Allu Arjun Pushpa 2 Makers Share First Glimpse From Shooting Sets - Sakshi
Sakshi News home page

Pushpa 2 Movie: శరవేగంగా పుష్ప 2 షూటింగ్.. ఫోటోలు వైరల్

Published Mon, Oct 17 2022 8:59 PM | Last Updated on Mon, Oct 17 2022 9:15 PM

Allu Arjun Pushpa 2 Makers Share First Glimpse from Shooting sets - Sakshi

ఐకాన్‌ స్టార్‌ బన్నీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం పుష్ప-2: ది రూల్.  ఈ చిత్రానికి సంబంధించి అదిరిపోయే అప్‌డేట్ వచ్చింది. బాక్సాఫీస్ ఓ ఊపు ఊపేసిన పుష్పకు సీక్వెల్‌గా ఈ చిత్రం రూపొందుతోంది. తాజాగా షూటింగ్ జరుగుతున్న ఓ ఫోటోను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. దీనిపై పుష్ప బ్యూటీ రష్మిక మందన్నా కూడా ట్వీట్ చేసింది. ఇది కేవలం ప్రారంభం మాత్రమే అంటూ అంటూ ట‍్వీట్ చేసింది ఈ ముద్దుగుమ్మ.  అల్లు అర్జున్‌, క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ కాంబినేషన్‌లో వచ్చిన పుష్ప మూవీ సెన్సేషన్‌ క్రియేట్‌ చేసిన విషయం తెలిసిందే.

ఈ పోస్ట్‌లో షూటింగ్ ప్రక్రియ శరవేగంగా జరుగుతోందన్న విషయాన్ని చిత్ర నిర్మాతలు, దర్శకుడు  కెమెరా వెనుక స్టిల్‌ను ఉన్న ఫోటోను షేర్ చేశారు. దీంతో అల్లు అర్జున్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.  ఈ చిత్రం ప్రేక్షకుల్లో పెద్దఎత్తున అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం పుష్ప-2 షూటింగ్ పిక్స్ షేర్ చేయడంతో అభిమానులు ఖుషీ అవుతున్నారు. కొద్ది రోజుల క్రితమే సినిమా చిత్రీకరణ ప్రారంభిస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement