Big Twist Expected To Be In Allu Arjun Upcoming Movie Pushpa 2, Deets Inside - Sakshi
Sakshi News home page

Pushpa 2 Update: బన్నీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. పుష్ప-2లో భారీ ట్విస్ట్..!

Published Wed, Oct 26 2022 3:15 PM | Last Updated on Wed, Oct 26 2022 4:21 PM

Big Twist Expected In Allu Arjun Latest Movie Pushpa 2 - Sakshi

ఐకాన్ స్టార్ బన్నీ, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా జంటగా నటించిన బ్లాక్ బస్టర్ చిత్రం పుష్ప. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించింది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. దీంతో ఈ చిత్రానికి సీక్వెల్‌గా పుష్ప-2 రూపొందిస్తున్నారు మేకర్స్. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కూడా ఇటీవలే ప్రారంభమైంది. 

అయితే తాజాగా పుష్ప-2 చిత్రానికి సంబంధించిన ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఈ మూవీ సెకండ్‌ హాఫ్‌లో ఓ కొత్త క్యారెక్టర్‌ను పరిచయం చేయనున్నట్లు తెలుస్తోంది. ఆ క్యారెక్టర్ ద్వారా క్లైమాక్స్‌లో వచ్చే భారీ ట్విస్ట్ రివీల్ ఉంటుందని సమాచారం. అదే ట్విస్ట్ పుష్ప-3కి లీడ్ రోల్‌గా చిత్రబృందం ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే నిజమైతే బన్నీ ఫ్యాన్స్‌కు పండగే. దీనిపై చిత్రబృందం ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement