పుష్ప2 విడుదలై ఇప్పటకి మూడు వారాలు దాటిన సోషల్‌మీడియాలో ఆ క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. ఈ చిత్రం నుంచి వీడియో సాంగ్స్‌ను మేకర్స్ విడుదల చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో తాజాగా కపుల్స్ సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. అల్లు అర్జున్- సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ఈ చిత్రం డిసెంబర్ 5న విడుదలైంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు సుమారు రూ. 1730 కోట్లకుపైగా (గ్రాస్) కలెక్షన్స్ రాబట్టింది.
పుష్ప2 సినిమా విజయంలో దేవీశ్రీప్రసాద్ సంగీతం కూడా కీలక పాత్ర పోషించింది. ఈ మూవీలోని ప్రతి సాంగ్ ఒక సెన్సేషనల్ హిట్ అయింది. ఇప్పటికీ అందుకు సంబంధించిన రీల్స్ నెట్టింట వైరల్ అవుతూనే ఉన్నాయి. తాజాగా ఈ చిత్రం నుంచి కపుల్స్ సాంగ్ 'సూసేకి అగ్గిరవ్వ మాదిరి ఉంటాడే నా సామి..' విడుదలైంది. శ్రేయా ఘోషల్ ఆలపించిన ఈ సాంగ్ ఆడియో వర్షన్ అన్ని భాషలలో ఇప్పటి వరకు 500 మిలియన్ వ్యూస్ దక్కించుకుంది. ఇప్పుడు వీడియో రిలీజ్ కావడంతే ఇంకెన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment