గిరిజన మహిళ ఆత్మహత్య
Published Tue, Mar 14 2017 11:03 PM | Last Updated on Tue, Nov 6 2018 8:28 PM
మారేడుమిల్లి (రంపచోడవరం) :
మండలంలోని వేటుకూరు పంచాయతీ పరిధిలోని పందిరి మామిడికోట గ్రామంలో గిరిజన మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామస్తుల కథనం ప్రకారం ఈ గ్రామానికి చెందిన రేవుల నాగమణి (39)కి సోమేశ్వరరెడ్డితో 20 ఏళ్ల క్రితం వివాహమైంది. ఈ దంపతులకు నలుగురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. సోమేశ్వరరెడ్డి గురువారం విపరీతంగా మద్యం సేవించి ఇంటికి వచ్చి నాగమణితో గొడవ పడ్డాడు. దీంతో విరక్తి చెందిన నాగమణి ఇంటి నుంచి పారిపోయి మర్నాడు శుక్రవారం బొడ్లంక గ్రామంలో చదువుకుంటున్న తన కొడుకుని చూసి తిరిగి పందిరిమామిడికోట వచ్చింది. ఆమె గ్రామం సమీపంలోని తోటలోకి వెళ్లి మామిడి చెట్టుకు ఉరి వేసుకుంది. ఆమె కోసం భర్త వెతికినా ఫలితం లేకపోయింది. ఆమె చనిపోయి నాలుగు రోజులు కావడంతో మృతదేహం నుంచి విపరీతమైన దుర్గంధం పరిసర ప్రాంతాలకు రావడంతో ఆమె ఆత్మహత్య విషయం గ్రామస్తులకు మంగళవారం తెలిసింది. వారు ఇచ్చిన సమాచారం మేరకు మారేడుమిల్లి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్డం కోసం రంపచోడవరం తరలించారు. దీనిపై ఇ¯ŒSఛార్జి సీఐ గీతా రామకృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
భార్యకు నిప్పు పెట్టిన భర్త
రాజమహేంద్రవరం క్రైం (రాజమహేంద్రవరం సిటీæ) : భార్యపై అనుమానంతో కిరోసి¯ŒS పోసి భర్త నిప్పు పెట్టాడు. వ¯ŒS టౌ¯ŒS పోలీసుల కథనం ప్రకారం జట్టు కార్మికుడిగా పనిచేసే రాజమహేంద్రవరం కొత్తపేట ప్రాంతంలోని గుభేల్‌పేటకు చెందిన రొక్కం ప్రకాష్‌రావు వృద్ధాప్యం వల్ల హోటల్‌లో పని చేస్తున్నాడు. భార్య కళావతిపై అనుమానంతో అతడు కొంతకాలంగా గొడవ పడుతున్నాడు. మంగళవారం రాత్రి మద్యం సేవించి ఇంటికి వచ్చిన అతడు భార్యతో ఘర్షణకు దిగాడు. ఆగ్రహంతో ఇంట్లో ఉన్న కిరోసి¯ŒS భార్యపై పోసి నిప్పు అంటించాడు. ఒంటిపై మంటలు ఎగిసిపడుతుండగా ఆమె కేకలు వేస్తూ రోడ్డుపై పరుగులు తీసింది. ఆమెను కుటుంబ సభ్యులు స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. స్థానికుల సమాచారంతో పోలీసులకు సంఘటనా స్థలానికి చేరుకుని నిందితుడు ప్రకాష్‌రావును అరెస్టు చేశారు.
Advertisement