378 కిలోల గంజాయి స్వాధీనం
Published Thu, Jan 26 2017 12:06 AM | Last Updated on Tue, Sep 5 2017 2:06 AM
మారేడుమిల్లి:
తూర్పు గోదావరి జిల్లా మారేడుమిల్లి ఏజెన్సీ లోతట్టు గ్రామం నుంచి ఆక్రమంగా తరలిస్తున్న గంజాయిని గుర్తేడు పోలీసులు పట్టుకున్నారు, వీటితోపాటు ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసి, ఓ బైకు, వ్యా¯ŒSను స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలను స్థానిక పోలీస్ స్టేష¯ŒSలో బుధవారం జరిగిన విలేకర్ల సమావేశంలో మారేడుమిల్లి ఇ¯ŒSచార్జి సీఐ గీతా రామకృష్ణ, తెలిపారు. మారేడుమిల్లి మండలం బోడ్లంక గ్రామానికి చేందిన పల్లాల వెంకటరెడ్డి వ్యా¯ŒS డ్రైవర్), విశాఖ జిల్లా దారకొండ పంచాయతీ గొందిపాలెం గ్రామానికి చేందిన కీలో సుందర్ రాయి, కీలో రంజిత్ కుమార్ అనే ముగ్గురు వ్యక్తులు దారకొండ గ్రామం నుంచి గంజాయిని బోడ్లంక గ్రామం మీదుగా వ్యా¯ŒSలో తరలిస్తుండగా ఏఎస్పీకి అందిన ముందస్తు సమచారం మేరకు గుర్తేడు ఎస్సై నాగేశ్వరరావు తన సిబ్బందితో వాహనాలు తనిఖీలు చేస్తుండగా వేటుకూరు జంక్ష¯ŒS వద్ధ పట్టుకున్నారు. వీరినుంచి 15 బస్తాలో ఉన్న 378 కిలోల గంజాయిని పట్టుకున్నారు. సరుకును తరలిస్తున్న ఓ వ్యా¯ŒSను, బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. మరో నింధితుడైన వ్యా¯ŒS ఓనర్ బలరాం పరారీలో ఉన్నాడు. గంజాయి విలువ సుమారు రూ.19 లక్షలుంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది బాలజీ పాల్గొన్నారు.
Advertisement