పోర్షే కారు కేసు: నిందితుడి ఫ్యామిలీ రిసార్ట్‌లో అక్రమ కట్టడాలు కూల్చివేత | Pune Porsche car case: Illegal portions of resort owned by accused family demolished | Sakshi
Sakshi News home page

పుణే పోర్షే కేసు: నిందితుడి ఫ్యామిలీ రిసార్ట్‌లో అక్రమ కట్టడాలు కూల్చివేత

Published Sat, Jun 8 2024 8:08 PM | Last Updated on Sat, Jun 8 2024 9:00 PM

Pune Porsche car case: Illegal portions of resort owned by accused family demolished

ముంబై: పుణె పోర్షే కారు రోడ్డు ప్రమాదం కేసులో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. తాజాగా నిందితుడు మైనర్‌ బాలుడి కుటుంబానికి సంబంధించిన ఓ రిసార్ట్‌లో అక్రమ కట్టడాలను శనివారం అధికారులు కూల్చి వేశారు. మహారాష్ట్రలోని మహాబలేశ్వర్‌ మల్కంపేట్‌ ప్రాంతంలో మైనర్‌ బాలుడి ఫ్యామిలీకి ‘ఎంపీజీ క్లబ్‌’ అనే పేరుతో ఓ రిసార్ట్‌ ఉంది. దానిలో ఎలాంటి అనుమతులు తీసుకోకుండా కొన్ని నిర్మాణాలు చేపట్టినట్లు అధికారులకు సమాచారం అందింది.

 

ఈ వ్యవహారంపై గతవారం సీఎం ఏక్‌నాథ్‌ షిండే స్పందించారు. నిందితుడి ఫ్యామిలీ రిసార్ట్‌లో ఉన్న కట్టడాలు అక్రమమని తేలితే చర్యలు తీసుకోవాలని సతారా జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. ఈ క్రమంలోనే గతవారం రిసార్ట్‌ను అధికారులు సీల్‌ చేశారు. తర్వాత వాటిపై విచారణ చేపట్టగా.. ఆ కట్టడాలు అక్రమంగా నిర్మించినట్లు నిర్ధారణ అయింది. దీంతో శనివారం ఎంపీజీ క్లబ్‌ వద్దకు బుల్డోజర్‌ను తీసుకువెళ్లిన అధికారులు అనుమతులు లేకుండా నిర్మించిన కట్టడాలను కూల్చివేశారు.

మే 19 తెల్లవారుజామున మైనర్‌ బాలుడు మద్యం మత్తులో  వేగంగా పోర్షేకారు నడిపి బైక్‌ను ఢీకొట్టాడు. ఈ రోడ్డు ప్రమాదంలో ఇద్దరు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు మృతి చెందారు. ఈ కేసులో పోలీసులు చేపట్టిన దర్యాప్తులో రోజుకో కీలక విషయం వెలుగులోకి వస్తోంది. దీనిపై పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

చదవండి: పుణె పోర్షే కేసు: ఇవేం ట్విస్టులు బాబోయ్‌!

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement