Pushpa Update: Anasuya First Look As Dakshayani Look Released | Anasuya Pushpa Movie First Look - Sakshi
Sakshi News home page

Anasuya Pushpa First Look: దాక్షాయణిగా అనసూయ లుక్‌ అదిరిందిగా..

Published Wed, Nov 10 2021 10:09 AM | Last Updated on Wed, Nov 10 2021 12:20 PM

Pushpa Update: Anasuya First Look As Drakshayini Look Released - Sakshi

Pushpa Movie Anasuya Dakshayani First Look: నటనకు ప్రాధాన్యమున్న పాత్రల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేకమైన స్థానం సంపాదించుకుంది యాంకర్‌ అనసూయ. రంగస్థలంలో రంగమత్తగా నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్న అనసూయ..  బడా సినిమాల్లో వరుస అవకాశాలతో దూసుకుపోతుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ పుష్ప సినిమాలో 'దాక్షాయని' అనే కీలక పాత్రలో నటిస్తుంది. తాజాగా ఈ చిత్రంలో అనసూయ లుక్‌ని రివీల్‌ చేసింది చిత్ర బృందం. చదవండి: భర్త అరెస్ట్‌.. హాస్పిటల్‌లో నటి పూనమ్‌ పాండే


నోట్లో ఆకు నములుతూ.. చేతిలో అడకత్తెర పట్టుకొని మాస్‌ లుక్‌లో అనసూయ దర్శనమిచ్చింది. ముఖ్యంగా ఆమె హెయిర్‌ స్టైల్‌ ప్రత్యేకంగా నిలిచింది.క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌, ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో బన్నీ పుష్పరాజ్‌గా అలరించనున్నాడు. రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తుంది.  ఎర్రచందనం అక్రమ రవాణా నేపథ్యంలో పాన్‌ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఫష్ట్‌ పార్ట్‌ డిసెంబర్‌17న విడుదల కానుంది. 

చదవండి: నిన్ను నమ్మినవాళ్లను మోసం చేయొద్దు : వెంకటేశ్‌
మళ్లీ తెరమీదకి శ్రీరెడ్డి- శ్రీరామచంద్ర వాట్సాప్‌ చాట్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement