tribal lady
-
గిరిజన మహిళ ఆత్మహత్య
మారేడుమిల్లి (రంపచోడవరం) : మండలంలోని వేటుకూరు పంచాయతీ పరిధిలోని పందిరి మామిడికోట గ్రామంలో గిరిజన మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామస్తుల కథనం ప్రకారం ఈ గ్రామానికి చెందిన రేవుల నాగమణి (39)కి సోమేశ్వరరెడ్డితో 20 ఏళ్ల క్రితం వివాహమైంది. ఈ దంపతులకు నలుగురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. సోమేశ్వరరెడ్డి గురువారం విపరీతంగా మద్యం సేవించి ఇంటికి వచ్చి నాగమణితో గొడవ పడ్డాడు. దీంతో విరక్తి చెందిన నాగమణి ఇంటి నుంచి పారిపోయి మర్నాడు శుక్రవారం బొడ్లంక గ్రామంలో చదువుకుంటున్న తన కొడుకుని చూసి తిరిగి పందిరిమామిడికోట వచ్చింది. ఆమె గ్రామం సమీపంలోని తోటలోకి వెళ్లి మామిడి చెట్టుకు ఉరి వేసుకుంది. ఆమె కోసం భర్త వెతికినా ఫలితం లేకపోయింది. ఆమె చనిపోయి నాలుగు రోజులు కావడంతో మృతదేహం నుంచి విపరీతమైన దుర్గంధం పరిసర ప్రాంతాలకు రావడంతో ఆమె ఆత్మహత్య విషయం గ్రామస్తులకు మంగళవారం తెలిసింది. వారు ఇచ్చిన సమాచారం మేరకు మారేడుమిల్లి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్డం కోసం రంపచోడవరం తరలించారు. దీనిపై ఇ¯ŒSఛార్జి సీఐ గీతా రామకృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భార్యకు నిప్పు పెట్టిన భర్త రాజమహేంద్రవరం క్రైం (రాజమహేంద్రవరం సిటీæ) : భార్యపై అనుమానంతో కిరోసి¯ŒS పోసి భర్త నిప్పు పెట్టాడు. వ¯ŒS టౌ¯ŒS పోలీసుల కథనం ప్రకారం జట్టు కార్మికుడిగా పనిచేసే రాజమహేంద్రవరం కొత్తపేట ప్రాంతంలోని గుభేల్‌పేటకు చెందిన రొక్కం ప్రకాష్‌రావు వృద్ధాప్యం వల్ల హోటల్లో పని చేస్తున్నాడు. భార్య కళావతిపై అనుమానంతో అతడు కొంతకాలంగా గొడవ పడుతున్నాడు. మంగళవారం రాత్రి మద్యం సేవించి ఇంటికి వచ్చిన అతడు భార్యతో ఘర్షణకు దిగాడు. ఆగ్రహంతో ఇంట్లో ఉన్న కిరోసి¯ŒS భార్యపై పోసి నిప్పు అంటించాడు. ఒంటిపై మంటలు ఎగిసిపడుతుండగా ఆమె కేకలు వేస్తూ రోడ్డుపై పరుగులు తీసింది. ఆమెను కుటుంబ సభ్యులు స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. స్థానికుల సమాచారంతో పోలీసులకు సంఘటనా స్థలానికి చేరుకుని నిందితుడు ప్రకాష్‌రావును అరెస్టు చేశారు. -
పురిటి నొప్పులతో పది కిలోమీటర్లు నడిచి..
► మార్గమధ్యలో తానే పురుడు పోసుకున్న గిరిజన మహిళ ► వెంట తెచ్చుకున్న బ్లేడ్‌తో బిడ్డ నుంచి పేగును వేరు చేసిన వైనం మారేడుమిల్లి నెలలు నిండిన గర్భిణులను సుఖ ప్రసవానికి ఆసుపత్రికి తరలించేందుకు కనీస చర్యలు తీసుకోకపోతుండటంతో తూర్పుగోదావరి జిల్లాలోని మన్యం ప్రాంతంలో గిరిజన మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రెండు రోజుల క్రితం మారేడుమిల్లి మండలం లోతట్టు ప్రాంతమైన కింటుకూరు గ్రామానికి చెందిన పాలించి లక్ష్మి నెలలు నిండటంతో 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న రంపచోడవరం ఆసుపత్రికి వచ్చేందుకు భర్తతో బయలుదేరింది. ఇంతలో పురిటి నొప్పులు రావడంతో ఆ బాధ భరిస్తూనే కొండ ఎక్కి పది కిలోమీటర్లు నడుస్తూ వచ్చింది. దాహంగా ఉందంటూ భర్తను కాలువ నుంచి నీరు తేవాలని చెప్పింది. ఈలోపు నొప్పులు అధికమవడంతో తన వెంట తెచ్చుకున్న బ్లేడ్‌తో బిడ్డ నుంచి పేగును వేరుచేసి పురుడు పోసుకుని ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ పరిస్థితి గమనించిన ఓ యువకుడు మొబైల్ నెట్వర్క్ ఉన్న ప్రాంతానికి వెళ్లి 108కి సమాచారం ఇచ్చాడు. గంట తరువాత వాహనంలో రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి ఆమెను తరలించారు. తల్లీబిడ్డలు ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. -
డయేరియాతో గిరిజన మహిళ మృతి
ఇచ్చోడ : మండలంలోని చించోలి గ్రామానికి చెందిన గిరిజన మహిళ రానుబాయి(26) డయేరియాతో మంగళవారం రాత్రి మతిచెందింది. కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. రానుబాయి మంగళవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో విరేచనాలతో అస్వస్థతకు గురైంది. దీంతో కుటుంబసభ్యులు ఆమెను 11 గంటల ప్రాంతంలో ఇచ్చోడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. డ్యూటీలో ఉన్న డాక్టర్ వైద్యం అందించారు. సాయంత్రం వరకు బాగానే ఉన్న ఆమె కు తిరిగి 6 గంటల ప్రాంతంలో వాంతులు, విరేచనాలు తీవ్రంగా బాధపడింది. దీంతో డాక్టర్ సర్పరాజ్ ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారు. అయితే 108 అంబులెన్స్ వచ్చేలోపే రాత్రి 7.30 గంటల ప్రాంతంలో రానుబాయి మతి చెందింది. కాగా, డ్యూటీ డాక్టర్ నిర్లక్ష్యం కారణంగానే రానుబాయి మహిళ మతిచెందినట్లు బంధువులు ఆరోపించారు. డాక్టర్ సర్పరాజ్‌ను వివరణ కోరగా.. తము సరైన వైద్యం అందించామని తెలిపారు. -
పెరిగిన నేరాలు
మనిషిలో నేర ప్రవర్తన పెరుగుతోంది. చిన్నచిన్న విషయాలకు హత్యలకు పాల్పడుతున్నాడు. కొందరు మృగాల్లా మారి కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన కూ తుళ్లపై లైంగిక దాడులు చేస్తూ సభ్య సమాజం తలదించుకునేలా చేస్తున్నారు. పరిగి సర్కిల్ పరిధి లో గతేడాదితో పోల్చుకుంటే ప్రధాన నేరాలు కాలంతో పాటు పెరిగిపోయి ఆందోళన కలిగిస్తున్నాయి. ఈయేడు చోటుచేసుకున్న ప్రధాన నేరాలకు సంబంధించిన కథనం. న్యూస్‌లైన్, పరిగి సభ్య సమాజం తలదించుకుంది.. కుల్కచర్ల మండల కేంద్రంలో కన్నతండ్రే పశువులా మారిపోయాడు. వావివరసలు మరచిపోయి సభ్య సమాజం తలదించు కునేలా కన్న కూతురుపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ సంఘటన తో జనం నివ్వెరపోయి కంట తడి పెట్టారు. అదే గ్రామం లో.. క్రమ శిక్షణకు మారుపేరైన జవాన్ కళ్లు కామంతో మూసుకుపోయాయి. మానసిక వికలాంగురాలిని గర్భవతిని చేశాడు. చౌడాపూర్‌లో గిరిజన మహిళపై సామూహిక లైంగిక దాడికి ఒడిగట్టిన సంఘటన మహిళలను భయభ్రాంతులకు గురిచేసింది. కుల్కచర్ల మండలం బండవెల్కిచర్లలో.. భారంగా మారిందని ఓ వ్యక్తి ప్రియురాలిని కడతేర్చి నిప్పంటించాడు. గండేడ్ మండలం కంచన్‌పల్లిలో ఓ వ్యక్తి పశువులా మారాడు. కామవాంఛ తీర్చలేదని వారం రోజుల బాలింతను గొంతు నులిమి చంపేశాడు. మహ్మదాబాద్‌లో.. ప్రేయసితో వివాహానికి నిరాకరించిందనే కార ణంతో ఓ యువకుడు నవమాసాలు మోసి కని పెంచిన తల్లినే మట్టుబెట్టాడు. దోమ మం డలం బొంపల్లి తండాలో బాలికపై బలత్కారం జరిగింది. పరిగి మండలం లక్ష్మీదేవిపల్లిలో డిగ్రీ కళాశాల విద్యార్థినిపై ఓ కార్మికుడు అత్యాచార యత్నం చేశాడు. ప్రతిఘటించడంతో పాశవిక దాడి చేసి పరారయ్యాడు. మాదారంలో.. ఆస్తి కోసం పెంచి పెద్ద చేసిన అవ్వను కడతేర్చారు మనవడు, మనవరాలు. బసిరెడ్డిపల్లిలో నగల కోసం ప్రియురాలిని కడతేర్చిన ఓ మృగాడు. ఇలా చెప్పుకుంటూ చాలా ఘటనలే ఉన్నాయి. ఈ ఏడాది పరిగి సర్కిల్లో జరిగిన నేరాలు ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్నా యి. పెరిగిన ప్రధాన నేరాలు.. గతేడాదితో పోలిస్తే 2013లో పరిగి సర్కిల్లో ప్రధాన నేరాలు పెరిగిపోయాయి. 2012లో 11 హత్యలు జరిగాయి. పోలీసులు ఏడింటిని ఛేదించారు. ఈఏడాది 17 హత్యలు చోటుచేసుకోగా ఒక్కటి మినహా పోలీసులు మిగతా వాటిని ఛేదించి నిందితులను కటకటాల వెనక్కి పంపారు. గతేడాది 7 హత్యాయత్నాలు జరగ్గా.. ఈ సంవత్సరం 12 హత్యాయత్నాలు చోటుచేసుకున్నాయి. 2012లో తొమ్మిది లైంగిక దాడులు, 16 అత్యాచార యత్నాలు.. ఈ సంవత్సరం ఆరు లైంగిక దాడులు, 14 అత్యాచార యత్నాలు జరిగాయి. గతేడాది ముగ్గురు మహిళలు కట్న దాహానికి బలైపోయారు. అదే ఈసారి వాటికి సంబంధించి రెండు కేసులు నమోదయ్యాయి. నేరాల్లో మారిన పంథా.. గతేడాదితో పోలిస్తే ఈ సంవత్సరం నేరాలు పెరిగాయి. అదే సమయంలో నేరాలకు పాల్పడిన తీరు కూడా మారిపోయింది. గత రెండేళ్లలో వివాహేతర సంబంధాల నేపథ్యంలోనే ఎక్కువ హత్యలు చోటుచేసుకున్నాయి. ఈ ఏడాది నిందితులు చిన్నచిన్న కారణాలకు హత్యలకు పాల్పడ్డారు. హత్యలు జరిగిన కారణాలను విశ్లేషిస్తే శాంతి భద్రతలలో పాటు సామాజికపరమై కోణాలు ఉన్నాయి. వీటి నివారణకు సమాజంలో అవగాహన, కౌన్సెలింగ్ ఎంతైనా అవసరం అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.