
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా బ్లాక్ బస్టర్ చిత్రం పుష్ప. ఈ చిత్రానికి సీక్వెల్‌గా వస్తున్న పుష్ప-2 షూటింగ్ ఇటివలే ప్రారంభమైంది. ఇప్పటికే షూటింగ్‌కు సంబంధించిన కొన్ని చిత్రాలను సోషల్ మీడియలో పంచుకున్నారు మేకర్స్. తాజాగా చిత్రీకరణకు సంబంధించిన మరో ఫోటో సోషల్ మీడియాలో వైరలవుతోంది. అల్లు అర్జున్‌తో సినిమాటోగ్రాఫర్ మిరోస్లా కుబా బ్రోజెక్ సీన్ వివరిస్తున్న ఫోటో చక్కర్లు కొడుతోంది. ఆఫోటోను చూస్తే పుష్ప-2 అనుకున్న దానికంటే వేగంగా షూటింగ్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. దీంతో బన్నీ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.
(చదవండి: పుష్ప: తగ్గేదే లే అంటూ.. నాన్‌స్టాప్‌గా షూటింగ్!)
దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న పుష్ప-2 షెడ్యూల్‌లో అల్లు అర్జున్, రష్మికా మందన్నాపై పలు సన్నివేశాలు చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఈ మూవీలోనూ ఫాహద్ ఫాజిల్, ధనుంజయ, సునీల్, అనసూయ భరద్వాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. కాగా.. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
FIRE @alluarjun 🔥🔥🔥#PushpaTheRule #Pushpa2 pic.twitter.com/ojL7v7bw4y
— Allu Arjun TFC™ (@AlluArjunTFC) October 30, 2022
Comments
Please login to add a commentAdd a comment