజీ అప్‌ డేట్.. అల్లు అర్జున్ ఫోటో వైరల్)

అవతార్-2 రిలీజ్‌ రోజే ప్లానింగ్:  తాజాగా అప్‌డేట్‌ ప్రకారం చిత్ర దర్శకుడు సుకుమార్ కొన్ని సన్నివేశాలను చిత్రీకరించి టీజర్‌ను రూపొందించనున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఓ  ప్రత్యేకత ఏమిటటే డిసెంబర్ 16న టీజర్ విడుదల చేసేందుకు చిత్రబృందం ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అదే రోజు అవతార్ 2 సినిమా ప్రపంచవ్యాప‍్తంగా రిలీజవుతోంది. దీంతో పుష్ప-2 టీజర్‌ను అదే థియేటర్లలో దాదాపు 25 భాషల్లో భారీ స్థాయిలో విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. పుష్పకు సీక్వెల్‌ తెరకెక్కుతున్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రానికి డీఎస్పీ సంగీతం సమకూరుస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement