porshe car
-
పోర్షే కారు కేసు: ‘నిందితుడిని మేజర్‌గా పరిగణించండి’
ముంబై: పుణెలో సంచలనం రేపిన పోర్షే కారు రోడ్డు ప్రమాదం ఘటన పూర్తి నివేదికను పోలీసులు జువైనల్ జస్టిస్ బోర్టు(జేజేబీ)కి అందజేశారు. పూర్తిగా విచారించేందుకు నిందితుడిని మేజర్‌గా పరిగణించాలని పోలీసులు గతంలో జేజేబీలో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం తమ అభ్యర్థనకు మద్దతుగా కేసులోని పూర్తి వివరాలు, సాక్ష్యాధారాల నివేదికను క్రైం బ్రాంచ్ పోలీసులు జేజేబీకి అందజేశారు. చదవండి: రీల్‌ను మించిన రియల్ సస్పెన్స్ థ్రిల్లర్.. ఇవేం ట్విస్టులు బాబోయ్!‘‘ రోడ్డు ప్రమాదం కేసుకు సంబంధించి అన్ని సాక్ష్యాధారాలను జేజేబీకి సమర్పించాం. ఈ రోడ్డు ప్రమాదంలో మైనర్ బాలుడే కీలకంగా ఉన్నాడు. రోడ్డు ప్రమాదం జరిగిన రోజు( మే 19) సాయంత్రం నుంచి ప్రమాదం జరిగే సమయంలో అన్ని సాక్ష్యాలు సేకరించాం. ప్రమాదానికి సంబంధించి ప్రత్యక్ష సాక్ష్యుల వద్ద స్టేట్మెంట్ తీసుకున్నాం. మైనర్ బాలుడు కారు నడిపినట్లు ప్రత్యక్ష సాక్షి చూశాడు. విచారణ సమయంలో సీసీటీవీ ఫుటేజీ పరిశీలించాం. కోసీ రెస్టారెంట్, బ్లాక్ క్లబ్ రెస్టారెంట్లో మద్యం సేవించినట్లు గుర్తించాము. ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు మరణానికి కారణం మైనర్ బాలుడే. ఇలా.. మైనర్ బాలుడికి సంబంధించి పూర్తి వివరాలు జేజేబీకి అందించాం’’ అని క్రైం బ్రాంచ్ పోలీసులు తెలిపారు. నిందితుడిని ఇప్పటికైనా మేజర్‌గా పరిగణించి విచారించేందుకు సహకరిచాలని జేజేబీని క్రైం బ్రాంచ్ అధికారి కోరారు.ఈ కేసులో మైనర్ బాలుడి బ్లడ్ శాంపిళ్లు తారుమారు చేయడానికి అతని తల్లిదండ్రులు, సాసూన్ హాస్పిటల్ డాక్టర్ల సాయం తీసుకున్నారు. దీంలో విచారణలో వారి నిర్వాకం బయటపడటంతో పోలీసులు అరెస్ట్ చేయగా జైలులో ఉన్నారు. బ్లడ్ శాంపిళ్లను తారుమారు చేయడానికి ప్రయత్నించిన మైనర్ బాలుడి తండ్రికి, డాక్టర్లకు మధ్యవర్తులుగా పనిచేసిన మరో ఇద్దరు వ్యక్తులను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. చదవండి: పుణె పోర్షే కేసు: ‘ నాకేం గుర్తు లేదు.. అప్పడు తాగి ఉన్నా..!’ -
పుణే పోర్షే కేసు: మకందర్‌కు ఫోన్ చేసిందెవరు?
ముంబై: పుణేలో సంచలనం రేపిన పోర్షే కారు ప్రమాదం దర్యాప్తులో పోలీసులు మరో కీలక విషయం బయటపెట్టారు. బ్లడ్ శాంపిళ్లు తారుమారు చేయాలని నిందితుడు (మైనర్ బాలుడు) తండ్రి డాక్టర్లకు రూ. 3 లక్షల లంచం ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఈ లంచం జువైనల్ జస్టిస్ బోర్డు ఆవరణంలో డాక్టర్ల సూచనతో హాస్పిటల్ వార్డు బాయ్‌కి అందజేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. నిందితుడి తండ్రి విశాల్ అగర్వాల్.. బ్లడ్ శాంపిళ్లను తన భార్య బ్లడ్ శాంపిళ్లతో తారుమారు చేయాలని సూసాన్ ఆస్పత్రి వార్డు బాయ్ అతుల్ ఘట్కాంబ్లేకు లంచం ఇచ్చినట్లు తెలిపారు. ఆ లంచాన్ని విశాల్ అగర్వాల్ ఏకంగా జువైనల్ జస్టిస్ బోర్టు ఆవరణంలో ఇచ్చారని దర్యాప్తులో వెల్లడైంది. పుణే క్రైం బ్రాంచ్ పోలీసులు జువైనల్ జస్టిస్ బోర్టు సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించగా ఈ విషయం బయటపడింది. సూసాన్ ఆస్పత్రి ఫొరెన్సిక్ విభాగం హెడ్ డా.అజయ్ తవారే, డా.శ్రీహరి హాల్కర్ (చీఫ్ మెడికల్ ఆఫీసర్) సూచన మేరకు వార్డుబాయ్ అతుల్ ఘట్కాంబ్లే లంచం తీసుకోవడానికి అంగీకరించాడని పోలీసులు తెలిపారు.చదవండి: పుణే కేసు నిందితుడిపై ‘బుల్డోజర్’ప్రయోగంమొదట బాలుడి బ్లడ్ శాంపిల్ నెగటివ్ వచ్చింది. దీంతో అనుమానం వ్యక్తం చేసిన పోలీసులు మరోసారి పరీక్ష నిర్వహించగా రెండు వేర్వేరు వ్యక్తుల రిపోర్టులు వచ్చినట్లు తేలింది. బాలుడి బ్లడ్ శాంపిల్‌ను అతని తల్లి శాంపిల్‌తో డాక్టర్లు తారుమారు చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. మరోవైపు.. ఈ కేసుతో సంబంధం ఉన్న అష్ఫాక్ మకందర్ అనే వ్యక్తిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. మకందర్.. డాక్టర్లకు, బాలుడి తండ్రి విశాల్ అగర్వాల్‌కు మధ్యవర్తిగా పనిచేశాడని క్రైం బ్రాంచ్ పోలీసులు వెల్లడించారు.చదవండి: పూణే ప్రమాదంలో కీలక పరిణామం!.. తెరపైకి ఎమ్మెల్యే కుమారుడుమే 20న మకందర్ సాసూన్ ఆస్పత్రికి చేరుకునే ముందు ‘విశాల్ అగర్వాల్‌కు సాయం చేయండి’ అని అతనికి ఒకఫోన్ కాల్ వచ్చింది. తర్వాత మకందర్, డాక్టర్ తవారే మధ్య సంభాషణ జరిగింది. అయితే మకందర్ కాల్ చేసి.. విశాల్‌కు సాయం చేయాలన్నది ఎవరూ? అని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తులో భాగంగా మకందర్ ఫోన్‌ను పోలీసులు సీజ్ చేశారు. మే 19 ప్రమాదం జరిగిన సమయంలో ఎమ్మెల్యే సునీల్ టింగ్రేతో పాటు ఎరవాడ పోలీసు స్టేషన్ వద్ద మకందర్ ఉండటం గమనార్హం. మే19న మైనర్ బాలుడు చేసిన రోడ్డు ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ కేసు రోజుకో మలుపు తిరుగుతూ పుణేలో సంచలనం రేపుతోంది. -
పుణే కేసు నిందితుడిపై ‘బుల్డోజర్’ ప్రయోగం
ముంబై: పుణె పోర్షే కారు రోడ్డు ప్రమాదం కేసులో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. తాజాగా నిందితుడు మైనర్ బాలుడి కుటుంబానికి సంబంధించిన ఓ రిసార్ట్‌లో అక్రమ కట్టడాలను శనివారం అధికారులు కూల్చి వేశారు. మహారాష్ట్రలోని మహాబలేశ్వర్ మల్కంపేట్ ప్రాంతంలో మైనర్ బాలుడి ఫ్యామిలీకి ‘ఎంపీజీ క్లబ్’ అనే పేరుతో ఓ రిసార్ట్ ఉంది. దానిలో ఎలాంటి అనుమతులు తీసుకోకుండా కొన్ని నిర్మాణాలు చేపట్టినట్లు అధికారులకు సమాచారం అందింది.The administration in Maharashtra's Satara district on June 9 demolished illegal structures in a resort in Mahabaleshwar owned by the family of the 17-year-old boy allegedly involved in the Pune Porsche crash, an official said.https://t.co/l9Hdui9pH1— The Hindu (@the_hindu) June 8, 2024 ఈ వ్యవహారంపై గతవారం సీఎం ఏక్నాథ్ షిండే స్పందించారు. నిందితుడి ఫ్యామిలీ రిసార్ట్‌లో ఉన్న కట్టడాలు అక్రమమని తేలితే చర్యలు తీసుకోవాలని సతారా జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. ఈ క్రమంలోనే గతవారం రిసార్ట్‌ను అధికారులు సీల్ చేశారు. తర్వాత వాటిపై విచారణ చేపట్టగా.. ఆ కట్టడాలు అక్రమంగా నిర్మించినట్లు నిర్ధారణ అయింది. దీంతో శనివారం ఎంపీజీ క్లబ్ వద్దకు బుల్డోజర్ను తీసుకువెళ్లిన అధికారులు అనుమతులు లేకుండా నిర్మించిన కట్టడాలను కూల్చివేశారు.మే 19 తెల్లవారుజామున మైనర్ బాలుడు మద్యం మత్తులో వేగంగా పోర్షేకారు నడిపి బైక్‌ను ఢీకొట్టాడు. ఈ రోడ్డు ప్రమాదంలో ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు మృతి చెందారు. ఈ కేసులో పోలీసులు చేపట్టిన దర్యాప్తులో రోజుకో కీలక విషయం వెలుగులోకి వస్తోంది. దీనిపై పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు.చదవండి: పుణె పోర్షే కేసు: ఇవేం ట్విస్టులు బాబోయ్! -
పుణె పోర్షే కేసు: ‘నాకేం గుర్తు లేదు.. అప్పుడు తాగి ఉన్నా..!’
ముంబై: పుణె పోర్షే కారు రోడ్డు ప్రమాదం కేసులో పోలీసులు కీలక విషయాలు బయటపెట్టారు. మైనర్ బాలుడు తాను మద్యం తాగి కారు నడిపినట్లు అంగీకరించాడని తెలిపారు. మద్యం తాగటం వల్ల తనకు ఏం గుర్తులేదని చెప్పినట్లు క్రైం బ్రాంచ్ పోలీసులు పేర్కొన్నారు.‘మైనర్ బాలుడిని దర్యాప్తులో భాగంగా ప్రమాదానికి ముందు అతను ఉన్న లోకేషన్?, బ్లాక్ అండ్ కోసీ పబ్సుల్లో ఉన్నారా?, కారు డ్రైవింగ్ చేశారా? ప్రమాదానికి సంబంధించి వివరాలు, సాక్ష్యాలు, బ్లడ్ శాంపిళ్లు తారుమారు చేయటం.. ఇలా పలు ప్రశ్నలు అడిగాం. అయితే ఏది అడిగినా ఒకే సమాధానం చెప్పాడు. నాకు ఏం గుర్తు లేదు. నేను అప్పడు తాగి ఉన్నా అని చెప్పాడు’ అని క్రైం బ్రాంచ్ పోలీసులు వెల్లడించారు.ప్రాథమిక దర్యాప్తులోనే మైనర్ బాలుడు, అతని స్నేహితులు రెండ్లు పబ్బుల్లో రూ. 48 వేలు ఖర్చుపెట్టి మరీ మద్యం తాగినట్లు పోలీసులు గుర్తించిన విషయం తెలిసిందే. ఇక.. శనివారం మైనర్ తల్లిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు పుణె సీపీ అమితేష్ కుమార్ తెలిపారు. తన కుమారుడి బ్లడ్ శాంపిళ్లకు బదులు ఆమె బ్లడ్ శాంపిళ్లు ఇచ్చినందుకు ఆమెను అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. సాసూన్ హాస్పిటల్ డాక్టర్లే ఆమెచేత ఈ పని చేయించారని అన్నారు. ఈ కేసులో అరెస్టైన మైనర్ బాలుడి తల్లిదండ్రులను జూన్ 5 వరకు పుణె కోర్టు ఆదివారం పోలీసు కస్టడీకి ఆదేశించింది. -
పూణె పోర్షే కేసు: ఆస్పత్రి డీన్ ఎక్కడ?
ముంబై: పుణే పోర్షే కారు రోడ్డు ప్రమాదంలో మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. మైనర్ బాలుడికి సంబంధించి బ్లడ్ శాంపిళ్ల తారుమారు విషయంలో ఓ రాష్ట్ర మంత్రి, ఎమ్మెల్మే డాక్టర్లపై ఒత్తిడి చేశారని సాసూన్ హాస్పిటల్ డీన్ తెలిపారు. బుధవారం హాస్పిటల్ డీన్ వినాయక్ కాలే మీడియాతో మాట్లాడారు.‘‘మహారాష్ట్ర మెడికల్ ఎడ్యుకేషన్ మంత్రి హసన్ ముష్రిఫ్, ఎమ్మెల్యే సునీల్ తింగ్రే.. మెడికల్ సూపరింటెండెంట్‌గా డాక్టర్ అజయ్ తవాడేను నియమించారు. వీరు అధికారపార్టీ ఎన్సీపీ అజిత్ పవార్ వర్గానికి చెందిన నేతలు. వారు బ్లడ్ శాంపిళ్లను తారుమారు చేయించటం కోసం సోరెన్సిక్ డాక్టర్లపై ఒత్తిడి తీసుకువచ్చారు’’ అని డీన్ తెలిపారు. శాంపిళ్ల తారుమారుపై ఓ కమిటీని ఏర్పాటు చేసిన మంగళవారం ఈ వ్యవహారంపై రోజంతా విచారణ జరిపించామని హాస్పిటల్ డీన్ వినాయక్ కాలే తెలిపారు. తను కూడా ఈ విషయంపై పలు చర్యలు తీసుకున్నట్లు చెప్పారు.హాస్పిటల్ డీన్ మీడియా సమావేశం ముగిసిన కొన్ని గంటల్లోనే ఆయన్ను రాష్ట్ర ప్రభుత్వం సెలవుపై పంపటం గమనార్హం. ఈ కేసు విషయంలో నిర్లక్ష్యం వహించినందుకు, సరైన నిర్ణయం తీసుకోనందుకే ఆయన్ను ప్రభుత్వం సెలవుపై పంపినట్లు తెలుస్తోంది.ఇక.. మైనర్ బాలుడి బ్లడ్ శాంపిళ్లు తారుమారు చేయటం కోసం ఇద్దరు డాక్టర్లు అజయ్ తవాడే, శ్రీహరి హర్నర్.. మధ్యవర్తి హాస్పిటల్ ప్యూన్ ద్వారా నిందితుడి కుటుంబ సభ్యుల వద్ద రూ.3 లక్షల లంచం తీసున్నారని తెలియటంతో వారిని పుణే క్రైం బ్రాంచ్ పోలీసులు సోమవారం అరెస్ట్ చేసి కస్టడీలోకి తీసుకున్నారు. ఇక.. బ్లడ్ శాంపిళ్ల తారుమారుపై మహారాష్ట్ర ప్రభుత్వం సైతం దర్యాప్తుకు డాక్టర్ పల్లవి సపాలే నేతృత్వంలో ఓ కమిటి ఏర్పాటు చేసింది. ఈ కమిటిలో గ్రాంట్ మెడికల్ కాలేజీ, జేజే గ్రూప్ హాస్పిటల్ డీన్లు సభ్యులుగా ఉన్నారు.ఈ కేసులో ఓ ఎమ్మెల్యే కుమారుడికి సంబంధం ఉందని మహారాష్ట్ర కాంగ్రెస్ ప్రెసిడెంట్ నానా పటోల్ ఆరోపణలు చేశారు. రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే ఆ ఎమ్మెల్యే.. పోలీసులతో టచ్‌లోకి వెళ్లారు. బ్లడ్ శాంపిళ్లను మార్చటం కోసం డాక్టర్లు కూడా ఫోన్ చేశారని పటోల్ ఆరోపణలు చేశారు. ఈ కేసును సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఇక.. ప్రముఖ బిల్డర్ అయన మైనర్ తండ్రి కూడా బ్లడ్ శాంపిళ్లను తారుమారు చేయించాలని డాక్టర్ తవాడేకు 14 సార్లు ఫోన్ చేసినట్లు తెలుస్తోంది.ఇక.. ఈ ఘటనపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే మంగళవారం స్పందించారు. ‘ప్రమాదం జరిగినప్పటి నుంచి పుణే పోలీసు కమిషనర్‌తో నేను టచ్‌లో ఉన్నా. ఈ కేసులో ఎంతటివారు ఉన్నా చర్యలు తీసుకుంటాం. చట్టం ముందు అందరూ సమానులే. ఎవ్వరినీ వదిలిపెట్టం. నేను ఇప్పటికే ఈ కేసు విషయంలో కఠినంగా వ్యవహరించాలని ఆదేశాలు ఇచ్చాను’ అని తెలిపారు. -
పుణే ఘటన: లంచాల మోజు.. పోలీసుల అక్రమాలు వెలుగులోకి!
రెండు నిండు ప్రాణాల్ని బలిగొన్న పుణే పోర్షే హిట్ అండ్ రన్ కేసు.. రకరకాల కోణాల్లో చర్చకు దారి తీసింది. వాహనం నడిపింది ఓ మైనర్ కావడంతో పేరెంటింగ్ కోణంలో ప్రధాన చర్చ నడిచింది. మైనర్ బాలుడి తండ్రి తన పలుకుబడి ఉపయోగించి కేసును పక్కదోవ పట్టించే ప్రయత్నం.. ఆ ప్రయత్నంలో నిర్లక్ష్యం ధోరణి ప్రదర్శించిన పోలీసు అధికారులపై చర్యలు, రక్త నమూనాలు తారుమారు చేయటంతో డాక్టర్ల అరెస్టు.. తండ్రి, తాతల అరెస్ట్.. పోర్షే కథలు రోజుకొకటి వెలుగులోకి వచ్చాయి. తాజాగా ఈ కేసు కారణంగానే.. నగరంలో అర్ధరాత్రుల దాకా అనుమతులు లేకుండా బార్లు, పబ్‌ల నిర్వహణ, వాటిల్లో డ్రగ్స్ వాడకం.. ఆ మొత్తం వెనుక అధికారుల అవినీతి బాగోతం బయటపడింది ఇప్పుడు.. పుణేలో అర్ధరాత్రి దాకా అక్రమంగా కార్యకలాపాలు నిర్వహించే పబ్‌లు, బార్లు.. పైగా డ్రగ్స్ కోణాన్ని ఇప్పుడు తెరపైకి తెచ్చారు ఓ ఎమ్మెల్యే. కాంగ్రెస్ ఎమ్మెల్యే రవీంద్ర ధంగేకర్.. ఈ హిట్ అండ్ రన్ కేసుపై ఇదివరకే నిరసన వ్యక్తం చేశారు. పబ్‌లు, బార్లపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. తమ పార్టీ కార్యకర్తలతో కలిసి ఆయన యెరవాడ పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. అయితే ఆయన ఇప్పుడు మరో సంచలన చర్చకు దారితీశారు.చదవండి: Pune Porsche Case: రీల్‌ను మించిన రియల్ సస్పెన్స్ థ్రిల్లర్.. ఇవేం ట్విస్టులు బాబోయ్!లంచాల మోజుతో పోలీసులు అక్రమంగా నిర్వహిస్తున్న పబ్ యజమానులు, డ్రగ్స్ ట్రేడర్ల వద్ద నెలకు లక్షల్లో లంచాలు తీసుకుంటున్నారని రవీంద్ర ధంగేకర్ ఆరోపణులు చేశారు. పుణె ఎక్సైజ్ సూపరింటెండెంట్ ప్రతినెలా లంచాలు తీసుకుంటున్నారని, లంచాల సేకరణకు కానిస్టేబుళ్లు, ప్రైవేట్ వ్యక్తులను ఉపయోగించుకున్నారని తెలిపారు.#Pune #Porsche Case: Ravindra Dhangekar Discloses Names Of Persons Involved In ' HAFTA 'From Pubs, Clubs and Liquor Shops In a major crackdown, the Kasba Peth MLA Ravindra Dhangekar revealed that police are collecting monthly bribes amounting to lakhs of rupees from the owners… pic.twitter.com/5ehtFFSuW8— Pune Pulse (@pulse_pune) May 27, 2024 విమాన్ నగర్, కోరేగావ్ పార్క్, కళ్యాణి నగర్, భుగావ్ భూకుమ్, బానేర్, హింజవాడి, పింప్రి చించ్వాడ్, లోనావాలా ప్రాంతాల్లో ఉండే అర్ధరాత్రి, రూఫ్‌టాప్‌లో నిర్వహించినే హోటళ్ల వద్ద లంచాలు తీసుకొని చూసిచూడనట్లు వ్యవహరిస్తారని అన్నారు. ఒక్కో ప్రాంతంలో ఒక్కో పోలీసు నెలకు వసూలు చేసే మొత్తం దాదాపు రూ. 78 లక్షలు ఉంటుందని లెక్కలతో సహా మీడియాకు తెలిపారు. లంచాలు తీసుకునే ప్రాంతాలు, వాటిని వసూలు చేసే పోలీసు కానిస్టేబుల్స్ పేర్లను ఎమ్మెల్యే రవీంద్ర ధంగేకర్ బయటపెట్టారు.కస్బా పేట్ ఎమ్మెల్యే రవీంద్ర ధంగేకర్ బయటపెట్టిన ఈ వివరాలు ప్రస్తుతం మహారాష్ట్రలో సంచలనంగా మారాయి. అదేవిధంగా పుణె పోలీసు డిపార్టుమెంట్లో ఎప్పటి నుంచో ఉన్న అవినీతి వ్యవహారం తాజాగా బట్టబయలు అయింది. పుణె సిటీ కల్చర్, చట్టాల అమలుపై తీవ్ర చర్చ జరుగుతోంది. -
పుణె పోర్షే కేసు: ఇవేం ట్విస్టులు బాబోయ్!
గుద్దింది ఎవరు?.. మైనరేనా? డ్రైవరా?పోయింది మాత్రం రెండు ప్రాణాలుప్రమాదానికి కారణం ఆ మైనరే!పైగా మద్యం సేవించి ఉన్నాడుతండ్రి బిల్డర్.. సంఘంలో పలుకుబడి ఉన్న వ్యక్తిఅందుకే కేసును తారుమారు చేసే ప్రయత్నాలుఈ క్రమంలోనే రోజుకొక ట్విస్ట్ తెరపైకి పుణె పోర్షే కారు ప్రమాదం.. రోజుకో ట్విస్ట్‌తో థ్రిల్లర్ కథను తలపిస్తోంది. తాజాగా నిందితుడైన మైనర్ రక్త నమూనాల రిపోర్టులను తారుమారు చేసినందుకు పోలీసులు ఇద్దరు డాక్టర్లను అరెస్ట్ చేశారు. సాసూన్ ఆస్పత్రిలోని డా. అజయ్ తావ్రే, డా. శ్రీహరి హార్నర్ పుణె క్రైం బ్రాంచ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.ఎందుకంటే..ప్రభుత్వ ఆస్పత్రిలో డా. అజయ్ తావ్రే ఫొరెన్సిక్ హెడ్‌గా పనిచేస్తున్నారు. రోడ్డు ప్రమాద ఘటన రోజు నిందిత మైనర్ బాలుడు తన స్నేహతులతో మద్యం చేవించినట్లు సీసీటీవీ ఫుటేజ్‌లో స్పష్టంగా కన్పించిన విషయం తెలిసిందే. అయితే మైనర్ బాలుడి రక్త పరీక్షలో మాత్రం మద్యం సేవించనట్లుగా లేకపోవటం, ఆ రిపోర్టు నెగిటివ్ రావటం గమనార్హం. దీంతో రక్త నమూనాలను తారుమారు చేసిన ఇద్దరు డాక్టర్లను పోలీసులు అరెస్ట్ చేశారు.అంతకు ముందు పుణె పోలిసు కమిషనర్ అమితోష్ కుమారు మాట్లాడారు. ‘మద్యం మత్తులో కారు నడపటం వల్ల జరిగిన ప్రమాదం కాదు. మైనర్ బాలుడికి తన ప్రవర్తనపై పూర్తి అవగాహన ఉంది. మైనర్,అతని స్నేహితులు కలిసి రెండు బార్లలో పార్టీ చేసుకున్నారు. తర్వాత ఇరుకైన వీధిలో నంబర్ ప్లేట్ లేని కారుతో ర్యాష్ డ్రైవింగ్ చేశారు. అందుకే మేము దీనిపై దృష్టి పెట్టాము. అతను పూర్తిగా అవగాహనతో ఉన్నాడు. తన చర్యల వల్ల ఎదుటువారి ప్రాణాలు పోతాయని తెలుసు. ప్రమాదం జరిగిన తర్వాత రెండు వేర్వేరు సమయాల్లో బ్లడ్‌ను పరీక్ష చేయించాము. రెండు ఒకేలా కచ్చితంగా ఉన్నాయి’అని అమితోష్ కుమారు తెలిపారు.పోలిసులు వివరాల ప్రకారం.. మొదటి రక్త నమూనాలో మద్యం తాగినట్లు రాలేదు. రెండో నమూనాలో మద్యం సేవించినట్లు పాజిటివ్ రావటం గమనార్హం. దీంతో డీఎన్ఏ టెస్ట్ చేయించారు. డీఎన్ఏ టెస్ట్‌లో సాంపిళ్లు వేరుగా ఉన్నాయి. మైనర్ రక్త నమూనా మరోక వ్యక్తి రక్త నమూనాతో తారుమారు అయింది.దీంతో మైనర్ రిపోర్టులో నెగటివ్ వచ్చింది.ఆదివారం (మే 26): ప్రమాదం జరిగిన సమయంలో తానే కారు నడిపినట్లుగా డ్రైవర్ అంగీకరించేందుకు డ్రైవర్ కుటుంబానికి.. మైనర్ తాత పెద్దమొత్తంలో డబ్బు, బహుమతులు ఆశ చూపించారని పోలీసులు న్యాయస్థానానికి వివరించారు. తాము చెప్పినట్లే నడుచుకోవాలని అతడిని బెదిరించారని తెలిపారు. బాలుడి తాతపై ఉన్న ఇతర కేసుల వివరాలు కూడా పోలీసులు న్యాయస్థానానికి వివరించారు. ఇరు వర్గాల వాదనలు విన్న కోర్టు బాలుడి తాతకి ఈనెల 28 వరకు రిమాండు విధించింది.శనివారం( మే 25):రోడ్డు ప్రమాదం ఘటనకు కారకుడైన టీనేజర్ తాత సురేంద్ర అగర్వాల్ పోలీసులు అరెస్ట్ చేశారు. డ్రైవర్ గంగారాంను ఇరికించే ప్రయత్నం సురేంద్ర చేసిందేనని పోలీసులు నిర్ధారించుకున్నారు. గంగారాంను బెదిరించి.. ప్రమాద సమయంలో కారు తానే నడిపినట్లు పోలీసుల వద్ద చెప్పాలని ఒత్తిడి చేసింది సురేంద్ర అని విచారణలో తేలింది. దీంతో.. కొత్త కేసు నమోదు చేసుకున్న పుణే క్రైమ్ బ్రాంచ్.. ఇవాళ వేకువ ఝామున 3గం. టైంలో సురేంద్రను ఆయన నివాసంలోనే అరెస్ట్ చేసింది. అలా ఈ కేసులో మూడో ఎఫ్ఐఆర్ నమోదు అయ్యింది.శుక్రవారం( మే 24): ప్రమాదం గురించి వైర్‌లైస్ కంట్రోల్‌రూమ్‌కు సమాచారం ఇవ్వలేదన్న కారణంగా పోలీస్ ఇన్స్పెక్టర్, అసిస్టెంట్ పోలీస్ ఇన్స్పెక్టర్లను సస్పెండ్ చేశారు.#PorscheAccident: #Pune Police Obtain CCTV Showing Teenager Frequently Drove Cars#Pune Police have acquired #CCTV footage revealing that a teenager involved in a recent Porsche accident often drove cars. pic.twitter.com/SO2qoALTzA— Punekar News (@punekarnews) May 27, 2024గురువారం( మే 23): పోర్షే కారు ప్రమాద ఘటన జరిగినప్పుడు కారును నడిపింది తమ డ్రైవర్ అని మైనర్ బాలుడి తండ్రి విశాల్ అగర్వాల్ పేర్కొన్నారు. దీంతో కేసు కొత్త మలుపు తీసుకుంది. అయితే, కేసు నుంచి మైనర్‌ను తప్పించేందుకే డ్రైవర్‌ను ఇరికిస్తున్నారా? అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి.బుధవారం( మే 22): రోడ్డు ప్రమాదానికి ముందు ప్రముఖ బిల్డర్ కుమారుడైన మైనర్ బాలుడు కేవలం 90 నిమిషాలకు పబ్బులో రూ. 48 వేలు ఖర్చు చేసినట్లు పోలీసులు తెలిపారు.మంగళవారం( మే 21): రోడ్డు ప్రమాదం కేసులో పోర్షే కారు నడిపిన మైనర్ బాలుడి తండ్రి విశాల్ అగర్వాల్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు. జువైనల్ జస్టిస్ యాక్టు కింద ఆయనపై నమోదైన కేసు ఆధారంగా ఔరంగాబాద్‌లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.సోమవారం( మే 20): తన ర్యాష్ డ్రైవింగ్‌తో ఇద్దరి ప్రాణాలు బలిగొన్న నిందుతుడైన మైనర్‌కు 15 గంటల్లోనే కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కోర్టు విధించిన షరతులు చర్చనీయాంశంగా మారి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ‘ట్రాఫిక్ పోలీసుతో 15 రోజులు పని చేయాలి. మానసిక పరివర్తనకు సైకియాట్రిస్ట్ వద్ద చికిత్స చేయించుకోవాలి. ‘రోడ్డు ప్రమాదాలు, వాటి పరిష్కార మార్గాలు’అనే టాపిక్ మీద 300 పదాలలో వ్యాసం రాయాలి. డి- అడిక్షన్ సెంటర్లో పునరాసం కోరాలి. ట్రాఫిక్ రూల్స్ చదవి జువైనల్ జస్టిస్ బోర్డుకు ప్రజంటేషన్ ఇవ్వాలి. రోడ్డు ప్రమాద బాధితులకు భవిష్యత్తులో అండగా ఉండాలి’అని జువైనల్ కోర్టు మైనర్ బాలుడికి షరతులు విధించింది.ఆదివారం(మే 19): ప్రముఖ బిల్డర్ కుమారుడైన మైనర్ ఆదివారం ఉదయం కోరేగావ్ పార్క్ వద్ద వేగంగా పోర్షే కారును నడుతూ.. ఓ బైక్‌ను ఢికొట్టాడు. ఈ ప్రమాదంలో అనిస్ దుధియా ,అశ్విని కోస్టా అనే ఇద్దరు ఐటీ ఉద్యోగులు మృతి చెందారు. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. -
పోర్షే కారు ప్రమాదం: ‘పబ్‌లో భారీ ఖర్చు’.. వెల్లడించిన పోలీసులు
ముంబై: పుణె రోడ్డు ప్రమాదం కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసుకు సంబంధించిన విషయాలను పుణె పోలీసు కమిషనర్ అమితేష్ కుమార్ వెల్లడించారు. రోడ్డు ప్రమాదానికి ముందు ప్రముఖ బిల్డర్ కుమారుడైన మైనర్ బాలుడు కేవలం 90 నిమిషాలకు పబ్బులో రూ. 48 వేలు ఖర్చు చేసినట్లు తెలిపారు. ఈ ప్రమాదానికి సంబంధించి మరిన్ని విషయాలను అమితేష్ కుమార్ తెలిపారు.‘‘శనివారం 10.40కి మైనర్ నిందితుడు తన స్నేహితులతో కలిసి కోసీ రెస్టారెంట్(పబ్)కు వెళ్లారు. అక్కడ వారు భారీ బిల్లును చెల్లించారు. స్నేహితులతకు మైనర్ బాలుడు రూ. 48 వేలతో మద్యం తాగారు. కోసీ రెస్టారెంట్ మూసిన తర్వాత.. అక్కడి నుంచి వారు రెండో పబ్ బాలక్ మారియట్‌కు అర్థరాత్రి 12.10 గంటలకు వెళ్లారు. బాలుడిని అదుపులోకి తీసుకున్న వెంటనే ఆదివారం మెడికల్ టెస్ట్ పంపి.. అతని రక్త నమూనాలను ఫొరెన్సిక్ విభాగానికి పంపించాము. మద్యం తాగి మూలమలుపు రోడ్డుపై పోర్షే కారుకు నంబర్ ప్లేట్ లేకుండా నడిపాడు. రోడ్డు ప్రమాదానికి ఇదే ప్రధాన కారణంగా తెలుస్తోంది’అని అమితేష్ కుమార్ తెలిపారు.‘‘మైనర్ బాలుడు తన స్నేహితులతో కలిసి రోడ్డు ప్రమాదానికి ముందు పబ్‌లో మద్యం సేవించారు. దానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి నిర్థారణకు వచ్చాం. ఫొరెన్సిక్ విభాగానికి పంపిన రక్త నమూనాల రిపోర్టు కోసం వేచి చేస్తున్నాం’’ అని అసిస్టెంట్ పోలీసుల కమిషనర్ మనోజ్ పాలిట్ తెలిపారు.ఈ కేసులలో మైనర్ బాలుడి తండ్రిని పుణె పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. అదేవిధంగా మైనర్ బాలుడికి మద్యం సర్వ్ చేసిన రెండు హోటళ్లకు చెందిన ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై సీఎం ఏక్నాథ్ షిండే , డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ చాలా సీరియస్ అయ్యారు. దర్యాప్తు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసినట్లు సీపీ అమితేష్ కుమార్ తెలిపారు.ఆదివారం తెల్లవారుజామున మైనర్ బాలుడు తన స్నేహితులతో కలిసి ఖరీదైన పోర్షే కారుతో ఓ బైక్‌ను దారుణంగా ఢీకొట్టారు. ఈ ఘటనలో బైక్‌పై ఉన్న మధ్యప్రదేశ్‌కు చెందిన ఇద్దరు ఐటీ ఫ్రొపెషనల్స్ మరణించారు. ఈ ఘటన కల్యాణి నగన్ జంక్షన్ వద్ద చోటు చేసుకుంది. గంటల వ్యవధిలో నిందిత బాలుడుని జువైనల్ జస్టిస్ కోర్టులో ప్రవేశపెట్టగా కఠినమైన షరతులతో బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. బెయిల్ మంజురూకు విధించి షరతులు కూడా చర్చనీయాంశం అయ్యాయి. -
Pune Porsche Crash: మైనర్ తప్పిదం.. తండ్రి అరెస్ట్
ముంబై: మహారాష్ట్రలోని పుణెలో చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదం కేసులో పోర్షే కారు నడిపిన మైనర్ బాలుడి తండ్రి విశాల్ అగర్వాల్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు. జువైనల్ జస్టిస్ యాక్టు కింద ఆయనపై నమోదైన కేసు ఆధారంగా ఔరంగాబాద్‌లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.సదరు మైనర్ బాలుడు ఆదివారం మద్యం మైకంతో పోర్షే కారుతో ఓ బైక్‌ను ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ప్రమాదం జరిగిన మైనర్ బాలుడి తండ్రి పరారీలో ఉన్నాడు. దీంతో పోలీసులు పలు బృందాలకు ఏర్పాడి మంగళవారం ఉదయం ఛత్రపతి శంభాజీనగర్ సమీపంలో అరెస్ట్ చేశారు.ప్రమాద సమయంలో 17 మైనర్ బాలుడు 200 కిలోమిట్లర్లు వేగంతో కారు నడిపి బైక్‌ను ఢీకొట్టినట్లు సీసీటీవీ ఫుటేజీ ద్వారా ప్రాథమికంగా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఇక.. పుణె పోలీసు కమిషనర్ అమితేష్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. ‘‘12వ తరగతి ఫలితాలు వెలువడిన తర్వాత నిందిత బాలుడు స్థానిక పబ్‌లో సంబరాలు చేసుకున్నాడు. కారు ప్రమాదానికి ముందు అతను మద్యం సేవించి ఉన్నాడు. మహారాష్ట్రలో 25 ఏళ్లు దాటిన వారికే మద్యం తాగే చట్టపరమైన అనుమతి ఉంది. చట్టవ్యతిరేకంగా మైనరకు మద్యం ఇచ్చిన బార్ ఓనర్లుపై చర్యలు తీసుకుంటాం’’ అని తెలిపారు.రోడ్డు ప్రమాదం జరిగిన 15 గంటల లోపే మైనర్ బాలుడిని జువైనల్ కోర్టులో హాజరుపరిచామని పోలీసులు తెలిపారు. ఇక.. అతనికి బెయిల్ ఇవ్వడానికి కోర్టు పలు షరతులు విధించింది. వాటన్నింటిని తప్పకుండా పాటించాలని ఆదేశించింది. తీవ్రమైన నిర్లక్ష్యంతో ఈ ఘటనకు పాల్పడిన మైనర్ బాలుడి తండ్రి విశాల్ అగర్వాల్‌పై కూడా జువైనల్ జస్టిస్ యాక్ట్‌లోని పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో ప్రముఖ బిల్డర్ అయిన విశాల్ అగర్వాల్ పరారీలో వెళ్లిపోయాడు. దీంతో పోలీసులు సెర్చ్ చేసిన మంగళవారం ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. -
టెస్లాకి షాకిచ్చిన పోర్షే... ఇండియా మార్కెట్లోకి లగ్జరీ ఎలక్ట్రిక్ కారు
ఇండియా మార్కెట్‌కి వస్తాం.. మాకు పన్నుల్లో రాయితీ ఇవ్వడంటూ కోర్రీలే వస్తున్న టెస్లా ఓనర్ ఎలన్ మస్క్‌కి పోర్షే గట్టి షాక్ ఇచ్చింది. చడీ చప్పుడు లేకుండా ఇండియా మార్కెట్లో లగ్జరీ ఎలక్ట్రిక్ కారుని రిలీజ్ చేసింది. రూ. 1.5 కోట్లు లగ్జరీ కార్ల తయారీ సంస్థ పోర్షే ఇండియాలో టేక్యాన్ పేరుతో ఎలక్ట్రిక్ కారుని మార్కెట్లోకి తెచ్చింది. టేక్యాన్, టేక్యాన్ 4 ఎస్, టర్బో, టర్బో ఎస్‌లు ఉన్నాయి. ఆ తర్వాత వేరియంట్లలో ఈ కారుని ఇండియాకి తీసుకు వచ్చింది. ఈ కారు ప్రారంభం ధర రూ.1.50 కోట్లుగా ఉంది. ఈ స్పోర్ట్స్ లగ్జీరీ కారు జెట్ స్పీడ్‌తో దూసుకుపోగలదని పోర్షే చెబుతోంది. హై ఎండ్ వేరియంట్ కారు కేవలం 2.9 సెకన్లలోనే వంద కిలోమీటర్ల గరిష్ట వేగాన్ని అందుకుంటుందని పేర్కొంది. సింగిల్ ఛార్జ్‌తో 484 కి.మీ మైలేజ్ టైక్యాన్ మోడల్లో ఎంట్రీ లెవల్ కారు 408 పీఎస్(హెచ్‌పీ)తో వస్తుండగా హై ఎండ్ వేరియంట్ 761 పీఎస్ (హెచ్‌పీ)తో వస్తోంది. ఈ కారు టాప్ స్పీడ్ సగటు గంటకి 240 కిలోమీటర్లుగా ఉంది. పోర్షే టేక్యాన్ మోడల్ బ్యాటరీ సామర్థ్యం 79.2 కేడబ్ల్యూహెచ్‌గా ఉంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే స్టాండర్డ్ మోడ్‌లో 484 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయవచ్చని కంపెనీ చెబుతోంది. హై ఎండ్ వేరియంట్లో 93.4 కేడబ్ల్యూహెచ్‌గా (కిలో వాట్ పర్ అవర్)గా ఉంది. టెస్లా నాన్చుడు టెస్లా సంస్థ ఇటీవల మార్కెట్లోకి ఎస్ ప్లెయిడ్ మోడల్ని రిలీజ్ చేయగా గ్లోబల్ మార్కెట్లో ఆ కార్లు హాట్‌కేకుల్లా అమ్ముడయ్యాయి.ఈ పరంపరలో ఇండియాలో టెస్లా కార్లు తెస్తామంటూ ఎలన్‌మస్క్ ప్రకటించారు. అయితే కాలుష్యం తగ్గించే కార్లు కావడం వల్ల తమకు దిగుమతి సుంకం తగ్గించాలంటూ మెలిక పెట్టారు. దీనిపై స్పందించిన భారత అధికారులు మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ పెడితే పన్ను రాయితీ విషయంపై ఆలోచిస్తామన్నారు. దీంతో టెస్లా కార్లు ఇండియా మార్కెట్లోకి వచ్చే విషయంపై ఒక అడుగు ముందుకు అయితే రెండు అడుగులు వెనక్కి అన్నట్టుగా పరిస్థితి మారింది. పోర్షే దూకుడు భారత ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాలకు ఫేమ్ పథకం ద్వారా ప్రోత్సహాం అందిస్తోంది. పెరుగుతున్న ఫ్యూయల్ ధరలతో ప్రజలు సైతం ఈవీలకు మళ్లుతున్నారు. ఈ క్రమంలో టెస్లా కారుకి ఇండియా డిమాండ్ ఉండవచ్చనే అంచనాల నెలకొన్నాయి. అయితే ఇండియాలో తమ కార్లు ప్రవేశపెట్టే విషయంలో టెస్లా ఈసీవో ఎలన్‌మస్క్ నాన్చుడు ధోరణి అవలంభించారు. ఇదే సమయంలో టెస్లాకు పోటీ ఇవ్వగలిగే పోర్షే సంస్థ లగ్జరీ, స్పోర్ట్స్ ఫీచర్ల కలయితో టేక్యాన్ కారుని ఇండియాలోకి తెచ్చింది. చదవండి : షేర్ల అమ్మకం.. ఆ వెంటనే షేర్ వాల్యూ ఢమాల్! టెస్లాకు గట్టి దెబ్బే! -
కరోనాకి బెదరని లంబోర్గిని
కరోనా సెకండ్ వేవ్ ఇండియా మొత్తాన్ని చుట్టేసింది, దాదాపుగా అన్ని రంగాలు కోవిడ్ ఎఫెక్ట్‌కి లోనయ్యాయి. కరోనా వైరస్ ధాటికి నూటికి తొంభైశాతం అమ్మకాలు తగ్గిపోయాయి. అయితే లగ్జరీ కార్ల బ్రాండ్ లంబోర్గిని మాత్రం కరోనాకు సవాల్ విసిరింది. కరోనా సంక్షోభ సమయంలోనూ రికార్డు స్థాయి అమ్మకాలు సాగించింది. అంచనాలు తారుమారు జర్మనీకి చెందిన లంబోర్గిని బ్రాండ్‌కి అంతర్జాతీయంగా మంచి ఫేమ్ ఉంది. ఈ బ్రాండ్ కార్లను ముందుగానే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఇండియాలో బాగా సేల్ అవుతోన్న లంబోర్గిని ఉరుస్ కారు షోరూమ్ ధరనే రూ. 3.43 కోట్లుగా ఉంది. దీంతో లగ్జరీ బ్రాండ్ కార్ల అమ్మకాలు తగ్గుతాయనే అంచనాలు ఉండేవి. అయితే అవి పటాపంచలయ్యాయి. రెట్టింపు అమ్మకాలు ధర ఎంతున్నా పర్వాలేదు మాకు లంబోర్గిని ఉరుస్ కావాలంటున్నారు సినీ సెలబ్రిటీలు, బిజెనెస్‌మెన్‌లు. దీంతో అమ్మకాల్లో లంబోర్గిని ఉరుస్ దూసుకుపోతుంది. గతేడాది కూడా కరోనా ఎఫెక్ట్‌లో దేశవ్యాప్తంగా కేవలం 13 లంబోర్గిని ఉరుస్ మోడళ్లు ఇండియాలో అమ్ముడు పోయాయి. కానీ ఈసారి కేవలం ఆరు నెలల కాలంలోనే 26 కార్లు ఇండియాలో డెలివరీ చేసింది లంబోర్గిని. కరోనా కల్లోలం, మందగించిన ఆర్థిక వ్యవస్థ తదితర అంశాలేవి లంబోర్గినిపై ప్రభావం చూపలేదు. లగ్జరీ సెగ్మెంట్లో ఒక్క లంబోర్గినే కాదు మెర్సిడెస్, ఆడి వంటి ఇతర లగ్జరీ బ్రాండ్లలో కూడా కార్ల అమ్మకాలు సూపర్‌గా ఉన్నాయి. ఇటీవల విడుదలై మెర్సిడెస్ మేహ్బ్యాక్ జీఎల్ఎస్ 400 మోడల్ కార్లు విడుదలకు ముందే దాదాపు స్టాక్ మొత్తం అమ్ముడైపోయింది. ఇండియాలో తమ లగ్జరీ బ్రాండ్ కార్లకు డిమాండ్ ఎక్కువగా ఉందని, త్వరలో మరిన్ని మోడళ్లు ఇండియాలో ప్రవేశపెడతామని మెర్సిడెస్ సీఈవో మార్టిన్ చెబుతున్నారు. ఇండియన్ మార్కెట్లో లగ్జరీ కార్లకు ఉన్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ఆడి ఏకంగా ఈ ట్రాన్ పేరుతో లగ్జరీ ఈవీ ని అందుబాటులోకి తెచ్చింది. మరో హై ఎండ్ బ్రాండ్ పోర్షే కార్ల అమ్మకాలు ఈ త్రైమాసికంలో 57 శాతం పెరిగాయి. బైకుల పరిస్థితి దారుణం బిజినెస్ టైకూన్లు, టాప్ ఎగ్జిక్యూటివ్‌లు, సినీ సెలబ్రిటీలు లగ్జరీ కార్లు కొనేందుకు ఉత్సాహం చూపిస్తుంటే .. కరోనా ఎఫెక్ట్‌తో స్వంత టూవీలర్ కొనుక్కోవాలనుకున్న సామాన్యులు వెనుకడుగు వేస్తున్నారు. ఏళ్ల తరబడి పొదుపు చేసిన సొమ్మును ఖర్చు పెట్టేందుకు ధైర్యం చేయట్లేదు. దీంతో ఈ ఏడాది బైకుల అమ్మకాలు దారుణంగా పడిపోయాయి. ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ లెక్కల ప్రకారం కరోనాకు ముందు 2019 మేతో పోల్చితే 2021 మేలో బైకుల అమ్మకాలు ఏకంగా 71 శాతం పడిపోయాయి. చదవండి : స్టైలిష్ లుక్‌తో కట్టిపడేస్తున్న 'యమహా' -
కారుకు రూ. 27.68 లక్షల జరిమానా
అహ్మదాబాద్: సరైన పత్రాలు లేవని తన కారును అధికారులు స్వాధీనం చేసుకోవడంతో పోర్షే 911 స్పోర్ట్స్ కార్ యజమాని పన్నులు, వడ్డీ, జరిమానా కలిపి రూ. 27.68 లక్షలు చెల్లించి తన కారును తీసుకువెళ్లారు. ఈ మొత్తాన్ని అహ్మదాబాద్ ప్రాంతీయ రవాణా కార్యాలయం(ఆర్టీవో)లో చెల్లించిన కారు యజమాని రంజిత్ దేశాయ్ సిటీ ట్రాఫిక్ పోలీసుల స్వాధీనంలో ఉన్న తన కారును తీసుకువెళ్లారు. గడిచిన ఏడాది నవంబర్‌లో ఈ కారును ట్రాఫిక్ పోలీసులు సీజ్ చేశారు. నవంబర్ 28న హెల్మెట్ క్రాస్‌రోడ్ వద్ద నెంబర్ ప్లేట్లు లేని కారణంగా కారును ట్రాఫిక్ పోలీసులు నిలిపివేశారు. దీనిపై ట్రాఫిక్ పోలీసులు ప్రశ్నించగా డ్రైవర్ సరైన పత్రాలు చూపించలేకపోయారని పోలీస్ అధికారులు తెలిపారు. దీంతో తాము కారును సీజ్ చేసి మోటార్ వాహనాల చట్టం ప్రకారం మెమో జారీ చేశామని చెప్పారు. తొలుత రూ. 9.8 లక్షల జరిమానా విధించగా కారు ఓనర్ ఆ మొత్తాన్ని డిపాజిట్ చేశారని, ఆపై పాత రికార్డులను పరిశీలించి భారీ మొత్తం జరిమానా వడ్డించామని తెలిపారు. కాగా రూ. 27.68 లక్షల జరిమానా చెల్లించినట్టు ఇచ్చిన రసీదును ట్విటర్లో పోస్ట్ చేసిన అహ్మదాబాద్ ట్రాఫిక్ పోలీసులు దేశంలో అత్యధిక మొత్తంలో విధించిన జరిమానా ఇదే అని పేర్కొన్నారు. -
మార్కెట్లోకి రూ 1.31 కోట్ల ఖరీదైన పోర్షే కారు..
న్యూఢిల్లీ : ప్రముఖ లగ్జరీ కార్ల బ్రాండ్ పోర్షే దేశీ మార్కెట్లో రూ 1.31 కోట్ల ఖరీదైన కయెన్ కూపేను లాంఛ్ చేసింది. ఈ మోడల్ వీ8 వేరియంట్ ఎక్స్‌షోరూమ్ ధర రూ 1.97 కోట్లు పలకనుంది. వీ6 వేరియంట్ రూ 1.31 కోట్లకు అందుబాటులో ఉంటుంది. అన్ని పోర్షే కార్ల తరహాలోనే కయెన్ కూపే కూడా భారతదేశంలో పూర్తిగా నిర్మించిన యూనిట్ (సిబియు)గా సేల్కు సిద్ధమైంది. ఇది యూరోపియన్ మోడల్‌కు దీటుగా ఉంటుంది. సరికొత్త పోర్షే కయెన్ కూపేలో పోర్షే ఫీచర్లతో పాటు అత్యాధునిక సౌకర్యాలను సమకూర్చారు. -
తప్పతాగి.. 12 ఆటోలను గుద్దేశాడు!
ఆ కుర్రాడికి బాగా డబ్బుంది, చేతిలో ఖరీదైన కారుంది.. అంతే, తెగ తాగేసి తన పోర్షే కారుతో ఏకంగా 12 ఆటోలను గుద్దేశాడు. దాంతో ముగ్గురు డ్రైవర్లు తీవ్రంగా గాయపడగా, మరో ఆటోడ్రైవర్ ప్రాణాలు కోల్పోయాడు. దాంతో ఆ న్యాయవిద్యార్థి (22)ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన తమిళనాడు రాజధాని చెన్నై కెథెడ్రల్ రోడ్డులో జరిగింది. చాలావరకు ఆటోలు ఎందుకూ పనికిరాకుండా తుక్కుతుక్కుగా మారిపోయాయి. కారు కూడా బాగా దెబ్బతింది. ఒక్కసారిగా ఏదో కారు బ్రేకులు గట్టిగా వేసిన శబ్దం వినిపించిందని, ఈలోపు తన గుండె భాగంలో దెబ్బ తగిలి ఒక్కసారిగా కళ్లముందు చీకట్లు అలముకున్నాయని, లేచి చూసేసరికి పోలీసులు వచ్చి కారు నడుపుతున్న కుర్రాడిని లేపి తీసుకెళ్తున్నారని ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మరో ఆటోడ్రైవర్ సుందర్ చెప్పారు. ఆ తర్వాత 20 నిమిషాలకు తమను తీసుకెళ్లేందుకు ఒక అంబులెన్సు వచ్చిందన్నారు.